వడ్డీ రేట్ల తగ్గింపు ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందా?

 ఎంతో కాలం నుంచి పెట్టు బడిదారులు, ఉన్నత, మధ్య తరగతి ప్రజలు ఎదురు చూస్తు న విధంగా రిజర్వు బ్యాంక్‌ (ఆర్‌బిఐ) ఛైర్మన్‌ రఘురామ్‌ రాజన్‌ వడ్డీ రేట్లను తగ్గించారు. సెప్టెంబరు 29న జరిగిన రిజర్వు బ్యాంకు ద్వైమాసిక సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకున్నారు. వడ్డీ రేట్లు తగ్గిస్తారని ఊహించిన వారు కూడా ఒక్కసా రిగా 0.5 శాతం తగ్గించటంతో ఆశ్చర్యపోయా రు. సమీక్ష సందర్భంగా 0.25 శాతం తగ్గించవచ్చునని ఎక్కువమంది ఊహిం చారు. వారి ఊహలకు భిన్నంగా 0.5 శాతం తగ్గించి రాజన్‌ అందరినీ ఆశ్చర్యపరి చారు. ఇంతకు ముందు బ్యాంకులకు రిజర్వు బ్యాంకు ఇచ్చే అప్పుకు వడ్డీ (రెపో రేటు) 7.25 శాతంగా ఉంది. ఇప్పుడు 0.5 శాతం తగ్గించటంతో రెపో రేటు 6.75 శాతానికి తగ్గింది. రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించకుండా ఉంచటంతో వృద్ధిరేటు పెరగటం లేదని, వడ్డీ రేట్లు తగ్గిస్తే ఆర్థికాభివృద్ధికి ఊపు వస్తుందని భావించేవారు గణనీ యంగా ఉన్నారు. గతంలో 7.6 శాతంగా నిర్ణయించిన జిడిపి పెరుగుదల రేటును కూడా 7.4 శాతానికి రిజర్వు బ్యాంకు తగ్గించింది. తద్వారా వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల మాత్రమే జడిపి పెరగదని పరోక్షంగా తెలిపారు.
ఎగుమతుల రంగంలో కూడా మాంద్యం నెలకొందని ఎగుమతి-దిగుమతుల వివరాలు తెలుపుతున్నాయి. ఆగస్టు నెల సంబంధించి ఐదు ప్రధాన రంగాలలో ఎగుమతులు బాగా క్షీణించాయి. ఇంజనీరింగ్‌, పెట్రోలియం, టెక్స్‌టైల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌, రత్నాల ఎగుమతులు భారీగా పడిపోయాయి. 2014-15లో మొత్తం ఎగుమతుల్లో ఈ ఐదు రంగాల వాటా 65 శాతంగా ఉంది. మొత్తంగా కూడా మన ఎగుమతులు పడిపోతున్నాయి. 2014-15లో ఎగుమతుల లక్ష్యం 34,000 కోట్ల డాలర్లు కాగా 31,440 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. దిగుమతులు 44,750 కోట్ల డాలర్లుగా ఉండటంతో వాణిజ్య లోటు 13 కోట్ల డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, మన సరుకులు విదేశీ మార్కెట్లలో పోటీ పడలేకపోవటం, తదితరాలు మన ఎగుమతుల పెరుగుదలకు ఆటంకంగా ఉన్నాయి. ఒకవైపు దేశంలో నెలకొన్న మాంద్య పరిస్థితులు, మరోవైపు అంతర్జాతీయంగా తీవ్రమౌతున్న ఆర్థిక మాంద్యం మన ఆర్థికాభివృద్ధికి తీవ్ర ఆటంకంగా ఉన్నాయి.
