2016

చంద్రన్న కానుక ఎక్కడ ?..

సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న 'చంద్రన్న కానుక' అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. పండుగ దగ్గర పడుతున్నా ఇంకా సరుకులు అందకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో ప్రజల గంటలకొద్ది క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కానుక రూపంలో అందిస్తున్న సరుకులు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి. సంక్రాంతి పండుగ కోసం ప్రభుత్వం అందిస్తున్న 'చంద్రన్న కానుక'పై నెల్లూరు జిల్లాలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతి దగ్గరకు వచ్చినా కానుక అందడం లేదని ప్రజలు వాపోతున్నారు.

బలమైన సిపిఐ(ఎం)ను నిర్మిద్దాం..

ఇరవైఒకటవ పార్టీ మహాసభ ఆదేశాల మేరకు సిపిఐ(ఎం) ప్లీనం సమావేశమయింది. తన పనిని '2015 చివరికల్లా' పూర్తిచేసింది. కేవలం ఎనిమిది నెలల కాలంలో పార్టీ మహాసభ ఆదేశాలను సిపిఐ(ఎం) నెరవేర్చ గలగటం గౌరవప్రదమైన విజయం. ప్లీనం నిర్వహించటానికి ఒక సమగ్రమైన, సవివర మైన విధానాన్ని, టైంటేబుల్‌ను పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించింది. ప్రస్తుత పార్టీ నిర్మాణం, పనితీరులను గురించి రాష్ట్ర కమిటీల నుంచి విస్తృత సమాచారాన్ని సేకరించటం కోసం ఒక వివరణాత్మక మైన ప్రశ్నావళిని పార్టీ కేంద్రం రూపొందించింది.

బలవంతపు భూ సేకరణ ఆపకపోతే ఆందోళన ఉధృతం..

గ్రామాల్లోకి సర్వేయర్లను రానీయకుండా అడ్డుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు రైతులకు పిలుపిచ్చారు. ప్రకాశం జిల్లా పామూరు మండలం మాలకొండాపురం వద్ద బలవంతపు భూ సేకరణను వ్యతిరేకిస్తూ నిమ్జ్‌ రైతులు, కూలీల సదస్సు సోమవారం జరిగింది. సయ్యద్‌ హానీఫ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మధు ముఖ్య వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం బలవంతపు భూ సేకరణ ఆపకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. '2013 జిఒ ప్రకారం భూమిని తీసుకోవాలంటే నష్ట పరిహారం చెల్లించి సర్వే చేయాలి. గ్రామ సభలు పెట్టాలి. 80 శాతం మంది మెజారిటి ఆమోదం పొందాలి. ఆ తరువాత పనులు చేపట్టాలి.

నల్లధనమా! నువ్వెక్కడీ

 నల్ల కుబేరులు, స్విస్‌ బ్యాంకు, హవాలా, విదేశీ బ్యాంకు ఖాతాలు వగైరా మాటలు రోజూ పేపర్లు, టీవీ ఛానెళ్లలో చూసీ చూసీ, వినీ వినీ నవ్వాలో, ఏడవాలో తెలియని స్థిలో ఉన్నాం మనం. నేను ఒక పల్లెటూరి రైతును నల్ల ధనం అంటే ఏమిటని అడిగితే దొంగ నోట్లు అని ఠక్కున సమాధానమిచ్చాడు. ఆయన్ని చూసి నవ్వుకునే పరిస్థితిలో మనమేమీ లేము. ఎందుకంటే మనమూ అంతే అమాయకత్వంతో, తెలివితక్కువతనంతో ఆలోచిస్తు న్నాం. నేను ఇంటర్‌ విద్యార్థిగా ఉన్న రోజుల్లో (1996) మధ్యతరగతి అభిమాన నాయకులు వాజ్‌పేయి తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో స్విస్‌ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న వారి పేర్లు బయటపెడతామంటే నమ్మి తెరిచిన నోరు ఇప్పటికీ మూతబడలేదు.

RSS తొత్తుగా కేంద్రం:అనీరాజా

కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ తొత్తుగా వ్యవహరిస్తోందని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అనీ రాజా ఆరోపించారు. సోమవారం సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మహిళలు విరోచిత పోరాటం చేస్తే కొంతమంది మాత్రమే వాటి ఫలాలను అనుభవిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రం ఏర్పడితే మహిళలు, నిరుద్యోగులకు అపార అవకాశాలు వస్తాయన్న కేసీఆర్‌, రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి అయ్యాక నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు. 

