ఆర్టికల్స్
వామపక్ష, ప్రజాతంత్ర సంఘటన బలోపేతం : సీతారామ్ ఏచూరి
Tue, 2022-04-12 11:11
బిజెపి మతోన్మాద, కార్పొరేట్ విధానాలపై రాజీలేని పోరు. సొంత బలాన్ని పెంచుకోడానికి ప్రాధాన్యం. రాజకీయ, సామాజిక శక్తులను ఏకం చేసేందుకు కృషి - మీడియా గోష్టిలో సీతారామ్ ఏచూరి. కన్నూర్ నుంచి ప్రజాశక్తి ప్రతినిధి : దేశంలో వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయాన్ని నిర్మించేందుకు తాము శక్తివంచనలేకుండా కృషి చేస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. దీనికి ముందు పార్టీ తన స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం పట్ల నిబద్ధతను మహాసభ పునరుద్ఘాటించిందని ఆయన చెప్పారు. ప్రత్యామ్నాయ విధానాలతోనే ముందుకు వెళ్తామని, తద్వారా బిజెపి మతోన్మాద, కార్పొరేట్ కూటమి సవాల్‌ను తిప్పికొడతామన్నారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ల హిందూత్వ ఎజెండాను ఓడించే...
వైతాళికులు
Sun, 2022-04-10 11:57
'సత్యం కోసం పోరాడటానికి కమ్యూనిస్టు ఎల్లప్పుడూ సంసిద్ధంగా వుండాలి. ఎందుకంటే, సత్యం ప్రజల ప్రయోజనాల కనుగుణమైనది. కమ్యూనిస్టు తమ తప్పులను దిద్దుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుండాలి. ఎందుకంటే, తప్పులు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైనవి' అంటాడు మావో. అంతేకాదు... 'ప్రజలు భూమిలాంటివారు. కమ్యూనిస్టులమైన మనం విత్తనాల లాంటివారం. మనం ఎక్కడకు వెళ్లినా, మనం ప్రజలతో ఐక్యమవ్వాలి. ప్రజల్లో వేరూని, పెరిగి...వారి మధ్యనే వికసించాలి' అంటాడు. ప్రజా ఉద్యమాల్లో పనిచేసే కమ్యూనిస్టులు పార్టీకి, జనసామాన్యానికి మధ్య సంబంధాలను దృఢపరచడంలో ముందుంటారు. ప్రజలకు స్నేహితుడుగా, ఉపాధ్యాయుడుగా ప్రజలతో ఐక్యమవుతాడు. ఈ క్రమంలో జరిగే మంచి చెడులను చర్చించుకొని ఆచరణ యుక్తంగా,...
కర్ణాటకలో మరో చిచ్చు
Fri, 2022-04-08 11:15
కర్ణాటకలో ఒకదాని తరువాత మరొకటిగా వివిధ సున్నిత అంశాలపై అనవసర రగడను సంఫ్‌ు పరివార శక్తులు తెర మీదికి తెస్తున్నాయి. గత ఫిబ్రవరిలో రగిల్చిన హిజాబ్ చిచ్చు ఇంకా పూర్తిగా చల్లారలేదు. తాజాగా హలాల్, అజాన్, పండ్ల అమ్మకం వంటి అంశాలు వరస కట్టాయి. మతోన్మాదం ఆధారంగా లబ్ధి పొందాలని చూస్తున్న కాషాయ రాజకీయ శక్తులు ఈ ఉన్మత్త, ఉద్వేగపూరిత ఎజెండాను దురుద్దేశపూర్వకంగా ప్రజల్లో జొనుపుతున్నాయి. ప్రజలు ఈ కుట్రను, కుతంత్రాన్ని గ్రహించి, విభజన రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలి. విద్య, వైద్యం, కనీస వసతులు, ధరలు, ఉపాధి వంటి అంశాలు ప్రజల రోజువారీ జీవనాన్ని కులమతాలకు అతీతంగా ప్రభావితం చేస్తాయి. వాటికి సంబంధించి తలెత్తే సమస్యలు ప్రజలను ఏకం చేస్తాయి....
వికేంద్రీకరణ
Thu, 2022-04-07 17:59
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణలో సరికొత్త ముందడుగు. స్థూలంగా సర్కారు చర్య స్వాగతించదగింది. జిల్లాల పునర్విభజనతో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కాస్తా 26 జిల్లాలుగా సరికొత్త భౌగోళిక ముఖచిత్రం ఆవిష్కృతమైంది. మారిన సరిహద్దులు, నైసర్గిక స్వరూపంతో సోమవారం నుండి ఉనికిలోకొచ్చింది. కొత్తగా 13 జిల్లాలు రాగా, రెవెన్యూ డివిజన్లు 51 నుండి 72కు పెరిగాయి. జిల్లాల విభజనపై జనవరి 25న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేయగా ప్రజల నుండి 16 వేలకు పైన సూచనలు, అభ్యంతరాలు ప్రభుత్వానికి అందాయి. వాటిలో సహేతుకమైనవాటిని ఆమోదించామంటున్నారు. పాడేరు కేంద్రంగా నెలకొల్పిన అల్లూరి సీతారామరాజు జిల్లా సరిహద్దుల నిర్ణయంలో ఎంతమాత్రం హేతుబద్ధత లేదు. పోలవరం...
