పోర్టు మాటున భూదందా!

ఇప్పటి వరకూ ఎన్నికల నినాదం గానే ఉన్న బందరు పోర్టు ఇప్పుడు ఏకంగా రాజకీయ ప్రత్యామ్నా యంగా మారింది. అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా పోర్టు నినాదం మారు తోంది. ప్రజల కోసం, జిల్లా, రాష్ట్ర ప్రజల భవి ష్యత్‌ అవసరాల కోసం కాకుండా, రాజకీయ నాయకుల భవితవ్యం కోసమే పోర్టు నిర్మాణం అన్నట్లు తయారైంది. అందుకే ఇన్ని వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న బందరు ప్రాంత ప్రజలను మోసం చేయవచ్చ నేది అసాధ్యమనే విషయం అర్థమైంది. కోన ప్రాంతానికి వెళ్లిన మంత్రులు, పార్లమెంటు సభ్యుల్ని సైతం స్థానిక ప్రజలు తిప్పి కొట్టడమే బందరు ప్రాంత చైతన్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. పోర్టు నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే, అవసరమైనంత మేర మాత్రమే భూములు తీసుకోండి.. విదేశీ సంస్థల వ్యాపార అవసరాల కోసం తమ నోటి దగ్గర కూడును లాక్కోవ ద్దంటూ నినదిస్తున్నారు.. నిరసన తెలుపుతున్నారు.. తిరగబడుతున్నారు. కాంగ్రెస్‌ హయాంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆనాడు ఐదు వేల ఎకరాల్లో పోర్టు నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వ భూములు 2,500 ఎకరాలున్నాయని, వాటిల్లోనే పోర్టు నిర్మాణం చేయాలని తిరకాసుపెట్టి ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఆందోళన చేపట్టింది. ఇప్పుడు ఏకంగా 30 వేల ఎకరాల భూములు పోర్టు కోసం కావాలని అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవహరిస్తోంది. ఇదంతా రాజకీయ అవసరాల కోసమే తప్ప, ప్రజావసరాల కోసం కాదన్నది తెలిసిపోతోంది.
పోర్టుకు వ్యతిరేకమా..?
పోర్టు నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదు. బందరు ప్రాంతవాసులే కాదు అందరూ పోర్టు నిర్మాణం జరగాలనే కోరుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎన్నికలప్పుడు మాత్రమే పోర్టు తెరమీదకు వచ్చేది. ఇప్పుడు భూముల కోసం, రాజకీయ అవసరాల కోసం పోర్టును వెలుగులోకి తెచ్చారు. ఫ్రెంచ్‌, డచ్‌ దేశస్థులు 1604 నుంచే బందరు పోర్టు ద్వారా సరుకులు ఎగుమతులు, దిగుమతులు చేశారు. గడిచిన 30 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. 2003 నుంచి బందరు పోర్టును నిర్మించాలని కోరుతూ ఉద్యమాలు సాగుతున్నాయి. 2007లో పోర్టు నిర్మాణం చేయాలంటూ 100 రోజులపాటు రిలే నిరాహారదీక్షలు, 10 రోజులపాటు ఆమరణ దీక్షలు జరిగాయి. దీంతో అప్పటి సిఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోర్టు నిర్మాణానికి అనుమతిచ్చారు. 2008 ఏప్రిల్‌ 23న కరగ్రహారం దగ్గర పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత దీని పనుల్లో జాప్యం జరుగుతుండటంతో 2010 డిసెంబర్‌ 15వ తేదీ నుంచి 506 రోజులపాటు ఉద్యమం నిర్వహించారు. 2012 మే 2న నాటి సిఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోర్టు నిర్మాణం కోసం 5,324 ఎకరాలను కేటాయిస్తూ జీవో 11ను జారీ చేశారు. తర్వాత ఎలాంటి పురోగతీ లేదు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పోర్టు పనులు చేపడతామని హామీ ఇచ్చింది. 15 నెలల అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీన పోర్టు అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 24 గ్రామాల పరిధిలో 30 వేల ఎకరాల భూమి అవసరమని గుర్తించింది. దీన్లో 14,427 ఎకరాల ప్రైవేట్‌ భూమి సేకరించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మరో 15,573 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూమిని సేకరించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ, అసైన్డ్‌ భూమిలో సముద్రతీరం వెంబడి ఉన్న పేదలు రొయ్యల చెరువులు, వరిసాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి జీవనాధారంగా ఉన్న భూమిని ప్రభుత్వం బలవంతంగా తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది. పోర్టు నిర్మాణం జరిగితే బందరు మండలంలోని క్యాంప్‌బెల్‌ పేట, పల్లెపాలెం, కోన గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పోర్టుకు ఎంత భూమి కావాలి..?
