మార్చ్ లో రెండు వేల ఇళ్ల తొలగింపు..

రాజధాని నగర ప్రాంతంలో 2 వేల నివాసాలు తొలగించాల్సి ఉంటుందని అంచనా వేశారు. అందుకు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. తొలగించాల్సిన ఇళ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమూ ఉంది. వచ్చే మార్చిలో ప్రధాన అనుసంధాన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో, ఆలోగా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. రోడ్ల నిర్మాణం, ల్యాండ్‌ స్కేపింగ్‌ తదితర పనులకు మెకన్సీ సంస్థ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీని ఆధారంగా పనులు చేపట్టనున్నారు. ఈలోపే రోడ్డు వెళ్లే సర్వే నెంబర్లలో ఉన్న ఇళ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టే ఉద్దేశంతో ప్రభుత్వముంది.