ఆర్టికల్స్

పెద్దలకు కట్టబెట్టేందుకే...

 గత సంవత్సర కాలంగా 9/77 అసైన్డ్‌ చట్ట సవరణపై చర్చ జరుగు తున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. త్వరలో ఈ చట్టాన్ని సవరిస్తామని, అసైన్డ్‌ భూములకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్లకు ఉత్తర్వులు అందినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చట్ట సవరణపై చర్చిస్తామని ముఖ్య మంత్రి ప్రకటించటంతో మరీ వేడెక్కింది. ఈ చట్టం ఉద్దేశం ఏమిటి? ఎవరి రక్షణ కోసం ఈ చట్టం వచ్చింది? ఇప్పుడు ఈ చట్టాన్ని ఎందుకు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉబలాట పడుతోందనేదాన్ని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 2006లో కాంగ్రెస్‌ ప్రభుత్వం 9/77 చట్టాన్ని సవరించింది. నాడు ఈ చట్ట సవరణకు సిపిఐ(యం) శాసనసభ్యులు అసెంబ్లీలో గట్టిగా...

ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రజలే తిరస్కరించాలి..

స్వాతంత్రనంతర చరిత్రలో సత్ప్రవర్తనతో ఉంటానని వ్రాత పూర్వకమైన హామీ ప్రభుత్వానికిచ్చి పనిచేస్తున్న ఒకే ఒక్క సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌. సరిగ్గా 68 సంవత్సరాల క్రితం 1948 ఫిబ్రవరి 4న ఆర్‌ఎస్‌ఎస్‌ (రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు)ను నాటి కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఆ తర్వాత మరి రెండుసార్లు ఆర్‌ఎస్‌ఎస్‌ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఒకసారి 1975 అత్యవసర పరిస్థితిలో, 1993లో బాబరీ మసీదును కూల్చినప్పుడు. పైకి ఏమి చెప్పినా, వ్రాత పూర్వకంగా క్షమార్పణలు చెప్పినా ఆర్‌ఎస్‌ఎస్‌ స్వభావంలో ఎటువంటి మార్పులేదని చరిత్ర నిరూపిస్తున్నది. ప్రస్తుతం అది మరింత శక్తివంతంగా తయారై తన ఫాసిస్టు భావజాలాన్ని విరజిమ్ముతున్నది. అనేక మంది మధ్యతరగతి మేధావులు దాని...

అభివృద్ధి మంత్రం - అసలు తంత్రం!

ఈ మధ్య విజయవాడ పుస్తక ప్రదర్శనలో ప్రసంగించిన తర్వాత నాతో మాట్లాడిన వారిలో ఇద్దరు విద్యాధికులు ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రధాన భాగాన్ని అభినందిస్తూనే అమరా వతిని భ్రమరావతి అని వర్ణించడం ఎందు కని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేస్తే మంచిదే కదా అని అడిగారు. అమరావతిపై అనేకసార్లు ఈ శీర్షికలో చెప్పుకున్నాం. మొన్నటి మంత్రి వర్గ సమావేశం తర్వాత ఒక సీనియర్‌ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రి సింగపూర్‌పై చాలా ఆశలు పెట్టుకున్న మాట నిజమైనప్పటికీ వారి నుంచి అంత సహకారం రాలేదని చెప్పారు. ఈ కారణంగా హడ్కో రుణ సహాయంతో తామే నిర్మాణం చేపట్టవచ్చని సూచించారు. సింగపూర్‌పై ఆయన పెట్టుకున్న భ్రమలే పటాపంచలైనప్పుడు ఆయన ప్రజలకు...

రాయలసీమ వెనుకబాటుకు కారకులెవరు?

స్వార్థ రాజకీయమే సీమకు శాపం అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం ప్రచురిత మైంది. శీర్షికకు పెట్టిన పేరు అక్షరసత్యం. అయితే రచయిత వ్యాసం నిండా అర్థసత్యాలు, అసత్యాలు తప్ప ఏ ఒక్కటీ నిజం కాదు. చంద్ర బాబు అధికారానికి వచ్చిన తర్వాత అహరహం వెనుకబడిన సీమ అభివృద్ధి కోసమే కష్టపడుతు న్నట్లు చెప్పారు. ఆర్థిక, పారిశ్రామిక, మౌళిక సదుపాయాల కొరకు ఆర్థిక ఇబ్బందులలో కూడా అడ్డంకులను అధిగమించి కృషి చేస్తున్నార న్నారు. ఆర్థిక వికేంద్రీకరణను గురించి ప్రస్తావిస్తూ రాయల సీమలో పారిశ్రామికీకరణకు కృషి చేస్తున్నట్లు అందులో పేర్కొ న్నారు. గతంలో చంద్రబాబు పాలనలోనే రాయలసీమ లోని భారీ పరిశ్రమలైన సహకార చక్కెర ఫ్యాక్టరీలు, కార్బైడ్‌ ఫ్యాక్టరీ లు, పేపర్‌ మిల్లులు, నిజాం...