పోర్టు నిర్మాణానికి ఎంత భూమి కావాలన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటి టిడిపి ప్రభుత్వమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2,500 ఎకరాలు సరిపోతుందని పేర్కొంది. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు వేల ఎకరాల్లో నిర్మాణం చేస్తామని తెలిపింది. కానీ, వాస్తవాలను పరిశీలిస్తే దేశంలోనే మూడవస్థానంలో ఉన్న చెన్నరు పోర్టు కేవలం 587 ఎకరాల్లోనే ఉంది. ప్రఖ్యాతి గాంచిన కొచ్చిన్‌ ఓడరేవు రెండు వేల ఎకరాల్లో నిర్మాణం చేశారు. మంగుళూరు 1,908 ఎకరాల్లో ఉంది. ఇటీవల విశాఖపట్నం దగ్గర నిర్మించిన ప్రైవేట్‌ ఓడరేవు కూడా కేవలం రెండు వేల ఎకరాల్లోనే ఉండటం గమనించాల్సిన అంశం. ఇలాంటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు 30 వేల ఎకరాల భూమి అవసరం అని పేర్కొంటోంది..? సన్న, చిన్నకారు రైతుల నుంచి వారి జీవనాధారంగా ఉన్న భూముల్ని బలవంతంగా లాక్కోవాలని చూస్తోంది. 2,500 ఎకరాల భూమి పోర్టుకు సరిపోతుందని పేర్కొన్న టిడిపి ప్రభుత్వం ఇప్పుడు మాట ఎందుకు మార్చింది..? దీనికి రాజకీయ ప్రయోజనాలే తప్ప పోర్టు, ప్రజా ప్రయోజనాలు ఏ మాత్రం లేవని నిర్థారణ అవుతోంది. మచిలీపట్నం, పెడన మండలాల్లో 30 వేల ఎకరాల భూమిని బందరు పోర్టు, పారిశ్రామిక అవసరాల కోసం సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో రైతుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. తమ జీవనాధారంగా ఉన్న భూముల్ని ప్రైవేట్‌ కంపెనీల కోసం ధారాదత్తం చేస్తే సహించేదిలేదని ఆయా ప్రాంత ప్రజల్లోని ప్రజలు నిరసన తెలుపుతున్నారు. కోన గ్రామస్తులైతే ఏకంగా తిరుగుబాటు ప్రకటించారు. నాయకులు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. తమ జీవనాధా రంగా ఉన్న భూమికోసం ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమేనని ప్రజలు నిర్ణయించుకున్నారు. పోర్టు నిర్మాణం చేపట్టండి, ప్రభుత్వ భూమిని దానికోసం వినియోగించుకోండి. అంతేకానీ తమ భూముల జోలికొస్తే సహించేదిలేదని ప్రజలు తేల్చిచె ప్పారు. అయినా ప్రభుత్వం మాత్రం మొండి పట్టుదలకు పోతోంది.పోర్టు అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 14,427 ఎకరాల ప్రైవేట్‌ భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మరో 15 వేల ఎకరాల అసైన్డ్‌, ప్రభుత్వ భూమిని సేకరించేందుకు సిద్ధ మయ్యారు.
