ఆర్టికల్స్
నిబద్ధతే సాహూ మహరాజ్ సామాజిక తత్వం
Tue, 2015-06-30 10:35
మహారాష్ట్ర సంస్థానాలన్నింటా బలవంతంగా ఆమోదింపక తప్పని ఉచ్ఛస్థితిలో అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఉన్న రోజులవి. ఛత్రపతి శివాజీ వంశీయులు, ఘాట్గే వంశీయులైన జయంతిసింగ్ అబాసాహెబ్, రాధా బాయిలు సాహూ మహరాజ్ తల్లిదండ్రులు. వీరు క్షత్రియులా? కాదా? అన్న శీలపరీక్షకు గురిచేసింది ఆనాటి బ్రాహ్మణ వర్గం. సాహూ మహరాజ్ 1874 జూన్ 26న జన్మించారు. 1894లో తన ఇరవయ్యవ ఏట పాలనా బాధ్యతలు చేపట్టి ఎన్నో సామాజిక ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. బ్రాహ్మణ మనువాద తాత్వికతను క్షుణ్ణంగా పరిశీలించారు. అవరోధంగా ఉన్న వాటిని వదిలి ప్రజల సానుకూల అంశాలను పాలనా వ్యవస్థలో ఇమిడ్చారు. రాజ వంశాల వ్యక్తులు తమ హోదాకు చిహ్నంగా భావించే విలాసాలను, మద్యపానాన్ని ఆయన దరిజేరనివ్వలేదు. పాలనా...
మోసపూరిత మోడీ
Tue, 2015-06-30 09:43
''అఖిల భారత ఇమామ్ సంస్థ'' ముఖ్యులు ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసీ 30 మంది అనుచరులతో కేంద్ర సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి ఆధ్వర్యంలో ప్రధాని మోడీని కలిశారు. ఆ సందర్భంలో, ''... మతపరమైన భాషను నేను ఎప్పుడూ ఉపయోగించ లేదు. ... అర్ధరాత్రి కూడా మీ ఆర్తనాదాలు వింటాను'' అన్నారు మోడీ. మోడీయంలో గడిచిన వసంతమొక్కటే. గడవనున్న వత్సరాలలో నేతి బీరకాయ పటాటోప ప్రగల్భ ప్రకటనలెన్నో ప్రారంభం కానున్నాయి. అస్మదీయుల మత దాడులను, పరమత ద్వేష ప్రచారాలను సహించి, మౌనం పాటిస్తున్నందుకు మోడీని అంతర్జాతీయ సమాజం అసహ్యించుకుంటున్నది. అమెరికా పార్లమెంటులోని ''అంతర్జాతీయ మత స్వతంత్రత పరిరక్షణ కమిషన్'' తన నివేదికలో భారత దేశాన్ని తీవ్రంగా విమర్శించింది....
నీతి బాహ్య రాజకీయాలు- నిరర్థక వివాదాలు
Sun, 2015-06-28 12:21
ఓటుకు కోట్ల కేసు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. ఈ సందర్భంగానూ, అంతకు ముందూ కూడా కేంద్రం నుంచి ఏవో నాటకీయ ఆదేశాలు అందుతాయని, సంచలన పరిణామాలు కలుగుతాయని కథలు చెప్పిన వారికి నిరాశే మిగిలింది. గవర్నర్ పర్యటనకు చాలా రోజుల ముందు నుంచి కేంద్ర హోం శాఖ ఆదేశాల పేరిట చాలా కథనాలు వచ్చాయి. అటార్నీ జనరల్ సలహా పేరిట మరికొన్ని కథనాలు కాలక్షేపం ఇచ్చాయి. అసలు కేంద్రం ఆగ్రహించిన మీదట ఉభయ రాష్ట్రాలూ వివాదాన్ని వెనక్కు పెట్టేశాయని కొందరు మీడియాధిపతులు భాష్యాలు చెప్పారు. ఇంతా అయ్యాక చూస్తే ఇటు ఫోరెన్సిక్ లాబరెటరీ నివేదిక, అటు ఎన్నికల సంఘ ప్రవేశం, మరో వైపు కోర్టులో పోటాపోటీ వాదనలు...
ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకై చట్టం చేయాలి
Sun, 2015-06-28 12:16
ప్రైవేటురంగంలో రిజర్వేషన్ల గురించిన చర్చ గత 10 ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పటికీ ప్రముఖ వస్తు తయారీ పరిశ్రమలలో శాశ్వత ఉద్యోగులు ఎంతమంది ఉన్నదీ చెప్పటం లేదు. గణనీయమైన సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉన్నప్పుడు రిజర్వేషన్ల గురించిన భయాలు వారికెందుకు ఉండాలి? అంతేకాక గత 15 సంవత్సరాల్లో ఉద్యోగుల నియామకం తగ్గిన విషయాన్ని కూడా ఈ పత్రం ప్రస్తావించలేదు. సిఐఐ, అసోచెమ్‌ల విజ్ఞాపన పత్రం తప్పించుకునే ఉద్దేశంతో సమర్పించింది. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని ఉద్యోగాలు ఇవ్వగలమన్న హామీని అది ఇవ్వలేదు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించు కొని పెద్ద ఎత్తున ఉత్స వాలు నిర్వహిం చాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ...
