గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ నిరసన

ఏథెన్స్‌: గ్రీస్‌లోని సిరియా-ఎనెల్‌ ప్రభుత్వం అమ లు చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలు, అంత ర్జాతీయ ఆర్థిక సంస్థలతో చేసు కుంటున్న ఒప్పం దాలకు వ్యతిరేకంగా గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) దేశంలోని వివిధ నగరాలలో భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఏథెన్స్‌ సెంట్రల్‌ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో ఆందోళనకారులనుద్దేశించి కెకెఇ ప్రధాన కార్యదర్శి డి.కౌట్సుంపాస్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కుదుర్చుకునే ఒప్పందాలకు, దివాలాకోరు ఆర్థిక విధానాలకు, ఐరోపా కూటమి కేపిటలిస్ట్‌ అధికారానికి తలవంచే పార్టీలకు 'నో' చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కెకెఇతో కలిసి ఉద్యమించాలని ఆయన కోరారు. సిరిజా ప్రభుత్వం కార్మికులు, ప్రజల డిమాండ్లను హైజాక్‌ చేసే ప్రభుత్వంగా మారిపోయిందని, ఇప్పుడు ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం విషయంలో కెకెఇ వైఖరి స్పష్టంగా వుందని, ఆర్థిక సంస్థల ప్రతిపాదనలకు, ప్రభుత్వ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా గ్రీస్‌ ప్రజలు పెద్దయెత్తున ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు.