ఇదేనా బాబుగారి సమర్థత...

 ఎన్నికల ముందు చంద్రబాబు సమర్థుడని, అనుభవ జ్ఞుడని, తెలివైన వాడని తెలుగు దేశం పార్టీ, దాని మీడియా ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించింది. ఆయన అధికారంలోకొచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ కాలంలో ఆయన సమర్థత, అనుభవం దేనికి ఉపయోగించారు? ఎవరికి మేలు జరి గింది? ఎవరికి కీడు జరిగింది? ఆలోచించాల్సిన సమయం వచ్చింది. లేకుంటే ఆయన సమర్థతకు ప్రజలు మరింత మూల్యం చెల్లించుకో వాల్సిన పరిస్థితి రాబోతోంది.
ఆరు నెలల్లో సమర్థతతో పూర్తి చేశామన్న పట్టి సీమకు రెండు సార్లు ప్రారంభోత్సవాలు చేసి ఆగష్టు 15 నాటికని, సెప్టెంబరులో నీళ్ళని, అక్టోబరులో ఒక మోటారు బిగించి మధ్యలోనే కల్వర్టులు కూలిపోయి వంతెన లు పూర్తికాక పట్టిసీ మను ఒట్టిసీ మగా మార్చడం సమర్ధతా లేక రూ.1,300 కోట్ల ను జేబులో వేసుకొనే ప్రయత్నంలోనా అనుభవం? పట్టిసీమ పోలవరంలో భాగమని, కేంద్రం నుంచి వచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా ఉండడంలోనా అనుభవం? రాష్ట్రం విడగొడతానని మొదట కేంద్రం నుంచి ప్రకటన వచ్చినప్పుడు ఆయన మొదటి ప్రెస్‌మీట్‌ చరిత్రలో లిఖించబడి ఉంది. రాష్ట్ర రాజధానికి నాలుగు నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, అది కేంద్రం ఇవ్వాలని కోరలేదా? ఈ సంవత్సరంన్నర కాలంలో ఎన్ని వేల కోట్లు రాజధానికి తెచ్చారో ధైర్యంగా చెప్పగలరా! ఇదేనా సమర్ధత? రాజకీయాలంటే ప్రజలకు సేవచేయటం, పేదలకు మేలుచే యటం అనే భావాన్ని మరుగున పరచి, రాజకీయాలంటే వ్యాపారం, లాభాలు సంపాదించటంగా దిగజార్చటంలోనా బాబుగారి అనుభవం? హైదరాబాదు రాష్ట్రానికి గుండెకాయని, అదిలేకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగతేనని చెప్పి, అభివృద్ధి కేంద్రీకరణ నష్టమని చెప్పి వికేంద్రీకరిస్తానని మాటలు చెప్పి చేతలలో మరోసారి రాజధాని చుట్టూ అభివృద్ధిని కేంద్రీకరించే పని చేయడం అనుభవమా, మోసపూరితమా? బాబు వస్తే జాబు వస్తుందని గోడరాతలు చెరగక ముందే ఉన్న జాబులు పీకేయడమా అనుభవం, సమర్థత అంటే.
రాజధాని నిర్మాణానికి ప్రతి ఇంటి నుంచీ ఇటుక తెమ్మని, ఆర్థిక సహాయం చేయమని, సామాన్యుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి ప్రజాధనాన్ని నీళ్ళ ప్రాయంగా షోకులకు ఖర్చుచేయడంలోనా అనుభవం, సమర్థతా? ప్రతి సంవత్సరం డిఎస్‌సి అని నిరుద్యోగ టీచర్లకు చెప్పి నేటికీ ఒక్క టీచర్‌ పోస్టు కూడా భర్తీ చేయకుండా, రేషనలైజేషన్‌ పేరుతో ఎనిమిది వేల మిగులు ఉపాధ్యాయులను తేల్చి వారిని వేరే శాఖలకు మార్చాలని ప్రయత్నించడంలోనా అనుభవం? ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేటు విద్యా మాఫియాను ప్రోత్సహించడంలోనా సమర్థత? ప్రభుత్వ వైద్యాన్ని పడకెక్కించి పిల్లలను ఎలుకలు తిని చంపడంలోనా సమర్థత? కార్మికులకు అండగా ఉన్న కొద్దిపాటి చట్టాలను మార్చి వాటిని యజమానులకు అనుకూ లంగా మార్చటం, బెల్టుషాపులు రద్దు చేస్తానని చెప్పి వాటిని పదిలంగా కాపాడటం సమర్థతా? కార్పొరేట్‌ కాలేజీలలో పిల్లల ఆత్మహత్యలు పెంచడంలోనా సమర్ధత? రైతుల ఆత్మహత్యలు నిలువరించడంలో బాబు గారి సమర్థత ఏమయింది? నిత్యావ సర వస్తువులు ఉల్లి, కందిపప్పు, మినప్పప్పు, లాంటి వాటి ధరలు ఆకాశమే హద్దుగా పెరుగుతుంటే బాబు గారి సమర్థత, అనుభవం వాటిని అడ్డుకట్ట ఎందుకు వేయలేకపోతోంది? భూ బ్యాంకు పేరుతో 15 లక్షల ఎకరాలు ఎవరి నుంచి సేకరించి ఎవరికిచ్చి అభివృద్ధి చేస్తారు? కాకులను కొట్టి గద్దలను మేపి ఇదే అభివృద్ది అని నమ్మించడం సమర్థతా! మోసపూరితమా? ఇసుక మాఫియాను అరికడతానని మాటలు చెబుతూ పెంచి పోషించడం, ఇసుక మాఫియాను పట్టుకున్న ఎంఆర్‌ఒ నోరు నొక్కేయడం సమర్ధతా? ప్రభుత్వాన్నే ఒక వ్యాపార సంస్థగా మార్చి దానికి ఒక మేనేజర్‌ పాత్ర పోషిస్తున్నారు. అదే అనుభవం అయితే ఆయన రాజకీయాలు వదిలేసి వ్యాపారాలు చేసుకోవడం ఉత్తమం కదా!
