2016

భూ కేటాయింపులపై ' సిట్‌'

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భూ కుంభకోణంను తెర పైకి తీసుకురావాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. నరేంద్ర మోడి గుజరాత్‌ ముఖ్యమంత్రిగా, ఆనంది బెన్‌ పటేల్‌ రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన భూ,నిధుల కేటాయింపుల దుర్వినియోగం పై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌ చే విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆనంద్‌ శర్మ డిమాండ్‌ చేశారు.' ప్రభుత్వ ,అటవీ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయి. చాలా తక్కువ మొత్తానికి ఆ భూములను ' కార్పోరేట్‌ మిత్రులకు' అప్పటి గుజరాత్‌ ప్రభుత్వం విక్రయించారు' అని ఆయన ఆరోపించారు.

పెద్దలకు కట్టబెట్టేందుకే...

 గత సంవత్సర కాలంగా 9/77 అసైన్డ్‌ చట్ట సవరణపై చర్చ జరుగు తున్నది. ముఖ్యమంత్రి, మంత్రులు నిరంతరం ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. త్వరలో ఈ చట్టాన్ని సవరిస్తామని, అసైన్డ్‌ భూములకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్లకు ఉత్తర్వులు అందినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చట్ట సవరణపై చర్చిస్తామని ముఖ్య మంత్రి ప్రకటించటంతో మరీ వేడెక్కింది. ఈ చట్టం ఉద్దేశం ఏమిటి? ఎవరి రక్షణ కోసం ఈ చట్టం వచ్చింది? ఇప్పుడు ఈ చట్టాన్ని ఎందుకు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉబలాట పడుతోందనేదాన్ని పరిశీలించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. 2006లో కాంగ్రెస్‌ ప్రభుత్వం 9/77 చట్టాన్ని సవరించింది.

యూనివర్శిటీలను కబేళాలుగా..

దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలను మానవ కబేళాలుగా మార్చేందుకు కేంద్రంలోని బిజెపి సర్కారు ప్రయత్నిస్తున్నదని భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) విమర్శించింది. ఇటీవలి కాలంలో ఒకదాని తరువాత ఒకటిగా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిణామాలపై ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ కేంద్ర విశ్వవిద్యాలయంలో రోహిత్‌ ఆత్మహత్య చిచ్చు చల్లారకముందే మరో యువ మేథావి ప్రాణాలు తీసుకోవటం వంటిప రిణామాలను పరిశీలిస్తే దేశంలోని విశ్వవిద్యాలయాలు విద్యార్ధులు, యువ మేధావుల కబేళాలుగా మారుతున్నాయన్న భావన కలుగక మానదని ఎస్‌ఎఫ్‌ఐ పేర్కొంది.

నష్టాల్లో చమురు సంస్థలు..

అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గణనీయంగా పడిపోవడంతో ఆయా సంస్థల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో, ఆర్థిక సాయం కోసం ప్రపంచ బ్యాంక్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని తెలిపాయి. కాగా, చమురు ధరలు రెండేండ్లలో 70శాతానికి తగ్గాయి. గత ఏడాది జూన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌ 115డాలర్లు (రూ.7వేల 800) ఉండగా, ఈ ఏడాది 60డాలర్లకు (రూ.4072 ) దిగి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని నైజీరియా, అంగోలా, ఆఫ్రికాలోని రెండు ప్రముఖ చమురు కంపెనీలు పేర్కొన్నాయి. 

పేదలపై ప్రభుత్వం చిన్నచూపు

పేదలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. పట్టణంలోని ఆదర్శ పాఠశాల సమీపంలో ఇటీవల పేదలు స్వాధీనం చేసుకున్న ఉన్న 570 సర్వే నెంబర్‌ స్థలాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాజకీయ నాయకులు, ధనికులకు వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను కట్టబెడుతోందన్నారు. కొండలకు కూడా పట్టాలు ఇచ్చి వారికి పంపిణీ చేస్తోందన్నారు. పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి మాత్రం వారు ముందుకు రాలేదన్నారు. రెండు విడతల జన్మభూమిలో జిల్లా వ్యాప్తంగా 57,376 మంది పేదలు ఇళ్ల స్థలాల కోసం అర్జీలు ఇచ్చారన్నారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టండి

     ఉత్తరాంధ్ర అభివృద్ధికి తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక సర్క్యూట్‌ హౌస్‌లో వినతిపత్రాన్ని అందజేశారు. 

విజ‌య‌వాడ‌లో గాంధీ కాల‌నీ వాసుల‌కు శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాలు కేటాయించాలి. ` సి.పి.ఎం. రాష్ట్రకార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు సిహెచ్‌.బాబూరావు, న‌గ‌ర క్యార్య‌ద‌ర్శి కాశీనాథ్ డిమాండ్

విజ‌య‌వాడ‌లో గాంధీ కాల‌నీ వాసుల‌కు శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాలు కేటాయించాలి. ` సి.పి.ఎం. రాష్ట్రకార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు సిహెచ్‌.బాబూరావు,  న‌గ‌ర క్యార్య‌ద‌ర్శి కాశీనాథ్ డిమాండ్   

విజ‌య‌వాడ‌లో గాంధీ కాల‌నీ వాసుల‌కు శాశ్వత ప్రాతిపదికన పక్కా గృహాలు కేటాయించాలి. ` సి.పి.ఎం. రాష్ట్రకార్య‌ద‌ర్శివ‌ర్గ స‌భ్యులు సిహెచ్‌.బాబూరావు, న‌గ‌ర క్యార్య‌ద‌ర్శి కాశీనాథ్ డిమాండ్

విజ‌య‌వాడ రాజీవ్‌గాంధీ కాల‌నీలో అగ్ని ప్రమాదం జరిగి మూడు రోజులు అయియినా  అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై సి.పి.ఎం. రాష్ట్ర కార్య‌ద‌ర్శి వ‌ర్గ స‌భ్యులు శ్రీ సిహెచ్‌.బాబూరావు మండిప‌డ్డారు.  వారికి శాశ్వ‌త గౄహాలు మంజూరు చేయాల‌ని కోరారు.  

Pages

Subscribe to RSS - 2016