ఆర్టికల్స్

వాగ్దానం చేసిన ఉద్యోగాలెక్కడ

దేశంలో నిరుద్యోగం పెరుగుదల, ఉద్యోగాలు పెరగక పోవటాన్ని గురించి ఈమధ్య కార్పొరేట్‌ మీడియా చర్చ చేస్తున్నది. లేబర్‌ బ్యూరో చేసిన త్రైమాసిక సర్వేలో ఉద్యోగాల పెరుగుదల ఎక్కువగా ఉండే ఎనిమిది రంగాలైన బట్టల పరిశ్రమ, చేనేత వస్త్రాలు, బంగారు నగలు, నూలు ఉత్పత్తి, ఐటి రంగం, తోలు ఉత్పత్తులు, లోహాలు, ఆటోమొబైల్స్‌లలో 2014లో 4,90,000 మందికి, 2009లో 12,50,000 మందికి ఉద్యోగాలుకల్పించగా 2015లో 1,50,000 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించి నట్లుగా వెల్లడి కావటం ఈ చర్చకు తక్షణ కారణం కావచ్చు. గ్రామీణ ఉద్యోగితకు సంబంధించి పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. జిడిపిలో వ్యవసాయ రంగం వాటా తగ్గుతున్నది. గ్రామీణ ప్రాంతంలోని పేదలకు, యువతకు వ్యవసాయ రంగం నుంచి ఇతర రంగాలలో...

దోషులను బోనులో నిలబెట్టాలి

అగస్టా కుంభకోణం, కాగ్‌ తవ్వితీసిన గుజరాత్‌ స్టేట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (జిఎస్‌పిసి) అవినీతి భాగోతంపై పార్లమెంటులో బిజెపి, కాంగ్రెస్‌లు పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభాకార్యక్ర మాలను స్తంభింపజేశాయి. ఈ రెండు కుంభకోణాల్లోను ఆవిరైన ప్రజాధనాన్ని మెక్కిన వారిచే కక్కించేందుకు దీనిపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరిగితే ఉపయోగకరంగా వుండేది. కానీ, పసలేని వాదనలతో సభను అడ్డుకోవడం ఈ కుంభకోణాల్లో దోషులను కాపాడడానికే పనికొస్తుంది. రూ.36 వేల కోట్ల విలువైన పన్నెండు వివిఐపి హెలికాప్టర్ల అమ్మకంలో రూ.360 కోట్ల మేర ముడుపుల చెల్లింపునకు సంబంధించిన అగస్టా వెస్ట్‌లాండ్‌ కుంభకోణం గురించి లేవనెత్తి కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాలని బిజెపి యత్నించగానే, కాంగ్రెస్‌...

'భారత మాత'కు ఇచ్చే గౌరవం ఇదేనా?

భారత్‌ మాతాకీ జై... అనక పోతే దేశద్రోహమే అని సంఫ్‌ు పరివార్‌ అనుయా యులు ఈ మధ్య పదే పదే అంటున్నారు. దేశాన్ని తల్లిగా చూడాలా, తండ్రిగా చూడా లా? లేక తల్లితండ్రిగా చూడ కుండా వేరే పద్ధతిలో దేశ భక్తిని ప్రదర్శించే మార్గమే లేదా? అన్న చర్చ కూడా ఈ సందర్భంగా దేశంలో జరుగుతున్నది. ప్రస్తు తం ఈ చర్చల జోలికి పోవడం నా ఉద్ధేశ్యం కాదు. దేశంలోని మాతలకు (స్త్రీలను) సమానత్వం ఇవ్వకుండా, వారికి తగిన గౌరవం ఇవ్వకుండా భారత్‌ మాతాకీ జై అంటే దేశభక్తులై పోయి నట్లేనా? అన్నది నేను లేవనెత్త దలుచు కున్న చర్చ. 
సమానత్వం కోసం మహిళలు ఆందోళనలు చేస్తున్న కొన్ని ఘటనలను ఈ మధ్య వార్తల్లోకెక్కాయి. దేశంలో స్త్రీలను ఇప్పటికీ ఎంత అవమానకరంగా, ఎంత ఆక్షేపనీయంగా చూస్తున్నారో ఈ...

