ఆర్టికల్స్
బిసి సబ్‌ప్లాన్ ఎందుకు?
Sat, 2015-07-25 10:02
అన్ని స్థాయిల్లోని నిర్ణాయక స్థానాల్లో, ఆర్థిక రంగాన్ని శాసిస్తున్న అన్ని వ్యవస్థల్లో, సంపద, మౌలికరంగాలపై ఆధిపత్యంలో బిసిలు పూర్తిగా అధమస్థానంలోకి నెట్టబడ్డారు. ఇప్పటికీ ఉత్పాదకను అందిస్తూ అత్యధిక స్వయం ఉపాధితో దేశ అభివృద్ధికి బిసిలు తోడ్పడుతున్నారు. దానికి తోడు చట్టసభల్లో కేవలం 18 శాతం స్థానాలు, పాలనా వ్యవస్థ లోని పై స్థాయి ఉద్యోగుల్లో 8 శాతం, న్యాయశాఖలో 6 శాతం, దేశంలోని అతిపెద్ద వెయ్యి కంపెనీల్లోని నిర్వహణా బోర్డులలో 3 శాతం కన్నా తక్కువ భాగస్వామ్యానికి పరిమితమయ్యారు.
భారత రాజ్యాంగం ఈ దేశంలో నివసించే ప్రజలం దరికీ జాతి, వర్ణ, కుల, వర్గ, లింగ వివక్ష లేకుండా సమాన త్వాన్ని, సమాన అవకాశాలను కల్పిస్తానని హామీ నిచ్చింది. ఈ లక్ష్యంతోనే...
ఆదర్శ పాఠశాలల అసలు నిజాలు
Thu, 2015-07-23 16:54
''ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాస్వామిక ప్రభు త్వాలు విద్యారంగం మీద సామాజిక అభివృద్ధి దృక్పథంతో పెట్టుబడులు పెట్టినప్పుడే నిరక్షరాస్యతా మహమ్మారిని పారద్రోలగలమని, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని సెనెగల్ రాజధాని డాకర్‌లో 2000లో జరిగిన ప్రపంచ విద్యా సదస్సు తీర్మానించింది.'' తీర్మానాన్ని మన దేశం కూడా ఆమోదించింది. కానీ నేడు మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అపసవ్య విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తోంది. ప్రత్యేకించి మన రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్‌కు విద్యారంగంలో ప్రాథమిక స్థాయిలో ధీటైన విధానాలతో గట్టి పునాదులు వేసి...
రెండంకెల వృద్ధి సాధ్యమా..!
Thu, 2015-07-23 14:14
రాష్ట్ర ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖా మంత్రి వ్యవసాయంలో రెండంకెల అభివృద్ధి (డబుల్ డిజిట్ గ్రోత్) సాధిస్తామనీ, దానికోసం అన్ని ఏర్పాట్లూ చేశామనీ ప్రచార హోరు మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న హడావుడి చూస్తే 'ఉట్టి కెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లు' ఉంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిని అరికట్టలేని ప్రభుత్వం మరి రెండంకెల ప్రగతి గురించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? గడిచిన దశాబ ్దకాలంలో కనీసం 4 శాతం వృద్ధి రేటు సాధించలేక పోయాము. ఇప్పుడు ఏకంగా రెండంకెల ప్రగతి సాధిస్తామని చెబుతున్నారు. దేశంలో 4 శాతం వ్యవసాయ రంగం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకుం టున్నా దానిని కూడా చేరకుండా ఏయేటికాయేడు దిగజారిపోతున్నది. దేశ జనాభా ఏటా 1.9...
చతికిలపడుతున్న చిన్నపరిశ్రమల రంగం
Thu, 2015-07-23 13:19
పారిశ్రామికాభివృద్ధిలో పెద్ద పాత్ర పోషించే చిన్న పరిశ్రమల పరిస్థితి నయా ఉదారవాద విధానాల యుగంలో పరమ అధ్వానంగా తయారైందని ఎంతమంది మొత్తుకున్నా పెడ చెవిన పెట్టిన పాలకులకు సరికొత్త సర్వేలు కళ్ళు తెరిపిస్తాయి అనుకోవాలి. చాలా పరిశ్రమలు ఇప్పటికే దివాళా తీయగా, మరి కొన్ని ఈసురోమంటూ మూతపడే దిశలో వున్నాయి. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా ఆచరణలో సేల్ ఇన్ ఇండియాగా మారిపోయింది. గడచిన ఏడాది కాలంలో దేశంలో 61వేలకు పైగా చిన్న పరిశ్రమలు, వ్యాపార సంస్థలు మూతపడినట్లు కార్పొరేట్ వ్యవహారాలను స్వయంగా చూస్తున్న కేంద్ర ఆర్థికశాఖామాత్యులు జైట్లీ మహాశయుడే మంగళవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో...
