RSS తొత్తుగా కేంద్రం:అనీరాజా

కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్‌ తొత్తుగా వ్యవహరిస్తోందని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) ప్రధాన కార్యదర్శి అనీ రాజా ఆరోపించారు. సోమవారం సమాఖ్య తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు హైదరాబాద్‌లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మహిళలు విరోచిత పోరాటం చేస్తే కొంతమంది మాత్రమే వాటి ఫలాలను అనుభవిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర కేబినెట్‌లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రం ఏర్పడితే మహిళలు, నిరుద్యోగులకు అపార అవకాశాలు వస్తాయన్న కేసీఆర్‌, రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రి అయ్యాక నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారని విమర్శించారు.