ఆర్థిక నేరగాళ్లపై ఆంక్షలుండవా..?

దేశంలో గతంలో ఎన్న డూ కనీవినీ ఎరుగని రీతిలో బ్యాంకులు కొంత ఆర్థిక ఒడిదు డుకులకు గురవుతు న్నాయా..? అంటే అవుననే అనిపిస్తుంది. బ్యాంకుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసిందెవరు...? దేశంలో పేదలు నమ్మకంతో తమ కష్టార్జితాన్ని దాచుకునే బ్యాంకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే పరిస్థితేంటి...? అనే చర్చ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. పెట్టు బడిదారులు తమ అవసరాలకు బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని తీరా వారు చేపట్టిన సంస్థలు అప్పుల పాలయ్యాయని ఎగవేత దారులుగా మారుతున్నారు. 'భారతదేశంలో పరిశ్రమలు పెట్టండి, అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తాం. భూమి, విద్యుత్‌, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత మాదే' అంటూ ఊదర గొడుతూ దేశదేశాలు పట్టుకు తిరుగుతున్న మన పాలకులు ఇక్కడి...

మార్క్సి‌స్టు‌ దృక్కోణం - కులం

దేశంలోని అనేక ఉన్నత విద్యా సంస్థలపై హిందూత్వ శక్తుల దాడుల నేపథ్యంలో కులం గురించి వామపక్ష మేధావుల్లో ఒక నూతన చర్చ మొదలైంది. కుల అణచివేత సమస్యను మార్క్సి స్టు దృక్పథంతో అర్థం చేసుకుంటున్న తీరును ఈ చర్చ మరోసారి ముందుకు తెచ్చింది. నేడు జరిగే పోరాటాలపై ఈ చర్చ ప్రభావం తక్షణమే ఉండకపోవచ్చు. అయితే ఇది సైద్ధాతిక ఎజెం డాలో భాగమైన విషయాన్ని కాదనలేము.
మార్క్సిజం 'కులం' కంటే 'వర్గం'కు ప్రాధాన్యతనిస్తుందని, కుల విభజన కంటే వర్గ విభజన ఆధారంగానే మార్క్సిజం సమాజాన్ని ప్రాథమికంగా అర్థం చేసుకుంటుం దని, తద్వారా కుల సమస్యకు తగిన ప్రాధాన్యతను ఇవ్వటం లేదని చాలామంది ముఖ్యంగా దళిత మేధావులు ఆరోపి స్తున్నారు. మూడు మేధో వైఖరులను ఈ చర్చలో మనం గమనించవచ్చు....

2030 నాటికి పేదరికం కనబడదా?

అవునంటున్నారు పెట్టుబడిదారీ దేశాధి నేతలు. నిజానికి ఆయా దేశాల్లో ప్రభుత్వాధినేతలు రోజూ చెప్పేది అదే. అధికా రంలోకి వచ్చిన వాళ్లు పదవీ కాలంలో తిమ్మిని బమ్మిని చేస్తామని చెబుతుంటారు. అధికారం కోల్పోయిన వాళ్లు తమ కాలంలో దాదాపు పేదరికాన్నే నిర్మూలించినట్లు, తమ అనంతరం అంతా నాశనం అయిపోతున్నట్లు గగ్గోలు పెడు తుంటారు. ఏదిఏమైనా పేదరికం గురించి, పేదరిక నిర్మూలన గురించి జరిగేంత చర్చలో ఒక్క వంతు కూడా పేదరికానికి కారణాల గురించి మాత్రం జరగకుండా పాలక వర్గాలు, పలు పార్టీలు, వారి ఉప్పు తినే మేధావులు జాగ్రత్త పడుతుంటారు.
ఎండిజిల స్థానంలో ఎస్‌డిజిలు
ఎండిజిలు అంటే మిలీనియం డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు) 2000...