కొవ్వాడ అణుపార్కు... ఆంధ్రలో ఆటం బాంబే..
Thu, 2015-06-25 14:28
ప్రపంచ దేశాలన్నీ అణువిద్యుత్కేంద్రాలను మూసివేసి, ప్రత్యామ్నాయాల వైపు వెళ్తుంటే భారత్‌లో మాత్రం అణు విద్యుత్కేంద్రాలను ఎందుకు పెడుతున్నారు? భారతదేశంలోని కార్పొరేట్ సంస్థలు, బడా పెట్టుబడిదారులు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయడానికి అమెరికా పెట్టిన షరతులను ప్రభుత్వం అంగీకరించింది.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడలో అణుపార్కు పనులు వేగవంతం చేయడానికి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి పూనుకుం టున్నాయి. అమెరికాతో యుపిఎ-2 చేసుకున్న అణు ఒప్పందాన్ని బిజెపి, టిడిపి శరవేగంగా అమలు చేస్తున్నాయి. విధానపరంగా కాంగ్రెస్, బిజెపి, టిడిపిలకు తేడా లేదు. భూ సేకరణకు జిల్లా యంత్రాంగం ప్రయత్నాలు...
ప్రాంతీయవాదం-ప్రజలపై భారం..
Thu, 2015-06-25 12:31
కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏడాది పాలన పూర్తియిందంటూ సంకలు గుద్దుకుంటున్న రాష్ట్ర పాలకుల తీరు సంతోషంలో చావు మరిచిపోయి నట్లున్నది. రాష్ట్ర విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత 13 జిల్లాల ప్రజలపై, గడిచిన సంవత్సర కాలంలో వందల కోట్ల రూపాయల భారం మోపిన విషయం పాలకులకు గుర్తురావడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు ఒక్కటి కూడా సక్రమంగా అమలు జరపడం లేదు. చెయ్యని వాగ్దానాలు అమలు జరుపుతున్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ పూర్తిగా అమలు జరపలేదు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా రాయితీల పేరుతో వారి బ్యాంకు ఖాతాలో జమచేశారు. ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు జీత, బత్యాలు పెంచి...
చాప కింద నీరులా నియంతృత్వం..
Thu, 2015-06-25 12:01
పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్‌ఎస్‌ఎస్. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది.
ఈ రోజు జూన్ 25. 19 నెలలపాటు కొనసాగిన అంతర్గత అత్యవసర పరిస్థితి విధించబడి నేటికి 40...
విప్లవ రాజకీయాల్లో అలుపెరుగని యోధుడు..
Mon, 2015-06-22 13:28
విప్లవ రాజకీయాల్లో అలుపెరుగని యోధుడు..
పార్టీ నిర్మాణ వ్యవహారాలు, పత్రిక కోసం రాజకీయ రచనల బాధ్యత ఉండటం వల్ల రోజూ రాత్రి 10 గంటలకు గాని ఇంటికి బయలుదేరేవారు కాదు. అప్పటి వరకూ నేనూ ఉండేవాణ్ణి. ఎన్నో విషయాలు బోధించేవారు. ఆయన జ్ఞాపకాలు చెప్పి ఉత్సాహపరిచేవారు. సమయం, సందర్భాన్ని బట్టి రచన ఉండాలనేవారు. వ్యర్థ పదాలు, పరుషమైన పదజాలం వాడకూడదనేవారు. పాఠకుడికి పరుష పదాలు చివుక్కుమనిపిస్తాయని చెప్పేవారు. ఆయా ఉద్యమ ఘట్టాలలో ఎన్నో రచనలు చేశారు. సంపాదకీయాలు రాశారు. శక్తివంతమైన విమర్శకే తప్ప పరుష పదజాలం వాడేవారు కాదు. రచనా వ్యాసంగంలో ఎంతో చేయి తిరిగిన మేటి అయితేనే అది సాధ్యమవుతుంది. యం.హెచ్. ఈ రెండు అక్షరాలు ఎంతో విలువైనవిగా...
బడి నవ్వుతోంది..!