ప్రైవేటువర్సిటీ చట్టం..గెజిట్‌

ప్రైవేటు యూనివర్సిటీలు ( ఎస్టాబ్లిష్‌మెంట్‌ రెగ్యులేషన్‌ ) బిల్లు - 2015ను గెజిట్‌లో ప్రచురణ నిమిత్తం ప్రభుత్వం జీవో నెం.3 ను సోమవారం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 22న శాసన సభలో ప్రైవేటు యూనివర్సిటీ బిల్లు - 2015 ప్రవేశపెట్టింది. గ్రీన్‌ఫీల్డ్‌ ప్రైవేటు యూనివర్సిటీల ద్వారా ప్రపంచ స్థాయి విద్యా విధానం అందించే ఉద్దేశంతో తీసుకువచ్చిన ఈ బిల్లుకు గవర్నర్‌ ఈఎల్‌ నరసింహన్‌ ఈ నెల 8న ఆమోదం తెలిపారు. దీంతో బిల్లును గెజిట్‌లో ప్రచురించేందుకు గాను న్యాయశాఖ సోమవారం జీవో నెం.3ను విడుదల చేసింది. 

విశాఖ ఏజెన్సీలో ఉక్కుపాదం..

విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ ఉద్యమంపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా బాక్సైట్‌ వ్యతిరేక గొంతులను నొక్కేస్తోంది. భవిష్యత్‌లో బాక్సైట్‌ వ్యతిరేక పోరాటంలో పాల్గొనకుండా గిరిజనులను భయభ్రాంతులకు గురిజేస్తోంది. అక్రమ కేసులు బనాయించి నిర్బంధం ప్రయోగిస్తోంది. జర్రెల మాజీ సర్పంచ్‌ సాగి వెంకట రమణను హత్య చేసిన మావోయిస్టులకు సహకరించారన్న సాకును చూపించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిని పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. 

నీరోలా మారిన నారా:రఘువీరా

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును చూస్తుంటే నీరో చక్రవర్తి తీరు గుర్తుకు వస్తుందని పిసిసి అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు.రాష్ట్ర ప్రజలు, రైతులు అవస్థలు పడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా నదిపై ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పాలమూరు- రంగారెడ్డి, నక్కల గండి ఎత్తిపోతల పథకాలు కృష్ణా, పెన్నా డెల్టాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని, అలాంటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

ఇష్టారాజ్యంగా ఎసైన్డ్‌ భూముల కొనుగోళ్లు

క్రమబద్ధీకరణ ముసుగులో రాజధాని అమరావతి ప్రాంతంలోని వేలాది ఎకరాల అసైన్డ్‌ భూముల క్రయ విక్రయాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.అనేక మంది పెద్దలు వేలాది ఎకరాల అసైన్డు భూములను కొనుగోలు చేస్తున్నారని, ప్రమాదకరమైన ఈ కుంభకోణం త్వరలో వెలుగులోకి వస్తుందని రామకృష్ణ తెలిపారు. అసైన్డ్‌ భూముల చట్ట ప్రకారం ఎవరికైనా ఒకసారి భూమిని ప్రభుత్వం ఇస్తే దాన్ని వారు అమ్మటంగానీ, వేరెవరైనా కొనటంగానీ చేయకూడదన్నారు. అందుకు భిన్నంగా క్రయ విక్రయాలైన భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం యత్నించటం శోచనీయమన్నారు.

గిరిజన చట్టాలకు తిలోదకాలు..

ఏజన్సీ ప్రాంతాల్లో పటిష్టమైన చట్టాలున్నా వాటిని అమలు చేయకుండా లక్షలాది ఎకరాల ఆదివాసీల భూములను ప్రభుత్వం లాక్కొంటోందని ఆదివాసీ భూమి హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో మాజీ ఎంపి మిడియం బాబూరావు మాట్లాడుతూ గిరిజన, ఆదివాసీ భూములను దోచుకోవడంలో ప్రభుత్వానికి చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటివేవీ పట్టడం లేదన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి పనులు చేపట్టాలన్నా గ్రామసభల తీర్మానాలుండాలన్నారు. ప్రభుత్వం భూ బ్యాంకుల పేరుతో మరణ శాసనం రాస్తోందని వ్యాఖ్యాని ంచారు.

Pages

Subscribe to RSS - 2016