ఆర్టికల్స్

ఉడతకేల ఊర్లో పెత్తనం..

వంద ఎలుకలు తిన్న పిల్లి శాకాహారులను విమర్శిస్తూ కాశీకి బయలుదేరినట్లుగా ఈనెల 2న జరిగిన దేశవ్యాప్త సమ్మెను విమర్శిస్తూ పారిశ్రామిక, వ్యాపారవేత్తల సంఘాలు దేశభక్తి తమకే ఉన్నట్లు నీతి వాక్యాలు బోధిస్తున్నాయి. పాలకుల పంచన చేరిన బడా పారిశ్రామిక, వ్యాపారవేత్తలు (కార్పొరేట్లు) దేశ ఆర్థిక వ్యవస్థకు సమ్మె వల్ల వేల కోట్ల రూపాయలు నష్టం జరిగిందని అంటున్నారు. దేశభక్తుల ఇంటికి, తమకు తడికే అడ్డం అన్నట్లు మీడియాకు సమాచారం ఇచ్చారు. భారత్‌కు వ్యాపార నిర్వహణకు అనుకూలంగా ఉన్న దేశం అనే మంచి పేరు పోతుందని ఆవేదన వ్యక్త పరిచారు. ఇంతటితో ఆగకుండా దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని అంటున్నారు. ఉపాధి కల్పనకు కార్మిక చట్టాల సంస్కరణలు కీలకమైనవని...

వారి పోరాట బలం..త్యాగఫలం

అర్ధఫాసిస్టుల మారణకాండకు, భూస్వాముల హింసాకాండకు చిరునామాగా మారిన బెంగాల్‌లో బిగిసిన పిడికిళ్లు వారివి! వినిపించిన విప్లవ నినాదాలు వారివే! పీడిత, తాడిత ప్రజానీకపు విముక్తే లక్ష్యంగా ఎర్రజెండా ఎత్తిన ధీశాలులు వారు! దోపిడితో , పీడనతో విసిగిపోయి, బతుకులింతే అంటూ నిరాశ, నిస్పృహలో మునిగిపోయిన నిరుపేద ప్రజానీకపు గుండెల్లో ధైర్యాన్ని నింపి, పోరుబాట నడిపిన మార్గదర్శులు వారు! వారే ముజఫర్‌ అహ్మద్‌, జ్యోతిబసు, ప్రమోద్‌దాస్‌ గుప్తాలు! ఒకరు అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నిర్మిస్తే, మరొకరు అద్బుతమైన పాలనదక్షతతో పేదల ఆకాంక్షలకు పట్టం గట్టి మార్క్మిస్టు మేరునగధీరుడిగా వినుతికెక్కారు. ఇంకొకరు విప్లవానికి వేగుచుక్కగా,కమ్యూనిజానికి నిలువెత్తు రూపంగా...

Pages