ఆర్టికల్స్

ఆంధ్రప్రదేశ్‌ - అద్దె సచివాలయం

ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర తాత్కా లిక సచివాలయాన్ని మంగళగిరిలోని అమరావతి టౌన్‌షిప్‌లో 20 ఎకరా లలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.180 కోట్లు ఖర్చవుతుందని, ఈ మొత్తంలో రూ.90 కోట్లు వడ్డీలేని రుణం ఇస్తారని, మరో రూ.90 కోట్లు రుణాలు తీసుకొని సిఆర్‌డిఎ నిర్మాణాలను పూర్తి చేస్తుందని, నిర్మాణం పూర్తయి, వివిధ ప్రభుత్వ శాఖలు ఆ భవనాలలోకి వచ్చిన తర్వాత, ఆయా ప్రభుత్వ శాఖలు వినియోగించుకున్న విస్తీర్ణాన్ని బట్టి సిఆర్‌డిఎకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని ప్రకటించారు. ప్రభుత్వ స్థలంలో, ప్రభుత్వ సంస్థ నిర్మిస్తున్న సచివాలయానికి ప్రభుత్వ శాఖలు అద్దె చెల్లించాలని ప్రకటిం చటం ఆశ్చర్యం కలిగించే అంశం. తాను కట్టుకున్న భవనానికి తాను అద్దె...

సిపిఎం ప్లీనం-బడా మీడియా పాక్షిక రూపం

భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) నిర్మాణంపై ప్రత్యేక ప్లీనం సమావేశం జయప్రదంగా ముగిసింది. ప్రతినిధుల నుంచి వచ్చిన కొన్ని సవరణలతో నిర్మాణంపై తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అన్ని రాజకీయ పక్షాలూ అంతర్గత కలహాలతో అతలాకుతలమవుతున్న స్థితిలో-కమ్యూనిస్టు ఉద్యమం కూడా సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న స్థితిలో-సిపిఎం బలం లోక్‌సభలో ఎన్నడూ లేనంత తక్కువకు పడిపోయిన దశలో- ఈ అఖిల భారత సమావేశం ఇంత ఏకోన్ముఖంగా జరగడం ఒక విశేషం. అసలు సిద్ధాంతాలు విలువల వంటివి పూర్తిగా గాలికి వదిలివేసిన పాలక పక్షాలు అధికారమే ఏకైక సూత్రంగా కార్పొరేట్లకు సేవ చేస్తున్న స్థితిలో, సామ్రాజ్యవాదుల ముందు సాగిలపడుతున్న స్థితిలో అందుకు భిన్నమైన విధానాలను ప్రతిపాదించడం ఒక...

ఫ్రీ బేసిక్స్‌తో డిజిటల్‌ బానిసత్వం

ఫ్రీ బేసిక్స్‌ వినియోగదారులను కొన్ని వెబ్‌సైట్లకు మాత్రమే పరిమితం చేస్తుంది.    వినియోగదారులు ప్రత్యక్షంగా లాభపడేలా ఇంటర్నెట్‌ ప్యాకేజీలను అందించటం మంచి పథకం. బీహార్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లా, రత్నౌలీ గ్రామానికి చెందిన సంజరు సాహ్ని పాఠశాల విద్యను మధ్యలోనే ఆపేసి ఢిల్లీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను తన గ్రామానికి ఎప్పుడు వచ్చినా తమకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని చేయటానికి జాబ్‌ కార్డులు అందలేదనో, చేసిన పనికి వేతనాలు అందలేదనో గ్రామస్తుల నుంచి ఫిర్యాదులు వింటుండేవాడు. ఒకరోజు ఆయన ఢిల్లీలో కంప్యూటరు ముందు కూర్చొని ''యన్‌రీగా బీహార్‌'' అని టైప్‌ చేశారు. ఆయనకు వచ్చిన సమాచారంలో తన గ్రామానికి చెందిన వారి జాబ్‌కార్డుల్లో...

పార్టీ బలోపేతమే లక్ష్యంగా సిపిఎం ప్లీనం..

 పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తేగాని పార్టీ అఖిల భారత మహాసభల్లో తీసుకున్న నిర్ణయాలను సాధించలేము. ఆ నిర్ణయాల్లో మొదటిది, పార్టీ స్వతంత్ర బలాన్ని పెంచుకోవడం. దానికి ఆధారంగా వామపక్ష ఐక్యతను పెంపొందించాలి. అలాగే ఇది సాధించేందుకు వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టి జాతీయ స్థాయిలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డి ఎఫ్‌)ను ఏర్పాటు చేయాలి. ఈ లక్ష్యాలను సాధించేందుకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరచుకోవాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొన్ని పద్ధతులను మార్చుకొని, నయా ఉదారవాద విధానాల వల్ల తలెత్తిన పరిస్థితుల వల్ల ఏ వర్గాల ఐక్యత బలపరచాలనేది కోరుతున్నామో వాటిని నిర్దిష్టంగా విశ్లేషించి, నిర్దిష్ట నిర్ణయాలు, అవసరమైన మార్పుల ద్వారా సిపిఎం...

