2016

విలీన మండలాల్లో అభివృద్ధిపై

భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని విలీన మండలాల్లో పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా అభివృద్ధి పనులపై దృష్టిపెట్టాలని భద్రాచలం ఎంఎల్‌ఎ సున్నం రాజయ్య కోరారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ వెంకటేశ్వరరావును సోమవారం కలిశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషబాబ్జితో కలిసి సమస్యలను వివ రించారు.

ఊళ్లకు ఊళ్లే మారొచ్చు:బాబు

రాజధాని ప్రాంతంలో సమస్యల పేరుతో రైతులు తిరగ బడితే వారికే నష్టమని, కొద్దిమంది పనీపాటా లేనివాళ్లు మాత్రమే అక్కడ అల్లరి చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులకున్న రుణమాఫీ మొత్తం రద్దు చేస్తానని తాను చెప్పలేదని, వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద రూ.1.50 లక్షల మాత్రమే ఇస్తానని చెప్పానని అన్నారు.రోడ్లవల్ల కొద్ది ఇళ్లు పోతాయని, ఆందోళన చేపడితే భవిష్యత్‌లో జరిగే మార్పులకు ఊళ్లకు ఊళ్లే మార్చాల్సిన పరిస్థితి రావచ్చని తెలిపారు..

RSSపై పరోక్ష్యంగా మాజీ జస్టిస్ విమర్శలు

ఆర్‌ఎస్‌ఎస్‌కు భయపడి ఏ ఒక్కరికో ఓట్లు వేయొద్దని ముస్లింలకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏఎం అహ్మదీ పరోక్షంగా సూచించారు. ‘‘నిక్కర్లు ధరించి చేతిలో లాఠీలు పట్టుకొని రోడ్లపైకి వచ్చేవారిని చూసి భయపడకండి. ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు కేవలం ఎన్నికల సమయంలోనే వారు బయటకు వస్తారు. అది ఎన్నికల ప్రక్రియలో భాగం’’ అని ఆర్‌ఎస్‌ఎస్‌ పేరు ప్రస్తావించకుండా అహ్మదీ పేర్కొన్నారు. 

అభివృద్ధి మంత్రం - అసలు తంత్రం!

ఈ మధ్య విజయవాడ పుస్తక ప్రదర్శనలో ప్రసంగించిన తర్వాత నాతో మాట్లాడిన వారిలో ఇద్దరు విద్యాధికులు ఒక అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రసంగం ప్రధాన భాగాన్ని అభినందిస్తూనే అమరా వతిని భ్రమరావతి అని వర్ణించడం ఎందు కని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చేస్తే మంచిదే కదా అని అడిగారు. అమరావతిపై అనేకసార్లు ఈ శీర్షికలో చెప్పుకున్నాం. మొన్నటి మంత్రి వర్గ సమావేశం తర్వాత ఒక సీనియర్‌ మంత్రితో మాట్లాడితే ముఖ్యమంత్రి సింగపూర్‌పై చాలా ఆశలు పెట్టుకున్న మాట నిజమైనప్పటికీ వారి నుంచి అంత సహకారం రాలేదని చెప్పారు. ఈ కారణంగా హడ్కో రుణ సహాయంతో తామే నిర్మాణం చేపట్టవచ్చని సూచించారు.

బిసిల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలి - ప్రొఫెసర్‌ దుర్గాప్రసాద్‌, జమలయ్య డిమాండ్‌

రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేయాలని, బిసిలకు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని బిసి సబ్‌ప్లాన్‌, ప్రయివేటు రంగంలో రిజర్వేషన్ల సాధన వేదిక రాష్ట్ర గౌరవ సలదారులు ప్రొఫెసర్‌ ఎ.దుర్గాప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. పోరాట వేదిక ఆధ్వర్యంలో, జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల యూనియన్‌ ఛైర్మన్‌ గంటా శ్రీరామ్‌ అధ్యక్షతన స్థానిక వివేకానంద హాలులో ఆదివారం జిల్లా సదస్సు జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 50శాతానికి పైగా ఉన్న బిసిల్లో అత్యధిక మంది సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారన్నారు.

'బాక్సైట్‌'పై ఐక్య ఉద్యమం, ఏజెన్సీలో నిర్బంధం ఆపి కేసులు ఎత్తివేయాలి - గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాబూరావు

ప్రజా ప్రయోజనాల పేరుతో గిరిజనుల జీవితాలను ఫణంగా పెట్టి కార్పొరేట్‌ శక్తుల లాభాల కోసం బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న పాలకుల నిరంకుశ చర్యలను ఐక్య పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ఎపి గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డాక్టర్‌ మిడియం బాబూరావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని నార్ల వెంకటేశ్వరరావు భవన్లో 'జువార్‌ నేస్తం' పుస్తకాన్ని ఆదివారం ఆయన ఆవిష్కరించారు.

రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన వారిని క‌ఠినంగా శిక్షించాలి

దళిత పరిశోధక విద్యార్ధి రోహిత్‌ వేముల‌ ఆత్మహత్యకు కారకులైన విసి అప్పారావు, కేంద్ర‌మంత్రులైన బండారు, స్మృతి ఇరానీల‌ను కూడా  కఠినంగా శిక్షించాల‌ని కోరుతూ శుక్రవారం విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ బంద్‌ పూర్తిగా జయప్రదమయ్యింది. వేలాదిమంది విద్యార్ధులు తమ తరగతుల‌ను బహిష్కరించి  భారీ ర్యాలీ నిర్వహించారు. గత రెండురోజుల‌ నుండి ఎస్‌.ఎఫ్‌.ఐ నాయ‌కులు ప్రతి విద్యార్ధిని కలిసి కరపత్రాలు పంపిణీచేసి బంద్‌లో పాల్గొవాల‌ని పెద్దఎత్తున ప్రచారం నిర్వహించింది.

ఈవీఎంలలో ‘టోటలైజర్‌’..

ఓటర్ల వివరాలను మరింత గోప్యంగా ఉంచేందుకు వీలుగా ఈవీఎంలలో ‘టోటలైజర్‌’ అనే కొత్త పరికరాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.టోటలైజర్లను ఏర్పాటు చేయాలని ఈవీఎం తయారీదారులైన ఈసీఐఎల్‌, బీఈఎల్‌ కంపెనీలకు ప్రభుత్వంలో గతంలోనే సూచించింది.

ఫోరెన్సిక్‌కు రోహిత్‌ సూసైడ్‌ నోట్

దళిత స్కాలర్‌ రోహిత్‌ వేముల చివరగా రాసిన ఆత్మహత్య లేఖను ఫోరెన్సిక్‌ పరీక్షకు పంపినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా ఆ లేఖను ఫోరెన్సిక్‌కు పంపినట్లు తెలుస్తోంది. అయితే రోహిత్‌ మృతితో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో మిగతా నలుగురు విద్యార్థులపై సస్పెన్షన్‌ నిలిపివేశారు. అయినప్పటికీ విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తున్నారు. రోహిత్‌ మృతికి కారణమైన కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయ, హెచ్‌సియూ వైస్‌ ఛాన్స్ లర్‌ అప్పారావును తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు రోహిత్‌ సూసైడ్‌ పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Pages

Subscribe to RSS - 2016