కళంకిత కమలం
Wed, 2015-07-22 14:00
అ...అమ్మ, ఆ...ఆవు' అని చెప్పుకునే రోజులు పోయాయి. 'అ...అవినీతి, ఆ...ఆశ్రిత పక్షపాతం' అనుకోవాల్సిన కాలం వచ్చేసింది. మాది భిన్నమైన పార్టీ. స్వచ్ఛమైన పార్టీ అంటూ జనాన్ని నమ్మించి మరీ గద్దెనెక్కిన బి.జె.పి వారూ తక్కువ తినలేదని నిరూపితమౌతోంది. మోడీ గేట్, వ్యాపమ్ స్కామ్, చిక్కీ కుంభకోణం, అగ్నిమాపకాల కొనుగోళ్ల స్కామ్ ఓ వైపు, నకిలీ సర్టిఫికెట్లు- అక్రమ చదువుల ఆరోపణలు మరోవైపు కమలనాథులకు పట్టపగలే చుక్కలు చూయిస్తున్నాయి.
ఏడాది కిందట కేంద్రంలో గద్దెనెక్కింది భారతీయ జనతా పార్టీ (బి.జె.పి). గత పార్టీలకు తమకు నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుందని ఊదరగొట్టేసింది. అసలు అవినీతికి స్పెల్లింగే తెలీదన్నట్టు అదరగొట్టేసింది. నల్లధనం...
మున్సిపల్ సమ్మె పట్ల దళిత సంఘాల వైఖరేంటి?
Wed, 2015-07-22 13:06
రాష్ట్రంలో గత 12 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించమని కోరుతూ సమ్మె చేస్తున్నారు. అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి తమ సమస్యలను నివేదించిన తరువాత, పలుమార్లు అధికారులతో చర్చలు జరిగిన తరువాత అధికారుల, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సమస్యల పరిష్కారం పట్ల సానుకూలంగా లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగాల్సి వచ్చింది. మున్సిపల్ ఉద్యోగులు సంప్రదాయకంగా దళిత కులానికి చెందినవారే. ఒకప్పుడు నూటికి నూరు శాతం దళితులే పారిశుధ్య కార్మికులుగా పనిచేసేవారు. కానీ ఇటీవల ఇతర కులాల నుంచి కొంతమంది వేరే బ్రతుకుదెరువు లేక పారిశుధ్య కార్మికులుగా వస్తున్నారు. వీరు గనుక పారిశుధ్య...
కలల రాజధాని
Wed, 2015-07-22 13:00
యావత్ ప్రపంచాన్ని ఆకర్షించేలా అమరావతి కేంద్రంగా నవ్యాంధ్ర రాజధానిని నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ సంస్థ రూపొందించిన సీడ్ కాపిటల్ నమూనాను 70 ఎంఎం టెలిస్కోప్‌లో చూపించి యావదాంధ్ర ప్రజలకు కనువిందు కలిగించారు. చంద్రబాబు నాయుడు చూపించిన రాజధాని ప్రణాళికలో కలల రాజధానిపై కలలుగనేవారికీ, కలలతో వ్యాపారం చేసుకునేవారికీ కావాల్సిన హంగూ ఆర్భాటాలన్నీ పుష్కలంగా వున్నాయి. 7, 325 చ. కమి. మీ . విస్తీర్ణంలో నిర్మించే మూడంచెల రాజధానిలో 16.9 చ.కి.మీ వైశాల్యంలో మొదట ఈ సీడ్ కేపిటల్ సిటీని ఏర్పాటు చేయనున్నారు. సోమవారం రాజమండ్రిలో సింగపూర్ మంత్రి ముఖ్యమంత్రికి అందజేసిన సిటీ నమూనా ఆంధ్రుల రాజధాని అమరావతి నగరి రూపురేఖలను కళ్లకు...
విద్యా సంస్థలపై RSS డేగ కన్ను
Wed, 2015-07-22 10:46
ఆర్‌ఎస్‌ఎస్, దాని రాజకీయ పక్షం బిజెపిని ఎవరైనా విమర్శిస్తే నేరుగా వారికి హిందూ విరోధులనే బిరుదిస్తున్నారు. కేంద్రంలోని బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని విమర్శించినా, వ్యతిరేకించినా వారిని భారత విరోధులని ముద్ర వేయటం జరుగుతున్నది. ఇది ఆర్‌ఎస్‌ఎస్, బిజెపికి చెందిన ఏ నాయకుడో వెళ్ళగక్కిన విషం కాదు. ఇది ఆర్‌ఎస్‌ఎస్ ప్రచార పత్రిక ఆర్గనైజర్‌లో అక్షరీకరించబడ్డ సూత్రం.
పూణేలో ఎఫ్‌టిఐఐ(ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్) విద్యార్థినీవిద్యార్థులు అక్కడి ఛైర్మన్‌గా గజేంద్ర చౌహాన్ని నియమించటాన్ని నిరసిస్తూ నెలా పదిహేను రోజులుగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. దాంతో ఆ పత్రిక వారిని హిందూ విరోధులంటూ ఒక వ్యాసంలో రాసింది. ఈ ఉద్యమం పట్ల సంఘ...
