చంద్రన్న కానుక ఎక్కడ ?..

సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న 'చంద్రన్న కానుక' అందక లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. పండుగ దగ్గర పడుతున్నా ఇంకా సరుకులు అందకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో ప్రజల గంటలకొద్ది క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కానుక రూపంలో అందిస్తున్న సరుకులు నాసిరకంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తున్నాయి. సంక్రాంతి పండుగ కోసం ప్రభుత్వం అందిస్తున్న 'చంద్రన్న కానుక'పై నెల్లూరు జిల్లాలో అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతి దగ్గరకు వచ్చినా కానుక అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. 270 రూపాయల విలువైన 20 కిలోల బియ్యం, కిలో గోధుమపిండి, అరకిలో కందిపప్పు, అరలీటర్‌ పామాయిల్‌, అరకిలో శనగప్పు, అరకేజి బెల్లం, 100 గ్రాముల నెయ్యి ఇంతవరకు తమకు అందలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌ నెల నుంచే ఈ పంపిణీ మొదలుపెట్టాలని ప్రభుత్వం ఆదేశించినా డీలర్లు ఆ ఆదేశాలను బేఖాతరు చేసి సరుకులను అందించడంలో జాప్యం చేశారంటున్నారు.