ఆర్టికల్స్

ప్రమాదం తొలగిపోలేదు..

మన్యం ప్రజల బతుకుల్లో విషం చిమ్మే బాక్సైట్‌ జిఒ విషయంలో వెనక్కి తగ్గాలని ప్రభుత్వం నిర్ణయించడం మంచి పరిణామం. గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చినందువల్లే అయిష్టంగానైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చింది. మంత్రి మండలి సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు స్థానికంగా వ్యక్తమవుతున్న తీవ్ర ఆందోళనను సుదీర్ఘంగా వివరించిన తరువాత, నిఘా వర్గాల నివేదికలను పూర్తి స్థాయిలో పరిశీలించాక మరో మార్గం లేకే ఈ దిశలో నిర్ణయం తీసుకున్నారన్నది దాచినా దాగని సత్యం! అయితే, ప్రజా సంక్షేమం కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలకే పెద్దపీట వేసే బాబు సర్కారు బాక్సైట్‌ ఖనిజాన్ని వెలికితీసే విషయంలో తన వైఖరిని పూర్తిగా మార్చుకోలేదు. అధికారంలోకి...

ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు అవశ్యం..

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 1950 జనవరి 26న రాజ్యాంగ సభలో మాట్లాడుతూ మనం వైరుధ్యాలతో కూడిన జీవితం ప్రారంభిస్తున్నాము. మనకు రాజకీయాలలో సమానత్వం ఉంది కానీ, సామాజిక, ఆర్థిక జీవితాలలో అసమానతలున్నాయి. రాజకీయాలలో ఒక మనిషికి ఒక ఓటు, ఒక విలువ అనే సూత్రాన్ని గుర్తించబోతున్నాము. కానీ మనం సామాజిక, ఆర్థిక జీవితాలలో మనుషులందరికీ ఒకే విలువ అనే సూత్రాన్ని తిరస్కరిస్తున్నాము. ఎంతకాలం ఈ వైరుధ్యాల జీవితం. ఈ వైరుధ్యాలను వీలైనంత త్వరగా అంతం చేయాలి. లేదంటే రాజ్యాంగ సభవారు కష్టపడి నిర్మించిన రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థను అసమానతలకు గురైనవారు పెకలించి వేస్తారని చెప్పిన మాటలను మన పాలకులు గుర్తుంచుకోవాలి. వారు పరిపాలనా విధానంలో మార్పులు చేస్తూ రాజ్యాంగంలోని సామ్యవాద...

ప్రపంచ కార్పొరేట్‌ పాలన దిశగా...

 పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై అనేక దేశాలతో చర్చించటం ద్వారా ఒక సరికొత్త ప్రపంచ పాలనా నిర్మాణాన్ని అమెరికా చేపడుతున్నది. ఈ ఒప్పందాలన్నీ అమలులోకి వస్తే ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 80 శాతం వీటి పరిధిలోకి వస్తుంది. అంటే ఒక్కమాటలో చెప్పాలంటే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థంతా వీటి ఆధీనంలోకి వస్తుంది. అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు(బిట్సి, ట్రాన్స్‌అట్లాంటిక్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్టనర్‌షిప్‌(టిటిఐపి), ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌(టిపిపి)వంటివి) వీటిలో ఉన్నాయి. ఇందులో చేరాల్సిందిగా భారత్‌ను ప్రేరేపిస్తున్నందున ఈ నిర్మాణాన్ని మనం అధ్యయనం చేయవలసి ఉంది.
మూడు ముఖ్య లక్షణాలు
ఈ ఒప్పందాలలో కనీసం మూడు...

ఉగ్రవాదానికి అగ్రరాజ్యాలే ఆజ్యం..

ప్రపంచంలో కొన్ని అగ్రదేశాలు అనుసరిస్తున్న విధానాలే ప్రస్తుతం అన్ని దేశాలను వణికిస్తున్న ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్నాయని సిపిఎం అధికార పత్రిక పీపుల్స్‌ డెమొక్రసీ తన తాజాసంచిక సంపాదకీయంలో విమర్శించింది. ప్రస్తుతం ప్రపం చం అంతా ఉగ్రవాదం నుండి పెనుముప్పును ఎదు ర్కొంటున్నదని, ఈ పెనుభూతాన్ని తరిమికొట్టి నిర్మూలించాలన్న విషయంలో ఎటువంటి సందే హమూ అవసరం లేదని పత్రిక ప్రధాన సంపాద కుడు ప్రకాశ్‌ కరత్‌ అభిప్రాయపడ్డారు. అయితే ఉగ్ర వాద మూలాలను కనిపెట్టి వాటిని ఎదుర్కొనే విధా నాలు, పద్ధతులను అనుసరించటంలోనే అసలు సమస్య వస్తున్నదన్నారు. గత వారం పారిస్‌ నగ రంపై జరిగిన దాడులు, ఇతర దేశాలలో ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న మరికొన్ని దాడులను ఖండించే వారు అందుకు...

టిప్పు సుల్తాన్‌ జయంతిపై సంఘ్ పరివార్‌ రగడ..

