ఆర్టికల్స్
సాంఘిక సమానత్వ సాధనలో రిజర్వేషన్ల ఆవశ్యకత, పరిమితులు
Wed, 2022-05-11 12:09
ఉద్యోగాలలో, చదువుల్లో దళితులకు, గిరిజనులకు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఒక తాత్కాలిక ఉపశమనంగా పరిగణిస్తూనే సిపిఐ(ఎం) రిజర్వేషన్లను సమర్ధిస్తుంది. అదే సమయంలో దీర్ఘకాల పరిష్కారంగా సమూలంగా భూసంస్కరణలను చేపట్టాలని, కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపద కేంద్రీకరణను బద్దలు కొట్టాలని, అన్ని తరగతులవారికీ ప్రయోజనాలు కలిగే విధంగా ఆర్థికాభివృద్ధి ఉండాలని కోరుతుంది.
దేశంలో వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పలు గ్రూపులు ఆ యా తరగతుల డిమాండ్లపై ఆందోళనలు చేపడుతున్నాయి. వారి వారి ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం బూర్జువా రాజకీయ పార్టీలు...
బుల్డోజర్ సంస్కృతి
Wed, 2022-05-11 12:05
భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండే సుసంపన్నమైన మన సంస్కృతిని ధ్వంసం చేసేందుకు అత్యంత దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని బిజెపి ముందుకు తేవడం ఆందోళన కలిగిస్తోంది. బిజెపి అనుసరిస్తున్న ఈ ధోరణి చాలా ప్రమాదకరం. రాజ్యం క్రూరత్వానికి, అధికార దుర్వినియోగానికి ఈ బుల్డోజర్ సంస్కృతి ప్రతీక. ఏళ్ల తరబడి ఈ నిర్మాణాలున్నా ఏనాడూ లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకొచ్చింది? అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా , అవి ఏ వర్గానికి చెందినవైనా చర్య తీసుకోవాల్సిందే. కానీ, రోహింగ్యాలు, బంగ్లాదేశీల పేరుతో అమాయకులైన వలస శ్రామికులను, పేదలను ఉపాధికి దూరం చేసి నిలువ నీడలేకుండా చేయడం అమానుషం. మానవ హక్కులకే విరుద్ధం. అక్రమ కట్టడాలను కూల్చాల్సి వస్తే ఢిల్లీలో నాలుగింట మూడొంతులు ఉండవు....
మేధో సంపత్తి
Mon, 2022-04-25 12:25
మనిషి-తన సృజనాత్మకత, తెలివి, విజ్ఞానంతో తన చుట్టూ వున్న ప్రపంచాన్ని మార్చుకుంటూ సామాజిక ఉత్పత్తిలో ముందుకొచ్చాడు. ఆ మేధో సంపత్తి ఆధునిక సమాజ అభివృద్ధిలో కీలకమైనది. సాధారణంగా మేధో సంపత్తి అనేది ఇతరులు అనధికారికంగా ఉపయోగించకుండా చట్టం రక్షించే మానవ మేధస్సు నుంచి ఆవిష్కృతమైన ఉత్పత్తి. యాజమాన్యాలు స్వాభావికంగా మేధో సంపత్తిపై గుత్తాధిపత్యాన్ని ఏర్పరచుకుంటాయి. 'మానవ ఉత్పాదనలలో అత్యుత్తమమైనది-జ్ఞానం, ఆలోచన. వాటిని సమాజానికి స్వచ్ఛందంగా అందివ్వాలి. ఇవి గాలి వలె ఉచితం' అంటాడు యుఎస్ సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్ బ్రాండీస్. మేధో సంపత్తి ఏ ఒక్కరిదో కాదు...అందరిదీ. విజ్ఞానం మానవాళి ఉమ్మడి సొత్తు. ఇది జాతి సంపద. ఈ సంపత్తిని తమ ఖాతాలో వేసుకుని సమాజం...
మన భాష-మన జాతి-మన ఆత్మగౌరవం
Tue, 2022-04-19 12:07
ఒక ప్రాంతంలో జీవించే ప్రజలు తమని తాము ఏవిధంగా పాలించుకోవాలో నిర్ణయించుకోగలరు. అదే ప్రజాస్వామ్యం అంటే. ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వ చట్టాలు, ఉత్తర్వులు, నిర్ణయాలు ఉండడం ప్రజాస్వామ్యానికి కీలకం. భిన్న భాషలు ఉన్న దేశంలో కేంద్రం చేసే నిర్ణయాలను ఆయా ప్రాంతీయ భాషలన్నింటిలోకీ తర్జుమా చేసి పంపవచ్చు. ఆ పని మానేసి ఒక్క హిందీని మాత్రమే రుద్దడం కుట్ర కాక ఇంకేమిటి? రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి మీద దాడి గాక ఇంకేమిటి? మనం ఎంతగానో ప్రేమించే మన మాతృభాష మీద దాడి చేయడమంటే మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నించడం కాక మరేమిటి ? భాష అనేది మానవులు సృష్టించుకున్నది. తమ అవసరాలను తీర్చుకోడానికి ప్రకృతితో పోరాడుతూ మానవులు...