ఇతరత్రా సానుకూలాంశాలు కొంతమేరకు తోడ్పాటు నందించినా ఉత్పత్తి రంగంలో జరిగే సానుకూల పరిణామా లు మాత్రమే ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయి. వడ్డీ రేట్ల తగ్గింపు ఆర్థికాభివృద్ధిపై పరిమిత ప్రభావాన్నే కలిగిస్తుంది. ప్రపంచ దేశాల అనుభవం కూడా అదే అంశాన్ని స్పష్టం చేస్తున్నది. 2008 నుంచి అమెరికాలో వడ్డీ రేటు 0 నుంచి 0.25 శాతంగా మాత్రమే ఉంది. అయినా అమెరికా ఆర్థికాభివృద్ధి ఈ కాలంలో 2-3 శాతం మధ్యనే ఉంది. చైనాలో వడ్డీ రేట్లు 4.6 శాతంగా ఉన్నాయి. చైనా 8 నుంచి 10 శాతం అభివృద్ధిని సాధించింది. ఈ సంవత్సరం చైనా ఆర్థికవ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని బూర్జువా ఆర్థిక పండితులు చెబుతుండగా, 7 శాతం ఆర్థికాభివృద్ధిని సాధిస్తుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యూరో జోన్‌లో వడ్డీ రేట్లు 0.05 శాతంగా ఉన్నాయి. అభివృద్ధి 1.5 శాతంగానే ఉంది. యూరో జోన్‌కు ఇంజనులాగా పనిచే స్తూ, ఐరోపా ఆర్థికవ్యవస్థను ముందుకు నడుపుతుందని చెబుతున్న జర్మనీ అభివృద్ధి 1.60 శాతంగా మాత్రమే ఉంది. జపాన్‌లో వడ్డీ రేట్లు 0 శాతంగా ఉన్నాయి. అభివృద్ధి 0.80 శాతం మాత్రమే ఉంది. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటమే అబి óవృద్ధికి కారణమైతే 0 శాతంగా ఉన్న జపాన్‌, అమెరికాలు అన్ని దేశాలకన్నా అధిక జిడిపి వృద్ధిని సాధించి ఉండాల్సిం ది. కానీ జపాన్‌ జిడిపి 0.80 శాతం మాత్రమే పెరగగా, అమెరికా 2.7 శాతం వృద్ధిని మాత్రమే సాధించింది. వడ్డీరేట్లు 4.6 శాతం ఉన్న చైనా ఈ సంవత్సరం 7 శాతం అభివృద్ధి సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. పైన పేర్కొన్న దేశాల అనుభవాలు వడ్డీ రేట్ల తగ్గుదలకు, జిడిపి పెరుగుదలకు సంబంధం లేదని స్పష్టం చేస్తున్నాయి. అయితే వడ్డీ రేట్ల తగ్గింపు ఆర్థికవ్యవస్థ అభివృద్ధిపై సానుకూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.
వడ్డీరేట్ల తగ్గింపు వల్ల మూడు పరిణామాలు సంభవిస్తాయి. మొదటిది. పారిశ్రామికవేత్తలు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలు, వృత్తులు చేసుకునేవారికి వడ్డీ రేట్ల తగ్గింపు వల్ల కొంత మేరకు ఉపశమనం లభిస్తుంది. వారు బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ రేట్ల భారం తగ్గుతుంది. రెండవది, గృహ, వాహన రుణాలు, వినియోగ రుణాలు తీసుకున్నవారికి వడ్డీ రేట్లు తగ్గటం వల్ల కొద్దిపాటి ఊరట లభిస్తుంది. అయితే పెట్టుబడిదారులు ఆశిస్తున్నది మాత్రం వడ్డీ రేట్లు తగ్గటం వల్ల ప్రజలు విస్తారంగా వినియోగ రుణాలు తీసుకొని, పెద్ద మొత్తంలో కార్లు, మోటారు సైకిళ్ళు, ఫ్రిజ్‌లు, తదితర వినియోగ వస్తువులను కొంటారని, తద్వారా ఆర్థికాభివృద్ధికి ఊపు వస్తుందని భావిస్తున్నారు. ఆ విధంగా మధ్యతరగతి ప్రజానీకం సరుకులు కొనటానికి కూడా కొంతమేరకు అవకాశాలున్నాయి. ఇది తాత్కాలికంగా కొద్ది మేరకు ఉత్పత్తి పెంపుదలకు కూడా దారి తీయవచ్చు. మూడవది, వడ్డీ రేట్లు తగ్గటం వల్ల బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలలో పొదుపు చేస్తున్నవారికి వచ్చే ఆదాయం తగ్గుతుంది. ఫలితంగా పొదుపు మొత్తాలను వెనక్కు తీసుకొని, ఇతరంగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు. కొంత మొత్తం స్టాక్‌మార్కెట్‌లోకి కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది. కొందరైనా పొదుపును ఉపసంహరించు కోవటం వల్ల బ్యాంకులకు నిధుల లభ్యత తగ్గుతుంది. మరోవైపు స్టాక్‌మార్కెట్‌కు కూడా ఊతం లభించటానికి అవకాశాలున్నాయి.
