ఆర్టికల్స్

కరెంట్‌ బాదుడు

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచేసి ప్రజల నెత్తిన పెనుభారం మోపింది. కరోనా విలయానికి జనం బతుకులు కకావికలమైన సమయాన ఇళ్లకు వాడే కరెంట్‌ బిల్లులు పెంచి షాక్‌ ఇవ్వడం సర్కారు కర్కశానికి తార్కాణం. ఇప్పటికే కేంద్రం గ్యాస్‌, పెట్రోలు, డీజిల్‌ ధరల మోత మోగిస్తూ ప్రజల నడ్డి విరుస్తుండగా దానికి విద్యుత్‌ ఛార్జీల భారం అదనం. గృహ వినియోగదారులపై పడే మొత్తం భారం రూ.4,300 కోట్లు. అందులో టారిఫ్‌ పెంపుదల మూలంగా పడేది రూ.1,400 కోట్లు. ట్రూ అప్‌ వసూళ్లు రూ.2,900 కోట్లు. ఎపి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ (ఎపిఇఆర్‌సి)నే ఛార్జీలు వడ్డిస్తూ నిర్ణయం వెలువరించినా, ప్రభుత్వం రాయితీ ఇవ్వకపోవడం వల్లనే ఛార్జీలు పెరిగాయి. మూడు డిస్కంలు...

భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మూలమలుపు

చరిత్రలో సిపిఎం-1

అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంతో భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని విడదీసి చూడలేం. 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధకాలంలో రష్యన్‌ విప్లవ ప్రభావంతో భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఆవిర్భవించింది. భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగా జర్మనీ, అమెరికా తదితర దేశాల్లో పనిచేస్తూ, అక్టోబరు విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులై భారత్‌ తిరిగివచ్చినవారూ, ఖిలాఫత్‌, హిజ్రత్‌ ఉద్యమాలపై అక్టోబరు విప్లవప్రభావంవల్ల కమ్యూనిస్టులైనవారూ, గదర్‌ పార్టీ నుంచి కమ్యూనిస్టులుగా మారినవారూ, భారతదేశంలోనే రష్యా విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులైన అతివాద కాంగ్రెస్‌ వారూ - ఇలా వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఉద్యమకారులు భారతదేశంలో కమ్యూనిస్టు...

సమ్మె హెచ్చరిక

రెండు రోజుల దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మె విజయవంతం కావడం కేంద్ర ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక వంటింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా కోట్లాదిమంది కార్మికులు ఈ సమ్మెలో రోడ్డెక్కారు. ఇంత పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొనడం, వివిధ రంగాలకు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు, ఎల్‌ఐసి, బ్యాంకింగ్‌ రంగాలకు చెందిన వారు భాగస్వాములు కావడం, అనేక రాష్ట్రాల్లో బంద్‌ వాతావరణం నెలకొనడం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు మారుమ్రోగడం వంటి అంశాలు విదేశీ మీడియాలోనూ చర్చనీయాంశం అయ్యాయి. కార్మికవర్గ ప్రతిఘటన కారణంగా సంస్కరణల అమలు విషయంలో భారత్‌లో అయోమయ వాతావరణం నెలకొందన్న అర్ధం వచ్చే శీర్షికతో '...

మరో నిరంకుశ చర్య

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పౌర స్వేచ్ఛ పైన, ప్రజాతంత్ర హక్కులపై దండెత్తుతున్నది. ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఐడెంటిఫికేషన్‌) బిల్లు-2022 మోడీ ప్రభుత్వ మరో నిరంకుశ చర్య. బ్రిటిష్‌ వలస పాలకులు ప్రవేశపెట్టిన ఖైదీల గుర్తింపు చట్టం(1920) ని రద్దు చేసి, దాని స్థానే తీసుకొచ్చే బిల్లు ఆధునిక ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, పౌర స్వేచ్ఛకు ప్రాధాన్యమిచ్చేలా ఉండాలని ఎవరైనా ఆశిస్తారు. కానీ, మోడీ ప్రభుత్వం దీనికి పూర్తి భిన్నమైన రీతిలో బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు జీవించే హక్కును, మానవ హక్కులను మంటగలిపేదిగా ఉందని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసినా...

