ఆర్టికల్స్

ఛార్జీల బండ..

ముఖ్యమంత్రిగా కాక మాంచి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా మన్ననలందుకోవాలని తాపత్రయ పడుతున్న చంద్రబాబు ఏలుబడిలో ప్రజల పరిస్థితి చెంప దెబ్బ గోడ దెబ్బ అన్నట్లు తయారైంది. అమరావతి శిలాన్యాస్‌ సంరంభంలో ప్రత్యేక హోదాపై స్పష్టత రాక నిరాశ చెందిన ప్రజలు తమ నెత్తిన పడేందుకు వరుస కట్టిన సర్కారీ ఛార్జీల బండలపై మరింతగా కలత చెందుతున్నారు. రాజధాని శంకుస్థాపన మరుసటి రోజే ఆర్టీసి బస్‌ ఛార్జీలు బాది ప్రయాణీకుల తల బొప్పి కట్టించగా, అతి త్వరలోనే ట్రూ అప్‌ పేరుతో వినియోగదారులకు విద్యుత్‌ షాక్‌ ఇచ్చేందుకు బాబు ప్రభుత్వం సిద్ధమైంది. సర్కారు వాలకం చూస్తుంటే ఎప్పుడు ఏ రూపంలో ఏ భారం పిడుగుపాటు అవుతుందోనన్న భయాందోళనలు సర్వత్రా అలముకున్నాయి. జనాన్ని ఇబ్బంది పెట్టకూడదన్న...

ఐక్యంగా ఉద్యమిస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై 'పార్టీ రాజకీయాలు' ముదురుతున్నాయి. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి హోదా సాధనకు నిరవధిక దీక్షకు దిగడం, దానిని టిడిపి ప్రభుత్వం భగం చేయడంతో రాష్ట్రంలో 'ప్రత్యేక' రాజకీయం వేడెక్కింది. ఈ పోరులో మరో ఇద్దరు బలయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదేమోనని ఇప్పటికే కొందరు ప్రాణత్యాగం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొన్ని పార్టీలు ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతుండడంతో పరిస్థితులు దిగజారుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కొన్ని పార్టీలు ఇలా రెచ్చగొట్టే వందలాది మంది అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాయి. పౌరజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఈ ప్రమాదం ప్రత్యేక హోదా ఉద్యమంలో తలెత్తకూడదు. రాష్ట్రంలో అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడకుండా...

బిజెపికి చెంపపెట్టు..

దేశంలో అధిక ధరలు, ఉపాధి హామీకి కరువు, కనీసవేతనాలు వంటి అనేక సమస్యలతో సామాన్యుడు సతమతమవుతుంటే అవేమీ పట్టించుకోకుండా కార్పొరేట్ల సేవలో, మత చిచ్చు రేపడంలో మునిగి తేలుతున్న బిజెపికి యుపి, మహారాష్ట్ర ప్రజలు మున్పిపల్‌ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు ఒక హెచ్చరిక. యుపి స్థానిక ఎన్నికలు గ్రామీణ ప్రజల నాడిని తెలియజేస్తుండగా, మహారాష్ట్ర మున్సిపల్‌ ఫలితాలు పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ప్రజల మనోగతాన్ని స్పష్టంగా వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో బిజెపికి ఎదురైన ఘోర పరాజయం చిన్నదేమీ కాదు. అందులోనూ ఆయన దత్తత తీసుకున్న జయపూర్‌ గ్రామ పంచాయతీలో కాషాయ పార్టీ చావుదెబ్బ తింది. మరో ఏడాదిలో ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న...

ఎమర్జెన్సీ ముందు రోజులకన్నా ఘోర పరిస్థితి..

బెంగాల్‌లో ప్రస్తుతం 1970వ దశకం నాటి దారుణ పరిస్థితులు నెలకొని వున్నాయని రాష్ట్ర వామపక్ష సంఘటన చైర్మన్‌ బిమన్‌ బసు చెప్పారు. కోల్‌కతాలో ఆయనను ఇటీవల ప్రజాశక్తి విలేకరి సందీప్‌ చక్రవర్తి ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సమకాలీన జాతీయ, రాష్ట్ర పరిస్థితులపై ఆయన తన మనసులోని మాటను పంచుకున్నారు.
బెంగాల్‌లో ప్రస్తుత పరిస్థితి గురించి వివరిస్తారా?
పశ్చిమ బెంగాల్‌లో గత నాలుగున్నరే ళ్ళుగా తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలో ఉంది. 'ప్రతీకారం లేదు, మార్పే ఉంటుంది' అన్న నినాదంతో ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసిన తృణమూల్‌ ఆ తర్వాత ఆ మాటే మర్చి పోయి వ్యవహరించసాగింది. సిపిఎం, వామపక్షవాదులపై...

పెరిగిపోతున్న అరాచక ధోరణులు..

