2016

దిగొచ్చిన పోర్టు యాజమాన్యం

కాకినాడ ; కార్మికులు ఆందోళన ఉధృతం చేయడంతో పోర్టు యాజమాన్యం దిగొచ్చింది. ఆల్‌బెస్ట్‌ కార్మికులకు నష్టపరిహారం అందించేం దుకు రాతపూర్వక ఒప్పందం చేసుకుంది. 20 రోజులుగా కాకినాడ డీప్‌ వాటర్‌ పోర్టు ఆల్‌బెస్ట్‌ కంపెనీ కార్మికులు ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ పోర్టు యాజమాన్యం స్పందించలేదు. దీంతో శుక్రవారం వారు ఆందోళనను ఉధృతం చేశారు. వివిధ కంపెనీల కార్మికులు విధులను బహిష్కరించి వీరికి అండగా నిలిచారు. దీంతో యాజమాన్యం దిగొచ్చింది. డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ సమక్షంలో రాతపూర్వక ఒప్పందం జరిగింది.

ప్రభుత్వ విధానాలతోనే రైతుల ఆత్మహత్యలు

ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక గణేనాయక్‌ భవన్‌లోని జిల్లా కార్యాలయంలో సిపిఎం ఆధ్వర్యంలో రూపొందించిన 'పాలకుల విధానాలకు అన్నదాతలు బలి' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారం చేపట్టిన 18 నెలల కాలంలో జిల్లాలో 162 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2016 నూతన సంవత్సరం జనవరి మాసంలో 25 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, సంక్రాంతి పండుగ నుంచి 16 మంది రైతులు బలవన్మరాలకు పాల్పడ్డారని తెలిపారు.

గ్రానైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వొద్దు

సాలూరు మండలంలో గ్రానైట్‌ తవ్వకాలకు లీజు అనుమతులు ఇవ్వొద్దని తామరకొండ, పోలిమెట్టకొండ, దుక్కడమెట్ట పరిరక్షణ కమిటీ నాయకులు డిమాండు చేశారు. గురువారం ఆ కమిటీ కన్వీనర్‌, గిరిజన సంఘం, నాయకులు ఎం.శ్రీనివాసరావు అధ్వర్యాన రామస్వామిడ వలస, వల్లాపురం, సీతందొరవలస గ్రామాలకు చెందిన గిరిజనులు తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో రిలే నిరహార దీక్షలు ప్రారంభిం చారు. దీక్షలనుద్దేశించి భూ హక్కుల పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్‌ గేదెల సత్యనారాయణ మాట్లాడారు. తామరకొండ, పోలిమెట్టకొండ, దుక్కడమెట్ట ప్రాంతాల్లో గ్రానైట్‌ తవ్వకాల కోసం ప్రధానరాజకీయ పార్టీల అండతో కొంతమంది కాంట్రాక్టర్లు దరఖాస్తు చేశారన్నారు.

మున్సిపల్‌ కార్మికుల ధర్నా

మున్సిపల్‌ కార్మికుల పొట్టగొట్టే 279 జీవోను రద్దుచేయాలని కోరుతూ కనిగిరి నగర పంచాయతీ కార్మికులు శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి నగర పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు కనిగిరి డివిజన్‌ కార్యదర్శి పీసీ కేశవరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ఉద్యోలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా హౌసింగ్‌, ఉపాధి హామి సిబ్బంది తొలగించారని, ఆరోగ్య మిత్ర, అంగన్‌వాడీల మెడమీద కత్తిపెట్టారని ఆన్నారు. మున్సిపల్‌ కార్మికుల తొలగింపునకు జీవో జారిచేయటం దారుణమన్నారు.

పారిశుధ్య కార్మికుల ధర్నా

మున్సిపల్‌ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. సిపిఎం కార్యాలయం నుండి పురపాలక సంఘం వరకు వారు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని, కార్మికులకు ప్రభు త్వమే వేతనాలు చెల్లించాలని, ప్రజల పై భారాలు చేసే యూజర్‌ ఛార్జీలను విరమించాలన్నారు. 279 ఇఒని రద్దు చేయాలని వారు డిమాండ్‌చేశారు.

కార్మిక వ్యతిరేక జిఒ 279ని రద్దు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకిగా వ్యవహరిస్తుందని, మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు అన్యాయం చేసే జిఒ 279ని రద్దు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) జిల్లా అధ్యక్షులు ఆది నికల్సన్‌ డిమాండ్‌ చేశారు.జిఒ 279ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నికల్సన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పించుకునేందుకు ఈ జిఒ తీసుకువచ్చిందన్నారు.

ర‌వాణా శాఖ ప్రైవేటు

                       అతి కీలకమైన రవాణా శాఖను ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించాలని చూస్తోంది. అధికారం చేపట్టినప్పటినుంచీ ప్రైవేటు రాగం తీస్తున్న చంద్రబాబు ఒక్కొక్క ప్రజా సేవపై వేటు వేస్తూ వస్తున్నారు. తాజాగా రవాణా శాఖ సేవలను ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధం చేశారు. బిడ్డింగుల పేరిట బహుళ జాతి సంస్థలకు ఆ బాధ్యతను అప్పగించాలని చూస్తున్నారు. ముందుగా వాహన సేవలన్నింటినీ ఆన్‌లైన్‌ చేసి, వాటి బాధ్యతను ఐదు కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించి కోట్ల రూపాయల భారాలను ప్రజలపై వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఫిబ్రవరి నాటికి విధి విధానాలు విడుదల చేయనున్నట్లు తెలిసింది.

'వంశధార' పనులు నిలిపేయాలి : సిపిఎం

 వంశధార నిర్వాసితులకు పునరావాసం, 2013 ఆర్‌అండ్‌ఆర్‌ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని, అప్పటివరకూ పనులు నిలుపుదల చేయాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. శుక్రవారం కలెక్టరేట్‌లో ఇన్‌ఛార్జి డిఆర్‌ఒ సీతారామారావును సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి బి.కృష్ణమూర్తి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోరాడ నారాయణరావు, వంశధార నిర్వాసిత సంఘం ప్రతినిధి జి.సింహాచలం వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ జలాశయం పనులు చేపట్టి దశాబ్దకాలం పూర్తయినా నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పంచలేదని తెలిపారు.

Pages

Subscribe to RSS - 2016