సేకరించే భూమిలో పరిశ్ర మలకు ఎంత కేటాయిస్తారు? రైతులకు ప్యాకేజీ కింద ఏ మేరకు ఇస్తారు? అనేది చెప్పే నాథుడు లేడు. తుళ్లూరు తరహా ప్యాకేజీ ఇస్తాం.. మెగా టౌన్‌షిప్‌ నిర్మించి స్తామంటూ దూరపు కొండల్ని చూపిస్తున్నారే తప్ప వాస్తవాలను చెప్పడంలేదు. దీనివల్ల పోర్టు నిర్మాణం జరుగుతుందో, లేదో కాని ప్రజల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు పోర్టు నిర్మాణానికి 30 వేల ఎకరాల భూమి అవసరమా? ఇంత భూమిని ఏమి చేస్తారు? అన్న ప్రధానమైన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పేవారు లేరు. రాజకీయ అవసరాల కోసం కాకుండా, ప్రజావసరాలు, రాష్ట్రాభివద్ధి కోసమే పోర్టు నిర్మాణం అనే సంకల్పం ఉంటే వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి ఉంది. పోర్టు నిర్మాణంపై ఉన్న అనేక అనుమానాలను నివత్తి చేయాల్సి ఉంది. ఇన్ని వేల ఎకరాల భూమిని ఏమిచేస్తారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇవేమీ చేయకుండా భూ సేకరణకు దిగితే మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత రెట్టింపవుతుంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు చాలా ఇబ్బంది అవుతుంది.
(వ్యాసకర్త 10 టీవీ రీజియనల్‌ కో-ఆర్డినేటర్‌, విజయవాడ)
- కంచల జయరాజ్‌ఇప్పటి వరకూ ఎన్నికల నినాదం గానే ఉన్న బందరు పోర్టు ఇప్పుడు ఏకంగా రాజకీయ ప్రత్యామ్నా యంగా మారింది. అధికారంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉంటే మరో విధంగా పోర్టు నినాదం మారు తోంది. ప్రజల కోసం, జిల్లా, రాష్ట్ర ప్రజల భవి ష్యత్‌ అవసరాల కోసం కాకుండా, రాజకీయ నాయకుల భవితవ్యం కోసమే పోర్టు నిర్మాణం అన్నట్లు తయారైంది. అందుకే ఇన్ని వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తీర ప్రాంతంలో ఉన్న బందరు ప్రాంత ప్రజలను మోసం చేయవచ్చ నేది అసాధ్యమనే విషయం అర్థమైంది. కోన ప్రాంతానికి వెళ్లిన మంత్రులు, పార్లమెంటు సభ్యుల్ని సైతం స్థానిక ప్రజలు తిప్పి కొట్టడమే బందరు ప్రాంత చైతన్యానికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. పోర్టు నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే, అవసరమైనంత మేర మాత్రమే భూములు తీసుకోండి.. విదేశీ సంస్థల వ్యాపార అవసరాల కోసం తమ నోటి దగ్గర కూడును లాక్కోవ ద్దంటూ నినదిస్తున్నారు.. నిరసన తెలుపుతున్నారు.. తిరగబడుతున్నారు. కాంగ్రెస్‌ హయాంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి హోదాలో పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆనాడు ఐదు వేల ఎకరాల్లో పోర్టు నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు చేశారు. ప్రభుత్వ భూములు 2,500 ఎకరాలున్నాయని, వాటిల్లోనే పోర్టు నిర్మాణం చేయాలని తిరకాసుపెట్టి ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఆందోళన చేపట్టింది. ఇప్పుడు ఏకంగా 30 వేల ఎకరాల భూములు పోర్టు కోసం కావాలని అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యవహరిస్తోంది. ఇదంతా రాజకీయ అవసరాల కోసమే తప్ప, ప్రజావసరాల కోసం కాదన్నది తెలిసిపోతోంది.
