2016

విద్యపైWTOఒత్తిళ్లకు లొంగొద్దు

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపైన, డబ్ల్యూటిఓ మంత్రుల సమావేశం ముందుకు తెస్తున్న వినాశకర విధానాలపైన సమర భేరి మోగిస్తూ బుధవారం నాడు భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ), అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎఐఎస్‌ఎఫ్‌), అలిండియా డెమోక్రటిక్‌ స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌(ఎఐడిఎస్‌ఓ) సంఘాలు ఉమ్మడిగా ఆందోళన నిర్వహించాయి. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశాయి. విద్యా వ్యతిరేక విధానాలు నశించాలి, డబ్ల్యూటిఓ గో బ్యాక్‌, ఫెలోషిప్స్‌ అందరికీ ఇవ్వాలని ప్రదర్శకులు నినదించారు.

వారి పోరాట బలం..త్యాగఫలం

అర్ధఫాసిస్టుల మారణకాండకు, భూస్వాముల హింసాకాండకు చిరునామాగా మారిన బెంగాల్‌లో బిగిసిన పిడికిళ్లు వారివి! వినిపించిన విప్లవ నినాదాలు వారివే! పీడిత, తాడిత ప్రజానీకపు విముక్తే లక్ష్యంగా ఎర్రజెండా ఎత్తిన ధీశాలులు వారు! దోపిడితో , పీడనతో విసిగిపోయి, బతుకులింతే అంటూ నిరాశ, నిస్పృహలో మునిగిపోయిన నిరుపేద ప్రజానీకపు గుండెల్లో ధైర్యాన్ని నింపి, పోరుబాట నడిపిన మార్గదర్శులు వారు! వారే ముజఫర్‌ అహ్మద్‌, జ్యోతిబసు, ప్రమోద్‌దాస్‌ గుప్తాలు! ఒకరు అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నిర్మిస్తే, మరొకరు అద్బుతమైన పాలనదక్షతతో పేదల ఆకాంక్షలకు పట్టం గట్టి మార్క్మిస్టు మేరునగధీరుడిగా వినుతికెక్కారు.

Pages

Subscribe to RSS - 2016