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశమంతటా కొన్ని శక్తులు ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకుని అరాచక చర్యలకు పూనుకుంటు న్నాయి. బిజెపికి చెందిన దళాలు, పరిషత్తులు, వాహినులు వీటిలో ముందెత్తున పాల్గొంటున్నాయి. కేంద్ర బిజెపి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా ఈ శక్తులకు మద్దతిస్తున్నారు. శివసేన కూడా బిజెపి కంటే తానే ఒక ఆకు ఎక్కువ చదివాననే చందం గా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నది. మైనారిటీలు, దళితులు, అభ్యుదయవాదులు, చింతనాపరులు, కవులు ఈ శక్తుల చేతుల్లో చంపబడుతున్నారు. అవమానాల పాలవుతు న్నారు. మైనార్టీల ప్రార్థనాలయాలు ధ్వంసమ వుతున్నాయి. తమకు ఇష్టం లేనిది ఏదీ జరగకూడదని ఈ శక్తులు భావిస్తున్నాయి. ఏమి తిన కూడదో, ఏమి రాయకూడదో, ఏమి...

ప్రజాసమస్యలు గాలికి - ప్రశ్నిస్తే నిర్బంధం

 రాష్ట్రంలో 16 మాసాల క్రితం ఏర్ప డిన తెలుగుదేశం ప్రభుత్వం హామీ లను ఉల్లంఘించింది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి భారా లను మాత్రం పెంచింది. ప్రైవేటీక రణకు పెద్దపీట వేస్తున్నది. కనీసపు ప్రజా స్వామిక హక్కులను కూడా అనుమతించ కుండా తీవ్ర నిర్బంధం ప్రయోగిస్తున్నది.
వైద్యం
ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రధాన ఆస్పత్రులను ప్రయివేటు వారికి ధారాదత్తం చేస్తున్నది. ప్రయివేటు వైద్య కళాశాలలు స్థాపించాలను కునే వారికి క్లినికల్‌ అటాచ్‌మెంట్‌గా ప్రభు త్వాస్పత్రులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణ యించింది. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి అవసరమైన నిధులు...

ప్రపంచీకరణ రెండవ అవతారం..

క్రెడిట్‌ న్యూస్‌ ఇంటర్నేషనల్‌ రీసెర్చి (సిఎన్‌ఐఆర్‌) తన తాజా నివేదికలో 'ప్రపంచీకరణ' భవిష్య త్తుపై అనేక ఆలోచనలు మన ముందుంచింది. ప్రపంచీకరణను సిఎన్‌ఐఆర్‌ రెండు ప్రధాన స్రవంతులుగా అభి వర్ణించింది. ఒకటి, ఐరోపా దేశాల్లో, అమెరికాలో ప్రధానంగా 1870లో ప్రథమ ప్రపంచీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంలో రైలు, రోడ్డు, నౌకాశ్రయాలు నిర్మితమయ్యాయి. సూయజ్‌ కెనాల్‌ నిర్మాణం జరిగింది. ప్రపంచ వాణిజ్యానికి తోడ్పడి పారిశ్రామిక విప్లవ ప్రతిఫలంగా అమెరికా బలపడింది. కార్పొరేట్‌ సంస్థలకు తోడ్పడే బ్యాకింగ్‌ వ్యవస్థ పటిష్టతకు నాందీ పలికింది. మొదటి ప్రపంచయుద్ధ ప్రారంభంతో 1914తో ప్రథమ ప్రపంచీకరణ శకం ముగిసింది. రెండది, ప్రపంచీకరణ మరలా రెండవసారి 1990లో పరోక్ష యుద్ధం ముగిసి...

ప్రశ్నలూ ప్రతిఘటనల ప్రకంపనాలు..

ఇటీవలి కాలంలో కేంద్రంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వెంటవెంట జరుగుతున్న పరిణామాలు చూసే వారికి ప్రజాస్వామిక భావజాలం, ప్రజా ఉద్యమాల వారసత్వబలం తెలిసి వస్తున్నాయి. ఏడాది కూడా తిరక్కుండానే మూడు ప్రభుత్వాల పాలకులు తమను తాము సమర్థించుకోలేని స్థితిలో పడిపోతున్నారు. తమ ఆధిక్యత శాశ్వతమైనట్టు విర్రవీగినవారు అంతకంటే వేగంగా ఆత్మరక్షణ మార్గాలు అన్వేషిస్తున్నారు. రహస్య ఎజెండాలు లోపల పెట్టుకుని రాజకీయ బీరాలు పలికిన వారు రాజీ రాగాలాల పిస్తున్నారు. ఈ రాజీల వెనక రహస్యాలేమనే సందేహాలు, సవాళ్లు మీడియాలోనూ, సమాజంలోనూ వ్యక్తమవుతుంటే సర్దుకోలేక సతమతమవుతున్నారు. ఏతావాతా ఇదంతా వారి స్వయం కృతమైతే ప్రజా స్పందన తత్ఫలితం.
దిగజారిన ప్రచారం
...