పోర్టుకు వ్యతిరేకమా..?
పోర్టు నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదు. బందరు ప్రాంతవాసులే కాదు అందరూ పోర్టు నిర్మాణం జరగాలనే కోరుకుంటున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎన్నికలప్పుడు మాత్రమే పోర్టు తెరమీదకు వచ్చేది. ఇప్పుడు భూముల కోసం, రాజకీయ అవసరాల కోసం పోర్టును వెలుగులోకి తెచ్చారు. ఫ్రెంచ్‌, డచ్‌ దేశస్థులు 1604 నుంచే బందరు పోర్టు ద్వారా సరుకులు ఎగుమతులు, దిగుమతులు చేశారు. గడిచిన 30 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. 2003 నుంచి బందరు పోర్టును నిర్మించాలని కోరుతూ ఉద్యమాలు సాగుతున్నాయి. 2007లో పోర్టు నిర్మాణం చేయాలంటూ 100 రోజులపాటు రిలే నిరాహారదీక్షలు, 10 రోజులపాటు ఆమరణ దీక్షలు జరిగాయి. దీంతో అప్పటి సిఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పోర్టు నిర్మాణానికి అనుమతిచ్చారు. 2008 ఏప్రిల్‌ 23న కరగ్రహారం దగ్గర పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత దీని పనుల్లో జాప్యం జరుగుతుండటంతో 2010 డిసెంబర్‌ 15వ తేదీ నుంచి 506 రోజులపాటు ఉద్యమం నిర్వహించారు. 2012 మే 2న నాటి సిఎం నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోర్టు నిర్మాణం కోసం 5,324 ఎకరాలను కేటాయిస్తూ జీవో 11ను జారీ చేశారు. తర్వాత ఎలాంటి పురోగతీ లేదు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పోర్టు పనులు చేపడతామని హామీ ఇచ్చింది. 15 నెలల అనంతరం తెలుగుదేశం ప్రభుత్వం ఆగస్టు 31వ తేదీన పోర్టు అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 24 గ్రామాల పరిధిలో 30 వేల ఎకరాల భూమి అవసరమని గుర్తించింది. దీన్లో 14,427 ఎకరాల ప్రైవేట్‌ భూమి సేకరించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మరో 15,573 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూమిని సేకరించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ, అసైన్డ్‌ భూమిలో సముద్రతీరం వెంబడి ఉన్న పేదలు రొయ్యల చెరువులు, వరిసాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి జీవనాధారంగా ఉన్న భూమిని ప్రభుత్వం బలవంతంగా తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది. పోర్టు నిర్మాణం జరిగితే బందరు మండలంలోని క్యాంప్‌బెల్‌ పేట, పల్లెపాలెం, కోన గ్రామాలు పూర్తిగా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
పోర్టుకు ఎంత భూమి కావాలి..?