ఉపేక్ష ఉత్పాతం
Tue, 2022-04-19 11:59
ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సిన పండుగలు ఉద్రిక్తతలతో విషాదాంతం కావడం మిక్కిలి ఆందోళనకరం. కేంద్రంలో బిజెపి వచ్చాక ఇలాంటి దుర్మార్గాలు ఎక్కువయ్యాయి. కర్ణాటక హుబ్బళ్లిలో మైనార్టీలు పవిత్రంగా భావించే ప్రార్ధనాస్థలంపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మార్ఫింగ్ ఫొటో వివాదానికి హేతువైంది. అభ్యంతరం తెలుపుతూ మైనార్టీలు పట్టణంలో ప్రదర్శన నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశాక నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడికి మద్దతుగా మతోన్మాద మూకలు రెచ్చిపోయి అత్యంత పైశాచికంగా దాడులు చేయగా పోలీసులతో సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యమంత్రి బొమ్మరు హుబ్బళ్లి ఘటనను వ్యవస్థీకృత దాడిగా పేర్కొనగా, హోం మంత్రి జ్ఞానేంద్ర...
మనువాద విధానం
Thu, 2022-04-14 11:52
కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సియుఇటి) ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మొన్న సోమవారం తమిళనాడు శాసనసభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం పెద్ద మేల్కొలుపు. ఉన్నత విద్యనభ్యసించగోరు విద్యార్థులు అవకాశాలు కోల్పోతారన్న భయాందోళనలు ముమ్మాటికీ నిజం. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను 2022-23 విద్యాసంవత్సరం నుండే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు యూనివర్శిటీలలో క్లాస్ 12 మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇచ్చేవారు. ఇక నుండి కామన్ ఎంట్రన్స్ మార్కులను బట్టి ప్రవేశాలు ఉంటాయి. సియుఇటి అత్యధిక సంఖ్యాక విద్యార్థులకు నష్టదాయకం. వారి...
హిందీ - హిందూత్వ
Tue, 2022-04-12 11:16
మరో మారు దేశ వ్యాప్తంగా హిందీ భాష రగడ రగులుకుంది. కర్త, కర్మ, క్రియ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాయే. మొన్న ఢిల్లీలో జరిగిన ఒక సమావేశంలో పార్లమెంటరీ అధికార భాషా ఛైర్మన్ హోదాలో అమిత్‌షా మాట్లాడుతూ హిందీయేతర భాషలు మాట్లాడే రాష్ట్రాలు కమ్యూనికేషన్ భాషగా ఇంగ్లీషుకు బదులు తప్పనిసరిగా హిందీని వాడాలని హుకుం జారీ చేసినంత పని చేశారు. భావ వ్యక్తీకరణకు ఏ భాష అనువుగా ఉంటే ఆ భాషను వాడతారు. అది ప్రజల ప్రాథమిక హక్కు. ఏ భాషను ఉపయోగించాలో నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. ఫలాన భాషే మాట్లాడాలని శాసించే అధికారం కేంద్రానికి ఎంతమాత్రం ఉండదు. ఒక పథకం ప్రకారం హిందీని రుద్దే చర్యలో భాగంగానే అమిత్‌షా ఈ ప్రకటన చేశారన్నది బహిరంగ రహస్యం....
వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన బలోపేతం : సీతారామ్ ఏచూరి
Tue, 2022-04-12 11:11
బిజెపి మతోన్మాద, కార్పొరేట్ విధానాలపై రాజీలేని పోరు. సొంత బలాన్ని పెంచుకోడానికి ప్రాధాన్యం. రాజకీయ, సామాజిక శక్తులను ఏకం చేసేందుకు కృషి - మీడియా గోష్టిలో సీతారామ్ ఏచూరి. కన్నూర్ నుంచి ప్రజాశక్తి ప్రతినిధి : దేశంలో వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు తాము శక్తివంచనలేకుండా కృషి చేస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. దీనికి ముందు పార్టీ తన స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం పట్ల నిబద్ధతను మహాసభ పునరుద్ఘాటించిందని ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే ముందుకు వెళ్తామని, తద్వారా బిజెపి మతోన్మాద, కార్పొరేట్ కూటమి సవాల్‌ను తిప్పికొడతామన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల హిందూత్వ ఎజెండాను ఓడించే...
