2016

విశాఖ ' ప్రత్యేక రైల్వేజోన్‌ ' ఏర్పాటు చేయాలి

           విశాఖపట్నం, వాల్తేరు డివిజన్‌ను ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా నాయకులు కె లోకనాధం, డాక్టర్‌ బి గంగారావు ఆర్‌కెఎస్‌వి కుమార్‌ ఈస్ట్‌కోస్టు రైల్వే జనరల్‌ మేనేజరు రాజీవ్‌ విష్ణోరుకు వినతిపత్రం అందజేశారు. శుక్రవార స్థానిక డిఆర్‌ఎం కార్యాలయంలో జిఎమ్‌ను కలిసి, వినతిపత్రం అందజేసిన తర్వాత వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టం, 2014లో పేర్కొన్న విశాఖపట్నం ప్రత్యేకరైల్వేజోన్‌ అంశాన్ని జిఎం దృష్టికి తీసుకెల్లామన్నారు. ఏడాదికి సుమారు రూ. 7 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న వాల్తేరు డివిజన్‌ను ప్రత్యేక జోన్‌గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

భోగాపురంపై హైకోర్టు స్టే..

విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ధర్మాసనం సోమవారం సాయంత్రం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఎయిర్‌పోర్టు భూసేకరణకు జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ చెల్లదని స్పష్టం చేసింది. భూసేకరణ నోటిఫికేషన్‌ రాష్ట్ర గజిట్‌ పరిధిలోకి వస్తుందని పేర్కొంది. దీనికి భిన్నంగా కలెక్టర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వడం చట్ట నిబంధనలను ఉల్లంఘించడమేనని తెలిపింది. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తుండడాన్ని కోర్టు తప్పు పట్టింది.

ముగిసిన SFI జాతీయ మహాసభలు

దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా రంగంపై పెద్ద ఎత్తున దాడి జరుగు తోందని, దాని కను గుణంగానే విధానాల రూప కల్పన జరుగు తోందని ఎస్‌ఎఫ్‌ఐ 15వ జాతీయ మహాసభ పేర్కొంది. దేశవ్యాప్తంగా విద్య కాషాయీకరణకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాడాలని మహాసభ నిర్ణయించింది. సోమవారం రాజస్థాన్‌లోని సీకర్‌ (సుదీప్తో గుప్తా నగర్‌)లో ఎస్‌ఎఫ్‌ఐ 15వ అఖిల భారత మహాసభలు ఘనంగా ముగిసాయి.

భారత్ ఫ్రాన్స్ మధ్య రాఫెల్ ఒప్పందం

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య సంతకాలు జరిగాయి. అయితే వీటి ధరకు సంబందిóచిన ప్రతిష్టంభన ఇంకా అలానే కొనసాగుతోంది. 36 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ఇంటర్‌ గవర్నమెంటల్‌ అగ్రిమెంట్‌ (ఐజిఎ) పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

సింగపూర్‌ మాస్టర్‌ప్లాన్‌ నమూనాల దహనం

సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌ సమూ లంగా మార్చాలని, వ్యవ సాయ పరిరక్షణ జోన్‌లో ఆంక్షలు ఎత్తివేయాలని CRDA కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. మాస్టర్‌ప్లాన్‌ నమూనాలను రైతులు, నాయకులు దహనం చేశారు. వ్యవసాయ జోన్ల పేరుతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతులకు సిఆర్‌డిఎ ఉరి తాడు బిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఆర్‌డిఎ చైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. పారిశ్రామిక వేత్తలు, అధికార పార్టీ నాయకులతో సహా అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో మాస్టర్‌ప్లాన్‌ తిరస్కరిస్తున్నారని, స్వదేశీ నిపుణులతో మాస్టర్‌ప్లాన్‌ రూపొందించాలని డిమాండ్‌ చేశారు.

అట‌వీ భూములివ్వం:కేంద్రం

  రాజధాని చుట్టు పక్కల 33,500 హెక్టార్ల (83,750 ఎకరాలు) అటవీ భూమిని రాజధానికి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఏపీ రాజధానికి అటవీ భూములివ్వబోమని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది.

యూనివర్సిటీల బంద్ కు పిలుపు ..

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయు)లో వివక్షపై పోరు రోజురోజుకు ఉధృతమవుతోంది.హెచ్‌సీయు వెలివాడలో నిర్వహించిన సభలో వివిధ ప్రజా, దళిత, విద్యార్థి, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు భవిష్యత్‌ కార్యాచరణలో భాగంగా బుధవారం దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల బంద్‌కు హెచ్‌సీయు జేఏసీ పిలుపునిచ్చింది. 

డెక్కన్‌ కెమికల్ కంపెనీ విస్తరణ అనుమతులు నిలిపేయాలి. ఫిబ్రవరి 23న ప్రజాభిప్రాయసేకరణను రద్దు చేయండి - జిల్లా కలెక్టర్‌కు సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథం లేఖ

            విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ కంపెనీ విస్తరణ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, దీని కోసం వచ్చే నెల 23న నిర్వహించబోయే ప్రజాభిప్రాయసేకరణను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ను సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్‌కు లోకనాథం రాసిన లేఖను పత్రికలకు విడుదల చేశారు. 'భద్రతా చర్యలు పాటించకపోవడంతో తరచూ డెక్కన్‌ కెమికల్‌ కంపెనీలో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు.

Pages

Subscribe to RSS - 2016