ఆర్టికల్స్

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న నిర్బంధం

గత వారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ లోపలా వెలుపలా అట్టుడికిపోయింది. రైతుల ఆత్మహత్యలపై చర్చ సభను వేడెక్కిస్తే- ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఉద్దేశించిన చలో అసెంబ్లీపై అణచివేత బయిట నిరసనాగ్ని రగిల్చింది. ఒక విధంగా విభజనకు ముందు చలో అసెంబ్లీల సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది. ఆత్మహత్యలు కూడా తెలుగు దేశం పాలన చివరి రోజులను మించిపోయే రీతిలో జరగడం ఆవేదనా కారణమైంది. గత విధానాలే అమలు జరుగుతుంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని నాటి ఉద్యమ కారులే ప్రశ్నించిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంకేతమా అన్నట్టు తెలంగాణ పితామహుడనిపించుకోదగిన విద్యావేత్త చుక్కా రామయ్య గృహ నిర్బంధం, జిల్లాల నుంచి వచ్చేవారిని ఎక్కడికక్కడ అరెస్టుయ చేయడం కెసిఆర్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక...

పోర్టు మాటున భూదందా!

ఇప్పటి వరకూ ఎన్నికల నినాదం గానే ఉన్న బందరు పోర్టు ఇప్పుడు ఏకంగా రాజకీయ ప్రత్యామ్నా యంగా మారింది. అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా పోర్టు నినాదం మారు తోంది. ప్రజల కోసం, జిల్లా, రాష్ట్ర ప్రజల భవి ష్యత్‌ అవసరాల కోసం కాకుండా, రాజకీయ నాయకుల భవితవ్యం కోసమే పోర్టు నిర్మాణం అన్నట్లు తయారైంది. అందుకే ఇన్ని వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న బందరు ప్రాంత ప్రజలను మోసం చేయవచ్చ నేది అసాధ్యమనే విషయం అర్థమైంది. కోన ప్రాంతానికి వెళ్లిన మంత్రులు, పార్లమెంటు సభ్యుల్ని సైతం స్థానిక ప్రజలు తిప్పి కొట్టడమే బందరు ప్రాంత చైతన్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. పోర్టు నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే, అవసరమైనంత మేర...

కార్మిక వర్గ అంతర్జాతీయతకు డబ్ల్యుఎఫ్‌టియు కృషి

 పారిస్‌లో 1945 అక్టోబరు 3న స్థాపించ బడ్డ ప్రపంచ కార్మిక సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ టియు) దిగ్విజయంగా 70 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. కార్మిక వర్గ అంతర్జాతీయ తకు, ప్రపంచ కార్మికోద్యమ ఐక్యతకు కృషి చేస్తున్న వారు సాధించిన విజయం ఇది. రాజకీ య లేదా కార్మిక సంఘాల అనుబంధాలతో నిమిత్తం లేకుం డా కార్మికవర్గ ప్రయోజనాల ఆధారంగా కార్మికులందరినీ ఒక తాటి మీదకు తేవటం డబ్ల్యుఎఫ్‌టియు విశిష్టత. ఐక్యతకు, నియంతృత్వ వ్యతిరేక ఉమ్మడి పోరాటాలకు, శాంతి స్థాపన కృషికి, వలస ప్రజల విముక్తి పోరాటాలకు, మెరుగైన జీవన పరిస్థితుల కోసం జరిగే పోరాటాలకు, దోచుకునే బహుళజాతి కంపెనీలకు, యుద్ధోన్మాదులకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డ యుద్ధాలకు డబ్ల్యుఎఫ్‌టియు ప్రతిరూపమని సంస్థాపక మహాసభలో...

దేవాలయ భూముల నుంచి పేదలను తరిమేస్తున్న ప్రభుత్వం

 రాష్ట్రంలో వివిధ దేవాలయాల క్రింద మూడు లక్షల ఎకరాలకు పైగా సాగుభూమి ఉన్నది. ఇది కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలకు పనికొచ్చే భూములు కూడా ఉన్నాయి. ఈ భూములను కౌలుకు తీసుకొని వేలాది మంది పేదలు జీవనం సాగిస్తున్నారు. వీరు అసలు భూమిలేని నిరుపేదలు లేదా కొద్దిగా ఉన్న పేద రైతులు. దేవాలయ భూముల కౌలు రైతుల్లో అత్యధికులు బిసి, ఎస్‌సి ఎస్‌టి తరగతులకు చెందినవారే. ఒక వైపు పేదలు క్రమం తప్పకుండా కౌలు చెల్లిస్తూ సాగుచేసు కొంటుండగా మరోవైపు దేవాలయ భూములను ధనికులు ఆక్రమించుకొని కోర్టు లిటిగేషన్‌లో ఉన్నాయి. మరి కొందరు ధనికులు కౌలుకు తీసుకొని పేదలకు ఆ భూములకు అధిక కౌలుకు సబ్‌ లీజుకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 2003లో చేసిన దేవాలయ భూముల కౌలు నిబంధనలకు సవరణలను...