వైతాళికులు
Sun, 2022-04-10 11:57
'సత్యం కోసం పోరాడటానికి కమ్యూనిస్టు ఎల్లప్పుడూ సంసిద్ధంగా వుండాలి. ఎందుకంటే, సత్యం ప్రజల ప్రయోజనాల కనుగుణమైనది. కమ్యూనిస్టు తమ తప్పులను దిద్దుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుండాలి. ఎందుకంటే, తప్పులు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైనవి' అంటాడు మావో. అంతేకాదు... 'ప్రజలు భూమిలాంటివారు. కమ్యూనిస్టులమైన మనం విత్తనాల లాంటివారం. మనం ఎక్కడకు వెళ్లినా, మనం ప్రజలతో ఐక్యమవ్వాలి. ప్రజల్లో వేరూని, పెరిగి...వారి మధ్యనే వికసించాలి' అంటాడు. ప్రజా ఉద్యమాల్లో పనిచేసే కమ్యూనిస్టులు పార్టీకి, జనసామాన్యానికి మధ్య సంబంధాలను దృఢపరచడంలో ముందుంటారు. ప్రజలకు స్నేహితుడుగా, ఉపాధ్యాయుడుగా ప్రజలతో ఐక్యమవుతాడు. ఈ క్రమంలో జరిగే మంచి చెడులను చర్చించుకొని ఆచరణ యుక్తంగా,...
కర్ణాటకలో మరో చిచ్చు
Fri, 2022-04-08 11:15
కర్ణాటకలో ఒకదాని తరువాత మరొకటిగా వివిధ సున్నిత అంశాలపై అనవసర రగడను సంఫ్‌ు పరివార శక్తులు తెర మీదికి తెస్తున్నాయి. గత ఫిబ్రవరిలో రగిల్చిన హిజాబ్ చిచ్చు ఇంకా పూర్తిగా చల్లారలేదు. తాజాగా హలాల్, అజాన్, పండ్ల అమ్మకం వంటి అంశాలు వరస కట్టాయి. మతోన్మాదం ఆధారంగా లబ్ధి పొందాలని చూస్తున్న కాషాయ రాజకీయ శక్తులు ఈ ఉన్మత్త, ఉద్వేగపూరిత ఎజెండాను దురుద్దేశపూర్వకంగా ప్రజల్లో జొనుపుతున్నాయి. ప్రజలు ఈ కుట్రను, కుతంత్రాన్ని గ్రహించి, విభజన రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి. విద్య, వైద్యం, కనీస వసతులు, ధరలు, ఉపాధి వంటి అంశాలు ప్రజల రోజువారీ జీవనాన్ని కులమతాలకు అతీతంగా ప్రభావితం చేస్తాయి. వాటికి సంబంధించి తలెత్తే సమస్యలు ప్రజలను ఏకం చేస్తాయి....
వికేంద్రీకరణ
Thu, 2022-04-07 17:59
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణలో సరికొత్త ముందడుగు. స్థూలంగా సర్కారు చర్య స్వాగతించదగింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాస్తా 26 జిల్లాలుగా సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతమైంది. మారిన సరిహద్దులు, నైసర్గిక స్వరూపంతో సోమవారం నుండి ఉనికిలోకొచ్చింది. కొత్తగా 13 జిల్లాలు రాగా, రెవెన్యూ డివిజన్లు 51 నుండి 72కు పెరిగాయి. జిల్లాల విభజనపై జనవరి 25న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయగా ప్రజల నుండి 16 వేలకు పైన సూచనలు, అభ్యంతరాలు ప్రభుత్వానికి అందాయి. వాటిలో సహేతుకమైనవాటిని ఆమోదించామంటున్నారు. పాడేరు కేంద్రంగా నెలకొల్పిన అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దుల నిర్ణయంలో ఎంతమాత్రం హేతుబద్ధత లేదు. పోలవరం...
ఇది మోసకారుల 'యాత్ర'
Thu, 2022-04-07 17:55
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితేనే ఎడమ కాలవ ద్వారా విశాఖ జిల్లా వరకూ గోదావరి జలాలు వస్తాయి. ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల మెట్ట ప్రాంతాల సాగునీటి అవసరాలకు మళ్ళించేదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. పోలవరం పూర్తి కావడం ఇక్కడ కీలకం. దాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత. ఇది విభజన చట్టం నిర్దేశించిన విషయమే. ఆ పోలవరానికి నిధులు ఇవ్వకుండా బిగబట్టినది ఎవరు? బిజెపి ప్రభుత్వం కాదా? లక్షలాది నిర్వాసితులను నీట ముంచుతూ వారి పునరావాసం తన బాధ్యత కానే కాదంటున్నది ఎవరు? బిజెపి కాదా? పోలవరం పూర్తి కాకుండా మోకాలడ్డుతూ, అక్కడ గిరిజనులను నీట ముంచుతూ ఇక్కడ ఉత్తరాంధ్రలో జలం కోసం యాత్ర అని ఘోష పెట్టడం ఎంత పెద్ద డ్రామా! విశాఖ...