ఇది మోసకారుల 'యాత్ర'
Thu, 2022-04-07 17:55
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితేనే ఎడమ కాలవ ద్వారా విశాఖ జిల్లా వరకూ గోదావరి జలాలు వస్తాయి. ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాల మెట్ట ప్రాంతాల సాగునీటి అవసరాలకు మళ్ళించేదే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు. పోలవరం పూర్తి కావడం ఇక్కడ కీలకం. దాని నిర్మాణం పూర్తిగా కేంద్రం బాధ్యత. ఇది విభజన చట్టం నిర్దేశించిన విషయమే. ఆ పోలవరానికి నిధులు ఇవ్వకుండా బిగబట్టినది ఎవరు? బిజెపి ప్రభుత్వం కాదా? లక్షలాది నిర్వాసితులను నీట ముంచుతూ వారి పునరావాసం తన బాధ్యత కానే కాదంటున్నది ఎవరు? బిజెపి కాదా? పోలవరం పూర్తి కాకుండా మోకాలడ్డుతూ, అక్కడ గిరిజనులను నీట ముంచుతూ ఇక్కడ ఉత్తరాంధ్రలో జలం కోసం యాత్ర అని ఘోష పెట్టడం ఎంత పెద్ద డ్రామా! విశాఖ...
దిశా నిర్దేశం చేయనున్న సిపిఎం 23వ మహాసభ
Wed, 2022-04-06 10:59
నయా ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా...అదే సమయంలో...హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా సాగే రాజకీయ సైద్ధాతిక పోరాటాల సమ్మేళనంగానే బిజెపి-ఆర్‌ఎస్‌ఎస్ పాలనపై సాగే పోరాటం వుండాలని సిపిఎం ఎప్పుడూ చెబుతూ వస్తుంది. హిందూత్వ ముద్రతో కూడిన జాతీయవాదం, అందులో అంతర్లీనంగా ముస్లిం వ్యతిరేకత అనేది ప్రజల్లో ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని ప్రజల్లో గణనీయ వర్గాలను ప్రభావితం చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తించాల్సి వుంది. హిందూత్వకు రాజకీయ-సైద్ధాంతిక ప్రతివాదాన్ని నిర్మించి, ప్రజల్లోకి సమర్ధవంతంగా తీసుకెళ్ళని పక్షంలో హిందూత్వ-కార్పొరేట్ వర్గాల పాలనను దీటుగా, సమర్ధవంతంగా సవాలు చేయలేం.
సిపిఎం 23వ మహాసభ ఏప్రిల్ 6 నుండి 10 వరకు కేరళ లోని...
మతోన్మాద శక్తుల పట్ల నిరంతర అప్రమత్తత
Tue, 2022-04-05 12:13
చరిత్రలో సిపిఎం - 5 దేశంలోని భిన్నత్వాన్ని, సామరస్యాన్ని దెబ్బ తీసే మతోన్మాద శక్తుల ఎదుగుదలపై సిపిఎం మొదటి నుంచీ హెచ్చరిస్తూనే ఉంది. జనసంఫ్‌ు కాలం నుంచీ ఆ పార్టీ దూరంగా ఉంటూ, దానిని ఒంటరిపాటు చేయటానికీ అన్ని సందర్భాల్లోనూ ప్రయత్నించింది. అవకాశవాదంతో కొన్ని ప్రాంతీయ పార్టీలు దాని పంచన చేరుతున్నప్పుడు, కాంగ్రెస్ పలు కీలక సందర్భాల్లో దాని పట్ల ఉదారంగా వ్యవహరించినప్పుడు తీవ్రంగా హెచ్చరించింది. బిజెపి ఎదుగుదల దేశానికి ప్రమాదమని 11వ మహాసభ నుంచి చేస్తున్న తీర్మానాలు ఇప్పుడు అది ఎంత నిజమో స్పష్టమవుతోంది.
1987 అక్టోబర్ 12న మతోన్మాదానికి, వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా సిపిఎం ఢిల్లీలో సదస్సు నిర్వహించింది. చీలికలు, పీలికలుగా...
అమరావతి అఫిడవిట్
Tue, 2022-04-05 12:09
రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన తాజా అఫిడవిట్ రాజధాని వివాదాన్ని ఇంకా కొనసాగించే ఉద్దేశాన్ని సూచిస్తోంది. రాజధానిలో, రాజధాని ప్రాంతంలో ప్రధాన మౌలిక పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని, భూములిచ్చిన రైతులకు మూడు మాసాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను స్వాధీనం చేయాలని, ఆర్నెల్లలో రాజధానిని నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అమరావతిపై వ్యాజ్యాలలో మార్చి 3న హైకోర్టు తీర్పు వెలువరించింది. దానిపై నెల రోజులకు సర్కారు స్పందించి పనులన్నీ పూర్తి చేయడానికి ఐదేళ్లు కావాలని గడువు కోరింది. కాగా ఐదేళ్ల గడువు అడగడానికి స్పష్టమైన ప్రాతిపదిక, హేతువులేమీ తెలపక పోవడంతో కాలయాపన కోసం, కోర్టు ఆదేశాల అమలు నుండి...