చరిత్రను సంఫ్‌ు పరివార్‌ మతోన్మాద కళ్లద్దాలతో పరిశీలిస్తే అన్నీ తల్లకిందులుగానే కనిపిస్తాయి. దేశ రక్షణ కోసం పోరాడి యుద్ధభూమిలో నేలకొరిగిన వీరుడు ముస్లిం అయితే ఆయన దేశ భక్తుడు కాదు. విదేశీయులతో కుమ్మక్కయి దేశానికి ద్రోహం చేసిన వాడు హిందువు అయితే అతను మహా దేశభక్తుడవుతాడు. ప్రస్తుతం కర్ణాటకలో టిప్పుసుల్తాన్‌ జన్మదిన వేడుకలను వ్యతిరేకిస్తూ మత ఘర్షణలు సృష్టిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌-బిజెపి-సంఫ్‌ు పరివార్‌ శక్తుల ధోరణి చూస్తుంటే కేంద్రంలో అధికారం చేపట్టిన ఈ శక్తులు దేశాన్ని తాలిబానీకరించడానికి ఎంతగా తాపత్రయ పడుతున్నాయో అర్థమవుతుంది. 
మైసూర్‌ టైగర్‌గా పేరుగాంచిన టిప్పు సుల్తాన్‌ భారత దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చిన బ్రిటిష్‌ సామ్రాజ్యవాద...

''పాలకులే'' పీడకులైతే..

 ''పాలకులు మారినంత మాత్రాన ప్రజలకేమీ ఒరగదు. దోపిడీ వర్గాలు తమ సాంస్కతిక భావజాలాల ద్వారా ప్రజా జీవితాన్ని ప్రస్తుత దుర్భర స్థితిలోనే కొనసాగించడానికి సర్వప్రయత్నాలూ చేస్తూ ఉంటాయి. పీడితవర్గ పక్షపాత దక్పథం కలిగిన నాయకులు అధికారం చేపట్టాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది'' అని ఇటలీ తత్వవేత్త ఆంటోనియో గ్రాంసి అన్నారు. అతి పెద్ద దేశాలలో ఒకటైన మన దేశంలో ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. ఒకటి రెండు రాష్ట్రాలలో తప్ప అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్రంలోనూ పాలక ముఖ్యులు 'ముఖ్య కార్యనిర్వాహక అధికారులు'గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలోనే కాదు పార్టీలలోనూ ప్రజాస్వామ్యం అడుగంటింది. అందరూ రాజులుగా, చక్రవర్తులుగా నిజం చెప్పాలంటే నియంతత్వమే నిత్యకత్యంగా...

ఉగ్రవాదం - అగ్రవాదం

 ఫ్రాన్స్‌ రాజధాని నగరం పారిస్‌పై శుక్రవారంనాటి ఉగ్రవాద దాడితో టర్కీలో జరుగుతున్న జి20 సమావేశం దృష్టి ప్రపంచ ఆర్థిక పరిస్థితి మీదనుండి ఉగ్రవాదం మీదికి మళ్లింది. ప్రపంచంలోని అన్ని సంస్కృతులకు ద్వారాలు తెరిచి ఉంచే పారిస్‌ నగరంలో ఉగ్రవాదలు సృష్టించిన మారణ హోమంలో 128 మంది అమాయకులు మ్యత్యువాత పడడం, వందలాది మంది క్షతగాత్రులు కావడం దిగ్భ్రాంతికరం. ఈ దాడి తరువాత నగరం ఇప్పుడు పాత ధోరణిని కొనసాగిస్తుందా లేక శరణార్ధులకు, ఇతర జాతుల ప్రజలకు ద్వారాలు మూసేస్తుందా అన్నది పెద్ద ప్రశ్నగా తయారైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఫ్రాన్స్‌లో ఇప్పుడు జరిగింది అతిపెద్ద ఘాతుకం. పారిస్‌పై బరితెగించింది తామేనని ఇస్లామిక్‌ స్టేట్‌ ఇన్‌ ఇరాక్‌-సిరియా (ఐఎస్‌ఐఎస్‌-ఐసిస్...

మోడీ పాలనలో పెరుగుతున్నఅసహనం..

మాజీ ఉప ప్రధాని, బిజెపి సీనియర్‌ నాయకులు లాల్‌కృష్ణ అద్వానీ గతంలో ఒకసారి ప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీని గొప్ప 'ఈవెంట్‌ ఆర్గనైజర్‌'గా వర్ణించారు. ఎల్‌కె అద్వానీని బిజెపి, దాని సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు(ఆర్‌ఎస్‌ఎస్‌) విస్మరించింది. అయినప్పటికీ దేశ ప్రజానీకం అద్వానీని, ఆయన నాయకత్వాన్నీ ఇంకా గుర్తు పెట్టుకున్నది. ప్రధాని మోడీ ప్రస్తుతం దేశాలు పర్యటించడం, విదేశీ ప్రధానులు, అధ్యక్షులు, బడా పెట్టుబడిదారులకూ ఆతిథ్యం ఇస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అదే సమయంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మోడీ దేశ ప్రజానీకానికి ఇచ్చిన వాగ్దానం మరిచిపోయారనే విషయం కూడా నిక్కచ్చిగా చెప్పవచ్చు. అదేమంటే 'మినిమమ్‌ గవర్నమెంట్‌.. మాగ్జిమమ్‌...