సమైక్యతా సాధనంగా విద్య..

స్వతంత్ర భారత దేశ తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ పుట్టిన రోజు నవంబర్‌ 11న జాతీయ విద్యా దినోత్సవంగా పాటించబడుతోంది. 1947 ఆగస్టు 15 నుంచి తాను మరణించిన 1958 ఫిబ్రవరి 22 వరకు పదిన్నర సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన మౌలానా ఆజాద్‌ దేశ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే సమగ్ర విద్యా విధాన రూపకల్పనకు పునాదులు వేశారు. రాజ్యాంగ విలువలతో కూడిన లౌకిక విద్యను అన్ని స్థాయిల్లోనూ అందరికీ సమానంగా అందించేందుకు బహుముఖ పథకాలు, ప్రణాళికలు రచించారు. కామన్‌ స్కూల్‌ సిస్టం, 10+2+3గా విద్యా విధాన చట్రాన్ని నిర్ధారించారు. బ్రిటీష్‌ పాలనలోని పరిమితులను అధిగమించి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సత్వర ప్రగతిని సాధించేందుకు వివిధ స్థాయిల్లో విద్యారంగం...

జాబు కోసం బాబుతో పోరాటమే మార్గం..

వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనేది పాత సామెత.. వెయ్యి అబద్ధాలాడైనా అధికారంలోకి రావాలనేది కొత్త సామెత.. దీనికి నిదర్శనంగా చంద్రబాబు ప్రభుత్వం నిలుస్తోంది. ఎన్నికలకు ముందు టిడిపి మేనిఫెస్టోలలో ఇష్టమొచ్చినట్లు ప్రజలకు, యువతకు హామీలిచ్చేసి... నన్ను నమ్మండి...! నేను మారాను...!! అని అధికారంలోకొచ్చారు బాబు. దేశాభివృద్ధికి వెన్నెముకగా ఉన్న యువత భవిష్యత్‌ గురించి అస్సలు ఆలోచించడం లేదు. ''జాబు రావాలంటే - బాబు రావాలనే'' నినాదాన్ని తన పేటేంటుగా ప్రచారం చేసుకున్నారు. నిరుద్యోగులిప్పుడు జాబు అడుగుతుంటే... గుంటూరు జిల్లా సభలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీ కార్యకర్తలతో.... నెత్తురొచ్చేటట్లు నిరుద్యోగులను కొట్టించారు. ఇదీ మన బాబు...

అంగన్‌వాడీలకు వెన్నుపోటు..

అంగన్‌వాడీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమానవీయంగా ప్రవర్తిస్తూ వారి ఉసురు పోసుకుంటున్నాయి. మాతా శిశు సంక్షేమంలో, శిశు, బాలింత మరణాల నివారణలో ప్రపంచంలోనే అథమస్థాయిలో ఉండి కూడా వారికి కాస్తంత ఊరట కల్పిస్తున్న ఐసిడిఎస్‌ నిర్వీర్యానికి కేంద్రంలో బిజెపి సర్కారు కుయుక్తులు పన్నుతుండగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం అదే బాటలో నడుస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణే కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను ఒంటి చేత్తో ఈదుతున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు జీతాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం హామీ ఇచ్చి తప్పించుకు తిరుగుతోంది. అంగన్‌వాడీల దశలవారీ పోరాటాలతో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన బాసను తప్పేందుకు కనిపించిన...

సింగపూర్‌ చంద్రబంధంలో అమరావతి

 ఆలూలేదు, చూలూ లేదు అమరావతి అంతర్జాతీయ నగరం అని ఆర్భాటం చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం-ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో కల్పించిన భ్రమలూ, చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. 'సింగపూర్‌ కంపెనీల గొంతెమ్మ కోర్కెలు' శీర్షికతో ఈనాడు పత్రిక డిసె ంబర్‌ 11న ఇచ్చిన వార్త దీనికొనసాగింపే. ఆ వెంటనే సదరు వార్తను సమతుల్యం చేసేందుకన్నట్టు ఆంధ్రజ్యోతి మరో వార్తా కథనం ప్రచురించింది. వాస్తవంగా అమరావతి నిర్మా ణ ప్రణాళిక ఖరారు దగ్గరకు వచ్చేసరికి సింగపూర్‌ కంపెనీల ప్రవర్తన ఎలా ఉన్నదో మొదటి కథనం వివరిస్తే- అలాటి మార్పులేమీ లేనట్టు, అంతా సుభిక్షంగా జరిగిపో తున్నట్టు చిత్రించేందుకు రెండవ కథనం ప్రయత్నించింది. మరేదైనా పత్రికలో వచ్చి ఉంటే ఈ కథనాలకు...