ICDS నిర్వీర్యానికి కుట్రలు..

''తిండి కలిగితె కండ కలదోరు-కండ కలవాడేను మనిషోరు'' అని చెప్పిన మహాకవి గురజాడ 153వ జయంతి ఇటీవల జరిగింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల విధానాలు మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీ లకు పౌష్టికాహార కల్పన, శిశు, మాతృ మరణాల తగ్గింపు ప్రధాన లక్ష్యంగా 1975 అక్టోబర్‌ రెండున దేశంలో కేవలం 33 ప్రాజెక్టులతో ప్రారంభమైన ఐసిడిఎస్‌ నాలుగు దశాబ్దాలు పూర్తి చేసు కొంది. నేడు 13.40 లక్షల అంగన్‌వాడీ కేం ద్రాల ద్వారా 10 కోట్ల మందికి పైగా సేవలంది స్తున్నది. ఇందులో 8.41 కోట్ల మంది ఆరేళ్ల లోపు పిల్లలు, 1.9 కోట్ల మంది గర్భిణీ, బాలింత స్త్రీలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహి స్తున్న డాష్‌బోర్డు (వెబ్‌సైట్‌) ప్రకారం 2015...

మొసలి కన్నీరుతో కౌలు రైతులకు ఒరిగేదేంటి?

రైతు ఆత్మహత్యలపై ఎప్పుడూ స్పందించని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల తెగ బాధపడుతూ మొసలి కన్నీరు బక్కెట్లు బక్కెట్లు కారుస్తున్నారు. అంతేగాక జరుగుతున్న వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు. 2015 సెప్టెంబర్‌ 28న విజయవాడలో జరిగిన రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశంలో 70 శాతం భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకు పంట రుణాలు చట్ట ప్రకారం ఇచ్చే విష యాన్ని నిర్దిష్టంగా చర్చించకుండా దాటవేశారు. సెప్టెంబరు నెలలోనే రాష్ట్రంలో 22 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనిది పొగాకు రైతులు ఈ నెలలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గత 15 నెలల్లో 164 మంది బలవన్మరణం పాలయ్యారు. చనిపోయిన వారిలో ఒక్కరికీ రుణార్హత కార్డు ఇవ్వలేదు. బ్యాంకు...

దుర్మార్గపు వ్యాఖ్యలు..

కార్మిక సంఘాలను, కార్మికుల న్యాయమైన కోర్కెలకు మద్దతిచ్చే పార్టీలను, సంస్థలను ఉక్కుపాదంతో అణచి వేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల విశాఖపట్నంలో చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గపూరితమైనవి. రాష్ట్ర ప్రభుత్వాధిపతిగా కార్మికుల హక్కులను పరిరక్షించాల్సింది పోయి యాజమాన్యాల దోపిడీకి వకాల్తా పుచ్చుకోవడం దారుణం. ట్రేడ్‌ యూనియన్లపై విషం కక్కిన బాబు తమ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారుల అనుకూలమని కుండబద్దలు కొట్టారు. పారిశ్రామిక అభివృద్ధికి కార్మిక సంఘాలు అడ్డంకిగా మారాయని స్వయంగా ముఖ్యమంత్రే వక్కాణించడం అక్కసును తెలుపుతుంది. యూనియన్లు పరిశ్రమల ఉనికికే ప్రమాదంగా మారాయనడం వాక్‌చాపల్యమే. రాజకీయ పార్టీలపైనా బాబు అవాకులు చెవాకులు పేలడం అసహనానికి...

అసహన ప్రతిరూపం..

ఒకానొక చారిత్రక సందర్భంలో ఏర్పడ్డ రెండు తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరిన ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారడం ఎంతైనా ఆందోళనకరం. పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేందుకు సర్కార్లే నడుం కట్టడం అత్యంత ప్రమాదకరం. నిరసనోద్యమాలు, ప్రజాందోళనలపై చట్ట విరుద్ధమైన పద్ధతుల్లో మానవ హక్కుల హననం చేసి ఉక్కుపాదం మోపడం ప్రభుత్వాల నిరంకుశ పోకడలకు అద్దం పడుతోంది. తెలంగాణలోని వరంగల్‌ జిల్లాలో ఇటీవల ఇద్దరు మావోయిస్టులపై జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ వామపక్షాలు, ప్రజాసంఘాలు సెప్టెంబ‌ర్‌ 30న చలో అసెంబ్లీకి పిలుపునివ్వగా, ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు, భగం చేసేందుకు కెసిఆర్‌ సర్కారు చేయని పని లేదు. తొక్కని అడ్డ దారి లేదు. చట్ట...

దొంగ చేతికే తాళాలిచ్చిన ఐరాస..

