
ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్‌కుమార్‌ల మధ్య విబేధాలు మొదలయ్యాయి.ఇటీవల రాష్ట్రంలో జరిగిన ముగ్గురు ఇంజినీర్ల హత్యల నేపథ్యంలో ఆర్జేడీ, జేడీయూల మధ్య ఆరోపణల పర్వం మొదలైంది.ఇంజినీర్ల హత్యకు ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాధ్యత వహించాలని ఆర్జేడీ ఉపాధ్యక్షుడు కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రతాప్‌సింగ్ అన్నారు.రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో సీఎం విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఇంజినీర్లు హత్యకు గురౌతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ఆయన నిలదీశారు.