తపాలా సేవలు 'బహుళజాతి' సంస్థల పరం

ప్రతిష్టాత్మకమైన భారత తపాలా సేవలు బహుళజాతి సంస్థల పరం కాబోతున్నాయి. ఐసిఐసిఐ, సిటీ బ్యాంక్‌ వంటి మొత్తం 40 బహుళజాతి ఆర్థిక సంస్థల కోసం భారత తపాలాశాఖ తలుపులు బార్లా తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లా డుతూ, తపాలా బ్యాంకింగ్‌ సేవల్లో బహుళజాతి సంస్థలకు పెద్ద పీట వేయనున్నట్లు చెప్పారు.బ్యాంక్‌ ఏర్పాటుకు ప్రస్తుతం సూత్రప్రాయపు అనుమతిని మాత్రమే ఇచ్చామని, దేశ విదేశాలలో ఆర్థిక సేవలందిస్తున్న ఈ 40 సంస్థలు తపాలాశాఖతో ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తికనబర్చా యని ఆయన వివరించారు
ఈ బహుళజాతి సంస్థల్లో అమెరికాకు చెందిన సిటీ గ్రూప్‌, బ్రిటన్‌కు చెందిన బార్‌క్లేస్‌, దేశంలో ప్రైవేటు రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఐసిఐసిఐ బ్యాంక్‌ ఈ మేరకు ప్రతిపాదనలు పంపాయన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పోస్టల్‌ బ్యాంక్‌ సేవలు ప్రజలకు అందుబాటు లోకి వస్తాయన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ నుండి అనుమతులు పొందిన సంస్థల్లో కేవలం తపాలాశాఖ మాత్రమే ప్రభుత్వ రంగానికి చెందినదని ఆయన వివరించారు.