ఆత్మహత్యల 'భారతం'
Tue, 2015-07-21 12:46
భాతదేశాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో ఆత్మహత్యలు ప్రధానంగా ముందుకు రావడం ఆందోళన కలిగించే విషయం. పలు కారణాలతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారు సంవత్సరానికి లక్షకు మించి పోవడం కలచివేసే అంశం. కొన్నేళ్లుగా ఆత్మహత్యల పరంపర కొనసాగడంపై ఏలికలు తేలిగ్గా తీసుకోవడం దారుణం. ఏదైనా ప్రమాదంలోనో, హఠాత్తుగా సంభవించే అనారోగ్యంతోనో చనిపోతే అర్థం చేసుకోవచ్చు. కానీ జీవితంలో సమస్యలు ఎదుర్కోలేక కుంగిపోయి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం బాధాకరం కాగా, అలాంటి వారు వేలు దాటి లక్షలకు చేరడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తాజాగా 2014కు సంబంధించి విడుదల చేసిన ఆత్మహత్యల వివరాలు ప్రజలను విస్మయపరుస్తున్నాయి. నిరుడు...
ఐరోపా అసలు స్వరూపం..
Tue, 2015-07-21 12:40
గ్రీకు ప్రజలు కేవలం ఒక వారం క్రితం రిఫరెండంలో తిరస్క రించిన 'పొదుపు ప్యాకేజీ'ని ప్రధాని అలెక్సీ సిప్రాస్ అంగీకరిం చటమంటే గ్రీక్ ప్రభుత్వం లొంగిపోవ టమే. గ్రీకు ప్రజలంటే జర్మన్ ద్రవ్య పెట్టుబడికున్న చిన్నచూపుకు ఇది ఒక సూచిక. వాస్తవంలో ఐరోపాకే కాక మొత్తం ప్రపంచానికి ఇది ఒక నిర్ణయాత్మకమైన మలుపు. వామపక్షాల ముఖ్యంగా యూరోపియన్ వామపక్షాల ఆలోచనా ధోరణికి ఇది ఒక ముగింపు. గ్రీస్ ప్రధాని అలెక్సీ సిప్రాస్ షరతులను అంగీకరించటమా, లేదా అనేది అసలు విషయం కాదు. యూరోపియన్ వామపక్షాలు తమను తాము పరిమితం చేసుకున్న వ్యవహార శైలిలో సిప్రాస్‌కు అంతకుమించిన ప్రత్యామ్నాయం లేదు. దాని మాటునగల భావన లోపభూయిష్టమైనదని సిరిజా లొంగుబాటు తెలియజేస్తున్నది. ఇది సిరిజాను...
స్వచ్ఛ భారత్‌లో స్కాంల పర్వం..
Tue, 2015-07-21 12:35
ఇటీవల వెలుగులోకి వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కుంభకోణాలు బిజెపిని బెంబేలెత్తిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న భారీ వ్యాపం కుంభకోణం, లలిత్‌మోడీ కుంభకోణం, శృతి ఇరానీ లాంటి వారి విద్యార్హతలకు సంబంధించిన సమస్యలు బిజెపికి గుబులుపుట్టిస్తున్నాయి. బిజెపి నేతలు కుంభకోణాలపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. అవినీతిలేని పాలన అందిస్తామని బిజెపి నాయకులు ఊదరగొట్టారు. కుంభకోణాలు వెలుగుచూసిన నేపథ్యంలో బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. వ్యాపం స్కామ్‌లో ఆ పార్టీకి, ఆర్ఎస్ఎస్కు భాగస్వామ్యం ఉందంటూ వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు ద్వారా ప్రభుత్వోద్యోగాల రిక్రూట్మెంట్లో పెద్ద...
చట్టాలన్నీ పెళుసు...పాలకులకు పేదలంటే అలుసు
Mon, 2015-07-20 16:59
మన చట్టాలన్నీ పెళుసుబారాయి. పాలకులే వాటిని అమలు చేయని నిందితుల జాబితాలోకి చేరుతున్నారు. చట్టాలు చేసే వారే అమలుకు మీనమేషాలు లెక్కించడం విచిత్రం. అందునా పేదలకు సాయం అందించే చట్టాలంటే వారికి మరీ అలుసు! తాజాగా మున్సిపల్ కార్మికుల ఆందోళనే అందుకు ఉదాహరణ. మున్సిపల్ కార్మికుల్లో 85 శాతం మంది దళిత, గిరిజన పేదలే! వీరు పట్టణాల్లో మురికి, చెత్త, మలిన పదార్థాలను చేతులతో తీస్తూ వెట్టిచాకిరి చేస్తున్నారు. పాకీ పనితో నిజమైన 'స్వచ్ఛ భారత్'ను అమలు చేస్తున్నారు. ప్రజలంతా ప్రశాంతంగా ఉండేందుకు పనిచేసే ఆ కార్మికులు మాత్రం దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారు. వారికి ప్రభుత్వం ఇచ్చే వేతనాలు చాలక పస్తులతో కునారిల్లుతున్నారు. తమ పిల్లలను పోటీ ప్రపంచంలో పెద్ద...