ఆర్టికల్స్

బహుళజాతి కంపెనీపై తొలి తిరుగుబాటు

ఎత్తయిన గోడలు, చుట్టూ ముళ్ల కంచెలు, ఈగ సైతం లోపలకు వెళ్లలేనంతగా భద్రత... ఇదీ... ఓలం ఆగ్రా ఇండియా లిమిటెడ్‌ (ఒఎఐఎల్‌) బహుళజాతి కంపెనీ విశాఖ జిల్లాలో ఏర్పాటైన ప్రాంతం... అధికారంలో ఉండే రాజకీయ నాయకుల అండదండలు, కార్మిక శాఖ ఉన్నతాధికారుల చల్లని చూపులు రక్షణ కవచాల్లా ఓలం కంపెనీకున్నాయి. ఈ స్థితిలో లోపల ఏం జరుగుతోందో బయటి ప్రపంచానికి తెలియని పరిస్థితి. విశాఖ జిల్లాలో శాఖోపశాఖలుగా విస్తరించిన ఓలం జీడిపిక్కల కంపెనీ అన్ని కార్మిక చట్టాలనూ తుంగలో తొక్కుతూ పబ్బం గడుపుకుంటోంది...
90 శాతం మహిళా శ్రామికులే...
దీంట్లో పనిచేసే వేలాదిమందిలో 90 శాతం మహిళలే. దీంతో మహిళల శ్రమను కారు చౌకగా దోచుకుంటున్నది. దాదాపు 12 సంవత్సరాల క్రితం...

ఫాసిస్టు దాడి..

ముంబయిలో రచయిత సుధీంద్ర కులకర్ణిపై శివసేన మూకలు చేసిన దాడి సభ్య సమాజం వేనోళ్ల ఖండించాల్సిన దుర్మార్గ చర్య. మన దేశంలో మతోన్మాద శక్తులు అధికార పీఠాన్ని అధిరోహించిన తరువాత భావ ప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడుల పరంపరలో ఇది తాజాది. పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఖుర్షీద్‌ మహ్మద్‌ కసూరి పుస్తకావిష్కరణ సందర్భంగా ఫాసిస్టు మూకలు రెచ్చిపోయి కులకర్ణిపై నల్ల పెయింట్‌తో జరిపిన దాడి మేధో జగత్తును విస్మయానికి గురిచేసింది. కేంద్ర ప్రభుత్వంలోను, మహా రాష్ట్ర ప్రభుత్వంలోను బిజెపికి భాగస్వామిగా వున్న శివసేన విద్వేషపూరిత రాజకీయాలకు పేరుమోసింది. గత వారం ముంబయిలో జరగాల్సిన పాకిస్తానీ గజల్‌ గాయకుడు గులాం అలీ సంగీత కచేరిపై దాడి చేస్తామని బెదిరించి ఆ...

హుదూద్‌ వంచన..

 ఉత్తరాంధ్ర, ప్రధానంగా విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన హుదూద్‌ విలయం సంభవించి సరిగ్గా ఏడాది. ఆ ప్రచండ తుపాను ప్రాంతాల పునర్నిర్మాణం, బాధితుల సహాయ, పునరావాసాలపై నాడు ప్రభుత్వం గుప్పించిన హామీలపై వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. కంటి తుడుపు చర్యలు, ప్రచార్భాటం తప్ప ఒక్క పటిష్ట, శాశ్వత చర్య లేదుగాక లేదు. వినాశనం నుంచి ప్రజలు స్వంతంగా శక్తినంతా కూడదీసుకొని కుదుట పడ్డారు మినహా ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనా దక్షత, కొండంత మనసు వలన హుదూద్‌ బాధితుల జీవితాల్లో కాంతులు విరజిమ్మాయంటున్న అనుకూల మీడియా కథనాలు వంచనా శిల్పాలు. తుపానుతో ఛిద్రమైన విశాఖ మురికివాడలను, మత్స్యకార...

CPMపై అక్కసుతో తప్పుడు రాతలా?

సీనియర్‌ పాత్రికేయులు, ప్రస్తుత బిజెపి అధికార ప్రతినిధి, ఎంపీ ఎంజె అక్బర్‌ ఆక్టోబరు 5న వృద్ధ నేతలు-వ్యర్థ సిద్దాంతాల పేరుతో సాక్షి దినపత్రికలో వ్యాసం రాశారు. సీనియర్‌ పాత్రికేయులుగా సమకాలీన రాజకీయాల్లో విశ్లేషణా త్మక విమర్శలు చేసి ఉంటే మంచిది. కానీ అందుకు విరుద్ధంగా తమ పార్టీ సహజ లక్షణాలు పుణికి పుచ్చుకుని కమ్యూనిజంపై ముఖ్యంగా మార్కిస్టు పార్టీపై కూడా విమర్శలకు దిగారు. ఆయన పేర్కొ న్నట్టుగా కాకుండా సిపిఎంకు వృద్ధనేతలు, వారి త్యాగాలు, ఆశయ సాధన, పోరాట పటిమే మార్గదర్శకాలు, ప్రస్తుత బిజెపికి సీనియర్‌ నేతలన్నా, వారి అభిప్రాయాలన్నా గౌరవం లేని పద్ధతుల్లో బలవంతపు రిటైర్‌మెంట్‌ ఇచ్చి రాజకీయ సమాధి చేయడం అలవాటు. దానికి ఉదాహరణ మన కళ్ల ముందు ఉన్న ఎల్‌...

