ఆర్టికల్స్

ఈ పాపం ఎవరిది?

'ఒక ర్యాంకు ఒకే పింఛను' (ఓఆర్‌ఓపి) అమలు కోసం రిటైర్డు ఆర్మీ సుబేదార్‌ ఆత్మహత్య, తదనంతర పరిణామాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. జై జవాన్‌ అని నినదించిన గడ్డపైనే దేశానికి సేవ చేసిన జవాన్లు అత్యంత దయనీయమైన రీతిలో తనువు చాలించే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఇందుకు ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి చనిపోయిన రిటైర్డు సుబేదార్‌ మానసిక స్థితి ఏమిటో మొదట పరిశీలించాలని వికె సింగ్‌ వంటి మంత్రులతో ప్రకటనలు ఇప్పించడం అత్యంత గర్హనీయం. మోడీ సర్కార్‌కు మాజీ సైనికోద్యోగులన్నా, వారి ప్రాణాలన్నా, ప్రజాస్వామ్య విలువలన్నా ఏమాత్రం గౌరవం లేదనడానికి బుధ, గురువారాల్లో దేశ రాజధానిలోను, రాజస్థాన్‌లోను చోటుచేసుకున్న అరెస్టులు, నిర్బంధాలే నిలువెత్తు...

ఉగ్రవాదానికి మూలాలెక్కడ ?

ఉరి ఉగ్రవాద దాడి తరువాత దేశంలో పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదం పై చర్చ సాగుతుంది. కాశ్మీర్‌ లోయలో కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. దేశ భక్తి పేరుతో ఉన్మాదాన్ని ప్రేరేపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. సర్జికల్‌ దాడుల తరువాత ఆ ఘనత తమదేనని లాభాల వేట మొదలయ్యింది. పనిలో పనిగా ఏదేశ వస్తువులు కొనాలో, వద్దో చర్చ జరుగుతుంది. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నాలు అనేక విషయాల్లో సాగినట్టుగానే ఉగ్రవాద విషయం లోనూ వాస్తవాలు కప్పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి.
మనదేశంలోని పఠాన్‌ కోట, ఉరి తో పాటు పారిస్‌, ఇస్తాంబుల్‌, ఢాకా, బాగ్దాద్‌, సౌదీ అరేబియా ఇలా గత ఆరునెలల్లో అరడజను దేశాలపై ఉగ్రవాదం పంజా విసిరింది....

తెలుగు రాష్ట్రాలకు నష్టదాయకం

కృష్ణా జలాల పంపిణీని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు పరిమితం చేస్తూ కృష్ణా జలాల వివాదాలపై నెలకొల్పిన బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ బుధవారం వెలువరించిన తీర్పు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రయోజనాలకు శరాఘాతం. ఉమ్మడి ఏపీ విభజనతో నదీ పరీవాహక రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపి నాలుగుకు పెరగగా, నీటి పంపిణీ పంచాయతీ నుంచి మహారాష్ట్ర, కర్నాటకలను ట్రిబ్యునల్‌ మినహాయించడం సహజ న్యాయ సూత్రాలకు, అంతర్జాతీయ నీటి చట్టాలకు పూర్తి విరుద్ధం. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పునకు భిన్నంగా 2013 నవంబర్‌ 29న బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ చెప్పిన తీర్పుపై నదీ పరీవాహక పరిధిలోని రాష్ట్రాలన్నీ దేశ సర్వోన్నత న్యాయస్థానం వద్ద సవాల్‌ చేయగా, గెజిట్‌ పబ్లికేషన్‌ను...

హిందూత్వ హింస, దోపిడీకి ప్రత్యామ్నాయంగా అంబేద్కర్‌వాదం

నేడు దేశవ్యాప్తంగా హింస, సామాజిక అణచివేత, ఆర్థిక దోపిడీ మతం పేరుతో జరుగుతున్నాయి. దేశం ఆర్థికంగా కుంగిపోవ డానికి, సమాజం నేరస్థంగా మారడానికి కారణం హిందూవాదమే. హిందూవాదం హింసావాదం, అణచివేతవాదం, అమానవవాదం. హిందూత్వ పేరిట నేడు బిజెపి, విశ్వహిందూ పరిషత్‌ మైనార్టీలు, దళితులపై జరుపుతున్న దాడులు మోడీ జీవన శైలిలో ఉన్న పయోముఖ విషకుంభత్వాన్ని బయట పెడుతున్నాయి. ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే 'హిందూత్వ' పేరిట బిజెపి పరివార్‌ ప్రభుత్వం మైనారిటీ ప్రజలపై అమలు జరిపిన 'మారణకాండ' రెండవ ప్రపంచ యుద్ధ కాలానికి ముందు నాజీ ఫాసిస్టు జర్మనీలో హిట్లర్‌ హంతక ముఠా లక్షలాది మంది యూదులపై అమలుజరిపిన జాత్యహంకార పూరితమైన మూకుమ్మడి హత్యాకాండతో సమానం. భారత జాతీయ జీవనంలో...

