ఆర్టికల్స్

విద్యా వ్యతిరేక విధానాలను ఎదిరించేందుకే బంద్‌..

ప్రైవేట్‌ యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తూ, డిగ్రీలో సెమిస్టర్‌ విధానాన్నీ రద్దు చేయాలని, సంక్షేమ హాస్టళ్ళను మూసివేసే జీవో నెంబర్‌ 45ను రద్దు చేయాలని, విద్యా హక్కు చట్టాన్ని పటి ష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు సంఘా ల ఆధర్యంలో ఏర్పడిన విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 7 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల బంద్‌ నిర్వహిస్తున్నాం. విలీనం పేరుతో 20 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న పాఠశాలలు మూసివేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దీని ద్వారా ఐదు వేలకు పైగా పాఠశాలలు మూత పడుతున్నాయి.
30 మంది విద్యార్థులున్న పాఠశాలలు మూసివేస్తే 12 వేల పాఠశాలలు మూతబ డతాయి. రాష్ట్రంలోని ప్రైవేట్‌...

దగాకోరు సంస్కరణలు - మోసపూరిత నినాదాలు

దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి రావాలనీ, గ్రామీణ ప్రాం తాలకు కూడా బ్యాంకులు విస్తరిం చాలనీ, దేశ ఆర్థికాభివృద్ధికి బ్యాంకులు ఎంతో కృషి చేయాలనీ, ఇవి సాధించటం కోసమే 'ప్రధాన మంత్రి జన్‌ధన్‌ యోజన' ప్రవేశపెట్టిందని ప్రభుత్వ ప్రకటనలు, మంత్రివర్యుల ఉపన్యాసాలు వింటుంటే విస్మయం కలుగుతుంది. బ్యాంకింగ్‌రంగం ఇంకా ఇంకా ప్రజలకు చేరువ కావాలనే సంకల్పం తోనే బ్యాంకింగ్‌రంగ సంస్కరణలు చేపట్టామని పాలక పక్షాలు ప్రచారం చేయటాన్ని సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాంకుల జాతీయకరణ జరిగి 46 ఏళ్లు నిండాయి. రిజర్వుబ్యాంకు లెక్కలు, ప్రభుత్వ గణాంకాలు పరిశీలిస్తే ప్రజలందరి భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత వృద్ధి (ఇంక్లూసీవ్‌ గ్రోత్‌) సాధించలేక...

నిలువెత్తు నిర్లక్ష్యం..

మధ్యప్రదేశ్‌లో వరుసగా జరిగిన రెండు ఘోర రైలు ప్రమాదాలు దిగ్భ్రాంతినీ, రైల్వే శాఖ నిర్లక్ష్యం పట్ల ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ప్రయాణీకులతో కిటకిటలాడుతున్న రెండు రైళ్లు నిమిషాల వ్యవధిలో ఒకే ప్రాంతంలో పట్టాలు తప్పడం, 37 మంది దాకా మృతి చెందడం దారుణం. మరో 25 మంది దాకా తీవ్ర గాయాల పాలైనట్లు వార్తలు వస్తున్నాయి. స్థానికులు సకాలంలో స్పందించడంతో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది. లేని పక్షంలో పరిస్థితి భిన్నంగా ఉండేది. వాస్తవానికి రైలు ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో దీపాలుగా ఎప్పుడో మారిపోయాయి. భద్రతకు ఏమాత్రం పూచీ లేని పరిస్థితి ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఆప్తులను, సన్నిహితులను రైలు ఎక్కించిన తరువాత వారు క్షేమంగా గమ్యం చేరారన్న సమాచారం అందేంత వరకూ ప్రాణాలు...

సమర్థనీయం కాదు..

ఉన్నత పదవుల్లో అవినీతిపై చర్య తీసుకోవాలని పట్టుబట్టినందుకు పాతికమంది కాంగ్రెస్‌ ఎంపీలను పార్లమెంటు నుంచి అయిదు రోజులపాటు గెంటివేసిన స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చర్య ఏ విధంగానూ సమర్థనీయం కాదు. ఇందిర ఎమర్జెన్సీకి 40 ఏళ్లు గడిచిన సందర్భంలోనే దేశంలో మోడీ ఏలుబడిలో మళ్లీ అటువంటి నిరంకుశ పోకడలు వ్యక్తమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సభ్యులు ఉద్దేశపూర్వకంగానే సభకు అంతరాయం కలిగించారని, అందుకే నిబంధనల ప్రకారం వారిపై చర్య తీసుకోవాల్సి వచ్చిందని స్పీకర్‌ తన చర్యను సమర్థించుకున్నారు. స్పీకర్‌ చెప్పిందే వాస్తవమైతే మొదట వేటు ప్రభుత్వంపై పడాలి. ఎందుకంటే సభ సజావుగా సాగకపోవడానికి ప్రభుత్వమే అసలు ముద్దాయి. అదీగాక స్పీకర్‌ ఇప్పుడు ఉటంకిస్తున్న నిబంధనలు కూడా...