వారికి అంబేద్కర్‌ అవసరం ఎందుకొచ్చింది?

అంబేద్కర్‌ గురించి అంద రూ మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అని, దళిత వర్గా ల పెన్నిధి అని కీర్తిస్తు న్నారు. రిజ ర్వేషన్లు ఎస్సీ, ఎస్టీల హక్కు అని ప్రధాని నరేంద్ర మోడీ కూడా తాజాగా ప్రస్తుతించారు. అంబే ద్కర్‌ను ఇప్పుడు జాతీయ పార్టీలు అన్నీ సొంతం చేసుకునే దిశలో పోటీపడుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు బిజెపి ఈ విషయంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. అంబేద్కర్‌ పేరు చెప్పి ఓట్లు పొందే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందుకే సమయం వచ్చినప్పుడే కాకుండా అంబేద్కర్‌ పేరు చెప్పడానికి సమయం కొనితెచ్చుకుంటున్నారు. జాతీయ పార్టీల కు వేగుచుక్కగా ఇప్పుడు అంబేద్కర్‌ కన్పిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా చెలరేగుతున్న ప్రజా ఉద్యమాల...

విషం చిమ్ముతున్న దివిస్‌

 పరిశ్రమలొస్తే స్థానికులకు ఉపాధి లభిస్తుందని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పాలకులు చెబుతున్న మాటలు భ్రమలు కల్పించేవి తప్ప భరోసా ఇచ్చేవి కావని అర్థమవుతోంది. నమ్మించి పారిశ్రామికవేత్తల అవసరాలు తీర్చడం కోసం ప్రజలతో ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలని అనుభవాలు చెబుతున్నాయి. విశాఖ జిల్లాలోని సెజ్‌, ఫార్మా, హెటిరోడ్రగ్స్‌, బ్రాండిక్స్‌, డెక్కన్‌ కెమికల్స్‌, దివిస్‌ ఇలా ఏ కంపెనీని స్పృశించినా, దాని చరిత్ర చూసినా, నడత చూసినా అర్హతవున్న స్థానికులకు ఉద్యోగాలివ్వకపోవడం, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, కాలుష్య నియంత్రణ చర్యలు అమలుచేయకపోవడం, ఆర్జించిన వార్షిక లాభాల్లో రెండు శాతం సిఎస్‌ఆర్‌ నిధులను ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలకు కేటాయించకపోవడం వంటి...

కుహనా దేశభక్తుల ఆట కట్టించాలి..

కుహనా దేశభక్తి పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ బిజెపి కూటమి సాగిస్తున్న ఏడుపులను, గగ్గోలును సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు ఇంత హంగామా చేస్తున్న ఈ హిందూత్వ ప్రచారకులకు స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న రికార్డు లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ పేర్కొన్నారు. పైగా దీనికి విరుద్ధంగా తనను వదిలిపెడితే బ్రిటీష్‌ పాలకులకు అవసరమైన సాయాన్ని అందిస్తానంటూ హిందూత్వ సిద్ధాంత వ్యవస్థాపకుల్లో ఒకరైన వీర్‌ సావర్కార్‌ ముందుకొచ్చారని విమర్శించారు. సామ్రాజ్యవాదాన్ని బుజ్జగించే విధానాన్ని అనుసరించే శక్తులు నిజమైన జాతీయవాదులు కాదని అన్నారు. దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడేందుకు గానూ ఈ బూటకపు జాతీయవాదాన్ని ఓడించేందుకు చివరి వరకు తమ పోరాటాన్ని సాగించేవారే...

నీరుగారుతున్న గృహ నిర్మాణం..

