2016

రబీ సాగేనా

రబీని ఏటా నీటి కొరత వెంటాడుతోంది. ప్రభుత్వానికి ముందుచూపు కొరవడ టంతోపాటు, రైతులను గందరగోళ ప్రకటనలతో అయోమయానికి గురిచేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో 4.09 లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని ప్రభుత్వం రెండు నెలల క్రితం ప్రకటించింది. నెల రోజుల తర్వాత '3.49 లక్షల ఎకరాలకే నీరిస్తాం.

తపాలా సేవలు 'బహుళజాతి' సంస్థల పరం

ప్రతిష్టాత్మకమైన భారత తపాలా సేవలు బహుళజాతి సంస్థల పరం కాబోతున్నాయి. ఐసిఐసిఐ, సిటీ బ్యాంక్‌ వంటి మొత్తం 40 బహుళజాతి ఆర్థిక సంస్థల కోసం భారత తపాలాశాఖ తలుపులు బార్లా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మార్చ్ లో రెండు వేల ఇళ్ల తొలగింపు..

రాజధాని నగర ప్రాంతంలో 2 వేల నివాసాలు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. అందుకు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. తొలగించాల్సిన ఇళ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. వచ్చే మార్చిలో ప్రధాన అనుసంధాన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, ఆలోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రోడ్ల నిర్మాణం, ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితర పనులకు మెకన్సీ సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా పనులు చేపట్టనున్నారు. ఈలోపే రోడ్డు వెళ్లే సర్వే నెంబర్లలో ఉన్న ఇళ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టే ఉద్దేశంతో ప్రభుత్వముంది. 

మోడీ సారధ్యంలో క్లోజింగ్‌ ఇండియా..

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారధ్యంలో 'క్లోజింగ్‌ ఇండియా' అవుతోందని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేక్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఇన్‌ ఇండియా, స్కిల్డ్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా అంటూ ప్రజలను భ్రమల్లో ముంచివేస్తున్నారని ఆరోపించారు. కార్పోరేట్లు, పెట్టబడిదారులకు దాసోహమంటూ.. హిందుస్థాన్‌ మెసిన్‌ టూల్స్‌ (హెచ్‌ఎంటీ) వంటి సంస్థలను మూసివేస్తే.. 'మేక్‌ ఇన్‌ ఇండియా' ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 

కేజ్రీ నితీష్‌లే పెద్దముప్పు..

కేజ్రీవాల్‌, నితీష్‌ కుమార్‌ లాంటి నకిలీ ముస్లింల వల్లే దేశానికి ముప్పు అని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ అన్నారు. దేశంలో అసహనం పెరుగుతోందంటూ రాద్దాంతం చేసిన కేజ్రీవాల్‌, నితీష్‌లు బీహార్‌ ఎన్నికల తరువాత ఆ ఊసే ఎత్తడంలేదని మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారన్న ఆయన, అందులో వివాదం ఏముందని ప్రశ్నించారు.

GSTపై సోనియాతో వెంకయ్య భేటీ..

జీఎస్టీ బిల్లు ఆమోదానికి సానుకూల నిర్ణయం తీసుకుంటే బడ్జెట్‌ సమావేశాలను ముందే ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెంకయ్య నాయుడు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో అన్నారు. గురువారం ఢిల్లీలో సోనియా గాంధీని వెంకయ్యనాయుడు కలిశారు. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్‌ లేవనెత్తిన మూడు అంశాలపై ఇప్పటికే ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సవివరంగా సమాధానం చెప్పారని, కాబట్టి బిల్లు ఆమోదానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

అంగన్‌వాడీలను వర్కర్లుగా:తపన్‌సేన్‌

ఆలిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌్‌ సిల్వర్‌జూబ్లీ ఉత్సవాల సందర్భంగా నాలుగు రోజుల పాటు జరిగే 8వ మహాసభ గురువారం హైదరాబాద్‌లోని ఆర్టీసి కళాభవన్‌ (కామ్రేడ్‌ దీపామాలిక్‌ మంచ్‌, కామ్రేడ్‌ ఆర్తీదాస్‌ గుప్తా హాల్‌)లో ఉత్సాహంగా ప్రారంభమైంది.ఆరోగ్యవంతమైన భావి భారతావనికి కృషి చేస్తున్న అంగన్‌వాడీలు తమను వలంటీర్లుగా కాకుండా వర్కర్లుగా గుర్తించాలని రోడ్డున పడి పోరాటం చేయాల్సి రావడం దురదృష్టకరమని సీఐటీయూ అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ అన్నారు. ఇలాంటి కీలకమైన భాద్యత నిర్వర్తిన్తున్న అంగన్‌వాడీల సమస్యలపై పాలకులు సానుకూలంగా స్పందించకపోవడం సరికాదని చెప్పారు.

సందీప్‌ పాండేపై RSS వేటు..

విద్య, భావజాల రంగాల్లో హిందూత్వ శక్తులు పేట్రేగిపోతున్నాయి.తాజాగా బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన ఐఐటీ ప్రముఖ సామాజిక కార్యకర్త, మెగసెసే అవార్డు గ్రహీత సందీప్‌ పాండేను బోధనా బాధ్యతల నుంచి తొలగించింది. సందీప్‌ ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా ఉన్నారు. ఆయన 'అవాంఛనీయ కార్యకలాపాలకు' పాల్పడుతున్నారని అధికారులు ఆరోపించారు. కాగా, తనను వెళ్లగొట్టడం వెనుక ఆర్‌ఎస్‌ఎస్‌ హస్తముందని సందీప్‌ పాండే ఆరోపించారు. 

బర్ధన్‌ కష్టజీవుల పక్షపాతి:మధు

సిపిఐ రాష్ట్ర సమితి బర్ధన్‌ సంస్మరణ సభ ను విజయవాడలోని దాసరి నాగభూషణరావు భవన్‌లో గురువారం నిర్వహించింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లా డుతూ బర్ధన్‌ కార్మికులు, కష్టజీవుల పక్షపాతని పేర్కొంటూ నివాళులర్పించారు. నమ్మిన సిద్ధాం తాల కోసం అలుపెరగని పోరాటం చేశారన్నారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 1991నాటి నూతన ఆర్థిక విధానాలు, ప్రపంచీకరణ విధానాలకు తిలోదకాలు పలకాలని చెప్పిన వారిలో బర్థన్‌ ఒకరని తెలిపారు. 

Pages

Subscribe to RSS - 2016