
కమ్యూనిస్టు కురువృద్ధుడు ఏబీ బర్ధన్‌కు వివిధ పార్టీలు, నేతలు ఘనగా నివాళులు అర్పించాయి. వామపక్ష ఉద్యమానికి బర్దన్ మృతి తీరని లోటని లెఫ్ట్ పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి.బర్ధన్ మృతిపట్ల సీపీఎం ప్రధాన నాయకులు సీతారాం ఏచూరి, బి.వి. రాఘవులు, తమ్మినేని వీరభద్రం,పి.మధుతో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.