ఫిబ్రవరి 15న చలో పార్లమెంట్‌

ఐసిడిఎస్‌కోసంఐక్యపోరాటం
-సంఘాన్నిచీల్చేయత్నాలు
-9నరైతులు,కార్మికులఆందోళనకుమద్దతు
-మార్చి1నప్రభుత్వదిష్టిబొమ్మలదహనం
-ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌బహిరంగసభపిలుపు
- ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ బహిరంగసభ పిలుపు

ఫెడరేషన్‌ 8వ జాతీయ మహాసభలు విజయవంతంగా ఆదివారం ముగిశాయి.ఐసిడిఎస్‌ను కాపాడుకునే ఉద్యమంలో భాగంగానే వర్కర్లకు రూ.20 వేలు, హెల్పర్లకు రూ.15 వేల కనీస వేతనమివ్వాలనే ప్రధాన డిమాండ్లపై ఐక్యంగా పోరాటాలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.త్రిపురలో మాత్రమే ఈ పథకం పక్కాగా అమలవుతోందని గుర్తుచేశారు. అంగన్‌వాడీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయివేటుకు అప్పగించబోమంటూ అక్కడి ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏకంగా ఈ సంఘాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. న్యాయమైన డిమాండ్ల సాధనకోసం అంగన్‌వాడీలు లబ్దిదారులను కలుపుకొని ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. నిధుల కోతలను నిరసిస్తూ ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ ఇతర అన్ని సంఘాలు, సమాఖ్యలను కలుపుకొని ఫిిబ్రవరి 15న చలో పార్లమెంట్‌ నిర్వహిస్తున్నామని ప్రకటించారు. అప్పటికీ ప్రభు త్వం దిగిరాకపోతే మార్చి 1న దేశవ్యాప్తంగా అన్ని ప్రాజెక్టుల్లో ప్రభు త్వ దిష్టిబొమ్మలు దహనం చేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం కార్మికులు, కర్షకులు, శ్రామికులు ఈనెల 19న సంయుక్తంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త ఆందోళనలకు ఏఐఎఫ్‌ఏడబ్ల్యూహెచ్‌ సంపూర్ణ మద్దతునిస్తోందని చెప్పారు.