గుడిసెలులేని ఆంధ్రప్రదేశ్‌, పేదలకు డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ళు, 2022 నాటికి అందరికీ ఇళ్ళు అంటూ పాలకులు ఊదరగొడుతున్నారు. ప్రభుత్వాలు మారాయి. గృహనిర్మాణ పథకాల పేర్లు మారాయి. ఇందిరమ్మ, రాజీవ్‌ పథకాల స్థానంలో ఎన్‌టిఆర్‌ పథకాలొచ్చాయి. కానీ ప్రభుత్వాల తీరు మాత్రం మారలేదు. 22 నెలలు గడచినా తెలుగుదేశం, బిజెపి పాలనలో పేదలకు గూడు కల్పించడంలో వెనుకడుగే తప్ప ముందడుగు లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పేదలకు మూడు సెంట్ల ఇళ్ళ స్థలం, పక్కా ఇల్లు, మధ్యతరగతివారికి ప్రత్యేక గృహ పథకం పేరుతో వాగ్దానాల వర్షం కురిపించింది. ఈ కాలంలో ''గాలిమేడలే'' తప్ప ఇళ్ళ నిర్మాణం సాగలేదు. పెరిగిన ఇళ్ళ అద్దెలతో పేదలేకాదు మధ్యతరగతి వర్గాలు బెంబేలెత్తుతు న్నాయి. సొంత ఇల్లు కలగానే...

విస్తృత చర్చ అవసరం..

దేశ న్యాయవ్యవస్థ విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటోం దంటూ సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు మరోమారు న్యాయవ్యవస్థ పనితీరును చర్చనీయాం శం చేశాయి. అలహాబాద్‌ హైకోర్టుకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. నిజానికి ఈ తరహా చర్చ ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఎన్నోసార్లు ఈ అంశం తెరమీదకు వచ్చింది. ఇలా చర్చ జరిగిన ప్రతిసారీ కాయకల్ప చికిత్సతో సరిపుచ్చడం అలవాటుగా మారింది. అయితే, గతానికి ఇప్పటికీ పెద్ద తేడానే ఉంది. అన్ని రంగాల్లోనూ అవినీతిని వ్యవస్థాగతం చేసిన ఆర్థిక సంస్కరణలు న్యాయవ్యవస్థనూ వదలలేదన్న విషయం ఇప్పుడు మరింత స్పష్టంగా...

పీర్‌లెస్‌ రక్షణ ప్రభుత్వ బాధ్యత..

దేశంలోని చిన్న మొత్తాల పొదుపు సంస్థలలో ప్రముఖ స్థానంలో ఉండి ఆర్‌బిఐ నిబంధనలకనుగుణంగా నడుస్తూ ప్రజాభిమా నాన్ని చూరగొన్న సంస్థ పీర్‌లెస్‌ జనరల్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ లిమి టెడ్‌. నిజాయితీగా తన ఖాతాదారులకు మెచ్యూరిటీ సొమ్మును అందిస్తున్న ఈ సంస్థ ఆర్‌బిఐ విధించిన ఆంక్షల ఫలితంగా తన వ్యాపారాన్ని 2011 ఏప్రిల్‌ 1 నుంచి ఆపేయాల్సి వచ్చింది. దీనితో పీర్‌లెస్‌ సంస్థ ద్వారా లబ్ధిపొందిన లక్షలాది మంది ఖాతాదారులు తిరిగి తమ డబ్బును పీర్‌లెస్‌ సంస్థలో పొదుపు చేసుకొనే అవకాశం కోల్పో యారు. అంతేకాక ఖాతాదారులు తాము కష్టపడి సంపాదించు కున్న మొత్తాలను దేశంలోని శారదా చిట్‌ఫండ్‌ లాంటి అనేక బోగస్‌ సంస్థలలో పెట్టుబడులు పెట్టి పలు మోసాలకు గుర య్యారు....

Pages