ఆర్టికల్స్

వికృత రూపాల్లో మతవాద దాడి..

శుక్రవారం నాడు బిజెపి కేంద్ర మంత్రులు చాలా అట్టహాసంగా నెహ్రూ మ్యూజియం లైబ్రరీలో విజయోత్సవం జరుపుకొన్నారు. అంతకు ముందు దానికి డైరెక్టరుగా ఉన్న మహేష్‌ రంగరాజన్‌ను వదిలించుకున్న సంతోషమది. ఆ ఊపులో మాజీ జనసంఘం అధ్యక్షుడైన దీన దయాళ్‌ ఉపాధ్యాయ శతజయంతి వేడుకలు ప్రకటించడమే గాక ఆయన సిద్ధాంతంగా చలామణిలో ఉన్న సమగ్ర మానవతావాదం(ఇంటిగ్రల్‌ హ్యూమనిజం)పై పరిశోధన జరగాలని ప్రకటించారు. సరిగ్గా అదే రోజున వెంకయ్య నాయుడు హైదరాబాదులో దీనదయాళ్‌పై ఒక పుస్తకం విడుదల చేస్తూ కమ్యూనిజం విఫల మైందని, దేశంలో ఆ సిద్ధాంతాన్ని అనుసరించే పార్టీలకు స్థానం లేకుండా పోయిందని ప్రకటించారు. ''బెంగాల్‌ కంచుకోట బద్దలై పోయింది. కేరళ కోట బీటలు వారింది. ఆంధ్రా లో పుచ్చలపల్లి సుందరయ్య,...

శరణార్థుల సమస్యకు కారణమేంటి?

 ఐరోపా నేడు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య శరణార్థులు. రెండవ ప్రపంచ యుద్ధ కాలం తరువాత ఇంత పెద్దయెత్తున ఈ సంక్షోభం ముందుకు రావడం ఇదే మొదటిసారి. సిరియాపై నాటో కూటమి బాంబు దాడులను ఉధృతం చేసిన నేపథ్యంలో ఈ సమస్య ముందుకొచ్చింది. వేలు, లక్షల సంఖ్యలో శరణార్థులు ఇతర దేశాలకు తరలివెళ్లే ప్రస్తుత దుస్థితికి కారణం సిరియాలో అసద్‌ ప్రభుత్వం ఎంత మాత్రం కాదు. ఆ దేశంపై దండెత్తిన నాటో దేశాల కుట్రపూరిత విధానమే కారణం. నాటో కూటమి మధ్య ప్రాచ్యంలోని తన అరబ్‌ మిత్రదేశాలతో కలిసి సిరియాపై యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో లక్షలాది మంది సిరియన్‌ పౌరులు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇళ్ల నుంచి పరుగులు తీస్తున్నారు. వీరంతా మధ్యదరా సముద్రం మీదుగా యూరప్‌కు తరలి వెళ్తున్నారు....

పెరుగుతున్నధరలు-ప్రతికూల ద్రవ్యోల్బణం

ద్రవ్యోల్బణం తగ్గుతున్నదని, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని ప్రభుత్వా ధికారులు విశ్లేషణలు చేస్తున్నారు. హోల్‌సేల్‌ ధరల సూచి 2014 జులై కన్నా 2015 జులైలో 4.05 శాతం తక్కువగా నమోదయిందని, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడవ చ్చునని, కాబట్టి ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గించి, ఆర్థికాభివృద్ధికి దోహదం చేయాలని పెట్టుబడిదారులు, బడా వ్యాపారులు డిమాండు చేస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గుతున్నది కాబట్టి రిజర్వు బ్యాంక్‌ ఈ నెల 17-18 తేదీలలో జరిగే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటుందని పారిశ్రామికవేత్తలు ఆశాభా వాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రజల జీవితాలకు సంబంధించి చూస్తే అధికారుల లెక్కలకు, వాస్తవ జీవితానికి పొంతన లేని...

ప్రైవేటుకు ప్రభుత్వాస్పత్రులు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కేబినెట్‌ ఆగస్టు 8 సమావేశంలో వైద్య విద్య సమీక్ష పేరుతో ఇప్పటికే చిత్తూరు జిల్లా ఆస్పత్రిని 'ఆపోలో'కు అప్ప గించిన విధంగానే ఆంధ్ర ప్రదేశ్‌లోని ఎనిమిది జిల్లా ప్రభుత్వ ఆసుపత్రు లను ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు ఇవ్వాలని నిర్ణయించింది. జిల్లా ప్రభుత్వ వైద్యశాలను ప్రైవేటు వైద్య కళాశాలలకు అప్పగించడం దుర్మార్గం. ఇది జాతి సంపదను ప్రైవేటు వారికి అప్పగించడమే. సుమారు రూ.1,000 కోట్ల విలువ చేసే జిల్లా ప్రభుత్వ వైద్యశాలలను అప్పనంగా ప్రైవేటుకు కట్టబెట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరిచ్చారు? ఏ ప్రభుత్వమైనా ప్రజా సంపదను కాపాడాలి తప్ప హరించడం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం ఏ స్వార్థ ప్రయోజనంతో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నదో ప్రజలకు...

