ఇంత ఉదాసీినతా..?

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="" style="color: rgb(68, 68, 68); font-family: Mandali; font-size: 16px; line-height: 28.8px; text-align: justify;">పొగాకు ఉత్పత్తిలో బ్రెజిల్‌, అమెరికా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కర్నాటక, ఎపిలోనే సాగు అత్యధికం. పొగాకుపై ఏడాదికి రూ.20 వేల కోట్ల ఎక్సయిజ్‌ సుంకం, రూ.ఐదు వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం కేంద్రానికి లభిస్తోంది. ఇంత ఆదాయం సమకూర్చిపెట్టడానికి కారకులైన పొగాకు రైతులంటే సర్కారుకు చులకన. వారికి గిట్టుబాటుధర కల్పనపై ఉదాసీనత. సిగరేట్ల తయారీ దిగ్గజం ఐటిసి, ఇంకా ఆ రంగంలోని బహుళజాతి సంస్థలు ఇబ్బడిముబ్బడిగా లాభాలు గడిస్తుండగా రైతుల పరిస్థితి దీనావస్థకు చేరుతోంది. పొగాకు బోర్డును శాసించేది ట్రేడర్లు, ఎగుమతిదార్లు అయినప్పుడు రైతులకు న్యాయం జరుగుతుందా? రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న సుంకాలు, పన్నుల నుంచి లభించిన రూ.450 కోట్లతో బోర్డు స్వయంగా రంగంలోకి దిగి రైతుల నుంచి పొగాకును కొనుగోలు చేస్తే వ్యాపారులు వాళ్లంతటికి వాళ్లే దిగొస్తారు. అలాంటి చర్యలకు బోర్డు సిద్ధం కాకపోవడం దారుణం. బోర్డుతో ఆ పని చేయించాల్సింది కేంద్రం. రైతులు చనిపోతున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుంది. కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన రాష్ట్ర సర్కారు చేతులుకట్టుకొని కూర్చుంది. గతంలో సమస్యలొచ్చినప్పుడు ప్రభుత్వాలు రైతులను ఆదుకున్నాయి. రాష్ట్ర ట్రేడింగ్‌ కార్పొరేషన్‌ను రంగంలోకి దించాయి. రైతుల ఆత్మహత్యలతోనైనా కేంద్రం స్పందించాలి. కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తేవాలి. ఆలోపు జోక్యం చేసుకొని రైతులను ఆదుకునేందుకు అత్యవసర ఉపశమన చర్యలు చేపట్టాలి.