అణు ఒప్పందం-ప్రతికూల పర్యవసానాలు

భారత్‌-అమెరికా అణు ఒప్పందాన్ని 2005 జులై 18న ప్రకటించారు. ఇప్పటికి పదేళ్ళు గడిచింది. ప్రారంభం నుంచీ సిపిఎం, ఇతర వామపక్షాలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చాయి. అప్పటి మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అమెరికాతో పెట్టుకోవాలనుకున్న విస్తృత శ్రేణి వ్యూహాత్మక పొత్తులో ఇది కీలక భాగంగా వామపక్షాలు భావించాయి. ఈ ఒప్పందంలోని ప్రతి అంశం పట్ల వామపక్షాలు ప్రదర్శించిన వ్యతిరేకత పదేళ్ళ తర్వాత కూడా వాస్తవమేనని రుజువైంది.
బూటకపు వాదనలు
ఈ అణు ఒప్పందం ఇంధన రంగంలో పెద్ద ఎత్తున మార్పు తీసుకొస్తుందని యుపిఎ ప్రభుత్వం నాడు చెప్పింది. దేశానికి అవసరమైన సాంకేతిక, వ్యూహాత్మక ప్రయోజనాలు దీనివల్ల సమకూరతాయని పేర్కొంది. ఈ ఒప్పందం వల్ల...

ఆర్థిక విధానంపై ప్రతిష్టంభన..

ఆర్థిక విధానానికి సంబంధించి రిజర్వ్‌ బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య విభేదాలున్నాయని వార్తా పత్రికల్లో అనేక కథనాలు వచ్చాయి. గవర్నర్‌ అధికారాలను కుదించటానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంకు చట్టాన్ని సవరించాలని ప్రభు త్వం ఆలోచిస్తున్నంత తీవ్రంగా ఈ అభిప్రాయభేదాలున్నాయి. అయితే ఈ తేడాలు భారత ఆర్థిక వ్యవస్థలో లోతుగా పాతుకుపో యిన అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలే. ఇక్కడ ఎవరు ఒప్పు, ఎవరు తప్పు అనేది కాదు. అసలు విషయం ఏమంటే ఏ విధానాన్ని అవలంబించినా ఆర్థిక వ్యవస్థ మరింత ఒడిదుడుకులకు లోనుకావటం తథ్యమనేది. ఒక సంక్షోభ రూపాన్ని అధిగమించే ప్రయత్నం చేసినప్పుడు అది విజయవంతంగా మరో రూపాన్ని సంతరించుకుంటున్న పరిస్థితిని సంక్షోభంగా నిర్వచించినప్పుడు భారత ఆర్థిక...

రెండు పార్టీలు నాలుగు నాలుకలు..

నవ్యాంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై బిజెపి, టిడిపిలు చేస్తున్న విన్యాసాలు జుగుప్స కలిగిస్తున్నాయి. అధికారంలోకొచ్చి సంవత్సరం దాటినా హోదాపై స్పష్టం చేయకుండా ప్రజలను డోలాయమానంలో పడేసేందుకు రెండు పార్టీలు నాలుగు నాల్కలతో మాట్లాడుతున్నాయి. ప్రత్యేక హోదా సహా పునర్విభజన చట్టంలో పొందుపర్చిన, ఆ సందర్భంగా పార్లమెంటు చర్చలో ఇచ్చిన హామీలను తూచ తప్పకుండా అమలు చేస్తామని బిజెపి, టిడిపి సంయుక్తంగా ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని గద్దెనెక్కాయి. వాగ్దానాల అమలులో రెండు పార్టీలూ కప్పదాట్లకు దిగడం జనానికి వెన్నుపోటు పొడవడమే. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన కానీ, కనీస పరిశీలన కానీ కేంద్రం చేయట్లేదని మంత్రి ఇందర్‌జిత్‌ సింగ్‌ లోక్‌సభలో...

ప్రజల కోసం ప్రజాశక్తి

ప్రజల పత్రిక ప్రజాశక్తి నేటితో 34 సంవత్స రాలు ముగించుకుని 35వ వసంతంలోకి అడుగిడు తున్నది. ఈ సందరర్భంగా విజయవాడలో నేడు ప్రజాశక్తి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో 'సమకాలీన పరిస్థితులలో మీడియా' అనే అంశంపై సదస్సు జరుగుతున్నది. పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకులు కామ్రేడ్‌ ప్రకాశ్‌ కరత్‌, వివిధ తెలుగు దినపత్రికల సంపాదకులు, మాజీ సంపాదకులు శ్రీ కె రామచంద్ర మూర్తి, శ్రీ కె శ్రీనివాస్‌, శ్రీ రాఘవాచారి, శ్రీ ఈడ్పుగంటి నాగేశ్వరరావు, శ్రీ ఎస్‌ వీరయ్య, శ్రీ తెలకపల్లి రవి, ప్రజాశక్తి సాహితీ సంస్థ ఛైర్మన్‌ శ్రీ వి కృష్ణయ్య ప్రభృతులు సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. సుమారు 20 సంవత్సరాల తరువాత ప్రజాశక్తి హెడ్‌ ఆఫీసు విజయవాడలో మళ్లీ ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంగా...