వలసలు..

వలసలు లేకపోతే మానవాళి నేడున్న విధంగా భూగోళం అంతా విస్తరించి ఉండేది కాదు. ఆదిమ మానవుల కాలంలో ఒక గుంపు పరిమాణం చాలా పెద్దదిగా మారినప్పుడు ఆ గుంపులోని ఒక భాగం వేరే ప్రాంతానికి వలసవెళ్లేవారు. అందువల్ల మానవ నాగరికతా వికాసానికి కూడా ఈ వలసలు కారణమని చెప్పవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, నదులు, సముద్రాలు, అడవులు దాటి కూడా వెళ్ళడానికి ఈ వలసలు దారితీశాయి. బహుశా దీని నుంచే కొన్ని ఊళ్ళ పేర్లకు చివర వలస, ఊరు అనే పదం వచ్చి ఉంటుంది. తగరపు వలస, ఆమదాల వలస, కొత్తూరు, పాతూరు వంటివి పేర్లు అలాగే వచ్చి ఉండవచ్చు. మొట్టమొదట ఈ వలసలు ఆఫ్రికాలో సాగినట్లు చరిత్ర చెబుతోంది. తెల్లవారి జనాభా బాగా పెరిగిపోవడంతో అనేక ప్రాంతాలకు వలసలు వెళ్ళి అక్కడి మూలవాసులను...

రైతులకు బెదిరింపులు..

రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతులపై రాష్ట్ర మంత్రులు బెదిరింపులకు దిగుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలనే వ్యూహానికి సర్కారు దిగడం దారుణం. ఒకరి తరువాత ఒకరిగా మంత్రులు రైతులు భూములు ఇచ్చేయాల్సిందేనంటూ బెదిరింపుల పర్వాన్ని ప్రారంభించడం, డెడ్‌లైన్‌ చెప్పి మరీ హెచ్చరించడం దుర్మార్గం. తాము చెప్పిన తేదీ లోగా ఇవ్వకుంటే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించైనా గుంజుకుంటామని హెచ్చరించడం రైతులను గందరగోళ పరిచి, తీవ్ర ఒత్తిడికి గురి చేసే ఎత్తుగడే! మంత్రులు చేసే హెచ్చరికలు చాలవన్నట్టు భూములివ్వని రైతులను స్థానికంగా ఎక్కడికక్కడ టార్గెట్‌ చేసి వేధింపులకు గురి చేయడం, పచ్చటి పంటలకు నిప్పు పెట్టడం, తప్పుడు...

పచ్చి దగా..

వందల కోట్లు ఖర్చు చేసి త్రీ-డి ఎఫెక్టుతో దసరా రోజు నిర్వహించిన అమరావతి శంకుస్థాపన ముఖ్యమంత్రి చంద్రబాబుకు బెస్ట్‌ ఈవెంట్‌ మేనేజర్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది మినహా రాష్ట్ర ప్రజలకు ఎలాం టి ప్రయోజనం చేకూర్చలేదు. పదహారు మాసాలుగా విభజన హామీల అమలు కోసం కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్న జనం కనీసం శంకుస్థాపన నాడైనా తమకు భరోసా లభిస్తుందని ఆశించగా ఫలితం శూన్యం. శంకుస్థాపన వేదికపై ప్రధాని ప్రత్యేక హోదా ప్రకటిస్తారని, తీపి కబురు చెబుతారని బిజెపి, టిడిపి నాయకులు ఊరించగా మోడీ తుస్సు మనిపించారు. హోదా సంజీవని కాదని బుకాయిస్తూ వచ్చిన చంద్రబాబు, ప్రధాని అమరావతికొచ్చి బీహార్‌ కంటే అధిక ప్యాకేజీ ముట్టచెబుతారని నర్మగర్భంగా ప్రచారం చేశారు. తీరా...

ధరాఘాతం..

 నిత్యావసర వస్తువుల ధరలు ప్రజానీకానికి శరాఘాతంలా తాకుతున్నా ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దారుణం. నిన్నటి దాకా ఉల్లి పెట్టించిన కన్నీటితో కుదేలయిన ప్రజలను ఇప్పుడు కందిపప్పు కుదేలెత్తిస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కందిపప్పు ధర డబుల్‌ సెంచరీని దాటి ఆ పైనా దౌడు తీస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం క్షమార్హం కాదు. దసరా పండుగ ఉత్సాహంపౖౖె ఈ ధరాఘాతం నీళ్లు చల్లింది. పప్పు వండు కోవాలన్నా తటపటాయించే స్థితికి సాధారణ ప్రజానీకం చేరుకున్న తరువాత ఇంకెక్కడి పండగ! ఉల్లి ఏడిపించడానికి కొద్దిరోజుల ముందు చికెన్‌ ఇలాగే కొండెక్కి కూర్చుంది. అప్పట్లో చికెన్‌ వండిన రోజే పండగ. ఆ...

Pages