2016

మోడీతో జట్టు కడతా: ఒవైసీ

మజ్లిస్‌ నేత, శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ ప్రసంగానికి చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. అందులో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి దేశంలో కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేస్తానని చేసిన వ్యాఖ్యలున్నాయి.కాంగ్రెస్‌ నేతలు గాంధీలకు బానిసలని ఆయన ఎద్దేవా చేశారు.

ఆక్వాఫుడ్‌పార్క్‌పై రైతుల ఆందోళన

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మత్స్యకారులు, రైతులు ఆందోళనకు దిగారు. తుందుర్రులో చేపట్టిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్కు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ గురువారం భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఫుడ్‌ పార్కు నిర్మిస్తున్న తుందుర్రు, కె.బేతపూడి, జొన్నలగర్వు గ్రామస్తులతోపాటు.. మొగల్తూరు మండల కేంద్రం, ముత్యాలపల్లి, కొత్తోట, వారతిప్ప, కాళీపట్నం తదితర ప్రాంతాల రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. మొగల్తూరు ప్రధాన రహదారి నుంచి నరసాపురం సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు.

279జిఒని ఉపసంహరించుకోవాలి..

తమ కడుపులను కొట్టే జిఒ 279ని ఉపసంహరించుకో వాలని డిమాండు చేస్తూ పారిశుధ్య కార్మికులు గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను ముట్టడించారు. అందులోభాగ ంగా గుంటూరు, కడప, అనంతపురం జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.. మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు, నగర నాయకులు ముత్యాలరా వును పోలీసులు అరెస్ట్‌ చేసి అనంతరం విడుదల చేశారు. తొలుత నిర్వహించిన ధర్నాలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, జిఒను రద్దు చేయకుంటే దీర్ఘకాలిక సమ్మెకు పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై ప్రజాభిప్రాయ ఓటింగు పెట్టండి

విజయనగరం జిల్లా భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలా? వద్దా? అనే విషయమై దమ్ముం టే చంద్రబాబునాయుడు 'ప్రజాభిప్రాయ ఓటింగు' పెట్టాలని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులు సవాల్‌ విసిరారు. 'మెజార్టీ ప్రజలు ఎయిర్‌పోర్టు కావాలంటే కట్టుకోండి. లేదంటే తోకము డిచి ఎయిర్‌పోర్టు ప్రతిపాదన విరమించు కోండి' అని సూచించారు. రాష్ట్ర రాజధానికి గన్నవరం ఎయిర్‌పోర్టు సరిపోయినప్పుడు, విశాఖలో ఎయిర్‌పోర్టు ఉండగా ఇక్కడ మరొకటి ఎందుకని ప్రశ్నించారు. ఇది భోగాపురంలోని పెద్దల భూములకు ధరలు పెరగడానికి తప్ప, ప్రయాణికుల కోసమో, ప్రజల కోసమో కాదని విమర్శించారు. అభివృద్దే అనుకుంటే..

ఎపిఎన్‌జిఒ సంఘ రాష్ట్ర మహాసభల పోస్టరావిష్కర‌ణ‌

   ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యలను పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధమేనని కార్మికశాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం మండలంలోని నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎపిఎన్‌జిఒ సంఘ 19వ రాష్ట్ర మహాసభలకు సంబంధించి ఆ సంఘం శ్రీకాకుళం జిల్లా శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌జిఒల రాష్ట్ర మహాసభలు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు.

అడుగులో అడుగు వేస్తూ...

వంశధార నిర్వాసితుల పాదయాత్ర
కష్టాలను చెప్పుకోవడానికి బయలుదేరిన నిర్వాసితులు
మరో పోరాటానికి సిద్ధమైన బాధితులు
పాదయాత్రకు విశేష స్పందన

ప్రయివేటు రంగంలోనూ దామాషా పద్ధతి

ప్రయివేటు రంగంలో దామాషా పద్ధతి (జనాభా నిష్పత్తి)లో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రయివేటు రంగంలో రిజర్వేషన్స్‌ పోరాట సాధన కమిటీ సలహాదారు కె.ఎస్‌.చలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్‌ ఆడిటోరియంలో ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు పోరాట సాధన కమిటీ ఆధ్వర్యంలో 'ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలి' అనే అంశంపై జిల్లా సదస్సు నిర్వహించారు. కెవిపిఎస్‌ జిల్లా ప్రధానకార్యదర్శి డి.గణేష్‌ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో కె.ఎస్‌.చలం మాట్లాడారు.

BC కమిషన్‌ లేకుండా చేర్చలేం..

బీసీ కమిషన్‌ నివేదిక ద్వారానే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కమిషన్లు లేకుండా ఇంతవరకు ఎవర్నీ బీసీల్లో చేర్చలేదని, అలా చేసినపుడల్లా న్యాయస్థానాలు సదరు రిజర్వేషన్లను కొట్టేశాయని తెలిపారు. అదే సమయంలో కాపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రకటనలు చేయవద్దని బీసీ నేతలను కోరారు.

Pages

Subscribe to RSS - 2016