ఆర్టికల్స్

పేదలంటే ప్రభుత్వానికి అలుసెందుకు?

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 15 లక్షల ఎకరాలతో భూమి బ్యాంకునే ఏర్పాటు చేసి పారిశ్రామిక వృద్ధికి వినియోగించాలని చెబుతున్నది ఈ భూ సేకరణకు ప్రభుత్వం ఎసైన్డ్‌ భూములను లక్ష్యంగా పెట్టుకున్నది. దీని వల్ల రాజ్యాంగ లక్ష్యమైన పేదరిక నిర్మూలన దెబ్బతింటుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ భూమి పంపకం జరగకుండా పేదరిక నిర్మూలన జరగడం కల్ల అని చెప్పారు. మహత్తర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, దేశవ్యాప్తంగా వచ్చిన పోరాటాలు, అతివాద ఉద్యమాలు భూపంకం ఎజెండాను ముందుకు తెచ్చాయి. అందువల్లనే 1955 ఎఐసిసి ఆవడిలో భూ సంస్కరణలు తెస్తామని తీర్మానం చేయవలసి వచ్చినది. ఈ నేపథ్యంలో వచ్చిన అనేక చట్టాలలో భూసంస్కరణ చట్టం 1972 ముఖ్యమైనది. అప్పటి వరకు ప్రభుత్వ భూములు,...

సిలిగురి సంకేతం..

పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సుశాంత రంజన్‌ ఉపాధ్యాయ చేసిన రాజీనామా ఆ రాష్ట్రంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ దురహంకారాన్ని కళ్లకు కట్టింది. సుశాంత్‌ రంజన్‌ రాజీనామాచేస్తూ 'ఒక రాజకీయ పార్టీకి ఇది తగని పని. రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించరాదు' అంటూ మమత పార్టీపై చేసిన ప్రకటన ప్రజాస్వామ్యవాదుల్లో చర్చనీయాంశమైంది. కార్పొరేట్‌ దిగ్గజాలు, మత ఛాందసులు, మావోయిస్టుల అండదండలతో 'పరివర్తన్‌' పేరిట 2011లో కొల్‌కతా గద్దెనెక్కినప్పటి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ అరచాక దాడులకు బెంగాల్‌ ఆలవాలమైంది. గద్దెనెక్కుతూనే తృణమూల్‌ ప్రభుత్వం వామపక్షాల, ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు...

అడిగితే తప్పా?

ఇంట్లో పోలీస్‌ కవాతు బయట డిజిటల్‌ డాబుసరి.. ఇదీ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో తిష్ట వేసిన తాజా దృశ్యం. విశ్వనగరంగా అమరావతిని అభివర్ణిస్తూ ప్రచారం లంకించుకున్న ముఖ్యమంత్రి, శంకుస్థాపన అదరగొడతామని హోరెత్తిస్తున్నారు. కాగా ఈ అట్టహాసాల మాటున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, జనం ఆందోళనలను తొక్కేసేందుకు అన్ని రకాల కుయుక్తులకు పాల్పడుతున్నారు. శంకుస్థాపన దగ్గర పడే కొద్దీ రాజధాని గ్రామాల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పౌరుల కదలికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించి అణచిపెట్టాలని తాపత్రయ పడటం ప్రజాస్వామ్యానికి విఘాతం. గత చంద్రబాబు జమానాలో జార్జిబుష్‌, ఉల్ఫెన్‌ సన్‌, టోనీ బ్లేయర్‌ పర్యటనల సందర్భంగా ప్రయోగించిన నిర్భందం ప్రజలింకా మర్చిపోలేదు. అమరావతి...

ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్టులు..

 జిల్లాకు ప్రాణవాయువు లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికా కపోవడంతో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు అది ఒక వరం లాగా మారింది. ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే లక్షలాది ఎకరాలు పంట భూములుగా సాగులోకి తీసుకురావచ్చునని ప్రకటిస్తున్నారు. కానీ ఇది ఆచరణలో ఎంత సాధ్యమో గత దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పార్టీలు చేసిన ప్రకటనలు, వాగ్దానాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమౌతుంది. నాటి ముఖ్యమంత్రి అంజయ్య మొదలుకుని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మనం పరిశీలన చేస్తే వాళ్ళకు రాజకీయంగా...

