వారికి అంబేద్కర్‌ అవసరం ఎందుకొచ్చింది?

అంబేద్కర్‌ గురించి అంద రూ మాట్లాడుతున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అని, దళిత వర్గా ల పెన్నిధి అని కీర్తిస్తు న్నారు. రిజ ర్వేషన్లు ఎస్సీ, ఎస్టీల హక్కు అని ప్రధాని నరేంద్ర మోడీ కూడా తాజాగా ప్రస్తుతించారు. అంబే ద్కర్‌ను ఇప్పుడు జాతీయ పార్టీలు అన్నీ సొంతం చేసుకునే దిశలో పోటీపడుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్‌, మరోవైపు బిజెపి ఈ విషయంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. అంబేద్కర్‌ పేరు చెప్పి ఓట్లు పొందే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. అందుకే సమయం వచ్చినప్పుడే కాకుండా అంబేద్కర్‌ పేరు చెప్పడానికి సమయం కొనితెచ్చుకుంటున్నారు. జాతీయ పార్టీల కు వేగుచుక్కగా ఇప్పుడు అంబేద్కర్‌ కన్పిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా చెలరేగుతున్న ప్రజా ఉద్యమాల నేపథ్యం, అట్టడుగు వర్గాల అసహనం వెరసి అంబేద్కర్‌ మార్గమే శిరోధార్యంగా తల పోస్తున్నాయి. దీన్ని గుర్తించిన పాలక పక్షాలు అంబేద్కర్‌ను ఇష్టం లేకపోయినా భుజాన వేసుకుంటున్నాయి, కీర్తిస్తున్నాయి. ఆయన నామస్మరణ చేస్తున్నాయి. ఇదంతా అంబేద్కర్‌ మీద ఉన్న ప్రేమ, అభిమానం కాదు. ఆయన వెనుక ఉన్న బహు జనుల బలం. అట్టడుగు వర్గాల ఆశయమే. అందుకే అన్ని పెద్ద పార్టీలూ ఇప్పుడు అంబేద్కర్‌ను ఆరాధించడం ఆరంభించాయి.
అంబేద్కర్‌ జపం ఎందుకు? 
కాంగ్రెసు, బిజెపిలు పోటీపడి మరీ అంబేద్కర్‌ను సొంతం చేసుకునే దిశగా పరుగులు పెడుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? ఎంతో మంది నాయకులు ఉండగా అంబేద్కర్‌ను మాత్రమే ముందు వరుసలో పెట్టి కీర్తించడంలో అంతరార్థం ఏమిటి? దేశభక్తులుగా కీర్తిగడించి, స్వాతంత్య్రోద్యమంలో కీలక భూమిక పోషించారని చెప్పుకున్న నేతలను సైతం పక్కన పెట్టి మరీ అంబేద్కర్‌నే ఎందుకు భుజాన వేసుకుంటున్నాయి? అంబేద్కర్‌ సిద్ధాంతంపై ఇప్పుడు నమ్మకం పెరిగింది. బహుజ నులు అంబేద్కర్‌-మహాత్మా ఫూలే సిద్ధాంతాన్ని నమ్ముతు న్నారు. వారి బాటలో నడిచేందుకు సన్నద్ధం అయ్యారు. దీన్ని ఓట్ల పార్టీలు పసిగట్టాయి. బహుజనులకు దూరం అయితే రాజ్యాధికారానికి దూరం అయినట్లే అని భయపడుతున్నాయి. అందుకే అంబేద్కర్‌ని సొంతం చేసుకునే యత్నాలు ఆరంభిం చాయి. ఇన్నాళ్లూ అంబేద్కర్‌ను ఎస్పీలు, అందులోనూ మహర్‌ కులస్తులకే పరిమితం చేసిన కుహనా రాజకీయ నేతలు, మనువాదులు ఇప్పుడు అంబేద్కర్‌ను జాతీయ నాయకునిగా, అందరికీ ఆదర్శవాదిగా పేర్కొనడం వెనుక ఓట్ల నేపథ్యమే ఉంది. లేకపోతే ''అంబేద్కర్‌ను దళితుల విముక్తి ప్రదాతగా మాత్రమే పేర్కొనడం సరైంది కాదు. ఆయన దళితులకే పరిమితం కాలేదు. అణచివేతకు గురైన అన్ని అట్టడుగు వర్గాల గొంతుక అంబేద్కర్‌. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌లా ఆయనొక విశ్వ మానవుడు'' అని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొనడం వెనుక ఎంతో రాజకీయ వ్యూహం ఉంది.
దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు సాగుతున్నాయి. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత అసహం పెరిగిపోయింది. కులాలు, మతాల పేరిట విషయం చిమ్ముతోంది. బిజెపికి అనుబంధంగా ఉన్న ఆర్‌ఎస్‌ ఎస్‌, విహెచ్‌పి లాంటి శక్తులు ఒక్కసారిగా బలోపేతం అయ్యాయి. రాజ్యాంగం కల్పించిన హక్కులను వ్యక్తులు అనుభ వించే విషయంలోనూ అనేక భయాలు ఏర్పడ్డాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ తగ్గిపోతోంది. వ్యక్తిగత స్వాతంత్య్రం హరించి పోతోంది. నిత్యం భయం వెంటాడుతోంది. ఎప్పుడు ఎలాంటి శక్తులు వచ్చి దాడిచేస్తాయో తెలియని భయం తరుముతోంది. కాంగ్రెసు హయంలో కూడా ఇలాంటి వాతావరణాన్నే అనుభ వించినా ఇది ఇంతగా పెచ్చుమీరలేదు. అధికారం అంటే బాధ్యత అనే స్థాయి నుంచి, అధికారం అంటే అహంకారం అనే తీవ్రతకు నేతలు వచ్చారు. అటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు గానీ, అధికార పక్షంలో ఉన్న బిజెపి గానీ బహుజనులను వంచించి, ఓట్లు దండుకునే దిశగానే పయనిస్తున్నాయి తప్ప వారి బతుకులను బాగు చేయడానికి కాదని చెప్పవచ్చు.
చిత్తశుద్ధి ఏదీ?
ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేకుండా మన నేతలు ఒక్కమాట కూడా మాట్లాడరు. అలాంటిది అంబేద్కర్‌ 125వ జయంతులు, వారికి స్మారక చిహ్నాల ఏర్పాట్లు చేస్తున్నారంటే అతిపెద్ద రాజకీయ ప్రయోజనం తప్పకుండా ఉండి తీరాలి. అంబేద్కర్‌ మీద అమాంతంగా మన నేతలకు ప్రేమ కల గడానికీ, అంబేద్కర్‌ను భుజాన వేసుకోవడానికీ ప్రధాన కారణం ఉంది. గతేడాది సిపిఎం జాతీయ మహాసభలు విశాఖపట్నంలో జరిగాయి. అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్చ జరపాలని తీర్మానించారు. స్వాతం త్య్రానంతరం ఎస్సీలకు జరిగిన అభివృద్ధిపై పార్లమెంటులో చర్చించాలని జాతీయ మహాసభలో తీర్మానం చేశారు. దీంతో అన్ని పార్టీలూ కలవరపడ్డాయి. వామపక్షాలు ఎక్కడ బహుజ నులకు దగ్గర అవుతాయో, అధికారాన్ని హస్తగతం చేసు కుంటాయో అని కాంగ్రెసు, బిజెపిలు అలజడి చెందాయి. దీంతో ఇరు పార్టీలూ అంబేద్కర్‌ను సొంతం చేసుకునే దిశగా అడు గులు వేయడం ఆరంభించాయి. అంబేద్కర్‌ వారసులుగా ఉన్న ఎస్సీలను తెర మీదకు తీసుకొచ్చాయి. వారికి పదవులు ఇచ్చాయి. వారికి గౌరవమర్యాదలు కల్పించినట్లు భ్రమలు కల్పించాయి. అంబేద్కర్‌ ఆశయ సాధన కోసం చేసిన కార్యా చరణ అనేది ఏమాత్రం లేదనే చెప్పాలి. గడచిన దశాబ్ద కాలంలో ఎస్సీలపై అత్యాచారాలు పెరిగాయి. విద్య, ఉపాధి రంగాల్లో ఎస్సీలకు తీవ్ర అన్యాయమే జరిగింది. బ్యాక్‌ లాగ్‌ పోస్టులు భర్తీ కావడం లేదు. ప్రభుత్వం ప్రవేశపెట్టే స్కీములన్నీ రాజ కీయపరమైన అంశాలుగానే మిగిలిపోతున్నాయి తప్ప లబ్ధిదా రులకు జరిగే మేలు మాత్రం ఏమీలేదనే చెప్పాలి.