సంక్షోభానికి బీజాలు
వడ్డీ రేట్ల తగ్గింపు ద్వారా వస్తున్న చౌక రుణాలతో వినియోగదారులను ఆకర్షించి, విస్తారంగా సరుకులు అమ్ముకోవాలని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. పెట్టు బడిదారులు ఆశిస్తున్న సరుకుల అమ్మకం విధానం భవిష్యత్‌ సంక్షోభానికి బాటలు వేస్తుంది. తగ్గిన వడ్డీ రేట్లతో వినియో గదారుల చేత విస్తారంగా సరుకులు కొనుగోలు చేయించ టానికి పెట్టుబడిదారులు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. పారిశ్రామికాభివృద్ధి స్తబ్ధంగా ఉండటంతో బ్యాంకులు కూడా తమ వద్ద ఉన్న నిధులను అనివార్యంగా వినియోగ రుణాలివ్వటానికి వినియోగిస్తారు. గతంలో ఉద్యోగులకే ఎక్కువగా వినియోగ రుణాలిచ్చేవారు. ఇప్పుడు ఆర్థికాభివృ ద్ధికి ఊపునివ్వటానికని 'ముద్ర' రుణాల పేరుతో వృత్తులు, వ్యాపారాల అభివృద్ధి కోసమంటూ వినియోగ రుణాలు ఇస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నవారిలో ప్రభుత్వోద్యోగులు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. వారివి నికరమైన ఆదాయాలు కాబట్టి, తీసుకున్న రుణాల వాయిదాలను క్రమబద్ధంగా చెల్లించగల ఆర్థికస్థితిలో ఉంటారు. రుణాలు తీసుకునేవారిలో ఎక్కువమంది ప్రైవేటు ఉద్యోగులు, ప్రస్తుతం కొత్తగా రుణాలు పొందేవారిలో ఎక్కువమంది చిన్న వ్యాపారులు, వృత్తిదారులు ఉంటారు. వీరికి రుణం ఇచ్చేనాడు వారికొస్తున్న జీతాన్ని పరిగణనలోకి తీసుకొని రుణం ఇస్తారు. కానీ వారిని యజమానులు ఎప్పుడు ఉద్యోగాల నుంచి తొలగిస్తారో తెలియదు. దేశ పారిశ్రామికరంగంలో బాగా లాభాలు సంపాదిస్తున్న దిగ్గజాలలో ఒకటైన టిసియస్‌ 25,000 మంది ఉద్యోగులను తొలగిస్తానని ఈ మధ్య కాలంలోనే ప్రకటించింది. అలాగే ఇతర పెట్టుబడిదారులు ఎవరైనా, ఎప్పుడైనా ఉద్యోగులను తొలగించవచ్చు. ఉద్యోగాలు పోగొట్టుకున్నవారికి తిరిగి ఎప్పటికి ఉద్యోగాలు వస్తాయో తెలియదు. ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు బ్యాంకులకు నెలనెలా చెల్లించాల్సిన వాయిదాలను చెల్లించలేరు. చిన్న వ్యాపారులు, వృత్తిదారులకు ఇస్తున్న రుణాలు కూడా ఇటువంటి ఫలితాన్నే ఇస్తాయి. చిన్న వృత్తులు, వ్యాపారాలు ఎప్పుడైనా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రస్తుతం సరళీకరణ విధానాలు అమలు జరుగుతున్న దశలో ప్రభుత్వం దిగుమతులపై సుంకాలను తగ్గిస్తున్నది. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నది. ఫలితంగా విదేశీ సరుకులు చౌకగా దేశంలోకి దిగుమతి జరిగి మన ఉత్పత్తిదారులను దెబ్బతీస్తున్నాయి. అందువలన ఎప్పుుడైనా, ఏ పారిశ్రామికవేత్త అయినా, వృత్తిదారుడైనా దివాళా తీయవచ్చు. కాబట్టి రుణాల ద్వారా వినియోగాన్ని పెంచటం, తద్వారా ఆర్థికవ్యవస్థలో కదలిక తీసుకురావటం అనేది తాత్కాలికంగా సమస్యను పరిష్కరిస్తూ, దీర్ఘకాల సంక్షోభానికి పునాదులు వేస్తుంది.
వడ్డీ రేట్ల తగ్గింపుతో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కూడా ఊపు వస్తుందని భావిస్తున్నారు. ఆ రంగంలో కూడా ఇటువంటి పరిణామాలే చోటుచేసుకునే అవకాశం ఉంది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రుణాల లభ్యతతో వ్యాపారాలను విస్తరించటానికి ప్రయత్నిస్తారు. పెద్ద వ్యాపారులు బ్యాంకులను కూడా ప్రభావితం చేసి, అర్హత లేనివారికి కూడా రుణాలు ఇప్పిస్తారు. రుణాలు పొందిన వారికి నికరాదాయం లేకపోవటంతో రుణాలు సక్రమంగా చెల్లించలేరు. ఈ భారమంతా బ్యాంకులపై పడి, బ్యాంకులు సంక్షోభంలో చిక్కుకుంటాయి. దేశీయ మార్కెట్‌ను విస్తరింపజేసుకోవటం, చౌక దిగుమతుల నుంచి మన మార్కెట్‌ను కాపాడుకోవటం, వస్తూత్పత్తి రంగంపై కేంద్రీకరించటం మాత్రమే ఆర్థికాభివృద్ధి సాధించటానికి, మాంద్యం నుంచి బయటపడటానికి దారితీస్తుంది. 
- ఎ కోటిరెడ్డి