ఆర్థిక పతనం..

విదేశీ పెట్టుబడుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని విదేశాలు తిరుగుతుంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వార్షిక వినిమయ ద్రవ్యోల్బణం వరుసగా మూడో మాసం పెరిగి అక్టోబర్‌లో 5.0 శాతానికి చేరుకుంది. రిటైల్‌ ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగి 5.25 శాతానికి చేరింది. పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో 6.3 శాతంతో పోలిస్తే సెప్టెంబర్‌లో 3.6 శాతానికి తగ్గింది. ఇవన్నీ ప్రభుత్వం గురువారం నాడు విడుదల చేసిన లెక్కలు. ప్రపంచానికి భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆశాదీపం అని బ్రిటన్‌లో ప్రధాని ఊదరగొడుతున్న సమయంలోనే దేశంలో ఈ లెక్కలు వెలువడడం ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత అన్న సామెతను గుర్తుకు...

కరువు కోతలు..

అమరావతి, పుష్కరాలు, సింగపూర్‌, జపాన్‌ ప్రచారార్భాటంలో పడి చంద్రబాబు ప్రభుత్వం కరువును విస్మరించడం ఘోర అపరాధం కాగా ఆలస్యంగా ప్రకటించిన కరువు మండలాల్లోనూ పిసినారి తనానికి పాల్పడటం మరీ దుర్మార్గం. ఖరీఫ్‌లో రాష్ట్ర వ్యాప్తంగా దుర్భిక్షం అలముకోగా ఆర్చుకొని తీర్చుకొని సీజను ముగిసిన నెల రోజులకు వెల్లడించిన కరువు మండలాల విషయం కూడా ఎంతో లోపభూయిష్టంగా, ఆశాస్త్రీయంగా ఉంది. పదమూడు జిల్లాల్లో 670 మండలాలుండగా మీనమేషాలు లెక్కించి గుర్తించినవి ఏడు జిల్లాల్లో 196 మండలాలు. కరువు కోరల్లో చిక్కుకొని రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే కరువు గుర్తింపులో కూడా వడపోతలకు ఒడిగట్టడమే కాకుండా కఠిన షరతులు విధించడం...

మత నియంతృత్వం దిశగా దేశం

రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు (ఆర్‌యస్‌యస్‌) హిందూత్వ ప్రచారానికి కేంద్రంగా ఉంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వంపై ఆ ప్రభావం తీవ్రంగా ఉన్నది. ఈ స్థితిలో మనం ఈ కింది విధంగా ప్రశ్నించుకోవచ్చు. ''మనదేశం హేతుబద్ధత, తార్కికతతో పాటు ప్రజాస్వామ్యం నుంచి కూడా దూరంగా వెళ్తూ, హిందూ మత నియంతృత్వం వైపు ప్రయాణిస్తున్నదా?'' దురదృష్టవశాత్తూ ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పుకోవాల్సి వస్తున్నది. ప్రజాస్వామ్యం, తర్కబద్ధత, హేతు వులపై ఆధారపడిన సమాజంలో భిన్నాభి ప్రాయాలను వ్యక్తం చేయటానికి అవకాశాలు ఉండాలి. హేతుబద్ధమైన భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించాలి. ప్రస్తుతం భారతదేశంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ విధానంలో భాగంగా, హేతుబద్ధమైన భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం...

అంగట్లో అమ్మకం..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై నిబంధనలను మరింతగా సడలించిన కేంద్రంలోని ఎన్‌డిఎ సర్కారు దేశాన్ని అంగట్లో నిలబెట్టి అమ్మేందుకు బరితెగించింది. దీపావళి పండుగ వేళ ఎఫ్‌డిఐలపై పరిమితులు సరళీకరించి విదేశీ కార్పొరేట్లకు వెలుగులు అందించిన మోడీ ప్రభుత్వం ఇప్పటికే 'సంస్కరణ'ల భారాలతో మసకబారిన మన ప్రజల బతుకుల్లో చీకట్లు నింపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను కీలక రంగాల్లో ఎఫ్‌డిఐలకు తలుపులు బార్లా తెరిచి విదేశీ సంస్థల దోపిడీకి లైసెన్స్‌లు ఇవ్వడం ఆందోళనకరం. రక్షణ, బ్యాంకింగ్‌, పౌర విమానయానం, ఉద్యానవనాలు, చిల్లర వర్తకం, నిర్మాణ, రైల్వే, మీడియా, తదితర రంగాల్లో ఎఫ్‌డిఐలు స్వైర విహారం చేసేందుకు ఇంకా మిగిలి ఉన్న కొద్దిపాటి స్పీడ్‌ బ్రేకర్లను...

Pages