ఆర్టికల్స్

పేదల ఆశలు, ఆత్మగౌరవాన్ని దిగజారుస్తున్న ప్రభుత్వం

నేను కరోనా వైరస్‌ వల్ల చనిపోను. దానికన్నా ముందు ఖచ్చితంగా ఆకలితో చనిపోతాను' ఈ మాటలు పాత ఢిల్లీలో ఒక చిన్నపాటి సంఘీభావ కార్యక్రమంలో వినబడ్డాయి. కొద్దిమంది మిత్రులతో కలిసి ఒక వెయ్యి మంది అనాథలకు భోజనాలు ఏర్పాటుచేసే ప్రయత్నంలో అనేకమంది ప్రజలు వెలిబుచ్చిన ఈ ద్ణుఖపూరిత మాటలను నేను పన్నెండుసార్లకు పైగా విన్నాను. 'పెద్దనోట్ల రద్దు వలన పడిన బాధలు, ఇప్పుడు మనం అనుభవిస్తున్న బాధతో పోలిస్తే పెద్ద లెక్కలోని విషయమే కాద'ని ఇంకొక వ్యక్తి అన్నాడు.ఒక గంట తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహాయక చర్యల ప్రకటనను నేను ఆందోళనగా చదివి, నిరాశ చెందాను. కరోనా వైరస్‌ సోకకుండా ఉండడానికి చేపట్టిన 'లాక్‌డౌన్‌' ఫలితంగా ఏర్పడిన ఆర్థిక ప్రభావం నుంచి ప్రజలను...

కాంతిరేఖ క్యూబా

అంధకారంలో చిక్కుకున్న ప్రపంచానికి క్యూబా ఓ కాంతిరేఖ. భయోత్పాతంలో ఉన్న మానవాళికి ఓ ధైర్యం. ఆపదలో ఉన్న దేశాలకు కొండంత అండ! ప్రపంచ పటంలో కష్టపడి వెతికితేకాని కనిపించని ఓ చిన్న దేశం క్లిష్ట సమయంలో నేనున్నానంటూ ఆపన్నహస్తం అందించడం సామాన్యమైన విషయం కాదు. అది కూడా, అమెరికా వంటి అగ్రదేశం కాడి పడేసి, కరోనా (కోవిడ్‌-19) కాటుకు దిక్కుతోచక విలవిలలాడుతున్న వేళ ఆ రక్కసితో ధైర్యంగా పోరాడటమే కాకుండా అనేక దేశాలకు వైద్య బృందాలను పంపడం, ఔషధాలను సరఫరా చేయడం క్యూబాను వర్తమాన ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టింది. కరోనా వైరస్‌ విస్తృతంగా వ్యాపించడంతో అత్యధిక మరణాలు చోటు చేసుకుంటున్న ఇటలీతో పాటు అనేక దేశాలకు క్యూబా సాయం చేస్తోంది. వెనిజులా, నికరాగువా,...

కౌలు రైతుకు భరోసా ఏదీ?

రైతు భరోసా నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఒబిసి మైనారిటీలకు చెందిన కౌలు రైతులకు మాత్రమే సహాయం అందుతుంది. అగ్ర కులాల్లోని పేద రైతులు ముందుగా మినహాయించబడ్డారు. తరువాత మిగిలిన వారిలో ఆ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా, ఆదాయ పన్ను చెల్లిస్తున్నా ఈ సహాయం అందదు. అన్నదమ్ములో, తండ్రీ కొడుకులో ఒకే కుటుంబం అన్న పేరుతో కోత పెడుతున్నారు. దరఖాస్తులన్నీ ఇలా ఒడపోసి ఐదవ వంతుకు తగ్గిస్తే ఉన్న వాటికి భూ యజమాని సంతకం లేదు కాబట్టి వాటిని పక్కన పెట్టేశారు. ఈ అవాంతరాలన్నీ దాటుకొని ఎంత మందికి భరోసా సహాయం దక్కుతుందో చూడాలి. ఇప్పటి వరకు నమోదు కానివారు నవంబర్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది కౌలు రైతుల్లో ఉన్న ఆందోళనను...

లాభాలు పెద్దలకు-రోగాలు ప్రజలకు..

చంద్రబాబు ప్రభుత్వం రెండంకెల అభివృద్ధి జపం చేస్తున్నది. రెండంకెల అభి వృద్ధి సాధన కోసం ఎన్నుకున్న రంగా ల్లో కీలక మైనది ఆక్వారంగం. రాష్ట్రంలో ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా ఆక్వా సాగును ప్రోత్సహిస్తా మని, రాష్ట్రాన్ని ఆక్వా హబ్‌గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటిం చింది. కోస్తా ప్రాంతాల్లో ముఖ్యం గా పై మూడు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అధికారికంగానూ, అనధికారికం గానూ లక్షలాది ఎకరాలు చేపలు, రొయ్యల చెరువు లుగా మారాయి. ఇంకా మారుతు న్నాయి. అన్నపూర్ణగా పేరొంది, దేశానికే తిండి గింజలను అందించే కృష్ణా, గోదావరి డెల్టాల్లోని వరిచేలు నేడు చేపలు, రొయ్యల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఆక్వాసాగు ప్రజల...

