రాయితీల మాట మాట్లాడని కేంద్రం..

చంద్రబాబు లక్షలకోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పిన, ఆ లక్షల కోట్లు ఆచరణలోనికి రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఈ పరిశ్రమలకు కల్పించే మౌలిక వసతులు, రాయితీలపైనే అవి నెలకొనే అవకాశం ఆధారపడి ఉంది. మూడురోజుల పాటు జరిగిన సదస్సుల్లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు సహా ఏ ఒక్కరూ కేంద్రం రాయితీలు ఇస్తుందన్న ప్రకటన చేయలేదు. ముఖ్యంగా విశాఖకు రైల్వే జోన్‌ వస్తేనే పరిశ్రమలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రులెవ్వరూ ఈ అంశం ప్రస్తావించలేదు. దీంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో జ్యూట్‌, ఫెర్రో ఇండిస్టీ మూసివేతకు గురైంది. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. వారికి పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వ పారిశ్రామిక విధానంలో భాగంగా ఉండాలి. సిఐఐ సదస్సులో ఇలాంటి అంశాలు చర్చకు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రమంత్రులూ వాటిపై నిర్ధిష్ట ప్రకటన ఏమీ చేయలేదు.