గిరిజన చట్టాలకు తిలోదకాలు..

ఏజన్సీ ప్రాంతాల్లో పటిష్టమైన చట్టాలున్నా వాటిని అమలు చేయకుండా లక్షలాది ఎకరాల ఆదివాసీల భూములను ప్రభుత్వం లాక్కొంటోందని ఆదివాసీ భూమి హక్కుల పరిరక్షణ ఐక్యవేదిక రౌండ్‌టేబుల్‌ సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమావేశంలో మాజీ ఎంపి మిడియం బాబూరావు మాట్లాడుతూ గిరిజన, ఆదివాసీ భూములను దోచుకోవడంలో ప్రభుత్వానికి చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటివేవీ పట్టడం లేదన్నారు. ఆయా ప్రాంతాల్లో ఎలాంటి పనులు చేపట్టాలన్నా గ్రామసభల తీర్మానాలుండాలన్నారు. ప్రభుత్వం భూ బ్యాంకుల పేరుతో మరణ శాసనం రాస్తోందని వ్యాఖ్యాని ంచారు. పొలవరం, బాక్సైట్‌ల పై ప్రజల్లో చైతన్యం కల్గించి సుదీర్ఘ పోరాటాలకు ప్రణాళికలు వేయాల్సిన అవసరము ందని సూచించారు. రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి టి గోపాల రావు మాట్లాడుతూ భూములు లేని వారికి ప్రభుత్వం భూములిచ్చే పరిస్థితికి భిన్నంగా వారికున్న భూముల్ని తీసేసుకుంటుందన్నారు.