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కుచ్చుటోపీ..

పోలవరం ప్రాజెక్టు కథ-చారణా కోడికి బారణా మసాలా లాగా ఉంది. కేవలం నాబార్డు రుణంతో సరిపెట్టారు. కానీ, గమనార్హమైన అంశమేమంటే నాబార్డుకు పెట్టుబడి నిధి క్రింద రూ.9,020 కోట్లు కేటాయించారు. ఈ నిధుల నుంచే ఎఐబిపి జాతీయ హోదా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి. ఈ స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తున్నట్లు నాబార్డు నుంచి నిధులు ఎంత వరకు లభిస్తాయి. రూ.16 వేల కోట్లు అంచనా ప్రకారం ఇంకా రూ.3,829 కోట్లు రాష్ట్రానికి రావాలి. పైగా ప్రాజెక్టు అంచనాలు పెరిగితే నీతి ఆయోగ్‌ అమోదం పొందాలి. ఇదంతా ఒక విష వలయం. రాష్ట్ర ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న భ్రమ. అన్నిటికన్నా దుర్మార్గమేమంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన విద్యా సంస్థలు రాష్ట్రంలో తామరతంపరగా...

మరో వంచన..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వరుసగా తీసుకుంటున్న అనాలోచిత, ఏకపక్ష నిర్ణయాల వల్ల గ్రామీణ భారత ప్రజానీకం ఆర్థికంగా చితికి శల్యమైపోతోంది. పెద్ద నోట్ల రద్దు ఆకస్మిక నిర్ణయానికి నల్లధనం, ఉగ్రవాదం రూపుమాపడమే లక్ష్యమని చెబుతున్న పాలకులు అటువైపు గురి పెట్టకుండా బడుగు జీవులపై సర్జికల్‌ దాడులు చేస్తుండటం దారుణం. ఇప్పటికే ముందస్తు ప్రణాళికేదీ లేకుండా రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేయడం మూలాన భారతావని పీకల్లోతు చిల్లర కష్టాల్లో మునిగి మూలుగుతుంటే అది చాలదన్నట్టు బ్యాంకుల్లోనూ పాత పెద్ద నోట్ల మార్పిడిని నిలిపివేయడం వంచనకు పాల్పడటమే. బ్యాంకుల ముందు తీరిన బారులు స్మశానం వరకు సాగిపోతుంటే మోడీ సర్కార్‌ మాత్రం కళ్లున్నా చూడలేని...

మైనార్టీలపై మానసిక యుద్ధం

ఎల్‌కె అద్వానీ 2002లో తన రథయాత్ర ద్వారా కాషాయ శక్తులను పునరేకీక రించి డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును విధ్వంసం చేయించ టం ద్వారా దేశ లౌకికవాదాన్ని అపహాస్యం చేశారు. దాని ఫలితాన్ని వ్యక్తిగతంగా ఆయన ఇప్పుడు అనుభవిస్తుండటం వేరే విషయం అయినప్పటికీ, బాబ్రీ మసీదు విధ్వంసం కేసు నుంచి తప్పించుకోవడం ద్వారా ప్రజా స్వామ్యాన్ని పరిహాసం చేశారు. ఆ క్రమాన్ని గుజరాత్‌లో మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లిన మోడీ పరివారం ఇప్పుడు ఉత్త ర ప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా అసలు ప్రజా స్వామ్యం మనుగడనే సహించలేమన్నట్టుగా వ్యవ హరిస్తుండటం అత్యంత విచారకర అంశం. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో మరింతగా మత ఉద్రిక్తతలను, కల్లోలాలను సృష్టించటం ద్వారా ప్రజల మధ్య మరింత స్పష్టమైన విభజన రేఖ గీయటం...

ఈ పాపం ఎవరిది?

'ఒక ర్యాంకు ఒకే పింఛను' (ఓఆర్‌ఓపి) అమలు కోసం రిటైర్డు ఆర్మీ సుబేదార్‌ ఆత్మహత్య, తదనంతర పరిణామాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. జై జవాన్‌ అని నినదించిన గడ్డపైనే దేశానికి సేవ చేసిన జవాన్లు అత్యంత దయనీయమైన రీతిలో తనువు చాలించే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఇందుకు ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి చనిపోయిన రిటైర్డు సుబేదార్‌ మానసిక స్థితి ఏమిటో మొదట పరిశీలించాలని వికె సింగ్‌ వంటి మంత్రులతో ప్రకటనలు ఇప్పించడం అత్యంత గర్హనీయం. మోడీ సర్కార్‌కు మాజీ సైనికోద్యోగులన్నా, వారి ప్రాణాలన్నా, ప్రజాస్వామ్య విలువలన్నా ఏమాత్రం గౌరవం లేదనడానికి బుధ, గురువారాల్లో దేశ రాజధానిలోను, రాజస్థాన్‌లోను చోటుచేసుకున్న అరెస్టులు, నిర్బంధాలే నిలువెత్తు...

