2016

విద్యుత్‌ టారిఫ్‌కి కేబినెట్‌ఆమోదం

స్వచ్ఛమైన విద్యుత్‌ను అందించటంతో పాటు విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కం)పై మెరుగైన నియంత్రణ, రంగంలోకి వేగంగా పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన కొత్త విద్యుత్‌ టారిఫ్‌ విధానానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. స్వచ్ఛమైన విద్యుత్‌, డిస్కంలపై మెరుగైన నియంత్రణతో పాటు స్వచ్ఛబారత్‌ కార్యక్రమానికి మద్దతుగా రూపొందించిన విద్యుత్‌ టారిఫ్‌ విధానానికి కేబినెట్‌ ఆమోదం లభించిందని కేబినెట్‌ భేటీ అనంతరం ప్రభుత్వవర్గాలు వివరించాయి. 

రైల్వేలో ప్రైవేట్‌కు పెద్దపీట..

భారత్‌లో పెట్టుబడులకు అనువైన వాతావరణం కల్పించేందుకు పన్నుల్లో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ గురువారం దావోస్‌ వేదికపై నుంచి ప్రకటించారు. దేశంలో సులభ వ్యాపారానికి, పెట్టుబడులకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూసేందుకు పన్నుల విధానాన్ని సంస్కరిస్తామని ఆయన విదేశీ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. రైల్వే రంగంలో ప్రైవేట్‌కు పెద్ద పీట వేస్తామని, అన్ని రంగాల్లోనూ ఎఫ్‌డిఐలకు ప్రాధాన్యతనిస్తామని రాయితీల వర్షం కురిపించారు.

SFI జాతీయ మహాసభలు..

దేశంలో అమలవుతున్న విద్యా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ, విద్యార్థి సమస్యలపై గలమెత్తే భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) 15వ అఖిల భారత మహాసభలు శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు రాజస్థాన్‌లోని సికార్‌లో జరుగనున్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ చరిత్రలోనే రాజస్థాన్‌లో తొలిసారిగా ఈ సభలు నిర్వహిస్తున్నట్లు ఆ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ సభ్యుడు నితీష్‌ నారాయణ్‌ ప్రజాశక్తికి వివరించారు.సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చేతులు మీదుగా ప్రారంభం కాబోయే బహిరంగ సభకు ముందు పదివేల మంది విద్యార్థులతో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. 

ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు..

సామాజిక న్యాయం అమలు కావాలంటే ప్రయివేటురంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిఎస్‌ఎంఎం (దళిత శోషణ్‌ ముక్తి మంచ్‌) జాతీయ కన్వీనర్‌ వి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.పాలకులు అవలంబిస్తున్న విధానాల ఫలితంగా దేశంలో రోజురోజుకీ ప్రభుత్వ రంగం తీసికట్టుగా మారుతోందని, ఫలితంగా ప్రయివేటురంగం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం అమలు అసాధ్యంగా మారిందన్నారు. ప్రయివేటురంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా సామాజిక న్యాయం కొంతైనా సాధించే అవకాశముందని, ఆ దిశగా పాలకులు ఆలోచించాలని కోరారు. 

'మాస్టర్‌ప్లాన్‌' సదస్సులో గ్రామస్తుల ఆందోళన..

ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో ఇళ్లను తొలగిస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే చావడానికైనా సిద్ధమని తుళ్ళూరు గ్రామస్తులు సిఆర్‌డిఎ అధికారులను హెచ్చరించారు. మాస్టర్‌ప్లాన్‌పై గురువారం నిర్వహించిన సదస్సులో సిఆర్‌డిఎ ల్యాండ్స్‌ డైరెక్టర్‌ చెన్నకేశవులు, డిజైనింగ్‌ డైరెక్టర్‌ రాముడును గ్రామస్తులు నిలదీశారు. గ్రామకంఠా లపై స్పష్టతివ్వాలని, రైతులకు ప్లాట్లు ఎక్కడ కేటాయించేది మాస్టర్‌ప్లాన్‌లో చూపాలని డిమాండ్‌ చేశారు. ప్లాన్‌ను తెలుగులోకి అనువదించి మంత్రు లు, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే సదస్సులు నిర్వహించాలని, లేకుంటే తాము అంగీకరించ బోమని తేల్చిచెప్పారు..

 

రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై ఆందోళన..

రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై సిపిఎం అధ్వర్యంలో విజయవాడలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.కేంద్రమంత్రుల దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. కర్నూలులో కూడా సీపీఎం ఆధ్వర్యంలో నిరసనలు కార్యక్రమాలు నిర్వహించారు. రోహిత్‌ కుటుంబానికి 5కోట్ల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వివక్ష చూపడంవల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యేనని ఆయన మండిపడ్డారు. రోహిత్‌ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాయలసీమ వెనుకబాటుకు కారకులెవరు?

స్వార్థ రాజకీయమే సీమకు శాపం అనే శీర్షికన ఆంధ్రజ్యోతిలో ఒక వ్యాసం ప్రచురిత మైంది. శీర్షికకు పెట్టిన పేరు అక్షరసత్యం. అయితే రచయిత వ్యాసం నిండా అర్థసత్యాలు, అసత్యాలు తప్ప ఏ ఒక్కటీ నిజం కాదు. చంద్ర బాబు అధికారానికి వచ్చిన తర్వాత అహరహం వెనుకబడిన సీమ అభివృద్ధి కోసమే కష్టపడుతు న్నట్లు చెప్పారు. ఆర్థిక, పారిశ్రామిక, మౌళిక సదుపాయాల కొరకు ఆర్థిక ఇబ్బందులలో కూడా అడ్డంకులను అధిగమించి కృషి చేస్తున్నార న్నారు. ఆర్థిక వికేంద్రీకరణను గురించి ప్రస్తావిస్తూ రాయల సీమలో పారిశ్రామికీకరణకు కృషి చేస్తున్నట్లు అందులో పేర్కొ న్నారు.

రోహిత్ మరణానికి కారణమయిన వారిని కటినంగా శిక్షించాలి .

రోహిత్ మరణానికి కారణమయిన  వారిని కటినంగా శిక్షించాలని అఖిల పక్ష్యం, ప్రజసంగల అద్వర్యం లో తిరుపతి సి పి యం ఆఫీసు లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ప్రజా పోరాటాలతో తిప్పికొడతాం - సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు నర్సింగరావు

                 బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్న గిరిజనులను మావోయిస్టులతో సంబంధాలున్నాయని ముద్రవేసి అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గమని, బలమైన ప్రజాపోరాటాల ద్వారా ప్రభుత్వ చర్యలను తిప్పికొడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు హెచ్చరించారు. జర్రెల మాజీ సర్పంచ్‌ వెంకటరమణను మావోయిస్టులు హత్య చేసిన తరువాత ఏజెన్సీలో పోలీసులు తీవ్ర నిర్బంధం ప్రయోగించి మావోయిస్టు కార్యకలాపాలతో సంబంధంలేని గిరిజన యువతను వేధింపులకు గురిచేసి, అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు.

రోహిత్‌ ఆత్మహత్యపై ఆందోళన...

హెచ్‌సీయూలో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్యపై దేశ రాజధాని అట్టుడుకుతోంది. విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు జంతర్‌మంతర్‌ వద్ద పలు విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టారు. రోహిత్‌ ఆత్మహత్యకు బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Pages

Subscribe to RSS - 2016