అరాచకత్వానికి నిదర్శనం

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కమిషనర్‌ సుశాంత్‌ రంజన్‌ ఉపాధ్యారు రాజీనామాతో ఆ రాష్ట్రంలో అరాచకత్వం ఏ స్థాయికి చేరిందో తేటతెల్లమైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు ఆ రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించిన తీరు ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ. అధికారం అండతో గూండాలు చెలరేగి పోవడంతో హింస రాజ్యమేలింది. తెగించి పోలింగ్‌ బూత్‌లకు వచ్చిన సాధారణ ప్రజానీకంపై అమానుష దారుణకాండ చోటు చేసుకుంది. పోలింగ్‌ ప్రక్రియ ఇంతగా అపహాస్యం అయ్యింది కాబట్టే వామపక్ష సంఘటన మూడుచోట్ల రీపోల్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేయాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని పదిలంగా కాపాడాల్సిన ఎన్నికల కమిషన్‌ కీలకమైన పోలింగ్‌ తరుణంలో నిష్క్రియాపర్వంగా మారింది. నిజానికి పోలింగ్‌ ప్రక్రియకు...

దాద్రి దారుణం..

 మోడీ ప్రభుత్వ అండ చూసుకుని దేశంలో హిందూత్వ శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఢిల్లీకి యాబై కిలోమీటర్ల దూరంలోని దాద్రిలో సాగిన దారుణం కాషాయ మూకల రాక్షసత్వానికి మరో నిదర్శనం. గోవధ జరిగిందన్న తప్పుడు ప్రచారానికి హిందూ ఆలయాన్ని వేదికగా చేసుకోవడం మరీ దుర్మార్గం. గొడ్డు మాంసం తింటున్నాడన్న తప్పుడు ఆరోపణలతో యాభై ఏళ్ల మహ్మద్‌ ఇఖ్లాక్‌ అనే అమాయక ముస్లింను మతోన్మాద శక్తులు పొట్టనపెట్టుకోవడం హేయాతిహేయం. దీనికి కొద్ది రోజుల ముందు కాన్పూర్‌లో ఒక ముస్లింను పాకిస్తానీ ఉగ్రవాది అన్న ముద్ర వేసి ఇలాగే ప్రాణాలు తీశాయి. ముజఫర్‌గర్‌లో ఏ శక్తులైతే ఘర్షణలకు తెగబడ్డాయో అవే శక్తులు దాద్రి ఘటన వెనక వుండడం గమనార్హం. బిజెపి ఎమ్మెల్యే, ముజఫర్‌ నగర్‌ ఘర్షణల్లో పాత్రధారి...

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న నిర్బంధం

గత వారం తెలంగాణ రాష్ట్ర శాసనసభ లోపలా వెలుపలా అట్టుడికిపోయింది. రైతుల ఆత్మహత్యలపై చర్చ సభను వేడెక్కిస్తే- ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ఉద్దేశించిన చలో అసెంబ్లీపై అణచివేత బయిట నిరసనాగ్ని రగిల్చింది. ఒక విధంగా విభజనకు ముందు చలో అసెంబ్లీల సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చింది. ఆత్మహత్యలు కూడా తెలుగు దేశం పాలన చివరి రోజులను మించిపోయే రీతిలో జరగడం ఆవేదనా కారణమైంది. గత విధానాలే అమలు జరుగుతుంటే బంగారు తెలంగాణ ఎలా సాధ్యమని నాటి ఉద్యమ కారులే ప్రశ్నించిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంకేతమా అన్నట్టు తెలంగాణ పితామహుడనిపించుకోదగిన విద్యావేత్త చుక్కా రామయ్య గృహ నిర్బంధం, జిల్లాల నుంచి వచ్చేవారిని ఎక్కడికక్కడ అరెస్టుయ చేయడం కెసిఆర్‌ ప్రభుత్వ అప్రజాస్వామిక...

పోర్టు మాటున భూదందా!

ఇప్పటి వరకూ ఎన్నికల నినాదం గానే ఉన్న బందరు పోర్టు ఇప్పుడు ఏకంగా రాజకీయ ప్రత్యామ్నా యంగా మారింది. అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా పోర్టు నినాదం మారు తోంది. ప్రజల కోసం, జిల్లా, రాష్ట్ర ప్రజల భవి ష్యత్‌ అవసరాల కోసం కాకుండా, రాజకీయ నాయకుల భవితవ్యం కోసమే పోర్టు నిర్మాణం అన్నట్లు తయారైంది. అందుకే ఇన్ని వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న బందరు ప్రాంత ప్రజలను మోసం చేయవచ్చ నేది అసాధ్యమనే విషయం అర్థమైంది. కోన ప్రాంతానికి వెళ్లిన మంత్రులు, పార్లమెంటు సభ్యుల్ని సైతం స్థానిక ప్రజలు తిప్పి కొట్టడమే బందరు ప్రాంత చైతన్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. పోర్టు నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే, అవసరమైనంత మేర...