రైతు క్షోభ పట్టని సర్కారు..

జాతికి అన్నం పెట్టే రైతుల ఆత్మహత్యలు పెను విషాదం కాగా వాటిని ఏలికలు అలవోకగా తీసుకోవడం దుర్మార్గం. అన్నపూర్ణగా అభివ ర్ణించే ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల బలవన్మరణాలు మరింత ఆందోళన కరం. రాయలసీమలో సెప్టెంబర్‌ నెలలో ఇప్పటి వరకు 32 మంది కర్షకులు విధి లేని పరిస్థితుల్లో మరణాన్ని ఆశ్రయించినా ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం సైతం లేకపోవడం దారుణం. సీమలో రైతు ఇంట చావు డప్పు ఇప్పటికిప్పుడు తలెత్తిన ఉత్పాతం కాదు. దశాబ్దంన్నర నుంచీ పరంపర కొనసాగుతూనే ఉంది. టిడిపి, కాంగ్రెస్‌, మళ్లీ టిడిపి పాలక పార్టీలు మారాయి తప్ప పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు సరి కదా అంతకంతకూ దిగజారుతున్నాయి. ఎపిలో 2014లో 160 మంది రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారని ఇటీవల నేషనల్‌ క్రైం...

ప్రభుత్వాలు పాలించాలా? శాసించాలా?

''మానవుడు స్వేచ్ఛగా జన్మించి తర్వాత సంకెళ్ళలో బంధింపబడతాడు'' అని ఓ తత్వవేత్త ఉడ్రోవిల్సన్‌ అంటాడు. ఇది నేటికీ నిజమే! స్వేచ్ఛాయుతమైన జీవనం గడిపేందుకు అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. స్వేచ్ఛ అంటే ఎదుటి వారికి హాని కలిగించని ఏ పనైనా చేసుకునే వెసులుబాటు అని చిన్నప్పుడు మాస్టారు చెప్పారు. ఇప్పుడది అర్థం మారి ప్రభుత్వం చెప్పినట్టు వింటేనే స్వేచ్ఛ, లేదంటే ధిక్కారం అంటున్నారు. రాజ్యం ఏర్పడింది సమాజ శ్రేయస్సుకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి మాత్రమే. ప్రభుత్వాలు ఏర్పరచుకున్నది ప్రజలను పాలించడానికే కానీ శాసించడానికి కాదు. పాలించడం, శాసించడం మధ్య చాలా వ్యత్యాసముంది. పాలించడమంటే ప్రజలకు వారివారి జీవన విధానాలక నుగుణంగా సౌకర్యాలు, వసతులు కల్పించడం...

దళితులను పట్టించుకోరా?

 తరతరాలుగా సమాజంలో వేళ్లూనుకున్న కుల వివక్షను అంతం చేయకుండా దేశాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని ఏ ప్రభుత్వమైనా ప్రచారం లంకించుకుంటే అంతకన్నా మోసం ఉండబోదు. స్వాతంత్య్రం సిద్ధించి ఇన్నేళ్లయినా అన్నింటా దళితులు అట్టడుగున ఉన్నారంటే ఏలికల వైఫల్యమే కారణం. దళితుల ఓట్లతో గద్దెనెక్కుతున్న ప్రభుత్వాలు అనంతరం వారిని, వారికి ఇచ్చిన హామీలను విస్మరించడం దుర్మార్గం. పాలకుల నయవంచన వల్లనే దళితుల బతుకులు నానాటికీ తీసికట్టు అవుతున్నాయి. అంటరానితనాన్ని రూపు మాపాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఉద్యమించగా, ఆయన ఫొటో పెట్టుకొని ప్రభుత్వాలు రాజకీయాలు చేస్తున్నాయి మినహా ఆయన ఆశయసిద్ధిని వంటబట్టించుకున్న దాఖలా లేదు. దళితులను కేవలం ఓటు బ్యాంక్‌గా చూస్తూ, కులాల...

అంబేద్కర్‌ గురించి RSS అబద్ధాల పునశ్చరణ!

