ఆర్టికల్స్

హిందూత్వ వెనుక కుల వైరస్‌

హిందూ జాతీయవాదం ఆచరణీయమైన ప్రాజెక్టా? ప్రధానికి సంబంధించినంత వరకు ఇది నిరర్థకమైన ప్రశ్న కాదు. మరో కారణం రీత్యా ఇదొక నిరర్థకమైన ప్రశ్న. రాజ్యాగాన్ని అనుసరించి భారతదేశం ఎన్నటికీ హిందూ దేశం కాబోదు. ఒక జాతి రాజ్యంగా ఇది రాజకీయంగా మతంతో ఎలాంటి సంబంధంలేనిదిగా ఉండి తీరాలి. ఇదే ప్రశ్నను మరో రకంగా కూడా చెప్పవచ్చు. లౌకికవాద ''భారతీయ'' జాతీయవాదం ఆచరణీయమైన ప్రాజెక్టా? గీతా ప్రెస్‌ ప్రచురణలననుసరించి గట్టిగా 'కాదు' అనే వస్తుంది. వారి సిద్ధాంతం హిందూ జాతీయవాదం. వారి లక్ష్యం హిందూ భారతదేశం. ప్రస్తుతం కేంద్రంలో వారి సైద్ధాంతిక అనుబంధ సంస్థలే అధికారంలో ఉన్నందునా, రాజ్యాంగపరమైన వాస్తవాన్ని వారు తిరస్కరిస్తున్నందునా ఈ ప్రశ్నకు వారిచ్చిన సమాధానంపై దృష్టి...

అన్నిశాఖలపై ప్రపంచబ్యాంకు పెత్తనానికి యత్నం..

 ప్రపంచ బ్యాంకు ఈ నెల 14న 'అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రిఫామ్స్‌' అనే నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 1-జూన్‌ 30 మధ్య పారిశ్రామిక, వ్యాపార సంస్కరణలకు సంబం ధించి 98 అంశాలను మదింపు చేసింది. ప్రపంచ బ్యాంక్‌ కీలక పాత్ర పోషించి రూపొం దించిన ఈ నివేదిక రూపకల్పనలో మేక్‌ ఇన్‌ ఇండియా, కెపియంజి, సిఐఐ, ఫిక్కీ ఉన్నాయి. ఇందుకు 285 ప్రశ్నలను రూపొందించి, వాటికి ఆయా రాష్ట్రాలు ఇచ్చిన సమాధా నాలు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి ర్యాంకులు నిర్ణయిం చినట్లు నివేదికలో పేర్కొంది. ఈ ప్రశ్నలలో కార్మిక చట్టాల నియంత్రణకు సంబంధించినవి 51 కాగా, మరో 61 తనిఖీలకు సంబంధించినవి. మిగిలిన 112 ప్రశ్నలు ఫ్యాక్టరీలు, సంస్థలకు సంబంధించినవి....

భ్రమ-వాస్తవం

తెగించి పెట్టుబడులు పెట్టాలంటూ పారిశ్రామిక వేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇచ్చిన పిలుపు దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అయోమయానికి, గందరగోళానికి అద్దం పడుతోంది. పెట్టుబడిదారులతో పాటు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు పాల్గొన్న ఒక కార్యక్రమంలో మాట్లాడిన ప్రధానమంత్రి నష్టాలను భరించే శక్తి ప్రైవేటు రంగానికే ఉంటుందని కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాస్తవానికి ప్రధానమంత్రి నోటి వెంట వచ్చిన ఈ మాటలు ఆశావహ ధృక్పథాన్ని కాకుండా దానికి భిన్నమైన నైరాశ్యాన్ని ప్రతిబింబిస్తుండటం గమనార్హం. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదంతో దేశం రూపురేఖలు మారిపోనున్నాయంటూ కొద్దిరోజుల క్రితం వరకూ ఊదరగొట్టిన ప్రచారానికి కూడా తాజా వ్యాఖ్యలు భిన్నం. గతంలో ఏ ప్రధాన మంత్రీ పర్యటించని...