మోడీ మౌనంపై కలాల తిరుగుబాటు

తమ సాహిత్య అకాడమీ అవార్డులను వెనక్కి ఇవ్వడం ద్వారా ప్రముఖ రచయితలు నయనతార సెహగల్‌, అశోక్‌ వాజ్‌పేయి ప్రధాని మోడీ విస్మరించిన రెండు విధులను, బాధ్యతలను గుర్తు చేశారు. ఈ దేశంలో ఒక పౌరునికున్న జీవించే హక్కును పరిరక్షించడం, సృజనాత్మకతకు సంబంధించి కళాకారునికి గల హక్కును పరిరక్షించడం. దేశంలో ఇంత జరుగుతున్నా తమ సహ రచయితలు, సాహిత్య సంస్థలు మౌనం పాటించడం పట్ల కూడా వారు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ప్రత్యేకించి ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని మాత్రమే సంస్కరించాలని రచయిత భావించరాదు. అవసరమైతే నాగరికతా స్ఫూర్తికి సంబంధించి హెచ్చరికల సంకేతాలు కూడా పంపించాలి. సర్వకాల సర్వావస్థలయందూ పరిరక్షకుడిగా ఉండాలి. ఇక్కడ, బిజెపి రెండు రకాల ధోరణులను...

భ్రమరావతి - ప్రైవేటు చంద్రహారతి!

రాజధాని అమరావతి నిర్మాణం శంకుస్థాపనకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా ఆర్భాటం చేస్తున్నది. నభూతో నభవిష్యతి అన్నట్టు ఈ ఉత్సవం నిర్వహించడం నవ్యాంధ్రప్రదేశ్‌ భవితవ్యానికి బంగారు బాట అని శత విధాల ప్రచారం చేస్తున్నది. అనుకూల మీడియా కూడా అదే తరహాలో ఆకాశానికెత్తి చూపిస్తున్నది. రాజధానిగా అమరావతి ఎంపికను గాని, అక్కడ నిర్మాణం ప్రారంభిం చడాన్ని గాని వ్యతిరేకిస్తున్నవారె వరూ లేరు. కాకపోతే శ్రుతిమించిన హంగామాపై వ్యా ఖ్యలు, విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా షూటింగు ప్రారంభం ఆర్భాటాన్ని బట్టి పైసలు రావు. అలాగే తమ కృషిని బ్రహ్మాండంగా చూపించుకోవాలనే తాపత్రయంలో మోయ లేని ఖర్చును మీద వేసుకోవడం అవసరమా? ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే రాజధాని నిర్మాణ...

పేదలంటే ప్రభుత్వానికి అలుసెందుకు?

 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 15 లక్షల ఎకరాలతో భూమి బ్యాంకునే ఏర్పాటు చేసి పారిశ్రామిక వృద్ధికి వినియోగించాలని చెబుతున్నది ఈ భూ సేకరణకు ప్రభుత్వం ఎసైన్డ్‌ భూములను లక్ష్యంగా పెట్టుకున్నది. దీని వల్ల రాజ్యాంగ లక్ష్యమైన పేదరిక నిర్మూలన దెబ్బతింటుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ భూమి పంపకం జరగకుండా పేదరిక నిర్మూలన జరగడం కల్ల అని చెప్పారు. మహత్తర తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం, దేశవ్యాప్తంగా వచ్చిన పోరాటాలు, అతివాద ఉద్యమాలు భూపంకం ఎజెండాను ముందుకు తెచ్చాయి. అందువల్లనే 1955 ఎఐసిసి ఆవడిలో భూ సంస్కరణలు తెస్తామని తీర్మానం చేయవలసి వచ్చినది. ఈ నేపథ్యంలో వచ్చిన అనేక చట్టాలలో భూసంస్కరణ చట్టం 1972 ముఖ్యమైనది. అప్పటి వరకు ప్రభుత్వ భూములు,...

సిలిగురి సంకేతం..

పశ్చిమ బెంగాల్‌లో ఈ నెల ఆరో తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సుశాంత రంజన్‌ ఉపాధ్యాయ చేసిన రాజీనామా ఆ రాష్ట్రంలో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ దురహంకారాన్ని కళ్లకు కట్టింది. సుశాంత్‌ రంజన్‌ రాజీనామాచేస్తూ 'ఒక రాజకీయ పార్టీకి ఇది తగని పని. రాజ్యాంగబద్ధ సంస్థ నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు ఏ ఒక్కరూ ప్రయత్నించరాదు' అంటూ మమత పార్టీపై చేసిన ప్రకటన ప్రజాస్వామ్యవాదుల్లో చర్చనీయాంశమైంది. కార్పొరేట్‌ దిగ్గజాలు, మత ఛాందసులు, మావోయిస్టుల అండదండలతో 'పరివర్తన్‌' పేరిట 2011లో కొల్‌కతా గద్దెనెక్కినప్పటి నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ అరచాక దాడులకు బెంగాల్‌ ఆలవాలమైంది. గద్దెనెక్కుతూనే తృణమూల్‌ ప్రభుత్వం వామపక్షాల, ముఖ్యంగా మార్క్సిస్టు పార్టీ కార్యకర్తలు...