ప్రజల భాగస్వామ్యంతోనే వికేంద్రీకరణ

జగన్‌ గారి మాటల్లో గాని, వైఎస్సార్‌ సిపి వారి ప్రచారంలో గాని పరిపాలన వికేంద్రీకరణ అంటే రాజధానిని ముక్కలుగా చేసి ఒక్కొక్క ఆఫీసు ఒక్కోదగ్గర పెట్టడంగా ఉన్నది. అది వికేంద్రీకరణకు వికృత రూపం అవుతుంది తప్ప నిజమైన వికేంద్రీకరణ అవదు. అది ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. పరిపాలన వికేంద్రీకరణ అంటే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రాలకు ఎక్కువ హక్కులు రాజ్యాంగ పరంగా ఇవ్వడం, అది ఒక బలమైన ఫెడరల్‌ వ్యవస్థగా, ఐక్యంగా దేశం ముందుకు పోవడానికి తోడ్పడేది. అదే సమయంలో గ్రామ, పట్టణ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేయడం ద్వారా ప్రజల వద్దకు నేరుగా పరిపాలనను తీసుకురావడం,
     అమరావతినే రాజధానిగా కొనసాగించాలని, అభివృద్ధికి తక్షణం చర్యలు...

పార్లమెంట్‌ సాక్షిగా విశాఖ ఉక్కుపై బిజెపి దాడి

విశాఖ ఉక్కు అమ్మకంపై ప్రజల్లో వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేని బిజెపి...దుష్ప్రచారానికి పార్లమెంటు వేదికగా పూనుకుంది. తన సన్నిహిత కార్పొరేట్‌ వర్గానికి దీనిని ధారాదత్తం చేయడానికి ప్రజల్లో విశాఖ ఉక్కు ఖ్యాతిని మసకబార్చేందుకు కుట్ర పన్నింది. మొన్న పార్లమెంటులో విశాఖ ఉక్కుపై సభ్యులు అడిగిన ప్రశ్నలను ఆసరా చేసుకొని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విషం కక్కారు. వాస్తవాలకు పాతరేసి తీవ్రమైన అబద్ధాలు వల్లించారు. అబద్ధం 1: విశాఖ ఉక్కుకు కేప్టివ్‌ మైన్స్‌ లేకపోవడం వల్ల నష్టాలు రాలేదు. ఇది పచ్చి అబద్ధం. కేప్టివ్‌ మైన్స్‌ అంటే ప్రభుత్వం ఉక్కు పరిశ్రమలకు ముడి ఇనుప గనులు కేటాయించడం. దేశంలో సొంత ముడి ఇనుప గనులు లేని ఏకైక పరిశ్రమ విశాఖ...

అమెరికా ఉచ్చులో పడొద్దు

చైనాతో సరిహద్దు వివాదం ఒక పరిష్కారానికి వచ్చే సూచనలు ప్రస్తుతానికి కనబడడం లేదు. సరిహద్దుకి ఇరువైపులా సైన్యాల మోహరింపు తగ్గుముఖం పడుతున్న దాఖలాలూ లేవు. ఈ నేపథ్యంలో అమెరికా నుండి సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ (విదేశాంగ వ్యవహారాల బాధ్యత)గా ఉన్న మైక్‌ పాంపియో, సెక్రటరీ ఆఫ్‌ డిఫెన్స్‌ (రక్షణ రంగ బాధ్యత)గా ఉన్న మార్క్‌ ఎస్పర్‌ అక్టోబరు చివరి వారంలో మన దేశానికి వచ్చారు. మిలిటరీ రంగంలో అమెరికాతో మన దేశం కుదుర్చుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా 'బెకా' (బేసిక్‌ ఎక్స్‌చేంజ్‌ అండ్‌ కో-ఆపరేషన్‌ అగ్రిమెంట్‌) కుదుర్చుకున్నారు. ఈ కాలంలోనే విశాఖపట్నం లోను, మలబార్‌ తీరం లోను నాలుగు దేశాల (ఇండియా, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా) నావికా దళాల...

గెలుపొందినా ఎన్‌డిఎకు ఎదురుదెబ్బలు : పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం

ఇటీవల ముగిసిన బీహార్‌ ఎన్నికల్లో చాలా స్వల్ప తేడాతో బిజెపి-జెడి(యు) కూటమి గెలుపొందింది. ఈ కూటమికి 125సీట్లు రాగా, మహాగత్‌బంధన్‌కు 110సీట్లు వచ్చాయి. అయితే, ఈ రెండు కూటములు మధ్య ఓట్ల వాటా తేడా చాలా తక్కువగా కేవలం 0.2శాతం మాత్రమే వుంది. ఈ ఎన్నికల్లో గెలుపొందినప్పటికీ ఎన్‌డిఎకు చాలా ఎదురుదెబ్బలు తగిలాయని పీపుల్స్‌ డెమోక్రసీ తన సంపాదకీయంలో పేర్కొంది. 2019 లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి బిజెపి కూటమి 12.4శాతం ఓట్లు పోగొట్టుకుందని పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేకత, నితీష్‌ కుమార్‌ ప్రభుత్వం పట్ల నెలకొన్న అసంతృప్తి కారణంగా గత ఎన్నికల్లో ఏకంగా 71సీట్లు సాధించిన జెడి(యు)కి ఈసారి కేవలం 43సీట్లే లభించాయని సంపాదకీయం వ్యాఖ్యానించింది. మహాగత్‌బంధన్‌...

