
పఠాన్‌కోట్ దాడికి కారణమైన జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజ్హర్ తల నరికితే కోటి రూపాయలు నజరానా ఇస్తామని శివసేన పంజాబ్ యూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని శివసేన పంజాబ్ నేత యోగేష్ బతీష్ ఓ ప్రకనటలో పేర్కొన్నారు. జనవరి 2న పఠాన్‌కోట్‌లో జరిగిన ఉగ్రదాడిలో 7గురు భారత జవాన్లు మృతిచెందిన సంగతి తెలిసిందే. ఘటనను తీవ్రంగా ఖండించిన శివసేన.. ఆ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోటి రూపాయల ఆఫర్ ప్రకటన విడుదల చేసింది.