జనం స్పందన చూసైనా స్పృహలోకి వస్తారా!

సెప్టెంబర్‌ 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెకు ఉద్యోగ, కార్మిక వర్గాల నుంచి అపూర్వమైన మద్దతు లభించింది. అందరి అంచనాలకు మించి కార్మికులు సమ్మెలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు తమ వ్యతిరేకతను స్పష్టంగా చాటారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, పోస్టల్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఇన్సూరెన్సు, బ్యాంకింగ్‌ ఉద్యోగులు, ఓడరేవులు, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోనూ, బొగ్గు గనుల్లోనూ, రక్షణరంగ పరిశ్రమల్లోనూ పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులు అత్యధిక శాతం సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ రవాణా కార్మికులతో పాటు ప్రయివేటు రంగ రవాణా కార్మికులు కూడా కలిసి దేశవ్యాప్తంగా సమ్మెచేయడంతో రవాణా వ్యవస్థ స్తంభించి పోయింది. సమ్మెకు రెండు రోజుల ముందు నుంచే ''బిఎంఎస్‌ సమ్మెను...

ప్రశ్నిస్తేనే..!

న్నెన్నో మాయలు చేసినవాళ్ళు మహాత్ములుగా బతికిపోతున్న కాలంలో మనిషిగా, మంచి మనిషిగా బతకడమే కష్టమైన విషయం అంటాడు కబీరు. మంచి మనిషిగా బతకడమంటే మౌనంగా తన దారిన తాను బతకడం కాదు. తన కళ్ళెదుటే దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కళ్ళప్పగించి చూడటం కాదు. తానొవ్వక, నొప్పింపక, తప్పించుకు తిరిగే లౌక్యం చూపడమూ కాదు. మాయలపేరిట, మంత్రాల పేరిట మూఢత్వంలోకి లాక్కెళ్ళే కుతంత్రాలను ప్రశ్నించాలి. మనిషికి క్షేమకరం కాని చెడు మీద తిరగబడే తత్వాన్ని ప్రదర్శించాలి. హేతువుకు నిలవని విషయాలను సవాల్‌ చేయాలి. హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని ప్రపంచానికి అందించాలి. తన చుట్టూ ఉన్న ప్రజలలో ప్రశ్నించే తత్వాన్ని పాదుకొల్పాలి. ఇవాళ భూమి బల్లపరుపుగా ఉందని చెప్పడానికి ఎవరూ సాహసించరు. కానీ...

విద్యారంగ స్వేచ్ఛకు ప్రమాదం..

 ఈమధ్య పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరుగుతున్న విద్యార్థుల పోరాటం గురించి మీడియాలో చూస్తున్నాం. ఆ సంస్థకు అధ్యక్షుడిగా గజేంద్ర చౌహాన్‌ను, ఆయనతోపాటు మరో ముగ్గురిని పాలక మండలి సభ్యులుగా నియమించటాన్ని విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఆ సంస్థతో సంబంధంలేని ఇతర సినిమా రంగ నిష్ణాతులు కూడా ఈ నిరసనలో పాలుపంచుకుంటున్నారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఆయనకున్న అర్హతల్లా ఆయన మోడీపై సినిమా తియ్యటమే. దానితోపాటు మహాభారతం టీవీ సీరియల్‌లో ధర్మరాజు పాత్రను పోషించాడు. ఒకప్పుడు మహామహులు నిర్వహించిన ఆ బాధ్యతలోకి రావటానికి ఈ అర్హతలు ఏమాత్రం సరిపోవు. అయితే పూనా ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మాత్రమే ఇలా జరగలేదు. అనేక ఇతర పరిశోధనా సంస్థలలో కూడా ఇలాంటి...