కార్మికవర్గంపై మోడీ దాడిని ప్రతిఘటిద్దాం

దేశవ్యాప్తంగా కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మికవర్గంపై జరుపుతున్న తీవ్రమైన దాడికి నిరసనగా 11 అఖిలపక్ష కార్మిక సంఘాలు సెప్టెంబర్‌ 23న నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చాయి. ఇందులో సిఐటియు, ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌ తదితర సంఘాలు ముఖ్య పాత్ర నిర్వహిస్తు న్నాయి. కరోనాను నివారించడానికి దేశవ్యాప్తంగా 4 గంటల వ్యవధిలో మిలటరీ కర్ఫ్యూ లాగా లాక్‌డౌన్‌ విధించి నేటికి 6 మాసాలైంది. కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
కేంద్ర ప్రభుత్వం కరోనాను అడ్డం పెట్టుకొని గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వేగంగా సంస్కరణలను అమలు చేయడానికి పూనుకున్నది. లాక్‌డౌన్‌ 5.0 సందర్భంగా మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఆలంబనగా నిలిచిన ప్రభుత్వ రంగ...

ప్రమాదకర బిజెపి విధానాలు

కరోనా సందర్భాన్ని సైతం బిజెపి దూకుడుగా వినియోగించుకొని ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తోంది. మొన్న జిఎస్‌టి, అంతకు ముందు పెద్ద నోట్ల రద్దు, ఇప్పుడు రైతాంగ వ్యతిరేక చట్ట సవరణలు అన్నీ బుల్డోజు చేసేందుకు పూనుకున్నది. కార్మిక హక్కులను రద్దు చేసే చర్యలు ముమ్మరమయ్యాయి. అసలే కరోనా మహమ్మారి వ్యాప్తిలో ప్రభుత్వ వైద్య సహాయం మృగ్యమైంది. బాధ్యతారహితంగా లాక్‌డౌన్‌ అమలు జరిపి కోటాను కోట్ల అసంఘటిత రంగ కార్మికుల ఉపాధిని దెబ్బగొట్టింది. ఈ పరిణామాలు చిన్న చిన్న వ్యాపారాల్ని, చిన్న ఉత్పత్తిదారుల్ని, వృత్తుల్ని సంక్షోభం లోకి నెట్టింది. ఈ విపత్కర పరిస్థితుల్లో 6 మాసాల పాటు ప్రతి కుటుంబానికి నెలకు రూ.7500, ప్రతి వ్యక్తికి 10 కిలోల బియ్యం, నిరుద్యోగ భృతి లాంటి...

ఎన్నికల కమిషనర్‌ తొలగింపు న్యాయ సమ్మతమా?

తాజా పరిణామాన్ని చూస్తే ఏం జరిగినా సరే మడమ తిప్పేది లేదన్నట్లుగా జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును ఆర్డినెన్స్‌ ద్వారా గవర్నర్‌ అమలు చేశారు. గవర్నర్‌ ఆమోదం పొందిన తరువాత కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఉత్తరువు జారీ చేసింది. కొత్త కమిషనర్‌ నియామకం కూడా జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో పెద్ద తప్పిదం చేశారా లేక సలహాదారులు తప్పుదారి పట్టించారా? ఏదైనా ఒకటే. కమిషనర్‌ పదవీ కాలం తగ్గింపు, ఆ వెంటనే తొలగింపు చట్టబద్ధమా, విరుద్ధమా అన్న చర్చ...

అమెరికా అంటే భయమా? సైద్ధాంతిక ఐక్యతా?

నిన్నటికి నిన్న...హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు పంపకపోతే ట్రంపు ప్రతీకారం తీర్చుకుంటా మనగానే...మోడీ ప్రభుత్వం భయపడిపోయింది. మారు మాట్లాడకుండా అమెరికాకు మందులు పంపించింది. ఈ రోజు...చైనా నుండి తమిళనాడుకు రావాల్సిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను బలవంతంగా మళ్లించేసుకున్నా నోరు మెదపలేదు. గతంలో కూడా ఇరాన్‌ నుండి ఆయిల్‌ను కొనవద్దని ఆజ్ఞ జారీ చేయగానే కొనడం ఆపివేసింది. సర్వసత్తాక సార్వభౌమాధికారం గల భారత దేశాన్ని మోడీ ప్రభుత్వం అప్రతిష్ట పాల్జేసింది. లాక్‌డౌన్‌ ప్రకటించడం తప్ప మోడీ ప్రభుత్వం కరోనా నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్‌ కిట్లను ఏర్పాటు చేయలేదు. వైద్య సిబ్బందికి అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను (పిపిఇ), రోగులకు అత్యవసరమైన వెంటిలేటర్లను ఏర్పాటు...

Pages