విలువలతో కూడిన విద్య నేటి అవసరం

స్వాతంత్య్రోద్యమంలో మహా నాయకులు తమ పుట్టినరోజులను సామాజిక ఆశయాలతో ముడిపెట్టుకున్నారు. పుట్టిన రోజును కొత్త తీర్మానాలు చేసుకొనేదిగా నిర్ణయించుకున్నారు. కొత్త ఆశయాలకు కంకణబద్ధులై అందుకు ప్రణాళిక రచించుకొనే రోజుగా మార్చుకొని రాజీలేని పోరాటం చేశారు. కాబట్టే సెప్టెంబర్‌ 5న భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని యావత్‌ భారతావని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటోంది. 'విద్యకు విద్యార్థులు అంకితం.. ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకితం' అని చెప్పిన మహానుభావుడు ఆయన. ఉపాధ్యాయుల దిశానిర్దేశం లేకపోతే విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరమే అనేందుకు మరో మాటలేదు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే.. వారికి విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణను, సామాజిక విలువలను...

సెప్టెంబరు 2 సమ్మె అనివార్యం..

ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ 2016 సెప్టెంబర్‌ 2న ఒక రోజు దేశవ్యాప్త సమ్మె నిర్వ హించాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. బియంయస్‌ మినహా మిగిలిన కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలన్నీ భాగస్వాములుగా ఉన్నాయి. ఈ సమ్మె ఎందుకు జరుగుతుందో పరిశీలించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరళీకరణ ఆర్థిక విధానాలను తీవ్రంగా అమలు చేస్తున్నాయి. గత ప్రభుత్వాల కాలంలో ప్రజలచే ఛీత్క రించబడిన ఈ విధానాలను కొత్తగా అధికారంలోకి వచ్చిన కేంద్ర బిజెపి ప్రభుత్వం మరింత వేగంగా అమలుజేయ డానికి పూనుకోవడం వల్ల దేశంలో పెట్టుబడిదారులకు మంచిరోజులు వచ్చాయి. సాధారణ ప్రజలకు, ఉద్యోగ, కార్మికులకు మరింత గడ్డురోజులు దాపురించాయి.
దూకుడుగా ముందుకెళ్తున్న కేంద్రం...

ఆంధ్రాపై బిజెపి-టిడిపి దుష్ట వ్యూహం

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశమై ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లు ఎన్డీయే పక్షాల నాటకీయ పరిణామాలతో వెనక్కి వెళ్లింది. సభలో ఎక్కడైనా విపక్షం ఆందోళన చేస్తుంది. కానీ ఆరోజు అధికార పక్షమే ఆందోళనకు నడుం కట్టింది. సభకు సంబంధం లేని అంశాన్ని సాకుగా చూపించి సభను అడ్డుకుంది. స్వయానా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రే తమ పక్ష సభ్యులను ఆందోళనకు ఉసిగొల్పడం, ఎన్డీయే పక్షమైన టిడిపి మంత్రి అదే సమయంలో రాజ్యసభ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో ముచ్చటించటం, తమ సభ్యుల ఆందోళలను చూసి జైట్లీ ముసిముసి నవ్వులు నవ్వటం చూస్తుంటే అనేక మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంథ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని...

ప్రభుత్వరంగ బ్యాంకుల విలీనం ఎందుకు?

సాధారణంగా విత్తసంస్థలు (ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్స్‌) తమ ప్రాథమిక విధులు; సమాజంలో ఏర్పడే పొదుపు సమీకరించి ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచే పెట్టుబడులకు ఉపయోగపడే సంస్థలుగా, వ్యక్తుల పొదుపులను వారి జీవితకాలంలో ఆ తర్వాత నూతన తరాలకు మేనేజ్‌ చేసే సంస్థగా, క్రమానుగత చెల్లింపు చేసే సంస్థగా, నష్టభయాలను (రిస్క్‌) మేనేజ్‌చేయటం, బదిలీ చేయటం వంటి విధులు నిర్వహిస్తుంటాయి. కానీ ప్రపంచీకరణ, ఉదారీకరణ ఆర్థిక విధానాల ద్వారా బడా విత్తసంస్థలు నిజ ఆర్థిక వ్యవస్థ రంగాలకు వాటి వృద్ధికి దోహదపడే విత్తవనరులు సమకూర్చటం లేదు. అత్యధికంగా వారి విధులలో ఇతర విత్త సంస్థలతో విత్తపత్రాల మారకం చేయడటం ద్వారా డెరివేటీస్‌, స్వాప్స్‌ అనే విత్తపత్రాలు (క్లెయిమ్స్‌) మార్కెట్‌ను...