కార్మిక వర్గ అంతర్జాతీయతకు డబ్ల్యుఎఫ్‌టియు కృషి

 పారిస్‌లో 1945 అక్టోబరు 3న స్థాపించ బడ్డ ప్రపంచ కార్మిక సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ టియు) దిగ్విజయంగా 70 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. కార్మిక వర్గ అంతర్జాతీయ తకు, ప్రపంచ కార్మికోద్యమ ఐక్యతకు కృషి చేస్తున్న వారు సాధించిన విజయం ఇది. రాజకీ య లేదా కార్మిక సంఘాల అనుబంధాలతో నిమిత్తం లేకుం డా కార్మికవర్గ ప్రయోజనాల ఆధారంగా కార్మికులందరినీ ఒక తాటి మీదకు తేవటం డబ్ల్యుఎఫ్‌టియు విశిష్టత. ఐక్యతకు, నియంతృత్వ వ్యతిరేక ఉమ్మడి పోరాటాలకు, శాంతి స్థాపన కృషికి, వలస ప్రజల విముక్తి పోరాటాలకు, మెరుగైన జీవన పరిస్థితుల కోసం జరిగే పోరాటాలకు, దోచుకునే బహుళజాతి కంపెనీలకు, యుద్ధోన్మాదులకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టబడ్డ యుద్ధాలకు డబ్ల్యుఎఫ్‌టియు ప్రతిరూపమని సంస్థాపక మహాసభలో...

దేవాలయ భూముల నుంచి పేదలను తరిమేస్తున్న ప్రభుత్వం

 రాష్ట్రంలో వివిధ దేవాలయాల క్రింద మూడు లక్షల ఎకరాలకు పైగా సాగుభూమి ఉన్నది. ఇది కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలకు పనికొచ్చే భూములు కూడా ఉన్నాయి. ఈ భూములను కౌలుకు తీసుకొని వేలాది మంది పేదలు జీవనం సాగిస్తున్నారు. వీరు అసలు భూమిలేని నిరుపేదలు లేదా కొద్దిగా ఉన్న పేద రైతులు. దేవాలయ భూముల కౌలు రైతుల్లో అత్యధికులు బిసి, ఎస్‌సి ఎస్‌టి తరగతులకు చెందినవారే. ఒక వైపు పేదలు క్రమం తప్పకుండా కౌలు చెల్లిస్తూ సాగుచేసు కొంటుండగా మరోవైపు దేవాలయ భూములను ధనికులు ఆక్రమించుకొని కోర్టు లిటిగేషన్‌లో ఉన్నాయి. మరి కొందరు ధనికులు కౌలుకు తీసుకొని పేదలకు ఆ భూములకు అధిక కౌలుకు సబ్‌ లీజుకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 2003లో చేసిన దేవాలయ భూముల కౌలు నిబంధనలకు సవరణలను...

ICDS నిర్వీర్యానికి కుట్రలు..

''తిండి కలిగితె కండ కలదోరు-కండ కలవాడేను మనిషోరు'' అని చెప్పిన మహాకవి గురజాడ 153వ జయంతి ఇటీవల జరిగింది. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల విధానాలు మాత్రం ఆ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నాయి. చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీ లకు పౌష్టికాహార కల్పన, శిశు, మాతృ మరణాల తగ్గింపు ప్రధాన లక్ష్యంగా 1975 అక్టోబర్‌ రెండున దేశంలో కేవలం 33 ప్రాజెక్టులతో ప్రారంభమైన ఐసిడిఎస్‌ నాలుగు దశాబ్దాలు పూర్తి చేసు కొంది. నేడు 13.40 లక్షల అంగన్‌వాడీ కేం ద్రాల ద్వారా 10 కోట్ల మందికి పైగా సేవలంది స్తున్నది. ఇందులో 8.41 కోట్ల మంది ఆరేళ్ల లోపు పిల్లలు, 1.9 కోట్ల మంది గర్భిణీ, బాలింత స్త్రీలు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహి స్తున్న డాష్‌బోర్డు (వెబ్‌సైట్‌) ప్రకారం 2015...

మొసలి కన్నీరుతో కౌలు రైతులకు ఒరిగేదేంటి?

రైతు ఆత్మహత్యలపై ఎప్పుడూ స్పందించని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇటీవల తెగ బాధపడుతూ మొసలి కన్నీరు బక్కెట్లు బక్కెట్లు కారుస్తున్నారు. అంతేగాక జరుగుతున్న వాస్తవాన్ని పక్కదారి పట్టిస్తున్నాడు. 2015 సెప్టెంబర్‌ 28న విజయవాడలో జరిగిన రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశంలో 70 శాతం భూమిని సాగు చేస్తున్న కౌలు రైతులకు పంట రుణాలు చట్ట ప్రకారం ఇచ్చే విష యాన్ని నిర్దిష్టంగా చర్చించకుండా దాటవేశారు. సెప్టెంబరు నెలలోనే రాష్ట్రంలో 22 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనిది పొగాకు రైతులు ఈ నెలలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. గత 15 నెలల్లో 164 మంది బలవన్మరణం పాలయ్యారు. చనిపోయిన వారిలో ఒక్కరికీ రుణార్హత కార్డు ఇవ్వలేదు. బ్యాంకు...

Pages