పోర్టు నిర్మాణానికి ఎంత భూమి కావాలన్న దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటి టిడిపి ప్రభుత్వమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2,500 ఎకరాలు సరిపోతుందని పేర్కొంది. అప్పట్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఐదు వేల ఎకరాల్లో నిర్మాణం చేస్తామని తెలిపింది. కానీ, వాస్తవాలను పరిశీలిస్తే దేశంలోనే మూడవస్థానంలో ఉన్న చెన్నరు పోర్టు కేవలం 587 ఎకరాల్లోనే ఉంది. ప్రఖ్యాతి గాంచిన కొచ్చిన్‌ ఓడరేవు రెండు వేల ఎకరాల్లో నిర్మాణం చేశారు. మంగుళూరు 1,908 ఎకరాల్లో ఉంది. ఇటీవల విశాఖపట్నం దగ్గర నిర్మించిన ప్రైవేట్‌ ఓడరేవు కూడా కేవలం రెండు వేల ఎకరాల్లోనే ఉండటం గమనించాల్సిన అంశం. ఇలాంటప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు 30 వేల ఎకరాల భూమి అవసరం అని పేర్కొంటోంది..? సన్న, చిన్నకారు రైతుల నుంచి వారి జీవనాధారంగా ఉన్న భూముల్ని బలవంతంగా లాక్కోవాలని చూస్తోంది. 2,500 ఎకరాల భూమి పోర్టుకు సరిపోతుందని పేర్కొన్న టిడిపి ప్రభుత్వం ఇప్పుడు మాట ఎందుకు మార్చింది..? దీనికి రాజకీయ ప్రయోజనాలే తప్ప పోర్టు, ప్రజా ప్రయోజనాలు ఏ మాత్రం లేవని నిర్థారణ అవుతోంది. మచిలీపట్నం, పెడన మండలాల్లో 30 వేల ఎకరాల భూమిని బందరు పోర్టు, పారిశ్రామిక అవసరాల కోసం సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో రైతుల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. తమ జీవనాధారంగా ఉన్న భూముల్ని ప్రైవేట్‌ కంపెనీల కోసం ధారాదత్తం చేస్తే సహించేదిలేదని ఆయా ప్రాంత ప్రజల్లోని ప్రజలు నిరసన తెలుపుతున్నారు. కోన గ్రామస్తులైతే ఏకంగా తిరుగుబాటు ప్రకటించారు. నాయకులు చెప్పే మాటల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. తమ జీవనాధా రంగా ఉన్న భూమికోసం ఎంతవరకైనా పోరాటానికి సిద్ధమేనని ప్రజలు నిర్ణయించుకున్నారు. పోర్టు నిర్మాణం చేపట్టండి, ప్రభుత్వ భూమిని దానికోసం వినియోగించుకోండి. అంతేకానీ తమ భూముల జోలికొస్తే సహించేదిలేదని ప్రజలు తేల్చిచె ప్పారు. అయినా ప్రభుత్వం మాత్రం మొండి పట్టుదలకు పోతోంది.పోర్టు అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం 14,427 ఎకరాల ప్రైవేట్‌ భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. మరో 15 వేల ఎకరాల అసైన్డ్‌, ప్రభుత్వ భూమిని సేకరించేందుకు సిద్ధ మయ్యారు.
సేకరించే భూమిలో పరిశ్ర మలకు ఎంత కేటాయిస్తారు? రైతులకు ప్యాకేజీ కింద ఏ మేరకు ఇస్తారు? అనేది చెప్పే నాథుడు లేడు. తుళ్లూరు తరహా ప్యాకేజీ ఇస్తాం.. మెగా టౌన్‌షిప్‌ నిర్మించి స్తామంటూ దూరపు కొండల్ని చూపిస్తున్నారే తప్ప వాస్తవాలను చెప్పడంలేదు. దీనివల్ల పోర్టు నిర్మాణం జరుగుతుందో, లేదో కాని ప్రజల నుంచి మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అసలు పోర్టు నిర్మాణానికి 30 వేల ఎకరాల భూమి అవసరమా? ఇంత భూమిని ఏమి చేస్తారు? అన్న ప్రధానమైన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పేవారు లేరు. రాజకీయ అవసరాల కోసం కాకుండా, ప్రజావసరాలు, రాష్ట్రాభివద్ధి కోసమే పోర్టు నిర్మాణం అనే సంకల్పం ఉంటే వాస్తవాలను ప్రజలకు వివరించాల్సి ఉంది. పోర్టు నిర్మాణంపై ఉన్న అనేక అనుమానాలను నివత్తి చేయాల్సి ఉంది. ఇన్ని వేల ఎకరాల భూమిని ఏమిచేస్తారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇవేమీ చేయకుండా భూ సేకరణకు దిగితే మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత రెట్టింపవుతుంది. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు చాలా ఇబ్బంది అవుతుంది.
- కంచల జయరాజ్‌ 