అడిగితే తప్పా?

ఇంట్లో పోలీస్‌ కవాతు బయట డిజిటల్‌ డాబుసరి.. ఇదీ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో తిష్ట వేసిన తాజా దృశ్యం. విశ్వనగరంగా అమరావతిని అభివర్ణిస్తూ ప్రచారం లంకించుకున్న ముఖ్యమంత్రి, శంకుస్థాపన అదరగొడతామని హోరెత్తిస్తున్నారు. కాగా ఈ అట్టహాసాల మాటున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, జనం ఆందోళనలను తొక్కేసేందుకు అన్ని రకాల కుయుక్తులకు పాల్పడుతున్నారు. శంకుస్థాపన దగ్గర పడే కొద్దీ రాజధాని గ్రామాల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పౌరుల కదలికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించి అణచిపెట్టాలని తాపత్రయ పడటం ప్రజాస్వామ్యానికి విఘాతం. గత చంద్రబాబు జమానాలో జార్జిబుష్‌, ఉల్ఫెన్‌ సన్‌, టోనీ బ్లేయర్‌ పర్యటనల సందర్భంగా ప్రయోగించిన నిర్భందం ప్రజలింకా మర్చిపోలేదు. అమరావతి...

ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్టులు..

 జిల్లాకు ప్రాణవాయువు లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తికా కపోవడంతో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు అది ఒక వరం లాగా మారింది. ప్రతి రాజకీయ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో తమ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ప్రకటించడం ఆనవాయితీగా మారింది. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే లక్షలాది ఎకరాలు పంట భూములుగా సాగులోకి తీసుకురావచ్చునని ప్రకటిస్తున్నారు. కానీ ఇది ఆచరణలో ఎంత సాధ్యమో గత దశాబ్దాల కాలం నుంచి రాజకీయ పార్టీలు చేసిన ప్రకటనలు, వాగ్దానాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థమౌతుంది. నాటి ముఖ్యమంత్రి అంజయ్య మొదలుకుని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు మనం పరిశీలన చేస్తే వాళ్ళకు రాజకీయంగా...

అరాచకత్వానికి నిదర్శనం

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కమిషనర్‌ సుశాంత్‌ రంజన్‌ ఉపాధ్యారు రాజీనామాతో ఆ రాష్ట్రంలో అరాచకత్వం ఏ స్థాయికి చేరిందో తేటతెల్లమైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు ఆ రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించిన తీరు ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ. అధికారం అండతో గూండాలు చెలరేగి పోవడంతో హింస రాజ్యమేలింది. తెగించి పోలింగ్‌ బూత్‌లకు వచ్చిన సాధారణ ప్రజానీకంపై అమానుష దారుణకాండ చోటు చేసుకుంది. పోలింగ్‌ ప్రక్రియ ఇంతగా అపహాస్యం అయ్యింది కాబట్టే వామపక్ష సంఘటన మూడుచోట్ల రీపోల్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేయాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని పదిలంగా కాపాడాల్సిన ఎన్నికల కమిషన్‌ కీలకమైన పోలింగ్‌ తరుణంలో నిష్క్రియాపర్వంగా మారింది. నిజానికి పోలింగ్‌ ప్రక్రియకు...

దాద్రి దారుణం..

 మోడీ ప్రభుత్వ అండ చూసుకుని దేశంలో హిందూత్వ శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఢిల్లీకి యాబై కిలోమీటర్ల దూరంలోని దాద్రిలో సాగిన దారుణం కాషాయ మూకల రాక్షసత్వానికి మరో నిదర్శనం. గోవధ జరిగిందన్న తప్పుడు ప్రచారానికి హిందూ ఆలయాన్ని వేదికగా చేసుకోవడం మరీ దుర్మార్గం. గొడ్డు మాంసం తింటున్నాడన్న తప్పుడు ఆరోపణలతో యాభై ఏళ్ల మహ్మద్‌ ఇఖ్లాక్‌ అనే అమాయక ముస్లింను మతోన్మాద శక్తులు పొట్టనపెట్టుకోవడం హేయాతిహేయం. దీనికి కొద్ది రోజుల ముందు కాన్పూర్‌లో ఒక ముస్లింను పాకిస్తానీ ఉగ్రవాది అన్న ముద్ర వేసి ఇలాగే ప్రాణాలు తీశాయి. ముజఫర్‌గర్‌లో ఏ శక్తులైతే ఘర్షణలకు తెగబడ్డాయో అవే శక్తులు దాద్రి ఘటన వెనక వుండడం గమనార్హం. బిజెపి ఎమ్మెల్యే, ముజఫర్‌ నగర్‌ ఘర్షణల్లో పాత్రధారి...

Pages