2016

అయోధ్యపై సుప్రీంతీర్పు తర్వాతే

అయోధ్యలో రామాలయ నిర్మాణంపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి కల్‌రాజ్‌ మిశ్రా తెలిపారు. అలహాబాద్‌ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలైన అప్పీల్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాల్సి వుంది, ఆ తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. దాని తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులను బట్టి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. అయితే, బీజేపీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని సాధ్యం చేసి తీరుతామంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.

1.14 లక్షల కోట్లు మాఫీ..

గత మూడేండ్లలో బ్యాంకుల వద్ద పేరుకుపోయిన రూ. 1.14 లక్షల కోట్ల నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏ) లేదా వసూలు కాని అప్పులను మాఫీ చేశామని ప్రభుత్వం వెల్లడిం చింది. ఈ మొత్తాన్ని భారతీయ బ్యాం కులు గత మూడు ఆర్థిక సంవ త్సరాల్లోనే (2013-15 మధ్య) నష్ట పోయాయి. ఇది గత తొమ్మిదేండ్లలో దేశంలోని 29 రాష్ట్రాలు కలిగి వున్న మొత్తం నిరర్థక ఆస్తుల విలువకన్నా ఎక్కువ.

గ్రీన్‌జోన్‌పై 29 వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ తొల‌గించకుంటే సిఎం క్యాంప్‌ కార్యాయం ముట్టడి అడ్రస్‌లేని అవగాహన సదస్సులు

  అఖిపక్షం ఆధ్వర్యంలో సిఆర్‌డిఎ కార్యాయాన్ని ముట్టడిరచిన  రైతు

గ్రీన్‌జోన్‌పై 29 వరకు ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ తొగించకుంటే సిఎం క్యాంప్‌ కార్యాయం ముట్టడి అడ్రస్‌లేని అవగాహన సదస్సు అఖిపక్షం ఆధ్వర్యంలో సిఆర్‌డిఎ కార్యాయాన్ని ముట్టడిరచిన రైతు

వ్య‌వ‌సాయ ప‌రిర‌క్ష‌ణ జోన్‌పై అభ్యంత‌ర ప్ర‌తాల‌ను సి.ఆర్‌.డి.ఏ(విజ‌య‌వాడ‌) కార్య‌ల‌యంలో క‌మీష‌న‌ర్‌కు అంద‌చేయ‌డానికి వెళ్తున్న అఖిల‌ప‌క్ష నాయ‌కులు.

మెట్రోపై జపాన్‌ బృందం పరిశీలన

జపాన్‌ ప్రభుత్వ ప్రతినిధుల బృందం విజయవాడలో పర్యటించనుంది.  మెట్రోరైలుపై క్షేత్రస్థాయిలో ఈ బృందం పరిశీలన చేయనుంది. నగరంలో మెట్రోరైల్‌ స్టేషన్లు వచ్చే ప్రాంతాలను బృంద సభ్యులు పరిశీలించనున్నారు..

పటేల్‌పై దేశద్రోహం కేసువిచారణ..

 గుజరాత్‌లో పటేల్‌ వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలంటూ ఉద్యమించిన పటేల్‌ వర్గనేత హార్దిక్‌ పటేల్‌, మరో ముగ్గురిపై దేశద్రోహం కేసును సిటీ సెషన్స్‌ కోర్టు విచారించనుంది.

సార్వత్రిక సమ్మెపై బ్యాలెట్‌..

కేంద్రప్రభుత్వం నియమించిన 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులను వ్యతిరేకిస్తూ చేపట్టనున్న సార్వత్రిక సమ్మెపై నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేస్‌(ఎన్‌.ఎఫ్‌.ఐ.ఆర్‌), దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌.. ఉద్యోగులు, కార్మికుల అభిప్రాయాలను సేకరించనున్నాయి. ఇందుకు గాను ఈ నెల 8, 9 తేదీల్లో ఓటింగ్‌ను నిర్వహించనున్నారు. 

కాపు కార్పొరేషన్‌కు 1000cr

ముద్రగడతో చర్చలు మంచి వాతావరణంలో జరిగాయని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. గత నాలుగు రోజులుగా ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడతో ప్రభుత్వ ప్రతినిధుల చర్చలు సఫలం కావడంతో ఆయన దీక్ష విరమించారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ ముద్రగడతో అన్ని విషయాలు మాట్లాడామన్నారు. వచ్చే బడ్జెట్‌లో కాపు కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

VC లతో హెచ్‌ఆర్డీ సమావేశం..

దళిత స్కాలర్‌ రోహిత్‌ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలకు మానవ వనరుల అభివృద్ధి శాఖ(హెచ్‌ఆర్డీ) ఇన్నాళ్లకు స్పందించింది. విశ్వవిద్యాలయాల్లో అణగారిన వర్గాలపై వివక్షకు అంతం పలకడానికి అన్ని వర్సిటీల ఉపకులపతిలతో ఫిబ్రవరి18న సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు దేశంలోని 46 కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతిలను ఢిల్లీకు రప్పించ నుంది.

Pages

Subscribe to RSS - 2016