2016

26 స్థానాల్లో పోటీకి సీపీఎం సిద్ధం

స్వచ్ఛ హైదరాబాద్‌-స్వచ్ఛ రాజకీయాలు 'క్లీన్‌ హైదరాబాద్‌-క్లీన్‌ పాలిటిక్స్‌' అనే నినాదంతో జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ(యు), లోక్‌సత్తా, ఎంబీసీ జాక్‌, కాలనీ సొసైటీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నర్సింగరావు తెలిపారు. జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలో 150 డివిజన్లు ఉండగా, ఇప్పటికే 60 స్థానాల్లో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ 60 డివిజన్లలో లోక్‌సత్తా 21, సీపీఎం 26, సీపీఐ 12, ఎంసీపీఐ (యు) ఒక స్థానంలో పోటీ చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. 

పాక్ విష్యంలో మోడీ వైఖరేంటి?:ఏచూరి

పాకిస్తాన్‌తో చర్చల విషయంలో మోడీ ప్రభుత్వం కుప్పిగంతులు వేస్తోందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. గతంలో ఎన్డీయే ప్రభుత్వం చర్చల నుంచి వెనక్కి పోయిందని, ఆ తర్వాత అప్ఘనిస్తాన్‌ నుంచి తిరుగు ప్రయాణం సందర్భంగా ప్రధాని మోడీ ఆకస్మికంగా పాకిస్తాన్‌లో దిగారని గుర్తుచేశారు. పఠాన్‌కోట్‌ ఘటన నేపథ్యంలో ప్రస్తుతం చర్చల విషయంలో ఎలాంటి వైఖరిని అను సరించబోతున్నారని మోడీని ప్రశ్నించారు. ఇలాంటి విదేశాంగ విధానం దేశానికి ప్రమాదకరమని హెచ్చరించారు. 

డీజిల్‌ ధర తగ్గించాలని డిమాండ్‌ జనవరి 22న నిరసనలు

డీజిల్‌ రేట్లు తగ్గించాలనే డిమాండ్‌తో ఈనెల 22న నిరసన కార్యక్రమాలు చేపట్టి, మార్చి 1న చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన్నట్లు ఆలిండియా రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన ్‌(ఎఐఆర్‌టి డబ్ల్యూఎఫ్‌) తెలిపింది.

ఫిబ్రవరి 15న చలో పార్లమెంట్‌

ఐసిడిఎస్‌కోసంఐక్యపోరాటం
-సంఘాన్నిచీల్చేయత్నాలు
-9నరైతులు,కార్మికులఆందోళనకుమద్దతు
-మార్చి1నప్రభుత్వదిష్టిబొమ్మలదహనం
-ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌బహిరంగసభపిలుపు
- ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ బహిరంగసభ పిలుపు

ఇక భూసేక'రణమే'!

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ ఫీల్డ్‌ విమానాశ్రయం కోసం బలవంతపు భూసేకరణకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఆరునూరైనా సర్వే చేయాలని అధికారులను ఉసుగొలిపింది. దీంతో, సోమవారం నుంచి సర్వేకు అధికారులు సిద్ధమవుతున్నారు. విమానాశ్రయ ప్రతిపాదిత గ్రామాల్లో సర్వేలు చేస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

పారిశుధ్య కార్మికుల పొట్టగొట్టడం దుర్మార్గం

రాష్ట్రంలోని నగర పాలక సంస్థల్లో పారిశుధ్య కార్మికుల తొలగింపునకు దారితీసే 279 నెంబరు జీవోను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన మున్సిపల్‌ వ్యవహారాల మంత్రి నారాయణకు ఒక లేఖ రాశారు.

రాష్ట్రం నుంచి ఐదుగురు

అంగన్ వాడీ ఆల్ ఇండియా కమిటికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టి బేబీరాణి ఉపాధ్యక్షురాలిగా, సుబ్బరావమ్మ కార్యదర్శిగా, వర్కింగ్‌ కమిటీలో వాణిశ్రీ, వీరలక్ష్మి, సుప్రజ ఎన్నికయ్యారు.

అంగన్ వాడీ జాతీయ నూతన కమిటీని ఎన్నిక

21 మందితో ఆఫీస్‌బేరర్లను, 50 మందితో వర్కింగ్‌ కమిటీని ఎన్నుకున్నారు. ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ అధ్యక్షురాలిగా పంజాబ్‌కు చెందిన ఉషారాణి, ప్రధాన కార్యదర్శిగా కేరళకు చెందిన ఏఆర్‌ సింధు ఎన్నికయ్యారు.

 

పోలీసు పహారా మధ్య 'జన్మభూమి'

'జన్మభూమి - మా ఊరు' కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై అధికారులను నిలదీస్తూనే ఉన్నారు. దీంతో అధికార యంత్రాంగం పలుచోట్ల పోలీసు పహారా ఏర్పాటు చేసి సభలను నిర్వహిస్తున్నాయి. సభల్లో సమస్యలపై ప్రస్తా విస్తున్నవారిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకుంటు న్నారు. దీంతో అనేకచోట్ల నిరసనకారులకూ, టిడిపి నేతలకూ మధ్య వాగ్వివాదాలు కొనసాగుతున్నాయి.

సంక్రాంతికీ లేని 'మాఫీ'

ఎన్నికల్లో రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది. అనంతరం అనేక కోతలు, నిబంధనలు విధించి మాఫీని కొన్ని నెలలపాటు సాగదీసింది. రూ.50 వేల నుంచి లక్షన్నర లోపు రుణాలను ఐదు విడతల్లో ఏడాదికి 20 శాతం చొప్పున మాఫీ చేస్తానని పేర్కొంది. అనేక వడపోతల అనంతరం సుమారు 54 లక్షల రైతులు మాఫీకి అర్హత సాధించారు.

Pages

Subscribe to RSS - 2016