 'సంబంధిత ప్రజలను మానసికంగా సరైన రీతిలో అర్థంచేసుకుని, సరిపడినంతగా పునశ్చరణ చేస్తే చతురస్రాన్ని వృత్తంగా నిరూపించటం దుస్సాధ్య మేమీ కాదు' అని జోసెఫ్‌ గోబెల్స్‌ చెప్పాడు. మద్రాసు ఐఐటిలోని 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌' 'గుర్తింపును రద్దు' చేయటానికి వ్యతిరేకంగా దేశం లోపలా, బయటా నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక 'ఆర్గనైజర్‌' ఆగ్రహపూరితంగా నిరసనకారులను కమ్యూనిస్టులుగా పేర్కొంటూ 'తొలిగిన బూటకపు అంబేద్కరిస్టుల ముసుగు' అనే శీర్షికతో గందరగోళపరిచే సంపాదకీయం రాసింది. అంబేద్కర్‌ హిందూ మతానికి అనుకూలుడని, కమ్యూనిస్టులకు వ్యతిరేకి అనే విషయం ఆ నిరసనకారులకు తెలియదని ఆ పత్రిక ఆరోపిస్తూ 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌'...

దళిత సమస్యలపై చర్చించేందుకే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకై ఉద్యమం..

బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతి ఏడాది పాటు జరుగుతోంది. మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన ఆశయాలకు తిలోదకాలిచ్చింది. ఎన్నో ఏళ్లగా దళితులకు సంబంధించిన సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, తదితర వెనుకబడిన సామాజిక తరగతుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. దేశంలోని సగటు మానవాభివృద్ధి సూచికలతో పోల్చుకుంటే వీరి పరిస్థితి అంతకంటే అట్టడుగున ఉంది. దళిత, గిరిజన వాడలు అభివృద్ధికి నోచుకోలేదు. ఉపాధి లేక వలసలు పెరిగాయి. ప్రభుత్వ రంగ పతనంతో చదువుకున్న వారికి ఉద్యోగం దొరకటం లేదు. ప్రైవేటు రంగంలో పోటీ పడలేక వెనకబడిపోతున్నారు. దళితులు, ప్రత్యేకించి దళిత మహిళలపై...

ప్రభుత్వ భూ దాహం..

శ్రీకాకుళం జిల్లా సోంపేట థర్మల్‌ పవర్‌ప్లాంటుకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం భూములను కేటాయిస్తూ 2009లో 1107 జీవో విడుదల చేసింది. సర్వేనెంబరు 152/2లో 972 ఎకరాల భూమిని ఎన్‌సిసి లిమిటెడ్‌కు థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి కేటాయించింది. పవర్‌ప్లాంట్‌ నిమిత్తం కేటాయించిన ఈ భూమికి చెందిన రైతులు, ప్రజలు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. దీన్ని ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది. ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా ఆ ప్రాంతంలో వివిధ రూపాలలో ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలను, భూమి కోల్పోతున్న రైతులను ప్రజా...

నేతాజీ ఫైళ్ల, నిరాధార కథనాలతో హడావుడి

నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ ప్రమాద మరణంపై విభిన్న కథనాలకు సంబంధించిన 64 రహస్య ఫైళ్లను పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విడుదల చేశారు. రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో తనకు ఉపయోగపడుతుందనే అంచనాతోనే ఆమె ఈ చర్య తీసుకున్నట్టు మీడియాలో వ్యాఖ్యలు వచ్చాయి. ప్రతిపక్షాలు కూడా అదే విమర్శ చేశాయి. బెంగాలీలు నేతాజీని ఎంతగానో ప్రేమిస్తారు గనక వారి మనోభావాలు చూరగొనేందుకు దీదీ వేసిన తెలివైన ఎత్తుగడగా పత్రికలు అభివర్ణించాయి. అయితే ఆ ఫైళ్లలో కొత్తగా బయిటపడిన విషయాలు ఏమీ లేవని కూడా దాదాపు అందరూ అభిప్రాయం వెలిబుచ్చారు. నేతాజీ బతికే ఉన్నాడన్న సందేహాన్ని వ్యక్తం చేసే బంధువుల లేఖలు, అమెరికా, బ్రిటన్‌ గూఢచారి సంస్థల అనుమానాలు మాత్రమే ఈ ఫైళ్లలో ఉన్నాయి. అయితే...

పారిశ్రామికాభివృద్ధితో సంబంధంలేని భూసేకరణ

 రాజధాని నిర్మాణం కోసం సేకరించే భూమి కాక, రాష్ట్రంలో పరిశ్రమల నిర్మాణం కోసం 15 లక్షల ఎకరాల భూమిని సమీకరి స్తానని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిం చింది. అందుకను గుణంగానే వివిధ ప్రాంతాలలో సేకరించ టానికి భూములను గుర్తిస్తున్నది. కొన్ని చోట్ల నోటిఫికేషన్‌ జారీచేసి భూములను స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నది. ఫారెస్టు భూములు, ప్రభుత్వ భూములతో పాటు రైతుల భూములు, గతంలో దళితులు, పేదలకు పంచిన పట్టా భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. వచ్చే పరిశ్రమలు వేళ్ళ మీద లెక్కబెట్టేటన్ని కూడా లేకపోయినా భూములు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటుండటంతో రైతులు భయాందోళనలతో తల్లడిల్లుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భూములు తీసుకోవటానికి ప్రయత్ని స్తున్న ప్రతి...

Pages