అప్రజాస్వామిక కమిటీలు..

 జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలన నిర్వహిస్తున్న తీరు అప్రజాస్వామికం, దుర్మార్గం. ఏ మాత్రం చట్టబద్ధత కానీ, రాజ్యాంగబద్ధత కానీ లేని ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో సర్వం తామే అయి వ్యవహరిస్తున్న విధానం విస్మయాన్ని కలిగిస్తోంది. రేషన్‌ కార్డులు, ఫించన్ల నుండి వరద సాయం వరకు క్షేత్రస్థాయిలో అన్ని అంశాల్లో జన్మభూమి కమిటీలదే పెత్తనం కావడంతో స్థానిక సంస్థలు నామమాత్రంగా మారుతున్నాయి. జన్మభూమి కమిటీల నీడలో ఉనికి కోల్పోతున్న స్థానిక సంస్థల ప్రతినిధులు తమ హక్కుల కోసం ఎలుగెత్తాల్సిన స్థితి వచ్చినా రాష్ట్ర సర్కారులో చలనం లేకపోవడం చూస్తుంటే అస్మదీయులకు లబ్ధి చేకూర్చే రంది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతగా పట్టుకుందో అర్థమవుతోంది. స్థానిక...

రైతు ఉద్ధరణ ఇలాగా?

నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లు తయారైంది పత్తి రైతుకు ప్రభుత్వం కల్పిస్తామన్న మద్దతు ధర. ఇంకేముంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేశాం పంట తేవడమే ఆలస్యం అని సర్కారీ పెద్దలు ఆశ పెట్టడంతో నిజమేననుకొని పత్తిని మార్కెట్‌ యార్డులకు తీసుకెళ్లిన రైతులు కొనుగోలు జాడ లేక తెల్లబోతున్నారు. తిరిగి పంటను ఇంటికి తీసుకెళ్లే స్తోమత లేక దళారులకు అయిన కాడికి తెగనమ్ముకొని నిలువు దోపిడీకి గురవుతున్నారు. రైతులను రక్షించాల్సిన ప్రభుత్వమే వంచిస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలీక గుండెలు అవిసేలా బోరుమంటున్నారు. రైతులంటే పాలకులకు ఎందుకంత అలుసో అర్థం కాదు. ఊరికి ముందే ఈ నెల 3న ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి పత్తి కొనుగోళ్లపై కొండంత రాగం తీయగా పక్షం రోజులు దాటాక అది...

అన్ని విధాలా ఆదుకోవాలి..

గోరుచుట్టుపై రోకటి పోటులా నిన్నటివరకు అనావృష్టితో బాధపడిన రాష్ట్ర్ర ప్రజలకు నేడు అతివృష్టి దెబ్బతీసింది. అల్పపీడనం ప్రభావం వల్ల గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా మన రాష్ట్రంలో నెల్లూరు, కడప, చిత్తూరు జిల్లాలకు ఈ వర్షాలు ఆపార నష్టాన్ని కలిగించాయి. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ఊరు యేరూ ఏకమయ్యాయి. స్వర్ణముఖి, కాళంగి, కైవల్య, పంబలేరు కట్టలు తెంచుకు ప్రవహించడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వందలాది గ్రామాలు జలదిగ్బంధనంలో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. చెరువులకు గండ్లు, రోడ్లు, రైలు మార్గాలు కోతకు గురికావడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వర్ష బీభత్సాలకి ఇంతవరకు 13...

సామ్రాజ్యవాదపు వికృత శిశువు ఉగ్రవాదం..

ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌)..ఆ మధ్య జర్నలిస్టులకు నారింజ రంగు చొక్కాలు తొడిగి..ఏడారిలో కత్తులు ఝుళిపిస్తూ అతి క్రూరంగా గొంతుకలు తెగ్గోసి..ఆ దృశ్యాలను సోషల్‌ మీడియాలో ఉంచి సంచలనం సృష్టించిన సాయుధ సంస్థ. 'మీ మిస్సైళ్లు మా మీద పడుతున్నంత కాలం..మా కత్తులు ఇలా గొంతులు కోస్తూనే ఉంటాయి' అని అమెరికా అధ్యక్షునికి హెచ్చరికలు పంపిన సంస్థ. ఇరాక్‌, సిరియాల తర్వాత జోర్డాన్‌, లెబనాన్‌లకు విస్తరించి, పాలస్థీనాను విముక్తం చేసి.. విస్త త ఖలీఫా రాజ్యం తెస్తామని, తర్వాత క్రమేపీ ప్రపంచమంతా ఖలీఫా రాజ్యం తేవాలన్నదే తమ ప్రధాన ఎజెండా అని ప్రకటించింది. అదే ఇప్పుడు పారిస్‌లో వరుసదాడులకు పాల్పడి ప్రపంచం ముంగిట పెను సవాలుగా నిలిచింది. కొన్నేళ్లుగా అంతర్జాతీయ...

Pages