బలమైన సిపిఐ(ఎం)ను నిర్మిద్దాం..

ఇరవైఒకటవ పార్టీ మహాసభ ఆదేశాల మేరకు సిపిఐ(ఎం) ప్లీనం సమావేశమయింది. తన పనిని '2015 చివరికల్లా' పూర్తిచేసింది. కేవలం ఎనిమిది నెలల కాలంలో పార్టీ మహాసభ ఆదేశాలను సిపిఐ(ఎం) నెరవేర్చ గలగటం గౌరవప్రదమైన విజయం. ప్లీనం నిర్వహించటానికి ఒక సమగ్రమైన, సవివర మైన విధానాన్ని, టైంటేబుల్‌ను పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత పార్టీ నిర్మాణం, పనితీరులను గురించి రాష్ట్ర కమిటీల నుంచి విస్తృత సమాచారాన్ని సేకరించటం కోసం ఒక వివరణాత్మక మైన ప్రశ్నావళిని పార్టీ కేంద్రం రూపొందించింది. రాష్ట్ర కమిటీ లు పంపిన సమాధానాలను పరిశీలించిన మీదట వాటి ఆధారంగా నిర్మాణంపై 'ముసాయిదా నివేదిక', 'ముసాయిదా తీర్మానం'లను తయారు చేసింది. పార్టీ మహాసభకు, ప్లీనం జరగటానికి మధ్యకాలంలో...

నల్లధనమా! నువ్వెక్కడీ

 నల్ల కుబేరులు, స్విస్‌ బ్యాంకు, హవాలా, విదేశీ బ్యాంకు ఖాతాలు వగైరా మాటలు రోజూ పేపర్లు, టీవీ ఛానెళ్లలో చూసీ చూసీ, వినీ వినీ నవ్వాలో, ఏడవాలో తెలియని స్థిలో ఉన్నాం మనం. నేను ఒక పల్లెటూరి రైతును నల్ల ధనం అంటే ఏమిటని అడిగితే దొంగ నోట్లు అని ఠక్కున సమాధానమిచ్చాడు. ఆయన్ని చూసి నవ్వుకునే పరిస్థితిలో మనమేమీ లేము. ఎందుకంటే మనమూ అంతే అమాయకత్వంతో, తెలివితక్కువతనంతో ఆలోచిస్తు న్నాం. నేను ఇంటర్‌ విద్యార్థిగా ఉన్న రోజుల్లో (1996) మధ్యతరగతి అభిమాన నాయకులు వాజ్‌పేయి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో స్విస్‌ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారి పేర్లు బయటపెడతామంటే నమ్మి తెరిచిన నోరు ఇప్పటికీ మూతబడలేదు. నాటి నుంచి నేటి దాకా నోరు తెరుచుకుని మనం చూస్తూనే...

ఆంధ్రప్రదేశ్‌ - అద్దె సచివాలయం

ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర తాత్కా లిక సచివాలయాన్ని మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌లో 20 ఎకరా లలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.180 కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తంలో రూ.90 కోట్లు వడ్డీలేని రుణం ఇస్తారని, మరో రూ.90 కోట్లు రుణాలు తీసుకొని సిఆర్‌డిఎ నిర్మాణాలను పూర్తి చేస్తుందని, నిర్మాణం పూర్తయి, వివిధ ప్రభుత్వ శాఖలు ఆ భవనాలలోకి వచ్చిన తర్వాత, ఆయా ప్రభుత్వ శాఖలు వినియోగించుకున్న విస్తీర్ణాన్ని బట్టి సిఆర్‌డిఎకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ సంస్థ నిర్మిస్తున్న సచివాలయానికి ప్రభుత్వ శాఖలు అద్దె చెల్లించాలని ప్రకటిం చటం ఆశ్చర్యం కలిగించే అంశం. తాను కట్టుకున్న భవనానికి తాను అద్దె...

సిపిఎం ప్లీనం-బడా మీడియా పాక్షిక రూపం

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) నిర్మాణంపై ప్రత్యేక ప్లీనం సమావేశం జయప్రదంగా ముగిసింది. ప్రతినిధుల నుంచి వచ్చిన కొన్ని సవరణలతో నిర్మాణంపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్ని రాజకీయ పక్షాలూ అంతర్గత కలహాలతో అతలాకుతలమవుతున్న స్థితిలో-కమ్యూనిస్టు ఉద్యమం కూడా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న స్థితిలో-సిపిఎం బలం లోక్‌సభలో ఎన్నడూ లేనంత తక్కువకు పడిపోయిన దశలో- ఈ అఖిల భారత సమావేశం ఇంత ఏకోన్ముఖంగా జరగడం ఒక విశేషం. అసలు సిద్ధాంతాలు విలువల వంటివి పూర్తిగా గాలికి వదిలివేసిన పాలక పక్షాలు అధికారమే ఏకైక సూత్రంగా కార్పొరేట్లకు సేవ చేస్తున్న స్థితిలో, సామ్రాజ్యవాదుల ముందు సాగిలపడుతున్న స్థితిలో అందుకు భిన్నమైన విధానాలను ప్రతిపాదించడం ఒక...