ఉగ్రవాదానికి మూలాలెక్కడ ?

ఉరి ఉగ్రవాద దాడి తరువాత దేశంలో పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదం పై చర్చ సాగుతుంది. కాశ్మీర్‌ లోయలో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశ భక్తి పేరుతో ఉన్మాదాన్ని ప్రేరేపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. సర్జికల్‌ దాడుల తరువాత ఆ ఘనత తమదేనని లాభాల వేట మొదలయ్యింది. పనిలో పనిగా ఏదేశ వస్తువులు కొనాలో, వద్దో చర్చ జరుగుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు అనేక విషయాల్లో సాగినట్టుగానే ఉగ్రవాద విషయం లోనూ వాస్తవాలు కప్పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
మనదేశంలోని పఠాన్‌ కోట, ఉరి తో పాటు పారిస్‌, ఇస్తాంబుల్‌, ఢాకా, బాగ్దాద్‌, సౌదీ అరేబియా ఇలా గత ఆరునెలల్లో అరడజను దేశాలపై ఉగ్రవాదం పంజా విసిరింది....

తెలుగు రాష్ట్రాలకు నష్టదాయకం

కృష్ణా జలాల పంపిణీని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు పరిమితం చేస్తూ కృష్ణా జలాల వివాదాలపై నెలకొల్పిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ బుధవారం వెలువరించిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రయోజనాలకు శరాఘాతం. ఉమ్మడి ఏపీ విభజనతో నదీ పరీవాహక రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపి నాలుగుకు పెరగగా, నీటి పంపిణీ పంచాయతీ నుంచి మహారాష్ట్ర, కర్నాటకలను ట్రిబ్యునల్‌ మినహాయించడం సహజ న్యాయ సూత్రాలకు, అంతర్జాతీయ నీటి చట్టాలకు పూర్తి విరుద్ధం. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పునకు భిన్నంగా 2013 నవంబర్‌ 29న బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ చెప్పిన తీర్పుపై నదీ పరీవాహక పరిధిలోని రాష్ట్రాలన్నీ దేశ సర్వోన్నత న్యాయస్థానం వద్ద సవాల్‌ చేయగా, గెజిట్‌ పబ్లికేషన్‌ను...

హిందూత్వ హింస, దోపిడీకి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్‌వాదం

నేడు దేశవ్యాప్తంగా హింస, సామాజిక అణచివేత, ఆర్థిక దోపిడీ మతం పేరుతో జరుగుతున్నాయి. దేశం ఆర్థికంగా కుంగిపోవ డానికి, సమాజం నేరస్థంగా మారడానికి కారణం హిందూవాదమే. హిందూవాదం హింసావాదం, అణచివేతవాదం, అమానవవాదం. హిందూత్వ పేరిట నేడు బిజెపి, విశ్వహిందూ పరిషత్‌ మైనార్టీలు, దళితులపై జరుపుతున్న దాడులు మోడీ జీవన శైలిలో ఉన్న పయోముఖ విషకుంభత్వాన్ని బయట పెడుతున్నాయి. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే 'హిందూత్వ' పేరిట బిజెపి పరివార్‌ ప్రభుత్వం మైనారిటీ ప్రజలపై అమలు జరిపిన 'మారణకాండ' రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి ముందు నాజీ ఫాసిస్టు జర్మనీలో హిట్లర్‌ హంతక ముఠా లక్షలాది మంది యూదులపై అమలుజరిపిన జాత్యహంకార పూరితమైన మూకుమ్మడి హత్యాకాండతో సమానం. భారత జాతీయ జీవనంలో...

విలువలతో కూడిన విద్య నేటి అవసరం

స్వాతంత్య్రోద్యమంలో మహా నాయకులు తమ పుట్టినరోజులను సామాజిక ఆశయాలతో ముడిపెట్టుకున్నారు. పుట్టిన రోజును కొత్త తీర్మానాలు చేసుకొనేదిగా నిర్ణయించుకున్నారు. కొత్త ఆశయాలకు కంకణబద్ధులై అందుకు ప్రణాళిక రచించుకొనే రోజుగా మార్చుకొని రాజీలేని పోరాటం చేశారు. కాబట్టే సెప్టెంబర్‌ 5న భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని యావత్‌ భారతావని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటోంది. 'విద్యకు విద్యార్థులు అంకితం.. ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకితం' అని చెప్పిన మహానుభావుడు ఆయన. ఉపాధ్యాయుల దిశానిర్దేశం లేకపోతే విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరమే అనేందుకు మరో మాటలేదు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణను, సామాజిక విలువలను...

Pages