ఆర్టికల్స్

ఎన్‌డిఎ ప్రభుత్వం - త్రిముఖ ప్రమాదాలు

భారతదేశ జాతీయవాదానికి మత భిన్నత్వంతో సహా తమ బహుళ విధమైన భిన్నత్వాన్ని గౌరవించే విస్తారమైన ప్రజలను కలుపుకుపోవడం కీలకంగా ఉంటుంది. అలా కలుపుకుపోవడమనేది 'భారతదేశ భావన'కు అంటే లౌకిక ప్రజాస్వామ్యానికి కేంద్రకంగా ఉంటుంది. ఇక్కడ లౌకికవాదం, ప్రజాస్వామ్యాలను రెండు భిన్నమైన భావనలంటూ వేరు చేయజాలం. కానీ నేడు ఆర్‌ఎస్‌ఎస్‌/బిజెపి ఈ రకంగా విడదీస్తున్నాయి. మన లౌకిక ప్రజాతంత్ర గణతంత్ర రాజ్యాన్ని ఏమాత్రం సహనం లేని ఫాసిస్టు 'హిందూ రాజ్యంగా' మార్చాలనే తమ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవడం ద్వారా అవి విడదీస్తున్నాయి.
               అమానుషమైన అత్యవసర పరిస్థితి 40వ వార్షికోత్సవం చరిత్రను వక్రీకరించాలని, దానికి వ్యతిరేకంగా సాగిన ప్రజల ఉమ్మడి...

రాజకీయ వ్యూహాలకు రాష్ట్రాలే పాచికలా?

ప్రజలు పరిపక్వతతో విభజన వాస్తవాన్ని ఆమోదించారు. భవిష్యత్తులో తమకు జరిగే మేలేమిటని చూస్తున్నారు. రెండు ప్రభుత్వాలూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే కొరత కూడా వారిని వెన్నాడుతున్నది. ఇందుకు రెండే పరిష్కారాలు- ఒకటి రాజకీయ విజ్ఞతతో ఉభయులూ మాట్లాడుకోవడం. రెండు-కేంద్రం చొరవతో పరిష్కరించుకోవడం. ఇందులో కేంద్రం కూడా ఆసక్తిచూపడం లేదు. కనుకనే స్నేహపూర్వకంగా జరగాల్సిన ప్రథమ వార్షికోత్సవం వివాద సందర్భమై కూచుంది. 
                ఈ వారం రోజులూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలన్నీ పరస్పర వివాదాలూ, సవాళ్లతోనే నడిచాయి. హైదరాబాదు నుంచి ఢిల్లీ వరకూ పాకాయి. అయితే ఈ మొత్తం తతంగంలో ప్రజల ప్రయోజనాలకు, రాష్ట్రాల దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించిన...

మార్గదర్శి కొరటాల..

               భూస్వామ్య కుటుంబంలో పుట్టి విద్యార్థి దశలోనే ఉద్యమాలు నడిపిన నేత కొరటాల సత్యన్నారాయణ. ఆనాటి విద్యార్థి సంఘం జిల్లా నాయకులైన ఎంబి, ఎంహెచ్‌, ఎల్‌బిజిల సాన్నిహిత్యంతో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులై పేద ప్రజల శ్రేయస్సుకై జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి. ఆయన రేపల్లె డివిజన్‌ పార్టీ కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యులుగా, పొలిట్‌బ్యూరో సభ్యులుగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజానాయకులు. రేపల్లె ఏరియాలో చేనేత కార్మికుల సమస్యలపై నిరంతరం అలుపెరగని కృషి చేశారు. చేనేత కార్మికులు కొరటాలను తమ వాడిగా చెప్పుకున్నారంటే వారి సమస్యలపై ఆయన చేసిన కృషి అసమానమైనది. లంకభూముల సమస్యపై నిరంతరం పోరాటాలు నడిపి పేద...

సంక్షోభంపై హెచ్చరిక

             ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితినీ, పరిణామాలనూ 1930 నాటి ఆర్థిక సంక్షోభ పరిణామాలతో పోల్చుతూ.. ఇటీవల లండన్‌ బిజినెస్‌ స్కూలులో జరిగిన సదస్సులో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్‌ రఘురాం రాజన్‌ చేసిన ప్రసంగం సంచలనాన్నే సృష్టించింది. జాగ్రత్త వహించకపోతే 1930 నాటి పరిణామాలు పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఐఎంఎఫ్‌ మాజీ ఆర్థిక సలహాదారుగానూ, పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న భారతదేశ రిజర్వు బ్యాంక్‌కు గవర్నర్‌గానూ ఉన్న వ్యక్తి చెప్పిన ఏ వ్యాఖ్యలకైనా విలువ ఉంటుంది. రఘురాం రాజన్‌ వ్యాఖ్యలు కూడా ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్‌ వర్గాల్లోనూ, బూర్జువా ఆర్థిక శాస్త్రవేత్తల్లోనూ అటువంటి ప్రభావాన్నే కలుగజేశాయి. ఇప్పటి వరకూ ప్రధానమైన...

గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ నిరసన

ఏథెన్స్‌: గ్రీస్‌లోని సిరియా-ఎనెల్‌ ప్రభుత్వం అమ లు చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలు, అంత ర్జాతీయ ఆర్థిక సంస్థలతో చేసు కుంటున్న ఒప్పం దాలకు వ్యతిరేకంగా గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) దేశంలోని వివిధ నగరాలలో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఏథెన్స్‌ సెంట్రల్‌ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో ఆందోళనకారులనుద్దేశించి కెకెఇ ప్రధాన కార్యదర్శి డి.కౌట్సుంపాస్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాలకు, దివాలాకోరు ఆర్థిక విధానాలకు, ఐరోపా కూటమి కేపిటలిస్ట్‌ అధికారానికి తలవంచే పార్టీలకు 'నో' చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కెకెఇతో కలిసి ఉద్యమించాలని ఆయన కోరారు....

గ్రీస్‌ సంక్షోభం

గ్రీస్‌లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐరోపా యూనియన్‌(ఇయు), యూరపు సెంట్రల్‌ బ్యాంకు (ఇసిబి), అంతర్జాతీయ ద్రవ్యనిధిó త్రయం గ్రీస్‌ ఆర్థిక రోగానికి ఇచ్చిన మందు వికటించి ఆ దేశాన్ని మరింత తీవ్రమైన రోగానికి గురిచేయగా ప్రపంచీకరణ యుగంలో దాని జబ్బు ఇప్పుడు యూరప్‌కూ, ఇతర దేశాలకూ పాకుతోంది. దుష్ట త్రయంగా గ్రీకు ప్రజలు పిలుస్తున్న ఈ మూడు ద్రవ్య సంస్థలు గ్రీకు బ్యాంకులకిచ్చే రుణాలపై పరిమితులు విధించడంతో ఆ దేశం పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సంక్షోభానికి మూలాలు యూరపు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. దానికి మూలాలు 2008లో అమెరికాలో తలెత్తిన ప్రపంచ ఆర్థిక మాంద్యంలో ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని జర్మనీ, ఫ్రాన్స్...

అవినీతి రొచ్చులో బిజెపి

          'అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న' సామెత బిజెపికి బాగా నప్పుతుంది. పదేళ్ల యుపిఎ హయాంలో కాంగ్రెస్‌ మంత్రులు, ముఖ్యమంత్రులు అవినీతిలో మునిగిపోగా, కాంగ్రెస్‌ అవినీతిని తూలనాడి అధికారంలోకొచ్చిన బిజెపి, ఏడాదిలోనే అవినీతిలో ఈత కొడుతున్నది. తొలి వసంత సంబరాలు జరుపుకుంటున్న ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్న బిజెపికి, ఒక్కొక్కటిగా బయట పడుతున్న ఆ పార్టీ నేతల అవినీతి, అక్రమాలు తల బొప్పి కట్టిస్తున్నాయి. మొన్న సుష్మా స్వరాజ్‌, నిన్న వసుంధరా రాజే, నేడు పంకజా ముండే అక్రమాలతో బిజెపి నాయకులు, ప్రధాని నరేంద్ర మోడీ గిలగిల్లాడుతున్నారు. ఈ ఉదంతాలకు స్మృతి ఇరానీ విద్యార్హతల వివాదం తోడై ముచ్చెమటలు పోయిస్తున్నది. ఆత్మరక్షణలో పడ్డ ప్రధాని, బిజెపి అగ్ర నేతలు...

పడకేసిన ప్రాథమిక వైద్యం

                   మా బంధువు ఒకరు ఛాతిలో మంట ఉందని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్ళారు. వెంటనే ఎండోస్కోపీ, రక్తపరీక్షలు చేస్తేనే జబ్బు ఏంటో తెలుస్తుందని భయపెట్టి డాక్టర్‌ అన్ని రకాల పరీక్షలూ చేశారు. 15 రోజులకు రూ.2,200 విలువ చేసే మందులు సహా రూ.7,500 వసూలు చేశారు. అదే వ్యక్తిని కొన్నాళ్ళ తర్వాత నాకు తెలిసిన డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్తే గ్యాస్‌ సమస్య ఉందని, కారం, మసాలాలు తగ్గించమని చెప్పి ఒక ట్యాబ్లెట్‌తోపాటు, మంట ఉన్నప్పుడు డైజిన్‌ మాత్ర చప్పరిస్తే సరిపోతుందని చెప్పారు. దీనికి కేవలం రూ.10 మాత్రమే ఖర్చయింది. మన రాష్ట్రంలో ప్రజలను ప్రైవేట్‌ వైద్యశాలలు ఎలా పీల్చి పిప్పి చేస్తున్నాయో అర్థమవుతుంది. పెద్ద పెద్ద కార్పొరేట్‌ ఆసుపత్రులలో శవాల మీద కూడా...

