2016

ఉగ్ర దాడులపై మోడీ సమీక్ష్య

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరం, ఆఫ్ఘనిస్థాన్‌లో భారత దౌత్య కార్యాలయంపై ముష్కరుల దాడిపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు సమీక్ష నిర్వహించారు. మోడీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, విదేశాంగ కార్యదర్శి జయశంకర్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

బర్ధన్‌కు సీపీఎం నేతల సంతాపం..

కమ్యూనిస్టు కురువృద్ధుడు ఏబీ బర్ధన్‌కు వివిధ పార్టీలు, నేతలు ఘనగా నివాళులు అర్పించాయి. వామపక్ష ఉద్యమానికి బర్దన్‌ మృతి తీరని లోటని లెఫ్ట్‌ పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి.బర్ధన్‌ మృతిపట్ల సీపీఎం ప్రధాన నాయకులు సీతారాం ఏచూరి, బి.వి. రాఘవులు, తమ్మినేని వీరభద్రం,పి.మధుతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

సిపిఐ సీనియర్‌ నేత బర్దన్‌ ఇక లేరు..

భారత దేశం ఓ మహోన్నత నేతను కోల్పోయింది. రాజకీయాల్లో విశిష్ట ఖ్యాతిని ఆర్జించిన సిపిఐ సీనియర్‌ నేత ఏబీ బర్దన్‌ మనకిక లేరు. కమ్యూనిస్ట్‌ నేతగా ఉంటూనే ఎంతోమంది ఇతర పార్టీల నాయకులకు ఆయన మార్గదర్శకుడిగా మెలిగారు. బర్దన్‌ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. న్యూఢిల్లీలోని జీబీ పంత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఆయన చాలాకాలం పనిచేశారు. బర్దన్‌ మృతిపట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ  ప్రగాఢసానుభూతి వ్యక్తం చేసింది.

సఫ్దర్‌ ఆశయాలను కొనసాగిద్దాం..

వీధి నాటిక వైతాళికుడు సఫ్దర్‌ హష్మీ 26వ వర్థంతి సందర్భంగా ఆయనకు ఢిల్లీ మేథావి వర్గం, కవులు, కళాకారులు నివాళులర్పించారు. ఢిల్లీలోని కాన్సిటిట్యూషన్‌ క్లబ్‌లో 'సఫ్దర్‌ హష్మీ మెమోరియల్‌ ట్రస్ట్‌' ఆధ్వర్యంలో శుక్రవారం పలురకాల కార్యక్రమాలు నిర్వహించారు. దేశంలో నానాటికి పెరుగుతున్న అసహనం, మతోన్మాదంపై ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన అందరినీ అకట్టుకుంది. మోడీ నిరంకుశ వైఖరిని, మతోన్మాద ఎజెండాను ఈ ప్రదర్శనలో ఎండగట్టారు. దేశంలోని రచయితలు, మేధావులకు మతంరంగు పులిమి హత్యలు చేస్తున్న వైనాన్ని ప్రముఖంగా ప్రదర్శించారు.

లాలూ,నితీశ్‌ల మధ్య విభేదాలు..

ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ల మధ్య విబేధాలు మొదలయ్యాయి.ఇటీవల రాష్ట్రంలో జరిగిన ముగ్గురు ఇంజినీర్ల హత్యల నేపథ్యంలో ఆర్జేడీ, జేడీయూల మధ్య ఆరోపణల పర్వం మొదలైంది.ఇంజినీర్ల హత్యకు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ బాధ్యత వహించాలని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్‌ ప్రతాప్‌సింగ్‌ అన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో సీఎం విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఇంజినీర్లు హత్యకు గురౌతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ఆయన నిలదీశారు. 

Pages

Subscribe to RSS - 2016