జెనీవాలోని సౌదీ అరేబియా దౌత్యవేత్త ఫైసల్‌-బిన్‌-హస్సాద్‌ ట్రాద్‌ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ అధ్యక్షునిగా ఎన్నిక వటం ప్రపంచ దేశాలను విస్మయా నికి గురిచేశాయి. ఈ ఎన్నికను అభ్యుదయ ప్రజాస్వామికవాదులంతా నిరసన తెలియజేస్తు న్నారు. కానీ సౌదీ మిత్ర దేశమైన అమెరికా మాత్రం అభినందనలు తెలుపుతూ సంబరాలు తెలియజేసుకుంటు న్నది. సౌదీ అరేబియాకు మానవహక్కుల కమిషన్‌ అధ్యక్ష పదవి దక్కటమంటే దొంగచే తికి ఇంటి తాళాలిచ్చి కాపలాకాయమనడం తప్ప మరొకటి కాదు. జులైలోనే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ గోప్యంగా ఉంచారు. ఈ విషయం సెప్టెంబరు 17 వరకు బయటి ప్రపంచా నికి తెలియదు. ఐక్యరాజ్యసమితి పత్రాల ఆధారంగా యుఎన్‌ వాచ్‌ అనే ఎన్‌జీఓ సంస్థ తెలియజేసింది. ఈ నియామకం ఐరాసకు కళంకంగా మారటం...

స్వచ్ఛ భారత్‌ ఇలాగా!

అయిదేళ్లలో పరిశుభ్ర భారతావని సాధించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీక్షబూని ఏడాది గడుస్తున్న సందర్భంగా మళ్లీ చీపురు కట్టలు పట్టుకుని రాజకీయ నాయకులు, సినీ, సామాజిక రంగ ప్రముఖలు టివీల్లో కనిపిస్తున్నారు. ఏడాది క్రితం ఇదే సీజన్‌లో మనకు ఇవే దృశ్యాలు కనిపించాయి. ఈ మధ్య కాలంలో స్వచ్ఛ భారత్‌ గురించి నేతలు చెప్పినదానికీ, కింది స్థాయిలో జరిగినదానికీ ఎక్కడా లంగరు కుదరడంలేదనడానికి దేశంలో 70 శాతం మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమంపై పెదవి విరుస్తున్న తీరే నిదర్శనం. గ్రామాల సంగతి అటుంచితే నగరాలు, పట్టణాల్లో సైతం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం ప్రచారార్భాటంగానే తయారైందన్నది సర్వత్రా వినవస్తున్న మాట.
దేశాన్ని చెత్త రహితంగా మార్చాలంటే పాలకుల్లో చిత్తశుద్ధి...

నేతిబీరలో నెయ్యి - కార్పొరేట్‌ సామాజిక భద్రత

సమాజంలో నెలకొని ఉన్న అంతరాలను రూపుమాపే లక్ష్యం తోనే 'సామాజిక బాధ్యత' అనే అం శం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ లక్ష్యాన్ని నెరవేర్చాల్సింది అధికారం లో ఉన్న పాలకవర్గాలే. దాని కోసమే 'సంక్షేమ రాజ్యం' అనే భావన వాడుకలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ బాధ్యతల నుంచి ప్రభు త్వాలు వైదొలగేందుకు ప్రయత్నిస్తున్నాయి. అందులో భాగంగా కార్పొరేట్‌ సంస్థలకు ఆ బాధ్యతలను బదలాయిస్తున్నాయి. ఈ మార్పిడి సత్ఫలితా లనిస్తుందని పాలకవర్గాలు ఆశిస్తున్నాయి. దాన్ని సాకుగా చూపి పాలక వర్గాలు చేతులు దులిపేసుకుం టుంటే కార్పొరేట్‌ సంస్థలు అమలు చేస్తున్న సామాజిక బాధ్యత పేరు గొప్ప, ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నది.ప్రభుత్వాలు ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడేవ నేది ప్రజాస్వామ్యవాదుల భావన....

కాయకల్ప చికిత్స..

రెపో రేట్లను అరశాతం తగ్గిస్తూ రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తీసుకున్న నిర్ణయంతో కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆర్థిక లావాదేవీలు పుంజుకుంటాయని చాలామంది ఆశిస్తున్నారు. ఊహించిన దానికన్నా ఎక్కువగా వడ్డీ రేట్లను తగ్గించడంతో పారిశ్రామిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ కూడా ఈ దిశలోనే స్పందించింది. బుధవారం ఉదయం నుండి ఏ మాత్రం తడబాటు లేకుండా మార్కెట్‌ సూచీ పైకే ప్రయాణం చేయడం రిజర్వు బ్యాంకు నిర్ణయానికి సానుకూల స్పందనే! అయితే, అరశాతం రెపో రేటు తగ్గిచడంతోనే బ్రహ్మాండం బద్దలవుతుందని భావించడం సబబుకాదు. ఆర్థిక వ్యవస్థను పట్టిపీడిస్తున్న అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి. వడ్డీ రేట్లను తగ్గిస్తూ ప్రకటన చేస్తూనే ద్రవ్యోల్బణంపై రిజర్వుబ్యాంకు...

Pages