ఒక వైపు రిజర్వేషన్లపై దాడి జరుగుతోంది. అమలు జరుగుతోన్న రిజర్వేషన్లపై సమీక్ష చేయాలని ఒక సెక్షన్‌ పని కట్టుకుని ప్రచారం చేస్తోంది. మరో వైపు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కావాలనే ఉద్యమం సాగుతోంది. దీనిపై అధికా రంలో ఉన్న బిజెపి నోరు మెదపడం లేదు. జాట్ల ఉద్యమంపై సానుకూలంగా స్పందించిన బిజెపి ప్రభుత్వం ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లపై కూడా స్పందించాలి కదా? రిజర్వేషన్లు యథాతథంగా ఉంటాయి అని ప్రధాని పేర్కొన్నందుకు సంతోషమే. కానీ ప్రభుత్వ రంగంలో వచ్చే ఉపాధి అవకాశాలు ఏమాత్రం? దీనిపై అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా అయినా ప్రకటించాల్సిన ఆవశ్యకత ఉంది? అంబేద్కర్‌పై నిజమైన గౌరవం ఉంటే, అంబేద్కర్‌ దార్శనికతపై నమ్మకం ఉంటే ఆయన రాసిన గ్రంథాలను తిరిగి ముద్రించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కులనిర్మూలన, అస్పృశ్యులెవరు? రాముని, కృష్ణుని రహస్యాలు, గాంధీ అస్పృశ్యులకు చేసిందేమిటి? హిందుత్వంలో చిక్కు ప్రశ్నలు వంటి గ్రంథాలను ముద్రించి, అందరికీ అందుబాటులో ఉంచే సాహసం బిజెపి నాయకత్వం చేయగలదా? అంబేద్కర్‌ అవసరం ఇప్పుడు అన్ని పార్టీలకూ ఉంది. ఆయన సిద్ధాంతం బహుజనులకే కాదు అన్ని వర్గాలకూ ఆచరణాత్మకంగా మారిం ది. మతోన్మాదం పెరుగుతోన్న దశలో, కులాల కుంపట్లు చెలరేగుతోన్న సమయంలో, ప్రజా ఉద్యమాలు బలపడే స్థితిలో అంబేద్కర్‌ చూపిన బాట అందరికీ ఆచరణాత్మకంగానే మారుతుంది. అయితే అంబేద్కర్‌ను అనుసరించడం అంత తేలికైన విషయం కాదు. ఆయన సిద్ధాంతాలను అమలు చేయడం ఆషామాషీ వ్యవహారం కానే కాదు. ''బోధించు... సమీకరించు... పోరాడు... అని అంబేద్కర్‌ ఇచ్చిన పిలుపు మరో వెయ్యి శతాబ్దాలకైనా స్ఫూర్తిని ఇస్తుంది. కానీ ఆయన కోరుకున్న సమాజాన్ని నిర్మించాలి అన్న ఆలోచన కూడా రావాలి.                     

....కంచల జయరాజ్‌