ఇష్టారాజ్యంగా ఎసైన్డ్‌ భూముల కొనుగోళ్లు

క్రమబద్ధీకరణ ముసుగులో రాజధాని అమరావతి ప్రాంతంలోని వేలాది ఎకరాల అసైన్డ్‌ భూముల క్రయ విక్రయాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.అనేక మంది పెద్దలు వేలాది ఎకరాల అసైన్డు భూములను కొనుగోలు చేస్తున్నారని, ప్రమాదకరమైన ఈ కుంభకోణం త్వరలో వెలుగులోకి వస్తుందని రామకృష్ణ తెలిపారు. అసైన్డ్‌ భూముల చట్ట ప్రకారం ఎవరికైనా ఒకసారి భూమిని ప్రభుత్వం ఇస్తే దాన్ని వారు అమ్మటంగానీ, వేరెవరైనా కొనటంగానీ చేయకూడదన్నారు. అందుకు భిన్నంగా క్రయ విక్రయాలైన భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం యత్నించటం శోచనీయమన్నారు. మరోవైపు 33 ఏళ్లు పరిమితిగా ఉన్న భూమి లీజును 99 ఏళ్లకు పొడిస్తూ బిల్లు తేవడం ఆయా భూములను కార్పొరేట్లకు కట్టబెడ్డడానికేనని విమర్శించారు. కొత్త లీజులో ఆయా భూములను తాకట్టు పెట్టుకునే, అమ్ముకునే హక్కునూ కల్పించటాన్ని ఆయన తప్పుపట్టారు.