మహిళా ప్రాతినిధ్యం

'అతివలు ఆకాశంలో సగం. అవనిపై సగం' అన్న మాటలు వింటే చాలు మనసు సంతోషంతో ఉప్పొంగుతుంది. కాని అభివృద్ధిలో వారి వెనుకబాటునూ, కట్టుబాట్లమధ్య నలిగిపోతున్న వారి పరిస్థితినీ చూస్తే మనసు దుఖంతో చలించిపోతుంది. బీహార్‌ మహిళలు సరిగ్గా ఈ స్థితిలోనే ఉన్నారు. జనాభా రీత్యా దేశంలోకెల్లా మూడవ అతి పెద్ద రాష్ట్రంగా గుర్తింపు పొందిన బీహార్‌లో మహిళా ఓటర్ల సంఖ్య పురుష ఓటర్లను మించిపోయింది. గత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల గణాంకాలు ప్రపంచానికి చాటిచెప్పిన వాస్తవమిది. వారు వెలువరించిన తీర్పుపై ఆయా కుటుంబాల్లోని పురుషుల ప్రభావం ఉన్నప్పటికీ పితృస్వామిక భావజాలం వేళ్లూనుకుపోయిన ఆ రాష్ట్రంలో తండ్రి చాటు బిడ్డలు, భర్త చాటు భార్యలు బయటకు వచ్చి ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం...

మరో ఆధార్‌ దేనికి..?

రాష్ట్రంలో నివసిస్తున్న పౌరులందరినీ ఆధార్‌ తరహాలో గుర్తించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా ఒక విధానం ప్రకటించి ఇప్పటికే ఉన్న కేంద్ర ఆధార్‌ను ప్రశ్నార్థకం చేసింది. ఆధార్‌తోనే నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ఆధార్‌ మరిన్ని తలనొప్పులు, గందరగోళం తెచ్చిపెట్టడం ఖాయం. ప్రజల సమస్త వివరాలనూ సేకరించేందుకు ఎపి యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ ఆఫ్‌ రెసిడెంట్స్‌ పాలసీ తెస్తూ ఎపి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిపార్టుమెంట్‌ బుధవారం వెలువరించిన 16వ నెంబర్‌ జీవోలో పేర్కొన్న పలు అంశాలు పేదలనూ, ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతున్న వారినీ మరింతగా వడపోసి తగ్గించేందుకు, పథకాలకు దూరం చేసేందుకు ఉద్దేశిం చినవి. అరకొర లబ్ధితో బతుకీడుస్తున్న పేదలకు ఆ మాత్రం సాయం సైతం దక్కకుండా...

ప్రతిష్టంభనకు తెరదించాలి!

లలిత్‌ గేట్‌, వ్యాపం కుంభకోణాలు ఊహించిన విధంగానే పార్లమెంటును కుదిపేశాయి. వర్షాకాల సమావేశాలు తొలి రోజున మొదలైన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్లమెంటు పదే పదే వాయిదా పడడానికి ఎవరు కారకులు అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. ప్రతిపక్షాలే పార్లమెంటును అడ్డుకుంటున్నాయని, చర్చ జరగడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నాయని బిజెపి, మోడీ ప్రభుత్వం చేస్తున్న వాదన పసలేనిది. ప్రతిపక్షాలు పార్లమెంటులో కోరుతున్నదేమిటి? అవినీతి కుంభకోణాల్లో పీకల్లోతున కూరుకుపోయిన విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు వసుంధరా రాజే, శివరాజ్‌ చౌహాన్‌లపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాలని అవి డిమాండ్‌ చేస్తున్నాయి. దర్యాప్తు సాగినంత కాలం...

పశ్చాత్తాపం - ఫలితం?

జులై 30వ తేదీకి ఉరిశిక్ష విధించిన బాంబు పేలుళ్ళ కేసు నిందితుడు యాకూబ్‌ మెమన్‌ ఇప్పటి వరకు 21 సంవత్సరాలకు పైగా జైలులో ఉన్నాడు. జీవిత ఖైదీకి మనదేశంలో విధించే శిక్ష 14 నుంచి 20 సంవత్సరాలు. ఆ విధంగా చూస్తే యాకూబ్‌ మెమన్‌ ఇప్పటికే ఒక జీవిత ఖైదు అనుభవించాడు. పోనీ నిందితుణ్ణి మన చట్టబద్ధ సంస్థలు శోధించి బంధించాయా? దానికి ఎంత పరిశోధన చేశాయి? ఎలా పట్టుకున్నాయి? అని ప్రశ్నించు కుంటే అలాంటిదేం లేదు. మెమన్‌ తనకు తానుగా లొంగిపోయాడు. లొంగిపోయిన అతణ్ణి అరెస్టు చేసి ఆయన ఇచ్చిన సమాచారంతోనే విచారణ సాగించిన సంస్థలు సుదీర్ఘ విచారణ చేసిన మేరకు అతడే నిందుతుడని తేల్చిన టాడా కోర్టు ఉరిశిక్ష విధించింది. వెనక్కి తిరిగి చూస్తే 20 ఏళ్ళు పైన గడిచిపోయాయి. వృత్తిరీత్యా...

Pages