Thu, 2015-06-18 12:20
కార్పొరేట్, ప్రయివేటు కళాశాలల్లోనూ, పాఠశాలల్లోనూ జీవో నెం.1(94) ప్రకారం యాజమాన్య కమిటీలు నియమించాలి. అధిక ఫీజుల తగ్గింపు, విద్యా ప్రమాణాల పెంపుదల, కనీస సౌకర్యాలు ఏర్పాటు విషయం ఆ కమిటీల్లో చర్చించి నిర్ణయాలు చేయాలి. ప్రజా ప్రతినిధులు తలో ఒక ప్రభుత్వ పాఠశాలను స్మార్ట్ స్కూల్‌గా చేయటానికి దత్తత తీసుకోవాలి. ప్రభుత్వ మెడికల్, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలనూ, ఐటిఐలనూ నేటి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలి. వెనుకబడిన ప్రాంతాలలో గురుకుల పాఠశాలలు ప్రారంభించాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం బడి ఈడు పిల్లలను ఒక కిలోమీటరు పరిధిలో ఏ స్కూలుఉందో దానిలో చేర్పించుకోవాలి. ఏదో ఒక బడిలో చేర్చాలి. కార్పొరేట్ స్కూళ్లు, కళాశాలల్లో పేద విద్యార్థుల కోసం...
స్వంతవారు చేదయ్యారా!
Mon, 2015-06-01 08:40
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం విదేశీ కార్పొరేట్ల చేతిమీదగానే జరుగుతోందని వినిపిస్తున్న విమర్శలకు ప్రభుత్వ చర్యలు బలం చేకూరుస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో అత్యంత కీలకమైన ప్లాట్ల లేఅవుట్ రూపకల్పనను పరాయి కన్సల్టెంట్లకు అప్పగించేందుకు సిఆర్‌డిఎ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అధారిటీ) అత్యుత్సాహం కనబరచడం ప్రభుత్వ వైఖరిలో భాగమే. ఇందుకోసం బహిరంగ టెండర్లు పిల్చినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రులవారి చూపంతా విదేశీ ప్లానింగ్ కంపెనీల మీదే ఉంది. సింగపూర్, జపాన్ వారు మినహా భారతీ యులు అందునా ఆంధ్రులు పనికి రాకుండా పోయారు బాబుగారికి. రాజధాని నిర్మాణానికి సంబంధించి గత కొంత కాలంగా జరుగుతున్న ఘటనలన్నీ వీటినే రుజువు చేస్తున్నాయి.
టెండర్లు...
ఉడతకేల ఊర్లో పెత్తనం..
Wed, 2015-02-11 17:28
వంద ఎలుకలు తిన్న పిల్లి శాకాహారులను విమర్శిస్తూ కాశీకి బయలుదేరినట్లుగా ఈనెల 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెను విమర్శిస్తూ పారిశ్రామిక, వ్యాపారవేత్తల సంఘాలు దేశభక్తి తమకే ఉన్నట్లు నీతి వాక్యాలు బోధిస్తున్నాయి. పాలకుల పంచన చేరిన బడా పారిశ్రామిక, వ్యాపారవేత్తలు (కార్పొరేట్లు) దేశ ఆర్థిక వ్యవస్థకు సమ్మె వల్ల వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అంటున్నారు. దేశభక్తుల ఇంటికి, తమకు తడికే అడ్డం అన్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. భారత్‌కు వ్యాపార నిర్వహణకు అనుకూలంగా ఉన్న దేశం అనే మంచి పేరు పోతుందని ఆవేదన వ్యక్త పరిచారు. ఇంతటితో ఆగకుండా దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. ఉపాధి కల్పనకు కార్మిక చట్టాల సంస్కరణలు కీలకమైనవని...
వారి పోరాట బలం..త్యాగఫలం
Thu, 2015-01-08 13:15
అర్ధఫాసిస్టుల మారణకాండకు, భూస్వాముల హింసాకాండకు చిరునామాగా మారిన బెంగాల్‌లో బిగిసిన పిడికిళ్లు వారివి! వినిపించిన విప్లవ నినాదాలు వారివే! పీడిత, తాడిత ప్రజానీకపు విముక్తే లక్ష్యంగా ఎర్రజెండా ఎత్తిన ధీశాలులు వారు! దోపిడితో , పీడనతో విసిగిపోయి, బతుకులింతే అంటూ నిరాశ, నిస్పృహలో మునిగిపోయిన నిరుపేద ప్రజానీకపు గుండెల్లో ధైర్యాన్ని నింపి, పోరుబాట నడిపిన మార్గదర్శులు వారు! వారే ముజఫర్ అహ్మద్, జ్యోతిబసు, ప్రమోద్‌దాస్ గుప్తాలు! ఒకరు అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నిర్మిస్తే, మరొకరు అద్బుతమైన పాలనదక్షతతో పేదల ఆకాంక్షలకు పట్టం గట్టి మార్క్మిస్టు మేరునగధీరుడిగా వినుతికెక్కారు. ఇంకొకరు విప్లవానికి వేగుచుక్కగా,కమ్యూనిజానికి నిలువెత్తు రూపంగా...