మొక్కుబడి సమావేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ వర్షాకాలపు అసెంబ్లీ సమావేశాలు తూతూ మంత్రంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు మాటల యుద్ధాలు, తోపులాటలు, వ్యక్తిగత దూషణలు, సవాళ్లు, ప్రతి సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది మినహా ప్రజోపయోగ చర్చలు, తదుపరి కార్యాచరణకు ఎలాంటి స్థానం లేకపోవడం దారుణం. విపక్షానికి అవకాశమివ్వడం, విపక్షం లేవనెత్తే అంశాలకు సమాధానాలివ్వడం, తద్వారా సమస్యల పరిష్కారానికి బాటలు వేయడం ప్రజాస్వామ్యంలో అధికారపక్ష కనీస బాధ్యత. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ప్రభుత్వం ఈ తరహా స్ఫూర్తిని మరచిన తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. అధికారపక్షం ఎదురు దాడికి దిగితే వ్యూహాత్మకంగా వ్యవహరించి సమస్యలపై సజావు చర్చ వైపు దారి మళ్లించాల్సిన విపక్షమూ దానికి భిన్నంగా...

సామాజిక న్యాయమా? ఆధిపత్యమా?

మరోసారి రిజర్వేషన్లపై రగడ మొదలైంది. గుజరాత్‌ పటేళ్ల ఆందోళన దీన్ని తిరిగి తెరపైకి తెచ్చింది. ఇది చాలా ఆందోళన కరమైన పరిణామం. తమను వెనకబడిన తరగతుల్లో చేర్చి రిజర్వేషన్లు వర్తింపజేయాలని వారు చేపట్టిన ఉద్యమం హింసాత్మక రూపం తీసుకుంది. ప్రధాని సొంత రాష్ట్రం అభివృద్ధికి ఆధునిక నమూనాగా చెప్పబడుతున్న గుజరాత్‌లో ఈ పరిణామం జరగడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయోనంటూ మీడియా ఊహాగానాలు మొదలు పెట్టింది. దీని వెనక ఎవరున్నారు? ఏ పార్టీ దీనివల్ల లాభపడుతోంది? అంతిమంగా ఇది రిజర్వేషన్లను ఎత్తివేసే వైపు సాగుతుందా? పటేళ్లు నిజంగానే వెనకబడిన వారా? పటేళ్లతోబాటు జాట్‌లు, కమ్మ, రెడ్డి వంటి కులస్తులకు వెనకబడిన తరగతుల హోదా ఇస్తే ఇంక...

సెప్టెంబర్‌ 2 సమ్మె ఎందుకు?

ప్రపంచీకరణ నేప థ్యంలో స్వదేశీ, విదేశీ పెట్టుబడిదారీ వర్గాల ఒత్తిళ్ల వల్ల 1991 నుంచి పాలకవర్గాలు అవలంబిస్తున్న సరళీ కరణ ఆర్థిక విధానాలు, ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఆది నుం చీ కార్మిక సంఘాలు పోరాడుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా పోరాడే క్రమంలో కార్మికవర్గాన్ని ఒక వర్గంగా ఐక్యంచేయటానికి కృషి జరుగుతున్నది. వివిధ కార్మిక సంఘాల నాయకత్వంలోని కార్మిక వర్గం ఇప్పటికే 15 సార్లు సార్వత్రిక సమ్మెలు చేసి, ఈ విధానాలను తాము తుదికంటా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. తత్ఫలితంగా ప్రయివేటీక రణ, సరళీకరణ విధానాల అమలు వేగం తగ్గింది. అయినా వాటి అమలు కోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం సర ళీకరణ...

సమ్మెతో కార్పొరేట్‌ పాలకులకు సమాధానం..