నిబద్ధతే సాహూ మహరాజ్‌ సామాజిక తత్వం

మహారాష్ట్ర సంస్థానాలన్నింటా బలవంతంగా ఆమోదింపక తప్పని ఉచ్ఛస్థితిలో అగ్రకుల బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం ఉన్న రోజులవి. ఛత్రపతి శివాజీ వంశీయులు, ఘాట్గే వంశీయులైన జయంతిసింగ్‌ అబాసాహెబ్‌, రాధా బాయిలు సాహూ మహరాజ్‌ తల్లిదండ్రులు. వీరు క్షత్రియులా? కాదా? అన్న శీలపరీక్షకు గురిచేసింది ఆనాటి బ్రాహ్మణ వర్గం. సాహూ మహరాజ్‌ 1874 జూన్‌ 26న జన్మించారు. 1894లో తన ఇరవయ్యవ ఏట పాలనా బాధ్యతలు చేపట్టి ఎన్నో సామాజిక ఒడుదుడుకులను ఎదుర్కొన్నారు. బ్రాహ్మణ మనువాద తాత్వికతను క్షుణ్ణంగా పరిశీలించారు. అవరోధంగా ఉన్న వాటిని వదిలి ప్రజల సానుకూల అంశాలను పాలనా వ్యవస్థలో ఇమిడ్చారు. రాజ వంశాల వ్యక్తులు తమ హోదాకు చిహ్నంగా భావించే విలాసాలను, మద్యపానాన్ని ఆయన దరిజేరనివ్వలేదు. పాలనా...

మోసపూరిత మోడీ

           ''అఖిల భారత ఇమామ్‌ సంస్థ'' ముఖ్యులు ఇమామ్‌ ఉమర్‌ అహ్మద్‌ ఇల్యాసీ 30 మంది అనుచరులతో కేంద్ర సహాయ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వి ఆధ్వర్యంలో ప్రధాని మోడీని కలిశారు. ఆ సందర్భంలో, ''... మతపరమైన భాషను నేను ఎప్పుడూ ఉపయోగించ లేదు. ... అర్ధరాత్రి కూడా మీ ఆర్తనాదాలు వింటాను'' అన్నారు మోడీ. మోడీయంలో గడిచిన వసంతమొక్కటే. గడవనున్న వత్సరాలలో నేతి బీరకాయ పటాటోప ప్రగల్భ ప్రకటనలెన్నో ప్రారంభం కానున్నాయి. అస్మదీయుల మత దాడులను, పరమత ద్వేష ప్రచారాలను సహించి, మౌనం పాటిస్తున్నందుకు మోడీని అంతర్జాతీయ సమాజం అసహ్యించుకుంటున్నది. అమెరికా పార్లమెంటులోని ''అంతర్జాతీయ మత స్వతంత్రత పరిరక్షణ కమిషన్‌'' తన నివేదికలో భారత దేశాన్ని తీవ్రంగా విమర్శించింది....

నీతి బాహ్య రాజకీయాలు- నిరర్థక వివాదాలు

ఓటుకు కోట్ల కేసు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని వచ్చారు. ఈ సందర్భంగానూ, అంతకు ముందూ కూడా కేంద్రం నుంచి ఏవో నాటకీయ ఆదేశాలు అందుతాయని, సంచలన పరిణామాలు కలుగుతాయని కథలు చెప్పిన వారికి నిరాశే మిగిలింది. గవర్నర్‌ పర్యటనకు చాలా రోజుల ముందు నుంచి కేంద్ర హోం శాఖ ఆదేశాల పేరిట చాలా కథనాలు వచ్చాయి. అటార్నీ జనరల్‌ సలహా పేరిట మరికొన్ని కథనాలు కాలక్షేపం ఇచ్చాయి. అసలు కేంద్రం ఆగ్రహించిన మీదట ఉభయ రాష్ట్రాలూ వివాదాన్ని వెనక్కు పెట్టేశాయని కొందరు మీడియాధిపతులు భాష్యాలు చెప్పారు. ఇంతా అయ్యాక చూస్తే ఇటు ఫోరెన్సిక్‌ లాబరెటరీ నివేదిక, అటు ఎన్నికల సంఘ ప్రవేశం, మరో వైపు కోర్టులో పోటాపోటీ వాదనలు...

ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లకై చట్టం చేయాలి

ప్రైవేటురంగంలో రిజర్వేషన్ల గురించిన చర్చ గత 10 ఏళ్ళ నుంచి జరుగుతున్నప్పటికీ ప్రముఖ వస్తు తయారీ పరిశ్రమలలో శాశ్వత ఉద్యోగులు ఎంతమంది ఉన్నదీ చెప్పటం లేదు. గణనీయమైన సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఉన్నప్పుడు రిజర్వేషన్ల గురించిన భయాలు వారికెందుకు ఉండాలి? అంతేకాక గత 15 సంవత్సరాల్లో ఉద్యోగుల నియామకం తగ్గిన విషయాన్ని కూడా ఈ పత్రం ప్రస్తావించలేదు. సిఐఐ, అసోచెమ్‌ల విజ్ఞాపన పత్రం తప్పించుకునే ఉద్దేశంతో సమర్పించింది. ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు మరిన్ని ఉద్యోగాలు ఇవ్వగలమన్న హామీని అది ఇవ్వలేదు.

డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ 125వ జయంతిని పురస్కరించు కొని పెద్ద ఎత్తున ఉత్స వాలు నిర్వహిం చాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ...

Pages