జాతుల సమస్యపై సూత్రబద్ధ వైఖరి
Mon, 2022-04-04 11:45
చరిత్రలో సిపిఎం - 3 తన సొంత విధానాన్ని రూపొందించుకున్న సిపిఎం సిద్ధాంతం విషయంలో ఎటువంటి రాజీ పడకుండా సాగుతోంది. ఎత్తుగడల విషయంలో మాత్రం పట్టువిడుపులు ప్రదర్శిస్తూ కార్మిక, కర్షక, కష్టజీవుల ప్రయోజనాలను మరింత ముందుకు తీసుకువెళుతూ వస్తున్నది. అందువల్లనే బెంగాల్‌లో రెండవ యునైటెడ్‌ఫ్రంట్‌లో ఇతరులకన్నా అసెంబ్లీ స్థానాలు తనకే ఎక్కువ వచ్చినప్పటికీ ఐక్యత కోసం ముఖ్యమంత్రి పదవిని బంగ్లా కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు అంగీకరించింది.
బెంగాల్, కేరళ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల కాలంలో రైతాంగం, ఇతర కష్టజీవుల వర్గ చైతన్యాన్ని పెంచేందుకు సిపిఎం బ్రహ్మాండంగా కృషి చేసింది. భూమి సమస్యపైనా, ఇంకా ఇతర సమస్యలపైనా గ్రామీణ...
ప్రజా ఉద్యమాల్లో నిగ్గుతేలిన స్వతంత్ర పంథా
Mon, 2022-04-04 11:39
చరిత్రలో సిపిఎం 2 రివిజనిజంతో తెగతెంపులు చేసుకున్న సిపిఎం- బర్ద్వాన్ ప్లీనంలో అతివాద పెడ ధోరణి నుంచి కూడా స్పష్టంగా వేరుపడింది. అటు రష్యా మార్గం, ఇటు చైనా మార్గం అని కాక భారతదేశ నిర్ధిష్ట పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకున్న స్వతంత్ర పంథాలో ముందుకు సాగింది. దేశవ్యాపితంగా ప్రజా ఉద్యమాలను, పోరాటాలను నిర్వహించింది. సిపిఎం పంథా సరైందని ప్రజలు నిరూపించారు. కేరళ, బెంగాల్, త్రిపురలో కూడా అధిక సంఖ్యలో ఆ పార్టీ అభ్యర్థులను ఎన్నుకొన్నారు.
సిపిఎం ఏడవ మహాసభలో కార్యక్రమాన్ని, ఇతర డాక్యుమెంట్లను ఆమోదించినప్పటికీ సిద్ధాంత సమస్యలపై సమగ్ర చర్చను వాయిదా వేసింది. సిద్ధాంత సమస్యలపైనా, అంతర్జాతీయ కమ్యూనిస్టు...
ఉగాదికి విద్యుత్ షాక్
Sat, 2022-04-02 13:19
విద్యుత్ చార్జీల భారాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యులే. ఇందులో ప్రధాన ముద్దాయి కేంద్రం, మోడీ ప్రభుత్వం. ఒకనాడు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలను ప్రజలు తిప్పికొట్టారు. అదే సంస్కరణలు నేడు కేంద్ర ప్రభుత్వం తన విధానాల పేరుతో అమలు చేస్తోంది. కేంద్ర విద్యుత్ చట్టానికి సవరణలకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం కేంద్ర విద్యుత్ చట్ట సవరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా నిలబడింది. ప్రస్తుతానికి చట్ట సవరణ చేయకపోయినా అనేక రూపాలలో ఆ ప్రమాదకరమైన విధానాల అమలుకు పూనుకుంటున్నాయి. రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారాన్ని ఉగాది కానుకగా ఇచ్చింది. రూ. 4300 కోట్లకు పైగా...
బెదిరింపులు సహించ రాదు
Sat, 2022-04-02 13:11
ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్ తటస్థ వైఖరి పాటించడం సరైంది కాదంటూ ఇన్నాళ్లూ సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చిన అమెరికా ఇప్పుడు నేరుగా బెదిరింపులకు దిగుతోంది. రష్యాపై అమెరికా విధించిన ఆంక్షలకు విరుద్ధంగా భారత్ వ్యవహరిస్తే 'తీవ్ర పర్యవసానాలు' ఎదుర్కోవాల్సి వుంటుందంటూ అమెరికా అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల జాతీయ డిప్యూటీ సలహాదారు హుకుం జారీ చేయడం గర్హనీయం. భారత్‌లో పర్యటనకు వచ్చి ప్రభుత్వానికి ఈ విధంగా బెదిరించడం ఎంతమాత్రం అనుమతించరానిది. అదే సమయంలో భారత్ సందర్శనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ ఏం కోరితే అది ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్నేహ హస్తాన్ని అందించారు. భారత్‌తో సంబంధాల విషయంలో అగ్ర రాజ్యం ఎంత...