  కార్పొరేట్‌ పాలకులైన బిజెపి, టిడిపిలు కార్మిక వర్గంపై యుద్ధం ప్రకటించాయి. కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి, ఉరికొయ్యలు, చెరసాలలు, ఆత్మబలిదానాలతో సాధించు కున్న కార్మిక చట్టాలను సవరించి, కార్పొరేట్‌ సంస్థలు, యాజ మాన్యాలు మరింత దోపిడీ చేసుకునే విధంగా మార్పులు చేస్తున్నాయి. కార్మిక చట్టాల సవరణ సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే... ఎటువంటి హక్కులూ, రక్షణా లేని కార్మికునిగా మార్చడం. కార్పొరేట్‌ పాలకులు కార్మిక వర్గానికి బానిస సంకెళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారు. కార్మిక వర్గం ఉద్యమాలు, ఆత్మబలిదానాలతో రూపొం దించబడ్డ, ఐడి యాక్ట్‌, ట్రేడ్‌ యూనియన్‌ యాక్ట్‌, ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌, కాంట్రాక్టు వర్కర్స్‌ రెగ్యులరైజేషన్‌ అండ్‌ అబాలిషన్‌ యాక్ట్‌, అప్రంటీస్...

పొంచివున్న విద్యుత్‌ ఛార్జీల ముప్పు

ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ఐదేళ్ళ బకాయిలను ఇప్పుడు వసూలు చేస్తామనడం సబబు కాదు. ఇప్పుడు 2009-10 నుంచి 2013-14 వరకు ఎపిఇపిడిసిఎల్‌ రూ.1,158 కోట్లు, ఎస్‌పిడిసిఎల్‌ రూ.6,051 కోట్లు ట్రూఅప్‌ ఛార్జీలు ప్రతిపాదించారు. రెండు డిస్కాంల వాదనల్లో అనేక అంతరాలు, అసంగతాలు ఉన్నాయి. ఇఆర్‌సి అనుమతించిన దానికంటే తక్కువ విద్యుత్‌ను సరఫరా చేశారు. అలాగే కొనుగోలు చేసిన విద్యుత్‌ పరిమాణం కూడా తక్కువే. (పరిస్థితి ఇలావుండగా రానున్న ఐదేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌ మూడు రెట్లు పెరుగుతుందన్న ప్రభుత్వ వాదన గాల్లో మేడలు కట్టడమే కదా!) అయినా ఖర్చు మాత్రం చాలా పెరిగిందని డిస్కాంలు వాదిస్తున్నాయి.

గడచిన ఎన్నికల్లో ''జాబు కావాలంటే బాబు రావాలి'' అని చేసిన...

చర్చలు తప్ప మరో మార్గం లేదు..

భారత్‌, పాకిస్తాన్‌ జాతీయ సలహాదారు స్థాయీ (ఎన్‌ఎస్‌ఎ) చర్చలు చివరి నిమిషంలో రద్దు కావడం బాధాకరం. ఇరు దేశాల్లోనూ శాంతికి విఘాతం కలిగించాలని కోరుకునే ఛాందసవాద శక్తులకు ఇది ఊతమిస్తోంది. నవంబరు 26 ముంబయి దాడుల తరువాత ప్రతిష్టంభనలోపడిన ద్వైపాక్షిక చర్చలను పునరుద్ధరించేందుకు జరిగిన మరో ప్రయత్నం ఇలా ఆగిపోవడం శోచనీయం. ఈ పరిణామం ఇరుదేశాల్లోని చర్చల ప్రక్రియను వ్యతిరేకించే శక్తులకు సంతోషం కలిగించవచ్చు, కానీ, ఈ ఉపఖండంలో కమ్ముకున్న అనిశ్చితిని తొలగించాలని కోరుకునేవారికి ఇది ఒక విచారకరమైన అంశం. ఆరు వారాల క్రితం షాంఘై కూటమి సమావేశాల సందర్భంగా రష్యాలోని ఉఫాలో భారత్‌, పాకిస్తాన్‌ ప్రధానులిరువురూ కూర్చొని ఉపఖండంలో శాంతి, సామరస్యాలను నెలకొల్పేందుకు చర్చల...

Pages