ఫ్రీ బేసిక్స్‌తో డిజిటల్‌ బానిసత్వం

ఫ్రీ బేసిక్స్‌ వినియోగదారులను కొన్ని వెబ్‌సైట్లకు మాత్రమే పరిమితం చేస్తుంది.    వినియోగదారులు ప్రత్యక్షంగా లాభపడేలా ఇంటర్నెట్‌ ప్యాకేజీలను అందించటం మంచి పథకం. బీహార్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా, రత్నౌలీ గ్రామానికి చెందిన సంజరు సాహ్ని పాఠశాల విద్యను మధ్యలోనే ఆపేసి ఢిల్లీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను తన గ్రామానికి ఎప్పుడు వచ్చినా తమకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేయటానికి జాబ్‌ కార్డులు అందలేదనో, చేసిన పనికి వేతనాలు అందలేదనో గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వింటుండేవాడు. ఒకరోజు ఆయన ఢిల్లీలో కంప్యూటరు ముందు కూర్చొని ''యన్‌రీగా బీహార్‌'' అని టైప్‌ చేశారు. ఆయనకు వచ్చిన సమాచారంలో తన గ్రామానికి చెందిన వారి జాబ్‌కార్డుల్లో...

పార్టీ బలోపేతమే లక్ష్యంగా సిపిఎం ప్లీనం..

 పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తేగాని పార్టీ అఖిల భారత మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను సాధించలేము. ఆ నిర్ణయాల్లో మొదటిది, పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం. దానికి ఆధారంగా వామపక్ష ఐక్యతను పెంపొందించాలి. అలాగే ఇది సాధించేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టి జాతీయ స్థాయిలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డి ఎఫ్‌)ను ఏర్పాటు చేయాలి. ఈ లక్ష్యాలను సాధించేందుకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరచుకోవాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పద్ధతులను మార్చుకొని, నయా ఉదారవాద విధానాల వల్ల తలెత్తిన పరిస్థితుల వల్ల ఏ వర్గాల ఐక్యత బలపరచాలనేది కోరుతున్నామో వాటిని నిర్దిష్టంగా విశ్లేషించి, నిర్దిష్ట నిర్ణయాలు, అవసరమైన మార్పుల ద్వారా సిపిఎం...

సమైక్యతా సాధనంగా విద్య..

స్వతంత్ర భారత దేశ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ పుట్టిన రోజు నవంబర్‌ 11న జాతీయ విద్యా దినోత్సవంగా పాటించబడుతోంది. 1947 ఆగస్టు 15 నుంచి తాను మరణించిన 1958 ఫిబ్రవరి 22 వరకు పదిన్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్‌ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. రాజ్యాంగ విలువలతో కూడిన లౌకిక విద్యను అన్ని స్థాయిల్లోనూ అందరికీ సమానంగా అందించేందుకు బహుముఖ పథకాలు, ప్రణాళికలు రచించారు. కామన్‌ స్కూల్‌ సిస్టం, 10+2+3గా విద్యా విధాన చట్రాన్ని నిర్ధారించారు. బ్రిటీష్‌ పాలనలోని పరిమితులను అధిగమించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సత్వర ప్రగతిని సాధించేందుకు వివిధ స్థాయిల్లో విద్యారంగం...

జాబు కోసం బాబుతో పోరాటమే మార్గం..

వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనేది పాత సామెత.. వెయ్యి అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలనేది కొత్త సామెత.. దీనికి నిదర్శనంగా చంద్రబాబు ప్రభుత్వం నిలుస్తోంది. ఎన్నికలకు ముందు టిడిపి మేనిఫెస్టోలలో ఇష్టమొచ్చినట్లు ప్రజలకు, యువతకు హామీలిచ్చేసి... నన్ను నమ్మండి...! నేను మారాను...!! అని అధికారంలోకొచ్చారు బాబు. దేశాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న యువత భవిష్యత్‌ గురించి అస్సలు ఆలోచించడం లేదు. ''జాబు రావాలంటే - బాబు రావాలనే'' నినాదాన్ని తన పేటేంటుగా ప్రచారం చేసుకున్నారు. నిరుద్యోగులిప్పుడు జాబు అడుగుతుంటే... గుంటూరు జిల్లా సభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీ కార్యకర్తలతో.... నెత్తురొచ్చేటట్లు నిరుద్యోగులను కొట్టించారు. ఇదీ మన బాబు...

Pages