2016

AP తాత్కాలిక సచివాలయం?

ఏపీ తాత్కాలిక సచివాలయం ఎక్కడ..? ఈ ప్రశ్నకు రేపటిలోగా స్పష్టత రానుంది. సీడ్‌ కేపిటల్‌ మధ్యలోనే తాత్కాలిక సచివాలయం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. భవిష్యత్తులో సమస్యలు రాకుండా... వివిధ ప్రాంతాల్లో భూసార పరీక్షలూ చేయించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్‌ చేతికందడంతో.. తాత్కాలిక సచివాలయంపై ఇవాళ తుది ప్రకటన వచ్చే అవకాశముంది..

పరువునష్టంపై కేజ్రీ ఘాటుగా..

తనపై జైట్లీ వేసిన పరువునష్టం దావాపై కేజ్రీవాల్ ఘాటుగానే స్పందించారు. సుమారు 2 వేల పేజీలతో కూడిన సమాధాన పత్రాలను ఢిల్లీ హైకోర్టుకు సమర్పించారు. అనంతరం కమల నేతపై తనదైన స్టయిల్‌లో సెటైర్లు విసిరారు. పరువు నష్టం దావా వేసిన వ్యక్తికి ప్రజల్లో ఎలాంటి ఆదరణ లేదని మీడియా ముందే జైట్లీ పరువు తీశారు. ఆయనకు పరువు ఉంటే కదా..! పరువు నష్టం కేసు వేయడానికి, తనను తాను కాపాడుకోవడానికే... తనపై ఈ కేసు వేశారని ఢిల్లీ సీఎం ఆరోపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అమృత్‌సర్‌లో లక్ష ఓట్ల తేడాతో జైట్లీ ఓడిపోయారని కేజ్రీవాల్ గుర్తుచేశారు.

SCనిర్ణయాన్నిసమర్థించినCPM

శబరిమలై ఆలయంలోకి మహిళలను నిషేధించడంపై సుప్రీంకోర్టు కేరళ ప్రభుత్వం, ఆలయబోర్డును ప్రశ్నించడాన్ని సిపిఎం స్వాగతించింది. 2008లో సిపిఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ అధికారంలో ఉండగా అయ్యప్ప ఆలయ ప్రవేశం కల్పించాలని కోరుతూ కొందరు మహిళలు వేసిన పిటిషన్‌కు తాము మద్దతిచ్చామని గుర్తు చేసింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుడిఎఫ్‌ ప్రభుత్వం  పిటిషన్‌పై ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించింది. మహిళలకు ఆలయ ప్రవేశం రాజ్యాంగ హక్కని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పేర్కొన్నారు..

దళిత విద్యార్థుల సస్పెన్షన్ పైSFI

హైదరాబాద్‌లోని సెంట్రల్‌ వర్సిటీలో ఐదుగురు దళిత విద్యార్థులపై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని మంగళవారం పలు చోట్ల ఆందోళనలు చేశారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశం, దిష్టిబొమ్మల దహనం, వినతిపత్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. బండారు దత్తాత్రేయను బర్తరఫ్‌ చేయాలని, వీసీని బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.విద్యార్థులను బహిష్కరించడం హేయమైన చర్య అని భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ సభ్యులు డీ మల్లేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. దీనికి నిరసనగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

అజ్హర్‌ తలనరికితే కోటి:సేన

పఠాన్‌కోట్‌ దాడికి కారణమైన జైషే మహ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజ్హర్‌ తల నరికితే కోటి రూపాయలు నజరానా ఇస్తామని శివసేన పంజాబ్‌ యూనిట్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని శివసేన పంజాబ్‌ నేత యోగేష్‌ బతీష్‌ ఓ ప్రకనటలో పేర్కొన్నారు. జనవరి 2న పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడిలో 7గురు భారత జవాన్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఘటనను తీవ్రంగా ఖండించిన శివసేన.. ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోటి రూపాయల ఆఫర్‌ ప్రకటన విడుదల చేసింది.

బెంగాల్‌ నుంచి తృణమూల్‌ను తరిమేయాలి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ను తరిమి కొట్టాలని వాపపక్షకూటమి మంగళవారం పిలుపునిచ్చింది. తద్వారా చిట్‌ ఫండ్‌ స్కామ్‌కు పాల్పడిన వారు అక్రమంగా దాచుకున్న ప్రజాధనాన్ని పెద్ద మొత్తంలో వెనక్కు తీసుకురావడం సాధ్యమవుతుందని లెఫ్ట్‌ నేతలు పేర్కొన్నారు. నగరంలోని ఉప్పునీటి సరస్సుకు సమీపాన ఉన్న సిబిఐ కార్యాలయం వద్ద సిపిఎం ఏర్పాటు చేసిన భారీ సభలో పాల్గొన్న పలువురు మమత ప్రభుత్వ అవినీతిని వారు నిశితంగా విమర్శించారు. టిఎంసి నాయకులు, వారి బినామీలు కలిసి ఏర్పాటు చేసిన చిట్‌ఫండ్‌ సంస్థలు ఖాతాదారులను నట్టేట ముంచాయన్నారు. 

భాగస్వామ్య సదస్సు - 2016 పేర రాష్ట్ర సంపద లూఠీ - సిపియం పార్టీ

* ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం- భారత పారిశ్రామిక సమఖ్య (సిఐఐ)లు సంయుక్తంగా కలిసి మూడు రోజులపాటు పెట్టుబడుల సదస్సు విశాఖపట్నంలో ఆర్భాటంగా జరిపారు. ఈ సదస్సులో మొత్తం 328 ఒప్పందాలు జరిగాయని వీటివల్ల 4.67క్ష కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుందని, 9.58 లక్ష మందికి ఉపాధి కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇసుకను భోంచేస్తున్న తెలుగుతమ్ముళ్ళు

రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ సుమారు 400 రీచ్‌లలో రూ.1.70 కోట్ల క్యూబిక్‌ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. దీని ద్వారా సుమారు రూ.1000 కోట్లు ఆదాయం రావచ్చనేది ప్రభుత్వ అంచనా. కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లోని రీచ్‌ల కోసం తమ్ముళ్లు తమ అధినాయకుల వద్ద క్యూ కడుతున్నారు. 2014 ఆగస్టు నుంచి ఇసుక రీచ్‌లను ప్రభుత్వమే నిర్వహించింది. ఏడాదిన్నరలో ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ.894 కోట్ల రాబడి వచ్చింది.

రాయితీల మాట మాట్లాడని కేంద్రం..

చంద్రబాబు లక్షలకోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పిన, ఆ లక్షల కోట్లు ఆచరణలోనికి రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమలకు కల్పించే మౌలిక వసతులు, రాయితీలపైనే అవి నెలకొనే అవకాశం ఆధారపడి ఉంది. మూడురోజుల పాటు జరిగిన సదస్సుల్లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు సహా ఏ ఒక్కరూ కేంద్రం రాయితీలు ఇస్తుందన్న ప్రకటన చేయలేదు. ముఖ్యంగా విశాఖకు రైల్వే జోన్‌ వస్తేనే పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులెవ్వరూ ఈ అంశం ప్రస్తావించలేదు. దీంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జ్యూట్‌, ఫెర్రో ఇండిస్టీ మూసివేతకు గురైంది. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.

Pages

Subscribe to RSS - 2016