గురుకులాల ఘోష పట్టని సర్కారు

నాటి ముఖ్యమంత్రి యన్‌టి రామారావు, ఎస్‌ఆర్‌ శంకరన్‌ల ఆధ్వర్యంలో 1983లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడిన షెడ్యూల్డ్‌ కులాల అభ్యున్నతి కోసం ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటుచేశారు. అవి సాధారణ హాస్టళ్ళ కంటే మెరుగైన విద్య, క్రమశిక్షణ వంటి విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తూ నడుస్తున్నాయి. 1987లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను కలిపి ఎపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐ సొసైటీ పేరుతో రాష్ట్ర సంస్థగా ఏర్పాటు చేశారు. కొన్ని సంవత్సరాలపాటు విద్యావేత్తల ఆధ్వర్యంలో ఇవి సజీవంగా నడిచాయి. ఆ తరువాత ఈ సంస్థ స్థాయి పెంచి ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులను కార్యదర్శులుగా నియమించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, అధికారులు ఆలోచనలకు అనుగుణంగా ఈ...

బహుళజాతి సంస్థల సామ్రాజ్యానికి బాటలు

 ట్రాన్స్‌ అట్లాంటిక్‌ ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పార్టనర్‌షిప్‌ (టిటిఐపి) ఒప్పందంపై అమెరికా, ఐరోపా యూనియన్‌ (ఇయు) మధ్య చర్చలు జరుగు తున్నాయి. ఈ ఒప్పందాన్ని ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్టనర్‌షిప్‌ (టిపిపి) ఒప్పందానికి అనుబంధ ఒప్పందంగా అమెరికా పరిగ ణిస్తున్నది. దుస్తులు, రసాయనాలు, మందులు, కాస్మటిక్స్‌, వైద్య పరికరాలు, కార్లు, ఎలక్ట్రానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, యంత్రాలు, ఇంజనీరింగ్‌, క్రిమి సంహారకాలు, శానిటరీ అండ్‌ ఫైటో శానిటరీ మెజర్స్‌, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, తదితరాల వాణిజ్యంలో ఆటంకాలను తొలగించటం, ఇంధన, ముడి పదార్థాలు, వర్తకం, సుస్థిర అభివృద్ధి, శ్రమ, పర్యావరణం, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి, పోటీ విధానం, తదితర అనేక అంశాలపై...

దేశానికి చేటు..

కేంద్రంలో గత కాంగ్రెస్‌ ప్రభుత్వం దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డిఐ) కిటికీలు తెరవగా ప్రస్తుత బిజెపి సర్కారు తలుపులు బార్లా తెరిచి కాంగ్రెస్‌ కంటే 'విభిన్నత'ను చాటుకుంది. గతేడాది నవంబర్‌లో కొన్ని కీలక రంగాల్లోకి ఎఫ్‌డిఐలను స్వేచ్ఛగా ఆహ్వానిస్తూ మోడీ ప్రభుత్వం తీర్మానించగా తాజాగా సోమవారంనాడు ఆదరాబాదరగా ప్రధాని ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ సమావేశమై ఎఫ్‌డిఐలకు మరింతగా ద్వారాలు వెడల్పు చేసింది. ఈ దెబ్బతో అదీ ఇదీ అనే తేడా లేకుండా దేశంలోని దాదాపు అన్ని రంగాల్లోకీ ఎఫ్‌డిఐలు చొరబడేందుకు ఆస్కారం కల్పించింది. ప్రపంచంలోనే అత్యధిక బహిరంగ మార్కెట్‌ కలిగిన దేశంగా భారత్‌ను అంగట్లో నిలిపింది. కీలకమైన రక్షణ రంగం సహా ఔషధ, పౌర విమానయానం,...

ఉగ్రవాదం ఏదైనా బలయ్యేది అమాయకులే...

సామాజిక అంతర్జా లం లో 2016 మే 14న ఒక వీడియో దుమారం రేపింది. అయోధ్యలో బజరంగ్‌దళ్‌ శిక్షణా శిబిరంలో భాగంగా సభ్యులకు మరణాయుధాలు వాడటంలో శిక్షణ ఇస్తున్నారు. వారి ఉద్దేశం దేశంలో ముస్లిం తీవ్రవాదులను ఎదుర్కోవడం, ఉగ్రవాదాన్ని అంతం చెయ్యడమట! ఆ పనులు చేయడానికి మనం పటిష్టమైన భద్రతా యంత్రాంగాన్ని ఏర్పర్చుకున్నామని వారు మర్చి పోయారా? అదే నెల 30న విహెచ్‌పి మహిళా శాఖ 'దుర్గావాహిని' తన సభ్యులకు మారణాయుధాలలో సైనిక శిబిరం లాంటి శిక్షణ ఇస్తుందని వివిధ వార్తా పత్రికల్లో ప్రచురితమైంది. ఆత్మరక్షణ కోసం శిక్షణ ప్రతి స్త్రీకీ అవసరమైనప్పటికీ మారణాయుధాలతో శిక్షణ వారికి ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? జూన్‌ 2న మథురలో ఒక నమ్మశక్యం కాని హింసాత్మక ఉదంతంలో ఆజాద్‌ విధిక్‌...

Pages