దళితులు, మహిళలపై దాడులూ, అత్యాచారాలు పెరుగుతుంటే అరికట్టలేక పోవడం సమర్థతకు గీటురాయా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దరిద్రంగా ఉంటే రూ.400 కోట్లు ఖర్చుపెట్టి ఆడంబరాలతో రాజధాని ప్రారంభోత్సవం జరపడం డాబుసరి కాదా! ఇంతకు మునుపు వ్యవసాయంలో కౌలు, పేద రైతులే ఆత్మహత్యలు చేసుకునేవారు. బాబుగారి హయాంలో మధ్య తరగతి, ధనిక రైతులు (పొగాకు, ఫామాయిల్‌) కూడా ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి రావడం సోచనీ యం. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించలేకపోవ డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ సాధించలేకపో వడాన్ని ఏమనాలి. 24 గంటలు కరెం టని, కరెంటు కోతలు పెట్టడం, రైతులకు 7 గంటల ఉచిత కరెంటులో చుక్కలు చూపించడం సమర్థతా? కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ను రెగ్యులరైజ్‌ చేస్తానని కమిటీల పేరుతో కాలయాపన చేయడం ఏమిటి. ఆఖరుకు ఎన్‌టిఆర్‌ సుజల స్రవంతి ద్వారా రూ.2కే నీళ్ళని, ఎన్‌టిఆర్‌ క్యాంటిన్‌లని చెప్పారు. అవి ఎక్కడున్నాయో బాబుగారికే తెలియాలి. ఆయన ఎక్కడ సభలు పెట్టినా పోలీసు సైన్యంతో ఎర్రజెండాల వారినీ, ప్రతి పక్షాలను, ప్రజలను, అరెస్టులు చేయించడం సర్వసాధారణమైంది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే బాబుగారి సమర్థత, అనుభవం చాంతాడంత ఉంటుంది. సమస్యేమంటే కత్తి పదునైందే, దాన్ని దేనికోసం ఉపయోగిస్తున్నామనేదే ముఖ్యం. బాబు గారి సమర్థత, అనుభవం పేదలు, రైతులు, కార్మికులు పొట్టలు కొట్టి పెద్దల బొజ్జలు నింపేది. దీన్ని ప్రశ్నించకుండా రాష్ట్రం అభివృద్ధి అని చెబితే అది ప్రజలను మోసగించడమే. ప్రజలు మేల్కోని బాబుగారి సమర్థతకూ, అనుభవానికీ మోసపోకుండా ప్రశ్నించి పోరాడితేనే వారి బతుకులు నిలుస్తాయని గుర్తించాలి.
(వ్యాసకర్త సిపియం పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు డివిజన్‌ కార్యదర్శి)
న్నికల ముందు చంద్రబాబు సమర్థుడని, అనుభవ జ్ఞుడని, తెలివైన వాడని తెలుగు దేశం పార్టీ, దాని మీడియా ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించింది. ఆయన అధికారంలోకొచ్చి సంవత్సరంన్నర అయింది. ఈ కాలంలో ఆయన సమర్థత, అనుభవం దేనికి ఉపయోగించారు? ఎవరికి మేలు జరి గింది? ఎవరికి కీడు జరిగింది? ఆలోచించాల్సిన సమయం వచ్చింది. లేకుంటే ఆయన సమర్థతకు ప్రజలు మరింత మూల్యం చెల్లించుకో వాల్సిన పరిస్థితి రాబోతోంది.

- ఆర్‌ లింగరాజు